Search
  • Follow NativePlanet
Share
» »ప్రత్యేక ఆకర్షణలో వెస్ట్ బెంగాల్ మ్యూజియంలు !

ప్రత్యేక ఆకర్షణలో వెస్ట్ బెంగాల్ మ్యూజియంలు !

గత కాల వైభవాలను ప్రదర్శించాలంటే, మ్యూజియం లు ఒక మంచి సాధనం. ఈ మ్యూజియంలను ఎంపిక చేసి చారిత్రక పర్యటన చేయటం మీకు గతకాల వైభవాలను గురించిన ఎంతో సమాచారం అందిస్తుంది. అనేక నమూనాలు, విగ్రహాలు, లేదా లిఖిత శాసనాలు వంటివి ఒకే చోట చూడగలరు. అర్కేయోలజి లేదా ఆంథ్రోపాలజీ, జియాలజి లేదా ఆర్ట్ వంటి రంగాలలో ఆసక్తి కలవారికి వారి ఆసక్తి దాహం తీర్చుకొనేందుకు ఈ మ్యూజియంలు ఉపయోగ పడతాయి. వెస్ట్ బెంగాల్ లో కల అనేక మ్యూజియంలు ఎన్నో రకాల పెయింటింగ్ లు, శిల్పాలు, చారిత్రక శాసనాలు, చరిత్రలోని ప్రసిద్ధ వ్యక్తుల వ్యక్తిగత ఆభరణాలు, మొదలైన అరుదైన వస్తువులు కూడా ఈ మ్యూజియం లలో చూడవచ్చు. పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రసిద్ధ మ్యూజియంలు ఆ రాష్ట్ర టూరిజంలో ప్రధాన పాత్ర వహించేవి కొన్ని పరిశీలిద్దాం.

కూచ్ బిహార్ పాలస్ మ్యూజియం
కూచ్ బిహార్ అనేది ఒక రాయల్ ప్రదేశం. ఇక్కడ ఒక మ్యూజియం కలదు. ఈ పాలస్ మ్యూజియంలో మహారాజులు ఉపయోగించిన అనేక వస్తువులు కలవు.

రైల్వే హెరిటేజ్ మ్యూజియం
రైల్వే హెరిటేజ్ మ్యూజియంలో బెంగాల్ దోయర్స్ మరియు కూచ్ బీహార్ స్టేట్ రైల్వేకు చెందిన వివిధ వస్తువులు, డాక్యుమెంట్ లు ప్రదర్శిస్తుంది. ఉత్తర బెంగాల్ ప్రాంత తెగల ప్రజల జీవన శైలికి సంబంధిన అనేక వివరాలు తెలుసుకోవచ్చు.

ది ఇండియన్ మ్యూజియం
కోల్కతాలో కల ' ది ఇండియన్ మ్యూజియం' ఇండియా లో ప్రసిద్ధి చెందినది. ఇది దేశ సాంస్కృతిక హెరిటేజ్ పై దృష్టి పెట్టినందున దీనికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలవని చెప్పవచ్చు. ఇది ఒక సమాచార కేంద్రం మాత్రమే కాక, సెమినార్లు, ట్రైనింగ్ ప్రోగ్రాములు నిర్వహిస్తుంది.

హజార్ దువారి పాలస్ మ్యూజియం
హజార్ దువారి పాలస్ మ్యూజియం ముర్షిదాబాద్ లో కలదు. విలాసవంత భవనం లో కల ఈ మ్యూజియం ఇపుడు అర్కేయోలాజికల్ సర్వే అఫ్ ఇండియాచే నిర్వహించ బడుతోంది. ఇక్కడ కల 4742 యాంటిక్ వస్తువులలో 1034 యాంటిక్ వస్తువులు ఇక్కడ ప్రదర్శించ బడుతున్నాయి. గ్రీక్ డిజైన్ లో కల ఈ మ్యూజియంలో అరుదుగా సేకరించబడిన అనేక మార్బుల్ విగ్రహాలు, మెటల్ మరియు పింగాణీ వస్తువులు, ఇటాలియన్, డచ్, ఫ్రెంచ్ దేశాల కొన్ని ఓల్డ్ మాప్ లు, వంటివి కలవు.

