Search
  • Follow NativePlanet
Share
» » ఒకే విగ్రహంలో హరిహరులు ఇది ప్రపంచంలో ఏకైక విగ్రహం

ఒకే విగ్రహంలో హరిహరులు ఇది ప్రపంచంలో ఏకైక విగ్రహం

తిరుపతికి దగ్గర్లోని అగస్థీస్వర రుద్రకోటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

భారత దేశంలో హరిహర క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఒకే ఆలయంలో అటు విష్ణువు, ఇటు శివుడు ఇద్దరూ ఉండటం. ఇటువంటి ఆలయాల్లో సాధారణంగా ఒకే దేవాలయంలో వేర్వేరుగా మూలవిరాట్టులు, ఉపాలయాలు ఉంటాయి. అంతేకాని ఒకే విగ్రహంలో అటు విష్ణువు, ఇటు శివుడు కనిపించడు. అయితే ప్రపంచంలో ఒకేఒక పుణ్యక్షేత్రంలో అటువంటి విగ్రహాన్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ శివుడికి ఎదురుగా నందితో పాటు మరో విగ్రహం కూడా ఉండటం విశేషం. నారాయణ వనంలో పద్మావతిని వివాహం చేసుకొని పసుపు బట్టలతో తిరుమలకు బయలుదేరి మార్గమధ్యలో ఉన్న ఈ క్షేత్రంలో ఆరు నెలలు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఉన్న పవిత్రమైన ఐదు వృక్షాలకు పూజలు చేస్తే సంతానయోగం ఉంటుందని స్థానిక భక్తుల నమ్మకం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ దేవాలయం పూర్తి సమాచారం మీకోసం.

 స్థల పురాణం ప్రకారం

స్థల పురాణం ప్రకారం

P.C: You Tube

శివుడి ఆదేశం మేరకు అగస్థీస్వర దక్షిణ భారత దేశంలోని వివిధ చోట్ల తిరుగుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండవాడ ప్రాంతాన్ని చేరుకొంటాడు.

మూడు నదుల సంగమ ప్రాంతం

మూడు నదుల సంగమ ప్రాంతం

P.C: You Tube

అది స్వర్ణముఖి, భీమ, కళ్యాణి నదులు సంగమించే ప్రాంతం. ఇక్కడి ప్రక`తి రమణీయతకు ముగ్దుడైన అగస్తమహాముని అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టింపజేస్తాడు. దానిని రుద్ర కోటేశ్వరుడిగా నిత్యం కొలుస్తూ ఉంటాడు.

శివతత్వాన్ని బోధిస్తూ

శివతత్వాన్ని బోధిస్తూ

P.C: You Tube

అంతేకాకుండా ఈ ప్రాంతానికి వచ్చే ప్రజలకు శివతత్వాన్ని బోధిస్తూ వారిని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణింపజేయడానికి పాటుపడుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా కలియుగ దైవం శ్రీనివాసుడు ఇక్కడికి దగ్గర్లోని నారాయణ వనంలో పద్మావతిని వివాహం చేసుకొని పసుపు బట్టలతో తిరుమలకు బయలుదేరుతాడు.

అగస్త్య మహాముని కోరిక పై

అగస్త్య మహాముని కోరిక పై

P.C: You Tube

మార్గమధ్యలో తొండవాడను చేరుకొంటాడు. అక్కడే ఉన్న అగస్త్య మహాముని తన వద్ద ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతాడు. ఈశ్వరుడితో సమానమైన అగస్త్యమహాముని కోరిక కాదనలేక ఈ శ్రీనివాసుడు ఆ తొండవాడలో ఆరునెలలు ఉండిపోతాడు.

పాదముద్ర

పాదముద్ర

P.C: You Tube

అటు పై తిరుమలకు బయలుదేరుతూ తన పాదముద్రలను అక్కడ వదిలి వెళ్లిపోతాడు. ఇలా ఈ క్షేత్రం హరిహరుల క్షేత్రమయ్యింది. ఇక ఇక్కడ ఉన్న విగ్రహం స్వయంభువుగా వెలిసిందని కొంతమంది చెబుతుండగా మరికొంతమంది మాత్రం స్థానిక రాజులు ఏర్పాటు చేశారని చెబుతారు.

ఒకే విగ్రహంలో

ఒకే విగ్రహంలో

P.C: You Tube

సాధారణంగా ఏ హరిహర క్షేత్రంలోనైనా శివుడి ఆలయం, విష్ణువు ఆలయం వేర్వేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం ఒకే చోట ఉన్నాయి. అంతేకాకుండా హరిహరులు ఒకే విగ్రహంలో ఉండం ఇక్కడ విశేషం. ఇటు వంటి విగ్రహం ప్రపంచంలో తొండవాడలో తప్ప మరెక్కడా చూడలేము.

ఒక వైపు నుంచి హరి, మరోవైపు నుంచి కేశవుడు

ఒక వైపు నుంచి హరి, మరోవైపు నుంచి కేశవుడు

P.C: You Tube

అంటే శివకేశవులు ఒకే విగ్రహంలో ఉన్నారన్నమాట. ఒక వైపు నుంచి చూస్తే శివుడు, మరోవైపు నుంచి చూస్తే శ్రీ హరి మనకు దర్శనమిస్తాడు. ఇటువంటి విగ్రహం మనం ఇక్కడి అగస్తీశ్వర రుద్రకోటేశ్వరాలయంలో మాత్రమే చూడవచ్చు.

 నందితో పాటు భృంగి

నందితో పాటు భృంగి

P.C: You Tube

ఇక ఇక్కడ పరమ శివుడికి ఎదురుగా నంది ఉంటాడు. అయితే ఈ క్షేత్రంలో నందితో పాటు భృంగి విగ్రహం కూడా ఉంటుంది. ఇలా నందితో పాటు భృంగి ఉండటం ఈ ఆలయం మరో విశిష్టతగా చెబుతారు.

పంచ వృక్షాలు

పంచ వృక్షాలు

P.C: You Tube

ఆలయంలోని ఆవరణంలో రావి, వేప, ఊడగ, చింత, బిల్వ వృక్షాలు ఉన్నాయి. ఈ ఐదు వృక్షాలు అత్యంత ప్రాచీనమైనవని ఇక్కడే అగస్త్య మహాముని తపస్సు చేసేవాడని చెబుతారు. మహిళలు సంతానం కొరకు ఈ వృక్షాలకు ప్రత్యేక పూజలు చేస్తారు.

రుద్ర పాదాల ముక్కోటి

రుద్ర పాదాల ముక్కోటి

P.C: You Tube

కార్తీక మాసం, మహాశివరాత్రి రోజూ ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా కార్తిక మాసం పౌర్ణమి రోజున రుద్ర పాదాల ముక్కోటి పేరుతో పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

P.C: You Tube

తిరుపతి-చిత్తూరు, తిరుపతి-చంద్రగిరి వెళ్లే ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ తొండవాడకు వెళుతుంది. టీ.టీ.డీ వారి దర్శన బస్సులు కూడా ఇక్కడకు వెలుతాయి. శ్రీనివాస మంగాపురంలో ఉన్న కళ్యాణ వేంకటేశ్వరుడి ఆలయం ఇక్కడకు దగ్గర.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X