Search
  • Follow NativePlanet
Share
» »ఆ పరమశివుడి ఆత్మ లింగం క్షేత్ర రహస్యం: రావణాసురుని పాత్ర

ఆ పరమశివుడి ఆత్మ లింగం క్షేత్ర రహస్యం: రావణాసురుని పాత్ర

భూకైలాస క్షేత్రంగా పేరుగాంచిన ఈ క్షేత్రం అగ్ని శిని మరియు గంగా వరం అనే రెండు నదుల మద్య ఉంది. ఈ రెండు నదులు కలసి గోవు చెవి ఆకారంగా ఏర్పడ్డాయి. అందుకే ఈ ప్రదేశాన్ని గోకర్ణ అంటారు. కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కర్ణాటకాలో బెంగళూరుకి 550 కిలోమీటర్ల దూరంలో హుబ్లికి సమీపంలో ఉండేదే గోకర్ణ . ఈ గోకర్ణ ఒక పుణ్యప్రదేశం, యాత్రాస్థలమే కాదు, అందమైన బీచ్ తో పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం.

మన ఇండియన్స్ మాత్రమే కాదు, విదేశీ పర్యాటకులు కూడా ఈ పుణ్యస్థలాన్ని దర్శిస్తుంటారు. ముఖ్యంగా ఈ ప్రదేశంలో ఆ పరమేశ్వరుడి యొక్క ఆత్మ లింగం కొలువైన క్షేత్రంగా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ కొలువైన పరమశివుడు మహేబలేశ్వరుని రూపంలో కొలువై భక్తుల పాపాలను తొలగించి, విముక్తి కలిగిస్తాడని భక్తులు నమ్మకం. ఆ ప్రదేశాన్నే నేడు గోకర్ణగా పిలవబడుతోంది.

ఈ ప్రదేశానికి పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున సిద్దేశ్వర క్షేత్రం, ఉత్తరానా గంగావళి, దక్షిణాన అగ్నిశిలి నది ఉంది. ఆహ్లాదం కలిగించే ప్రక్రుతి రమణీయత, సముద్ర కెరటాల మద్య ఆహ్లదకరమైన వాతావరణానికి చెప్పుకోదగ్గ ప్రదేశం గోకర్ణ. మరి ఈ ప్రదేశానికి ఆత్మలింగ క్షత్రం అని ఎలా పేరు వచ్చింది? ఆ రహస్యమేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రావణాసురిడి తల్లి కైకసి

రావణాసురిడి తల్లి కైకసి

రావణాసురిడి తల్లి కైకసి గొప్ప శివ భక్తురాలు. ఆ భక్తితోనే ఆమె ఇసుకతో శివలింగాన్ని చేసి నిత్యం పూజలు చేసేది. అయితే ఆమెకు శివుడి యొక్క ఆత్మ లింగాన్ని పూజించాలనే కోరిక కలిగింది, ఈ విషయాన్ని రావణాసురిడికి తెలిపుతుంది. రావణాసురుడు తల్లి కోరిక తీర్చడం కోసం శివుడి కొరకు అఘోర తపస్సు చేసి, శివపార్శతులను మెపించి, భూలోకానికి ఆత్మలింగాన్ని తీసుకొస్తాడు.

Mandsaur Ravana
Photo Courtesy: Rohit MDS

అయితే ఈ క్రమంలో భూలోకానికి తీసుకెళ్ళే మార్గంలో

అయితే ఈ క్రమంలో భూలోకానికి తీసుకెళ్ళే మార్గంలో

అయితే ఈ క్రమంలో భూలోకానికి తీసుకెళ్ళే మార్గంలో ఆత్మ లింగాన్ని మొట్టమొదట పెడతాడో, అక్కడే ఆత్మ లింగం స్థాపితం అవుతుందని, తర్వాత ఆ లింగాన్ని కదల్చడానికి కూడా వీలు కాదని నియమం ఒకటి రావణాసురనికి తెలుపుతారు.

