Search
  • Follow NativePlanet
Share
» »హోషంగాబాద్ - ఆనందం, ఆధ్యాత్మికం !!

హోషంగాబాద్ - ఆనందం, ఆధ్యాత్మికం !!

హోషంగాబాద్ లో జరిగే వేడుక నర్మదా జయంతి. ఈ పండుగ హోషంగాబాద్ టూరిజం కి ఎంతగానో తోడ్పడుతుంది. సెథాని ఘాట్ అనేది హోషంగాబాద్ లో ఉన్న ముఖ్యమైన ల్యాండ్ మార్క్.

By Mohammad

పర్యాటక ప్రదేశం : హోషంగాబాద్
రాష్ట్రం : మధ్యప్రదేశ్
ప్రధాన ఆకర్షణ : సాత్పురా నేషనల్ పార్క్, రాంజీ బాబా సమాధి

నర్మదా నది ఉత్తరపు ఒడ్డున దేశానికి హృదయం వంటి ప్రాంతం లో హోషంగాబాద్ ఉంది. దేశం అలాగే రాష్ట్రం యొక్క చరిత్రలో హోషంగాబాద్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. ఇంతకు పూర్వం 'నర్మదాపురం' గా పిలువబడిన ఈ ప్రాంతం పేరు నర్మదా నది నుండి పుట్టింది. ఆ తరువాత నర్మదాపురాన్ని పాలించిన హోశాంగ్ షా పేరుతొ హోషంగాబాద్ గా ఈ ప్రాంతం ప్రాచుర్యం పొందింది. అప్పటి నుండి, ఈ నగరం సహజమైన అనడంతో, ఆధ్యాత్మికత తో ఏంతో మంది పర్యాటకులని అమితం గా ఆకట్టుకుంటోంది.

సెథాని ఘాట్

సెథాని ఘాట్

చిత్రకృప : Maheshbasedia

హోషంగాబాద్ లో జరిగే వేడుక నర్మదా జయంతి. ఈ పండుగ హోషంగాబాద్ టూరిజం కి ఎంతగానో తోడ్పడుతుంది. సెథాని ఘాట్ అనేది హోషంగాబాద్ లో ఉన్న ముఖ్యమైన ల్యాండ్ మార్క్. ఈ జిల్లాలో ఉన్న రెండు నదుల అంటే నర్మదా ఇంకా తవా ల విభజన ప్రదేశం బంద్రబన్. హోషంగాబాద్ జనాభా వ్యవసాయం మీదే ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది.

సాత్పురా నేషనల్ పార్క్

టైగర్ రిజర్వులకి ప్రసిద్ది చెందినా సాత్పురా నేషనల్ పార్క్ వివిధ రకాల వృక్ష మరియు జంతు జాలాలకి స్థావరం. ఈ ప్రాంతం భారత దేశం లో ని పాడుకాని వైల్డ్ లైఫ్ సాంచురీలలొ ఒకటి. పులుల పరిరక్షణ ఉద్దేశ్యం తో ప్రారంభమయింది ఈ సాంచురీ. సాత్పురా నేషనల్ పార్క్ ని సందర్శిస్తున్నప్పుడు పర్యాటకులకి మచ్చల జింక, పులులు, చిరుత మరియు బురద మొసళ్ళను చూసే అవకాశం లభిస్తుంది.

నీటి చెలమల వద్ద దప్పిక తీర్చుకుంటున్న చిరుత

నీటి చెలమల వద్ద దప్పిక

తీర్చుకుంటున్న చిరుత

చిత్రకృప : Devyaani Bhatnagar

బ్లాకు బక్ మరియు ఇండియన్ జైంట్ స్క్విరెల్ ఈ ప్రాంతం యొక్క విశిష్టమైన ఆకర్షణలు. ఈ నేషనల్ పార్క్ లో ఉన్న అనేక రకాల పక్షుల ను చూడడానికి సంతోషంగా ఉంటుంది. సత్పుర నేషనల్ పార్క్ లో దాదాపు 1300 రకాల మొక్కలు కలవు. వీటిలో ఔషద మొక్కలు కూడా ఉన్నాయి. ప్రపంచం లో నే నడకకి అనువుగా ఉన్న ఏకైక టైగర్ రిజర్వ్ ఇది. నలుగురు వ్యక్తులు కలిగిన ఒక బృందాన్ని శిక్షణ పొందిన వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ ని రక్షణ తో ఈ టైగర్ రిజర్వ్ లో నడకకు అనుమతినిస్తారు. జనవరి నుండి జూన్ వరకు ఈ పార్క్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం.

ఇది కూడా చదవండి : సాత్నా - వరాహమూర్తి ఒంటినిండా దేవతలే !!

రాంజీ బాబా సమాధి

హోషంగాబాద్ లో ఉన్న ప్రధాన ఆకర్షనలలో రాంజీ బాబా సమాధి ఒకటి. ఈ సమాధి లో రాంజీ బాబా మందిరం కలదు. అత్యంత మంది శిష్యులు కల్గిన మహర్షి ఇతను. ఈ సమాధి వద్ద స్థానికులచే ప్రతి సంవత్సరం దాదాపు ఒక నెల వరకు పండుగని జరుపుతారు. ఈ సమయం లో దూర దూరాల నుండి అనేక మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు.

సైకత శిల్పాలు

సైకత శిల్పాలు

చిత్రకృప : Maheshbasedia

హోషంగాబాద్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

హోషంగాబాద్ మధ్యప్రదేశ్ లో ని అన్ని ప్రధాన నగరాలకు రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. టాక్సీ లని అద్దెకి తీసుకుని లేదా బస్సు ద్వారా కూడా సందర్శకులు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం

తరచూ రైళ్లతో చక్కగా నిర్వహించబడే రైల్వే స్టేషన్ హోషంగాబాద్ లో ఉంది. ట్రైన్ ద్వారా ఈ నగరానికి చేరుకోవడం ఉత్తమమైన మార్గం.

వాయు మార్గం

హోషంగాబాద్ కి సమీపం లో ఉన్న రాజ భోజ్ విమానాశ్రయం రాష్ట్ర రాజధాని భోపాల్ లో ఉంది. భోపాల్ నుండి హోషంగాబాద్ కి చేరుకునేందుకు టాక్సీలు సౌకర్యవంతమైన ఎంపిక.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X