Search
  • Follow NativePlanet
Share
» » ఔరంగజేబు నుంచి రక్షించిన ‘నల్లనయ్య’ను ద్వారక కాని ద్వారకలో దాచారు

ఔరంగజేబు నుంచి రక్షించిన ‘నల్లనయ్య’ను ద్వారక కాని ద్వారకలో దాచారు

రాజస్థాన్ లోని నాథ్ ద్వారా పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

భారత దేశాన్ని అనేకమంది పొరుగు దేశాలకు చెందిన చక్రవర్తులు పరిపాలించారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది ఇక్కడి హిందూ మతం పై గౌరవం పెంచుకొని ఆలయాలను నిర్మించారు. అయితే మరికొంతమంది మాత్రం హిందూ మతం అంతానికి కంకణం కట్టుకొని కనిపించిన దేవాలయాలను, వాటిలోని శిల్పాలను నాశనం చేయడానికి విఫలయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఔరంగజేబు నుంచి ఓ అరుదైన శ్రీకృష్ణుడి విగ్రహం కాపాడటానికి మధురలోని ఆలయ నిర్వహాకులు ఓ సాహసమే చేసి విజయం సాధించారు. ఆ మధురలోని విగ్రహం రాజస్థాన్ లో పూజలు అందుకొంటూ ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం

ఉదయ్ పూర్ కు దగ్గర

ఉదయ్ పూర్ కు దగ్గర

P.C: You Tube

ఆరావళి పర్వతశ్రేణిలో రాష్ట్రమైన రాజస్థాన్ లోని రాజసమండ్ జిల్లాలోని నాథ్ ద్వారా అనే చిన్న పట్టణంలో శ్రీనాథ్ జీ విగ్రహం ఉంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు 48 కిలోమీటర్ల దూరంలో ఈ నాథ్ ద్వారా ఉంది. ఈ విగ్రహం మథుర నుంచి ఇక్కడికి వచ్చిందని చెబుతారు.

ఔరంగజేబు

ఔరంగజేబు

P.C: You Tube

మొగల్ వంశానికి చెందిన ఔరంగజేబు హిందూ దేవాలయాలను నాశనం చేసేవాడని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయన కృష్ణుడి జన్మస్థానమైన మధురలో ఉన్న శ్రీనాథ ఆలయాన్ని క్రీస్తు శకం 1672 కూడా ధ్వంసం చేయాలని భావిస్తాడు.

విగ్రహం రక్షించాలని

విగ్రహం రక్షించాలని

P.C: You Tube

ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు మూలవిరాట్ అయిన శ్రీనాథ విగ్రహాన్ని రక్షించాలని భావిస్తాడు. కృష్ణుడు ఏడేళ్ల వయస్సులో గోవర్థన గిరిని ఎత్తుతున్నట్లు ఉండే ఆ విగ్రహాన్ని శ్రీనాథుడిగా పూజించేవారు.

మధుర నుంచి తరలిస్తారు

మధుర నుంచి తరలిస్తారు

P.C: You Tube

ఈ విగ్రహం మధురలోని యమునా నది తీరంలో దొరికిందని చెబుతారు. ఈ విగ్రహం అరుదైన నల్లరాతితో చేయబడి చూడటానికి నయనమనోహరంగా ఉంటుంది. అరుదైన శ్రీనాథ విగ్రహాన్ని ఎద్దుల బండిలో ఉంచి ఔరంగజేబు కంటబడకుండా మధుర నుంచి ఆలయ నిర్వాహకులు తరలిస్తారు.

 నాథ్ ద్వారా వద్ద ఆగిపోతుంది.

నాథ్ ద్వారా వద్ద ఆగిపోతుంది.

P.C: You Tube

అలా వెలుతున్న ఎద్దుల బండి ప్రస్తుతం నాథ్ ద్వారా కు వచ్చిన వెంటనే ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఎద్దులు ముందుకు కదలవు. దీంతో ఆ బండి వెంబడి ఉన్న పండితులు ఆ ప్రాంతంలోనే శ్రీనాథుడికి ఆలయం కట్టించాలని భావిస్తారు

రాజ్ సింగ్

రాజ్ సింగ్

P.C: You Tube

ఈ విషయాన్ని అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజ్ సింగ్ కు తెలియజేస్తారు. రాజు సంతోషంగా ఆలయ నిర్మాణానికి అంగీకరిస్తాడు. సొంత ఖర్చులతో ఆ ఆలయాన్ని నిర్మిస్తాడు. అంతేకాకుండా పండితులకు అక్కడ నివాసాలు ఏర్పాటు చేస్తారు.

అందుకే ఆ పేరు

అందుకే ఆ పేరు

P.C: You Tube

అలా ద్వారక నుంచి వచ్చిన శ్రీనాథుడి విగ్రహం కొలువైన ప్రాంతం కావునే దానికి నాథ్ ద్వారా అని పేరొచ్చింది. ఇక ఆలయాన్ని బ`ందావనంలోని నందమహారాజ ఆలయం శైలిలో నిర్మించారు. మూలవిరాట్టును కూడా శ్రీనాథ్ జీ పేరుతో కొలువడం మొదలుపెట్టారు. ఆలయం గోపురం మీద ఎప్పుడూ ఏడు జండాలు ఎగురుతూ ఉంటాయి.

గోవర్థనగిరి ఎత్తుతున్నట్లు

గోవర్థనగిరి ఎత్తుతున్నట్లు

P.C: You Tube

ఇక ఆలయంలో శ్రీ కృష్ణుడి విగ్రహం ఎడమచేతితో గోవర్థన గిరిని ఎత్తుత్తూ కూడి చేతిని పిడికిలిగా బిగించి ఛాతి మీద విశ్రాంతిగా పెట్టున్నట్లు ఉంటుంది. ఈ శిల్పంలో శ్రీ కృష్ణుడితోపాటు ఒక సింహం, రెండు ఆవులు, రెండు నెమళ్లను చూడవచ్చు.

అచ్చం అలాగే పూజలు

అచ్చం అలాగే పూజలు

P.C: You Tube

ఈ ఆలయంలోని పూజలన్నీ మధురలో కృష్ణుడికి ఏవిధంగా జరుగుతాయో అలాగే జరుగుతాయి. వల్లభాచార్యుడి వంశీయులే ఈ గుడికి పూజారులు. ఈ విగ్రహాన్ని బాలకృష్ణుడిగా భావించి గోవులు కాయడానికి వినియోగించే కర్రను విగ్రహం వద్ద ఉంచుతారు.

మూడు పూటలా నైవేద్యం

మూడు పూటలా నైవేద్యం

P.C: You Tube

ఆలయంలో జన్మాష్టమి, దీపావళి, హోలీ పండుగులు బ్రహ్మండంగా జరుగుతాయి. స్వామివారికి నేత పంచె, జరీ కండువా, రత్నఖచిత ఆభరణాలతో ప్రతి రోజూ ఆలంకరణ ఉంటుంది. మూడు పూటలా స్వామివారికి నైవేద్యం ఇక్కడ విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X