Search
  • Follow NativePlanet
Share
» »జైసల్మేర్ ఎడారి పండగ చూసొద్దామా !!

జైసల్మేర్ ఎడారి పండగ చూసొద్దామా !!

రాజస్థాన్ సంగీతానికి, నృత్యరీతులకు జైసల్మేర్ ప్రాసిద్ధి గాంచినది. దీన్నే బంగారు నగరం అని కూడా అంటారు. నోరూరించే వంటకాలకు, భవంతులకు, రాజప్రాసాదాలకు, మ్యూజియాలకు ... ఇలా మరెన్నో అంశాలకు జైసల్మేర్ ప్రసిద

By Mohammad

ఒకనాటి భారతదేశ నిర్మాణ కళాచాతుర్యానికి నిలువెత్తు నిదర్శనం ... రాజస్థాన్ లోని జైసల్మేర్. ఇది థార్ ఎడారి భూభాగంలో ముప్పైమూడు వేల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నది. ఈ జిల్లా భారత్ - పాకిస్థాన్ సరిహద్దు భూభాగంలో ఉన్నది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే నీళ్ళు, తిండి, గుడ్డ లాంటి కనీస అవసరాలు కూడా దొరకని భూభాగంలో దీనిని నిర్మించడమే !! జైపూర్ లాంటి నగరాలకు దగ్గరలో కాకుండా ఎక్కడో ఎడారిలో అంతంత పెద్ద పెద్ద భవంతులను, కోటలను ఎందుకు నిర్మించారో నాటి రాజపుత్రులకే తెలియాలి. అన్నట్లు ఈ జైసల్మేర్ ను నిర్మించింది రావు జైసల్. అతని పేరుమీదనే దీనికి జైసల్మేర్ అన్న పేరువచ్చింది. ఇక్కడ ప్రపంచంలోనే ఏకైక 'సజీవ కోట' ఉన్నది. అదే జైసల్మేర్ కోట గా పిలువబడుతున్నది.

థార్ ఎడారి (గ్రేట్ ఇండియన్ డెసర్ట్) లో కేవలం జైసల్మేర్ ఒక్కటే కాదు బికనేర్, జోధ్ పూర్ కూడా ఉన్నాయి (వీటిలో జోధ్ పూర్ పెద్దది). అదేంటో గానీ భారతీయ పర్యాటకులకన్నా జైసల్మేర్ ను సందర్శించటానికి ఎక్కువగా విదేశీ పర్యాటకులు ఆసక్తిని కనబరుస్తుంటారు. సంవత్సరానికి ఐదు లక్షల మంది దాకా జైసల్మేర్ ను పర్యాటకులు సందర్శిస్తుంటారని అంచనా. వీరిలో విదేశీయులు మూడు లక్షల మంది వరకు సందర్శిస్తున్నారట.

ఇది కూడా చదవండి : ఉదయపూర్ - భారతదేశపు వెనిస్ నగరం !!

జైసల్మేర్ లో వస్త్రాధారణ, ఉత్సవాలు, ఆహారపు అలవాట్లు, సంగీతం, నృత్యం ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఏటా ఫిబ్రవరిలో ఇక్కడ మూడు రోజులపాటు ఇక్కడ ఒక పండుగ/జాతర జరుగుతుంది. కేవలం దాన్ని చూడటం కోసమే ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఎండాకాలం సమీపిస్తున్న వేళ ఈ పండుగ జరపడం ఆనవాయితీ.

హైదరాబాద్ నగరం తో పాటు దేశంలో ఇతర ప్రధాన నగరాల నుండి జైసల్మేర్ వెళ్ళటానికి రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖవారు కూడా ఇక్కడ వసతి సౌకర్యాలు ఏర్పాటుచేయడంతో యాత్రికులు కూడా బాగానే వచ్చిపోతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఫిబ్రవరి నెలలో ఇక్కడ జరిగే జాతర లో పాల్గొనండి మరియు జైసల్మేర్ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలనూ సందర్శించండి.

