Search
  • Follow NativePlanet
Share
» » మీరు మంచివారైతేనే ఇక్కడ జ్వాల నరసింహుడి దర్శనం, అదే జరిగితే ఐశ్వర్య, సంతాన ప్రాప్తి

మీరు మంచివారైతేనే ఇక్కడ జ్వాల నరసింహుడి దర్శనం, అదే జరిగితే ఐశ్వర్య, సంతాన ప్రాప్తి

వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

ఈ క్షేత్రంలోనే నాలుగు వేదాలు నరసింహుడి చెంత కొలువై ఉన్నాయి. అంతేకాకుండా నరసింహుడు ఐదు రూపాల్లో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాడు. ఇలా ఒకే క్షేత్రంలో నరసింహుడు ఐదు రూపాల్లో కొలువై ఉండటం భారత దేశంలో ఇక్కడ మాత్రమే చూడవచ్చు.

ముఖ్యంగా ఇక్కడి పర్వతం అంతర్భాగంలో నరసింహుడు జ్వాల నరసింహుడిగా కొలువై ఉన్నాడని చెబుతారు. పర్వతానికి ఉన్న బిలం ద్వారా అక్కడకు చేరుకొని స్వామివారిని పూజిస్తే అంతులేని సంపద మనకు దక్కడమే కాకుండా కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే సంతానం పుడుతారని స్థానికుల నమ్మకం.

ఇందుకు ఎన్నో ఉదాహరణలు వారు చూపిస్తారు. అయితే ఆ బిలం ద్వారా వెళ్లడానికి అందరికీ సాధ్యం కాదని కేవలం పుణ్యాత్ములకు మాత్రమే ఆ మార్గం కనిపిస్తుందని చెబుతారు. ఇంతటి విశిష్టమైన క్షేత్రానికి సంబంధించిన కథనం మీ కోసం...

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

నరసింహస్వామి అవతరించిన అత్యంత శక్తివంతమైన క్షేత్రాల్లో వేదాద్రి ఒకటి. వేదాలను తనలో నిక్షిప్తం చేసుకున్న పర్వత ప్రదేశం కనుక ఈ క్షేత్రానికి వేదాద్రి అని పేరు వచ్చింది.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో ఉన్న జగ్గయ్యపేటకు సమీపంలో కృష్ణా నదీ పక్కనే ఈ వేదాద్రి ఉంది. ఈ కొండ మధ్య భాగంలో ఇప్పటికీ నరసింహుడు ఉగ్రజ్వాలను వెదజల్లుతూ కొలువై ఉన్నాడని చెబుతారు.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

ఇక్కడ స్థలపురాణాన్ని అనుసరించి... సోమకాసురుడనే రాక్షసుడు త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ నుంచి నాలుగు వేదాలను అపహరిస్తాడు. అటు పై ఎవరికీ దొరక్కుండా సముద్ర గర్భంలో దాక్కొంటాడు.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

దేవతలు వేడుకోవడంతో శ్రీ మన్నారాయణుడు ఆ మత్స్యావతారం ఎత్తుతాడు. అటు పై సముద్ర గర్భంలోకి వెళ్లి సోమకాసురుడిని సంహరించి నాలుగు వేదాలను రక్షించి బ్రహ్మకు అందజేస్తాడు.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

అటు పై నాలుగు వేదాలు పురుష రూపం ధరించి తాను ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుడి సన్నిదిలో ఉండేలా వరమివ్వమని కోరుతాడు. అంతే కాకుండా మీ సన్నిది వచ్చేవారి కోర్కెలు తీర్చు భాగ్యం తమకు కల్పించాలని వేడుకొంటాయి.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

దీంతో శ్రీమన్నారాయణుడు ఈ మత్స్యావతారంలో అందుకు వీలుపడదని అయితే రానున్న నారసింహావతారంలో మీ కోరిక తప్పకుండా తీరుస్తానని పురుష రూపంలో ఉన్న వేదాలకు అభయమిస్తాడు.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

అదే విధంగా కృష్ణా నదీ కూడా తన చెంతనే ఉండాలని పరితపిస్తోందని ఆమె కోరిక కూడా అదే సమయంలో నెరవేరుతుందని అటు వేదాలతో పాటు కృష్ణా నదికి కూడా చెబుతారు.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

ఇది జరిగిన కొన్ని వందల సంవత్సరాలకు హిరణ్యకశిపుడి సంహరించి ప్రహ్లాదుడిని రక్షించడానికి శ్రీ మన్నారాయణుడు నరసింహుడి అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. ఈ విషయం మన పురాణాల్లో చాలా చోట్ల కనిపిస్తుంది.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