శివుడు ఆత్మ లింగాన్ని రావణాసురుడు ఉండే లంకలో

శివుడు ఆత్మ లింగాన్ని రావణాసురుడు ఉండే లంకలో

శివుడు ఆత్మ లింగాన్ని రావణాసురుడు ఉండే లంకలో ప్రతిష్టాపనం చేస్తే పరిణామాలు విపత్కరంగా ఉంటాయని, ప్రతికూల చర్యలు జరుగుతాయని ముక్కోటి దేవతలు ఆ మహావిష్ణువును వేడుకొనగా, ఆ మహా విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేట్లు చేస్తాడు.

 అప్పుడు రావణాసురుడు సూర్యాస్తమయం

అప్పుడు రావణాసురుడు సూర్యాస్తమయం

అప్పుడు రావణాసురుడు సూర్యాస్తమయం అయ్యిందని, సంధ్య మార్చుకోవడానికి సంసిద్దుడు అవుతాడు. ఈ విషయం తెలుసుకున్న నారధుడు, ఈ విషయాన్ని వినాయకుడికి చెప్పి, ఆ పరమశివుడి యొక్క ఆత్మ లింగాని రావణాసురుని వద్ద నుండి తీసుకుని భూమి మీద పెట్టాలని చెబుతాడు.

PC: flickr.com

అప్పుడు వినాయకుడు నారదుడు చెప్పినట్లు,

అప్పుడు వినాయకుడు నారదుడు చెప్పినట్లు,

అప్పుడు వినాయకుడు నారదుడు చెప్పినట్లు, రావణాసురుడు సంద్య మార్చుకునే సమయంలో బ్రహ్మాణ వేశంలో వెళతాడు, ఆ బ్రాహ్మణ బాలుడిని చూసిన వెంటనే రావణాసురుడు , సంద్య మార్చుకుని వస్తానని, అంత వరకూ శివలింగాన్ని పట్టుకోమని చెబుతాడు.

అప్పుడు బ్రహణ వేశంలో ఉన్న వినాయకుడు

అప్పుడు బ్రహణ వేశంలో ఉన్న వినాయకుడు

అప్పుడు బ్రహణ వేశంలో ఉన్న వినాయకుడు శివలింగం చాలా బరువు ఉందని, ఎక్కువ సేపు మోయలేని, ఆ సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని ఆ సమయంలో రావణాసురుడు రాకపోతే, ఆ ఆత్మలింగాన్ని భూమిమీద పెడతాని చెబుతాడు. రావణాసురిడి అంగీకారంతో వినాయకుడు తన చేతిలోకి ఆత్మలింగాన్ని తీసుకుంటాడు.

తర్వాత రావణాసురుడు సంద్యమార్చుకోవడానికి వెళతాడు,

తర్వాత రావణాసురుడు సంద్యమార్చుకోవడానికి వెళతాడు,

తర్వాత రావణాసురుడు సంద్యమార్చుకోవడానికి వెళతాడు, ఆసమయంలో వినాయకుడు లింగాన్ని మోయలేకపోతున్నట్లు రావణాసురుడిని పిలుస్తాడు, సంద్య మార్చుకునే క్రమం మద్యలో ఉండటం వల్ల రావణాసురుడు రాలేకపోతాడు,. అప్పుడు వినాయకుడు ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు.

అది చూసిన రావణాసురుడు గణపతి నెత్తి మీద మోదుతాడు.

అది చూసిన రావణాసురుడు గణపతి నెత్తి మీద మోదుతాడు.

అది చూసిన రావణాసురుడు గణపతి నెత్తి మీద మోదుతాడు. దాంతో గణపతి నెత్తి మీద గుంటపడుతుంది. ఇలాంటి విగ్రహాన్ని మనం గోకర్ణ ఆలయంలో చూడవచ్చు.