జైసల్మేర్ లో ఫిబ్రవరి లో జాతర

జైసల్మేర్ లో ఫిబ్రవరి లో జాతర

ఫిబ్రవరి లో జరిగే జాతర జైసల్మేర్ లో ప్రత్యేకమైనది. ఎండాకాలం సమీపిస్తున్న తరుణంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ మూడు రోజుల పాటు జరుగుతుంది. దీనిని 'జైసల్మేర్ ఎడారి పండగ/జైసల్మేర్ డెసర్ట్ ఫెస్టివల్' అని కూడా పిలుస్తారు.

చేపట్టే కార్యక్రమాలు : ఒంటెల పందేలు, తలపాగా చుట్టడం, మీసకట్టు పందేలు, కుస్తీ పోటీలు ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. శిబిరాలు, చలిమంటలు, ఒంటెల మీద సవారి దూరం నుంచి వచ్చే యాత్రికులనూ ఆకట్టుకుంటాయి.

చిత్రకృప : Yogeshmankar

జైసల్మేర్ కోట

జైసల్మేర్ కోట

నగరం నడిబొడ్డున వుండే జైసల్మేర్ కోట ను జైసల్మేర్ కు గర్వ కారణంగా భావిస్తారు. పసుపు రంగు ఇసుకరాయి తో నిర్మించిన ఈ కోట సూర్యాస్తమయం లో బంగారంలా మెరిసిపోవడంతో దీన్ని సోనార్ ఖిల్లా లేదా బంగారు కోట అని అంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా సందర్శన వేళలు.

చిత్రకృప : Jitendra Parande

కోటలోని ఏడు జైన దేవాలయాలు

కోటలోని ఏడు జైన దేవాలయాలు

కోటలోని ఏడు జైన దేవాలయాలు : చంద్ర ప్రభు టెంపుల్, శంభదేవుడు, రిషభదేవుడు, శాంతినాధ్, శీతల్నాథ్ టెంపుల్ మొదలగునవి. లక్ష్మినాథ్ హిందూ దేవాలయం కూడా చూడవచ్చు.

చిత్రకృప : Shitha Valsan

మూల్ సాగర్

మూల్ సాగర్

జైసల్మేర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ మూల్ సాగర్. ఇది సాం ఇసుక తిన్నెలకు వెళ్ళే దారిలో వుంది. తోటలో శివాలయం చూడవచ్చు. 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకల్ వుడ్ శిలాజ పార్క్ చూడదగ్గది.

చిత్రకృప : Travelling Slacker

బడా బాగ్

బడా బాగ్

భట్టీ వంశ రాజులు నిర్మించిన రాజ సమాధులు వున్న పెద్ద పార్క్ గా బడా బాగ్ ప్రసిద్ది చెందింది. మహారావాల్ జైత్ సింగ్ సమాధి అన్నిటికన్నా పురాతనమైనది. ఈ ప్రాంతం జైసల్మేర్ నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో వుంది. సమాధులే కాకుండా, ఈ పార్కు లోపల జైత్ సార్ సరస్సు, జైత్ బాంద్ ఆనకట్ట, గోవర్ధన స్థంభం కూడా యాత్రికులు చూడవచ్చు.

చిత్రకృప : Nagarjun Kandukuru

అమర్ సాగర్ లేక్

అమర్ సాగర్ లేక్

అమర్ సాగర్ సరస్సు ఒడ్డున అందమైన రాజప్రాసాదం అమర్ సింగ్ పేలస్ కలదు. సాగర్ ఒడ్డున రిషభదేవ ఆలయం, ఒయాసిస్సుల వంటి సరస్సులు, రాజభవనాలు, రాళ్ళతో నిర్మించిన డ్యాంమ్ పలు జైన దేవాలయాలు చూడదగ్గవి.