గతంలో వేద పురుషులకు ఇచ్చిన వరం మేరకు కృష్ణా నదీతీరంలో లోని వేదాద్రి పర్వత ప్రాంతంలో ఐదు రూపాల్లో వెలిశాడు. ఇలా ఐదు రూపాల్లో ఒకే క్షేత్రంలో నరసింహుడు కొలువై ఉండటం చాలా అరుదైన విషయం.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

అవే జ్వాలా నరసింహస్వామి, సాలగ్రామ నరసింహ స్వామి, వీర నరసింహ స్వామి, యోగానంద నరసింహ స్వామి, లక్ష్మీ నారసింహ స్వామి. అయితే ఈ ఐదు అంశాల్లో ప్రధాన మూర్తిగా ప్రత్యేక శక్తిగా యోగానంద నరసింహ స్వామి పూజలు అందుకొంటూ ఉన్నాడు.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

యోగానంద నరసింహస్వామి మూల రూపము ప్రపంచంలో మరెక్కడా లేనంత సుందరంగా ఇక్కడ ఉంది. దీనిని సాలిగ్రామ శిలతో తయారు చేసి త్రేతాయుగంలో బుుష్యశృంగ మహర్షి ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతుంది.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

ఇదిలా ఉండగా ఈ వేదాద్రి పర్వత గర్భంలో దేదీప్యమానమైన వెలుగులతో నారసింహుడు కొలువై ఉన్నాడని చెబుతారు. అతి కష్టమైన కొండ బిలం ద్వారా కొంత దూరం వెళ్లిన పుణ్యత్ములకు మాత్రమే ఈ స్వామి దర్శనమవుతుందని చెబుతారు.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

ఇలా దర్శించుకున్నవారి అమితమైన ఐశ్వర్యం లభించడంతో పాటు కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే సంతానం కలుగుతుందని చెబుతారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా స్థానికులు చూపిస్తారు.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

ఇదిలా ఉండగా బ్రహ్మదేవుడు స్వయంగా ఇక్కడికి వచ్చి ఇదే రూపంలో తమ సత్యలోకానికి వచ్చి పావనం చేయాలని వేడుకొన్నాడు. బ్రహ్మదేవుడి కోరికను మన్నించిన నరసింహుడు అదే రూపంలో సత్యలోకానికి వెళ్లాడు.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

అయితే స్వామి వారి ఉగ్రరూపం, ఆయన శరీరం నుంచి వచ్చే సెగలను తట్టుకోలేక బ్రహ్మ దేవుడు నరసింహ స్వామిని తిరిగి కృష్ణా నదిలో ప్రతిష్టించాడు. అప్పటి నుంచి కృష్ణానదీ జలం స్వామివారిని అభిషేకిస్తోంది.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

ఇప్పటికీ కృష్ణానదిలో కనిపిస్తున్న పెద్ద రాయి సాలిగ్రామ నరసింహమూర్తి స్వరూపంగా భక్తులు భావిస్తారు. దీనికి కూడా పూజలు చేస్తారు. ఐదు రూపాల్లో మొదటి రూపం ఇదేనని స్థానికులు చెబుతారు.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

ఇదిలా ఉండగా కలియుగంలో మానవులు తపస్సు చేయాల్సిన అవసరం లేదని కేవలం భగవంతుడి నామస్మరణం చేస్తే చాలని వ్యాసభగవానుడు బుుషులకు తెలిపాడు. దీంతో బుుషులు దైవ నామ సంకీర్తన చేస్తూ దేశాటన చేయసాగారు.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

ఇలా దేశాటన చేస్తూ కృష్ణానదీ తీరంలో ఉన్న వేదాద్రి పర్వతం దగ్గరకు వచ్చారు. అదే సమయంలో ఈ పర్వతం నుంచి వారికి వేదఘోష వినిపించింది. దీంతో వారు మిక్కిలి ఆశ్చర్యపోయారు.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

అటు పై ఆ బుుషులు తమ తప: శక్తి ద్వారా ఇక్కడ శ్రీ మన్నారాయణుడు నరసింహ అవతారంలో వెలిశాడని తెలుసుకొని దర్శించారు. వేదాద్రి క్షేత్ర ప్రస్తావన మనకు శ్రీనాథుడి కాశీ ఖండంలో కనిపిస్తుంది.

 ఐదు వేదాలు నరసింహుడి చెంత

ఐదు వేదాలు నరసింహుడి చెంత

P.C: You Tube

వేదాద్రి కృష్ణా జిల్లా జగయ్య పేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఇక్కడకు నిత్యం బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్యం 1 గంట వరకూ అటు పై సాయంత్రం 3 నుంచి 5.30 వరకూ మరలా 6.30 నుంచి 8.30 వరకూ స్వామి వారి దర్శనం వీలవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X