వినాయకుడు ఆ పరమశివుడి ఆత్మలింగాన్ని భూమి మీద మోపిన

వినాయకుడు ఆ పరమశివుడి ఆత్మలింగాన్ని భూమి మీద మోపిన

వినాయకుడు ఆ పరమశివుడి ఆత్మలింగాన్ని భూమి మీద మోపిన ప్రదేశం గోకర్ణ. మురుడేశ్వర లింగం పడి భాగంలో ఇది ఒక ప్రదేశం. ఆ మహావిష్ణువు తన మాయను తొలగించిన వెంటనే ఆకాశంలో సూరుడు కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన రావణాసురుడు కోపంతో తన బలాంతటిని ఉపయోగించి ఆత్మలింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తాడు. ఆవిధంగా చేసిన ప్రయతంలోనే శివలింగం సాగిందని , ఆ ఆలయంలో ఉన్న లింగాక్రుతి చూస్తే అర్థం అవుతుంది.

Photo courtesy: Макс Вальтер

ఆత్మ లింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్న చేసి విసిరివేస్తే,

ఆత్మ లింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్న చేసి విసిరివేస్తే,

ఆత్మ లింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్న చేసి విసిరివేస్తే, అవి గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రాంతంలో ఆలింగం యొక్క కవచం పడినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. మరి దక్షిణ కాశీ, భూకైలాస్ లుగా ఎంతో ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రం గురించి, కాలిదాసు తన రగు వంశంలో చాలా గొప్పగా వర్ణించాడు. కదంబ చక్రవర్తి మయూర శర్మ ఈ ఆలయంలో నిత్యం పూజాధి కార్యక్రమాలకు అంకురార్పన చేశాడు.

Photo Courtesy: Native Planet

గోకర్ణలో ప్రధాన ఆలయం శ్రీ మహాబలేశ్వర ఆలయం,

గోకర్ణలో ప్రధాన ఆలయం శ్రీ మహాబలేశ్వర ఆలయం,

గోకర్ణలో ప్రధాన ఆలయం శ్రీ మహాబలేశ్వర ఆలయం, ఈ ఆలయాలో లింగాన్ని దర్శించే ముందు భక్తులు కోటి తీర్థంలో మరియు ఆ తర్వాత సముద్ర తీరంలో స్నానమాచరించి ఆ పరమేశ్వరున్ని దర్శిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. ఇక్కడ లింగాక్రుతి అనేది క్రింది బాగంలో వెడల్పుగా, పైకి సాగదీసినట్లు సన్నగా కనబడుతుంది. రావణాసురుడి ఈ లింగాన్ని పైకి లేపడానికి అలా చేయడం వల్ల ఇక్కడి లింగం అలా సాగదీసినట్లు కనబడుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం.

Photo Courtesy: Rojypala

12ఏళ్ళకొకసారి ఈ క్షేత్రం ఇక్కడ విశేషమైన ఉత్సవ జరుగుతుంది.

12ఏళ్ళకొకసారి ఈ క్షేత్రం ఇక్కడ విశేషమైన ఉత్సవ జరుగుతుంది.

12ఏళ్ళకొకసారి ఈ క్షేత్రం ఇక్కడ విశేషమైన ఉత్సవ జరుగుతుంది. అప్పుడు దేవాలయంలోని ఆత్మ లింగాన్ని బయటకు తీసి, నిజస్వరూపమైన ఆత్మలింగానికి పూజాది అభిషేకాలు నిర్వర్తిస్తారు. ఈ సమయంలో లక్షలాధి భక్తులు ఉత్సవాలు చూడటానికి వస్తారు.అంతే కాకుండా గోకర్ణని పిత్రుదోషాలతో బాధపడే వారు, ఇక్కడ కనుకు వారికి పిండప్రధానం వంటి కార్యక్రమాలు జరిపిస్తే, వారు పిత్రుదోషాల నుండి భయటపడి వారు అభివ్రుద్ది చెందుతారని భక్తుల విశ్వాసం. చాలా మంది భక్తులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరిపించడానికి గోకర్ణకు రావడం అనేది జరుగుతుంది.

Photo courtesy: Rojypala

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X