అర్కేయోలాజికల్ మ్యూజియం
అర్కేయోలాజికల్ మ్యూజియం వెస్ట్ బెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లాలో తమ్లుక్ లో కలదు. తమ్లుక్, రాష్ట్రంలో ఒక పురాతన నగరం. ఈ నగరం గురించి పాళీ మరియు సంస్కృత సాహిత్యాలలో కూడా కలదు. ఈ మ్యూజియం 1975 లో స్థాపించబడినది. దీనిలో చరిత్ర పూర్వ కాలం నాటి బోన్ టూల్స్, ఆరో హెడ్స్ , కాపర్ కాయిన్ లు, హర్పూన్, ఫిష్ నైఫ్, విక్టోరియా మెమోరియల్ వంటి వస్తువులు ప్రదర్శించారు.

విక్టోరియా మెమోరియల్
విక్టోరియా మెమోరియల్ కోల్కతా నగరంలో ఒక ప్రధాన ఆకర్షణ. వెస్ట్ బెంగాల్ టూరిజంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. విక్టోరియా మెమోరియల్ ప్రస్తుతం ఒక మ్యూజియంలా పని చేస్తోంది. ఈ ప్రదేశంలో క్వీన్ విక్టోరియా చరిత్ర , బ్రిటిష్ రాజ్యంల గురించి తెలుసుకోవచ్చు. ఒక రాయల్ గాలరీ క్వీన్ విక్టోరియా జీవితం గురించి, ప్రిన్సు ఆల్బర్ట్ జీవితం గురించి పెయింటింగ్ ల ద్వారా తెలియ చేస్తుంది.

ఆసియాటిక్ సొసైటీ
ఆసియాటిక్ సొసైటీ ని కోల్కతాలో 1784 సంవత్సరంలో స్థాపించారు. దీనిలో పురాతన గ్రంధాలు, బ్రాంజ్ శిల్పాలు, కాయిన్ లు, లేఖలు, పెయింటింగ్ లు కలవు. ఈ మ్యూజియంలోని లైబ్రరీలో రీసెర్చ్ కి ఉపయోగించ బడే అరుదైన పుస్తకాలు కలవు.

రవీంద్ర భారతి మ్యూజియం మరియు జోరాసంకో ఠాకూర్ బారి

రవీంద్ర భారతి మ్యూజియం 217 సంవత్సరాలనాటి ఒక పురాతన భవనంలో కలదు. ఈ మ్యూజియం లో మహాకవి రవీంద్ర నాథ్ టాగోర్ మరియు ఆయన కుటుంబ సభ్యుల కు చెందిన విలువైన డాక్యుమెంట్ లు, పెయింటింగ్ లు, ఫొటోగ్రాఫ్ లు ప్రదర్శిస్తారు.

ప్రత్యేక ఆకర్షణలో వెస్ట్ బెంగాల్ మ్యూజియ

నెహ్రు సైన్సు అండ్ టెక్నాలజీ మ్యూజియం
ఈ మ్యూజియం ఐ ఐ టి ఖరగ్పూర్ లో కలదు. దీనిలో అనేక గ్రంధాలు, మోడల్స్, ఎక్స్ పెరి మెంట్స్ కు సంబంధిన రికార్డులు , ఫొటోగ్రాఫ్ లు కలవు. వీటిని వివిధ సంస్థలు ఈ సంస్థకు విరాళంగా ఇచ్చాయి. ఈ మ్యూజియం అంతా సైన్సు అండ్ టెక్నాలజీ కి కేటాయించబడినది.

నేతాజీ రీసెర్చ్ బ్యూరో
కోల్కతాలోని ఈ మ్యూజియంలో సుభాస్ చంద్ర బోస్ కు చెందిన డాక్యుమెంట్ లు, ఆర్టికల్స్ మరియు ఫొటోగ్రాఫ్ లు వివిధ ప్రపంచ ప్రదేశాలనుండి సేకరించినవి ప్రదర్శిస్తుంది. ఈ చిత్రాలు, లేఖలు సంవత్సరాల క్రమంలో ఆయన జీవితం అనుసరించి ప్రదర్శిస్తారు. ఆయన లైఫ్ లో జరిగిన అనేక సంఘటలను ప్రదర్సిస్తారు.

నెహ్రు చిల్డ్రన్స్ మ్యూజియం
నెహ్రు చిల్డ్రన్స్ మ్యూజియం కోల్కతలో కలదు. ఈ మ్యూజియం ను పూర్తిగా పిల్లల అంశాలపై ఏర్పరచారు. తక్కువ స్థాయి నుండి, అడ్వాన్సు చెందిన, డెవలప్ అయిన పిల్లల సంరక్షణ కొరకు దీనిని స్థాపించారు. దీనిలో రామాయణ, మహాభారత గ్రంధాలలోని కధలు, బొమ్మలు, చిత్రాల రూపంలో ప్రదర్సిన్చబడతాయి. పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ఇతర విధానాలు కూడా ఉపయోగిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X