చిత్రకృప : Flicka

బ్రహ్మసర్

బ్రహ్మసర్

బ్రహ్మసర్, జైసల్మేర్ నగరం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న కుగ్రామం. ఈ ప్రాంత ప్రధాన ఆకర్షణ బ్రహ్మసాగర్ తీర్థంలో యాత్రికులు పార్శ్వనాధుని విగ్రహం చూడవచ్చు. ప్రముఖ జైన పుణ్యక్షేత్ర౦ బ్రహ్మసర్ లో పర్యాటకులు లోద్రవ్ పూర్ తీర్థం, వైశాఖీ తీర్థం చూడవచ్చు.

చిత్రకృప : Jules Jain

ఎడారి సంస్కృతిక కేంద్రం, మ్యూజియం

ఎడారి సంస్కృతిక కేంద్రం, మ్యూజియం

ఎడారి సాంస్కృతిక కేంద్రం, మ్యూజియం గడ్సిసార్ రోడ్డు మీద జైసల్మేర్ నగరానికి దగ్గరలో వుంది. ఈ కేంద్ర ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచి వుంటుంది. ఇక్కడ ఒక ప్రభుత్వ మ్యూజియం, జానపద మ్యూజియం కూడా కలదు.

చిత్రకృప : Schwiki

ఎడారి జాతీయ పార్క్

ఎడారి జాతీయ పార్క్

అంతరించి పోతున్న రాజస్థాన్ రాష్ట్ర పక్షి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కు ఈ పార్క్ సహజ ఆవాసం. రాజబాగ్ సరస్సు, మిలాక్ సరస్సు, పదం తలావ్ సరస్సు ఈ పార్కులోపల వున్న ప్రధాన జలాశయాలు. నవంబర్ - జనవరి నెలల మధ్య ఈ పార్కును సందర్శించడం ఉత్తమం.

చిత్రకృప : Vijay.dhankahr28

ఖురీ ఇసుక తిన్నెలు

ఖురీ ఇసుక తిన్నెలు

జైసల్మేర్ నగరానికి 42 కిలోమీటర్ల దూరంలోని ఖురీ గ్రామంలో ఖురీ ఇసుక తిన్నెలు వున్నాయి. ఇక్కడి ఎడారి ఇసుక తిన్నెల్లో యాత్రికులు ఒంటెలపై సవారీని ఆస్వాదించవచ్చు. జైసల్మేర్ నగరం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఖాభా కోట, జియోలాజికల్ మ్యూజియం ప్రధాన పర్యాటక ఆకర్షణలు.

చిత్రకృప : Flicka

కుల ధారా

కుల ధారా

కుల్దారా, జైసల్మేర్ నగరం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రిక గ్రామం. పర్యాటకులు సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యలో మాత్రమే సందర్శించడానికి అనుమతి౦చబడే భయానక గ్రామము. 200 సంవత్సరాల నాటి మట్టి ఇల్లు ఇక్కడ చూడవచ్చు.

చిత్రకృప : Suryansh Singh

మహారాజా పాలెస్

మహారాజా పాలెస్

మహారాజా పాలెస్, జైసల్మేర్ కోట సముదాయంలో ఉంది. ఈ భవనం ఐదు అంతస్తులతో, అద్భుతంగా చెక్కిన కిటికీలు, బాల్కనీల తో ప్రసిద్ది చెందింది. పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండే మధ్యాహ్న౦పూట ఈ భవనాన్ని సందర్శించడం ఉత్తమం.

చిత్రకృప : Schwiki

మానక్ చౌక్, హవేలీలు, జైసల్మేర్

మానక్ చౌక్, హవేలీలు, జైసల్మేర్

జైసల్మేర్ కోట బయట వున్న మానక్ చౌక్, హవేలీలు ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఇక్కడి హవేలీలు అందమైన కళాకృతులు చేతి పనులతో అలంకరించబడి వుంటాయి. ఈ హవేలీలు అన్నిటిలో పట్వోన్ కీ హవేలీ, సలీం సింగ్ కీ హవేలీ, నాద్ మల్ జీ కీ హవేలీ ప్రసిద్ధ కట్టడాలు.

