Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ ముస్లీం పూజారులు మేకలను సాత్విక బలి ఇస్తారు

ఇక్కడ ముస్లీం పూజారులు మేకలను సాత్విక బలి ఇస్తారు

ముండేశ్వరీ దేవి దేవాలయానికి సంబంధించిన కథనం.

భారత దేశంలో పార్వతీ దేవికి భారత దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయంలో అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఉంటారు. అదే విధంగా ఒక్కొక్క దేవాలయాకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది.
అటువంటి ఒక ఆలయం బీహార్ రాష్ట్రంలోని కైమూరు జిల్లాలో ఉంది. ఇక్కడ దేవాలయంలో ముస్లీం సోదరులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా మేకలను సాత్వికంగా మాత్రమే బలి ఇస్తారు.

బీహార్ లోని కైమూర్ జిల్లా

బీహార్ లోని కైమూర్ జిల్లా

P.C: You Tube

బీహార్ లోని కైమూర్ జిల్లాలో ఉన్న ఈ ప్రాచీన దేవాలయం పేరు ముండేశ్వరీ దేవి దేవాలయం. ఈ దేవాలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ విషయాన్ని పురావస్తుశాఖ అధికారులు కూడా నిర్థారించారు. ఇక్కడ ముస్లీం సోదరులు వందల ఏళ్లుగా వంశ పార్యంపర్యంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పవార పర్వత శిఖరాలు

పవార పర్వత శిఖరాలు

P.C: You Tube

కైమూర్ జిల్లాలో భగవాన్ పురకు దగ్గర్లోని పవారా పర్వత శిఖరాల పై ఉన్న ఈ దేవాలయానికి చేరుకోవడానికి 608 అడుగుల ఎత్తుకు చేరుకోవాల్సి ఉంటుంది. దాదాపు వెయ్యి తొమ్మిది వందల ఏళ్ల నుంచి ఈ దేవాలయంలో పూజాది కార్యక్రమాలు జరుగుతున్నట్లు చెబుతారు. ఈ విషయాన్ని భారతీయ పురావస్తుశాఖ అధికారులు కూడా నిర్థారించారు.

వరాహి మాతగా

వరాహి మాతగా

P.C: You Tube

దుర్గాదేవి వైష్ణవి రూపంలో ఇక్కడ ముండేశ్వరి మాతగా దర్శనమిస్తుంది. ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకూ వరాహి మాతగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి.
అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండటం గమనార్హం.

సాత్విక బలి

సాత్విక బలి

P.C: You Tube

ఈ ఆలయంలో ప్రధాన విశేషం సాత్విక బలి. అంటే ఇక్కడ మొదట బలి ఇవ్వాల్సిన మేకను అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకువస్తారు. అటు పై పూజారి మంత్రించిన అక్షింతలను మేక పై వేస్తారు. దీంతో మేక కొన్ని క్షణాల పాటు స`హతప్పి పడిపోతుంది. అటు పై మరోసారి పూజారి అక్షింతలను మేక పై వేస్తాడు. దీంతో ఆ మేక మరలా యథా స్థితికి వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

చైత్రమాసంలో

చైత్రమాసంలో

P.C: You Tube

చైత్రమాసంలో ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. పురావస్తుశాఖ అధికారులు భద్రతా కారణాల వల్ల 9 విగ్రహాలను కొలకత్తా సంగ్రహాలయానికి తరలించారు. వాటిని ఇప్పటికీ మనం
అక్కడ చూడవచ్చు..

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X