చిత్రకృప : ExtremeResearchNerd

జైసల్మేర్ జిల్లాలో చూడవలసిన ఇతర దర్శనీయ ప్రదేశాలు

జైసల్మేర్ జిల్లాలో చూడవలసిన ఇతర దర్శనీయ ప్రదేశాలు

లోదుర్వా 15 KM జైన దేవాలయానికి ప్రసిద్ధి, 15 వ శతాబ్దంలో నిర్మించిన హవేలీ శ్రీనాథ్, బాదల్ ప్యాలెస్ సమీపంలో మదిరీ ప్యాలెస్ (తాజియా టవర్), జైసల్మేర్ కోటలోని ఏడు జైన దేవాలయాలు, సలీం సింగ్ కి హవేలీ, సర్వోత్తమ విలాస్, 42 KM దూరంలో సాం ఇసుక తిన్నెలు, పట్వోన్ కి హవేలీ, 11 KM దూరంలో రామ్ కుండా మరియు అక్కడి దేవాలయాలు.

చిత్రకృప : Jasleen Bedi

నోరూరించే స్థానిక రుచులు

నోరూరించే స్థానిక రుచులు

జైసల్మేర్ వెళ్లాలనుకునే యాత్రికులు ఇక్కడి రాజస్తాన్ సాంప్రదాయ వంటకాల రుచులు చూడవచ్చు. నోరూరించే ముర్గ్-ఎ-సబ్జ్ యాత్రీకుల ఆదరణ చూరగొంది. రుచికరమైన కేర్ సా౦గ్రీ జైసల్మేర్ కే ప్రత్యేకం. ఆసక్తి ఉన్న యాత్రికులు జైసల్మేర్ లోని రెస్టారెంట్లలో దొరికే భానోన్ ఆలూ కడీ పకోడా కూడా రుచి చూడవచ్చు.

చిత్రకృప : Ana Raquel S. Hernandes

వసతి

వసతి

జైసల్మేర్ లో వసతి సదుపాయాలు కలవు. రాష్ట్ర పర్యాటక ప్రాంత అభివృద్లో భాగంగా ఇక్కడ వసతి సదుపాయాలను ఏర్పాటుచేశారు. ఏసీ, నాన్ - ఏసీ, రాయల్, సూట్ వంటి తరగతి గదులు లభిస్తాయి. రజ్వాడా కోట వంటి హోటల్లో బస కారిడార్ నుండి జైసల్మేర్ అందాలను చూడవచ్చు.

జైసల్మేర్ వసతి సదుపాయాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్రకృప : sanjeew singh

ఏది మంచి సమయం

ఏది మంచి సమయం

అక్టోబర్ నుండి మర్చి వరకు ఈ ప్రాంత సందర్శన అనుకూలం. మరీ ముఖ్యంగా ఫిబ్రవరిలో జరిగే 'ఎడారి ఉత్సవం' సమయంలో వెళితే అక్కడి ప్రాంతాలన్నీ కన్నులపండువగా ఉంటాయి.

చిత్రకృప : Jesse Gillies

జైసల్మేర్ చేరుకోవడం ఎలా ?

జైసల్మేర్ చేరుకోవడం ఎలా ?

వాయు మార్గం : 285 కి. మీ. ల దూరంలో ఉన్న జోధ్ పూర్ సమీప విమానాశ్రయం. ఇది ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్ నుండి కనెక్ట్ చేయబడి ఉంటుంది. క్యాబ్ అద్దెకు తీసుకొని జైసల్మేర్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : జైసల్మేర్ లో రైల్వే స్టేషన్ కలదు. ఢిల్లీ, జైపూర్ నుండి చక్కగా అనుసంధానించబడి ఉంటుంది.

రోడ్డు మార్గం : ఢిల్లీ, జైపూర్, జోధ్ పూర్ మరియు దాని పక్కనున్న సమీప ప్రాంతాల నుండి జైసల్మేర్ కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు కలవు.

చిత్రకృప : jokertrekker

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X