Search
  • Follow NativePlanet
Share
» »కేరళలోని ఈ దేవాలయంలో కుక్కల ప్రవేశానికి అవకాశముందంట...

కేరళలోని ఈ దేవాలయంలో కుక్కల ప్రవేశానికి అవకాశముందంట...

By Venkatakarunasri

మన భారత దేశంలో దేవాలయాలు దానికదే ప్రాముఖ్యతను మరియు మహత్యాన్ని కలిగివున్నది.ఏదైనా ఒక దేవాలయం దాని విశిష్టతవల్లే ప్రసిద్ధి చెందినది. కేరళలో ఒక విభిన్నమైన దేవాలయముంది. అక్కడ దేవునికి మద్యాన్ని, చేప, మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారంట. ఇంకొక విచిత్రం ఏమంటే ఇక్కడ ఎలాంటి జాతి వారైనా, ఎలాంటి మతం వారైనా కూడా ప్రవేశించవచ్చును. దాన్లో కుక్కలను కూడా ప్రవేశింపచేస్తారంటే మీరు నిజంగా నమ్ముతున్నారా?

ఔను ఈ దేవాలయంలో కుక్కలకు కూడా ప్రవేశముంది. ఆశ్చర్యం ఏమంటే ఈ దేవాలయానికి కుక్కలకూ ఒక సంబంధముంది. ఈ విభిన్నమైన దేవాలయముండేది కేరళ రాష్ట్రంలో వలపట్టినమం నది ఒడ్డున వున్నది.

ప్రస్తుత వ్యాసంమూలంగా ఈ విచిత్రమైన దేవాలయానికి సంబంధించిన ఆధ్యాత్మిక స్థల పురాణాన్ని తెలుసుకుందాం రండి.

కేరళలోని ఈ దేవాలయంలో కుక్కల ప్రవేశానికి అవకాశముందంట...

ఎక్కడుంది?

ఎక్కడుంది?

ఈ దేవాలయం పేరు ముత్తప్పన్ దేవాలయం. ఇదొక హిందూ దేవాలయం. కేరళ రాష్ట్రంలోని కణ్ణూరు జిల్లాలో తాలిపరంబ అనే ప్రదేశానికి సుమారు 10కిమీల దూరంలో వున్న కేరళ రాష్ట్రంలో వలపట్టినమం నది ఒడ్డున వున్నది.

PC: Sreelalpp

పరస్సి నికడవు ముత్తప్పన్

పరస్సి నికడవు ముత్తప్పన్

ఈ ముత్తప్పన్ దేవాలయాన్ని "పరస్సి నికడవు ముత్తప్పన్ దేవాలయం" అని కూడా పిలుస్తారు. దేవాలయం యొక్క ప్రధాన ఆదిదేవత శ్రీ ముత్తప్పన్. స్థానిక సాంప్రదాయం ప్రకారం ఇక్కడ వుండేది జానపద దేవత, వైదిక దేవతకు సంబంధించినది కాదు. అయితే ఇటీవలే విష్ణువు లేదా మహాశివుడిని కలపడానికి ప్రయత్నిస్తున్నారు.

PC:Dexsolutions

మాంసం, మద్యం

మాంసం, మద్యం

ఈ దేవాలయంలో బ్రాహ్మణ విధి విధానాన్ని అనుసరించరు. దానికి బదులుగా ఇక్కడ మాంసం, చేపలు మరియు మద్యాన్ని నైవేద్యంగా స్వామికి పెట్టి పూజిస్తారు. ముత్తప్పన్, తిరువప్పన్ మహోత్సవం ఇక్కడ ప్రముఖ పండుగ. ఈ ఉత్సవాన్ని 3 దినాల కాలం ఆచరిస్తారు.

PC:Sajith7775

ముత్తప్పన్ దంత కథ

ముత్తప్పన్ దంత కథ

ముత్తప్పన్ దంత కథ చాలా ఉత్తేజకరమైనది. అన్ని దేవతల కథల కన్నా కొంచెం విభిన్నంగా వుంటుంది. అదేమంటే పయ్యవూరు అనే గ్రామంలో బ్రాహ్మణ దంపతులైన నడువజి మత్తు అకెయ భార్య పడికుట్టి అంతర్జానం వీరికి పిల్లలు వుండరు.

PC: Rajesh Kakkanatt

పడికుట్టి

పడికుట్టి

పడికుట్టి కూడా పరమశివుని భక్తురాలు. ఒకరోజు నదిలో స్నానం చేస్తున్నప్పుడు, ఒక శిశువు పూలతో నింపిన బుట్టలో తేలుతూవుండటం చూసి శివుని ఆశీర్వాదం వల్ల తనకు లభించిందని అనుకుంటుంది.

PC:Omnipotent

నమ్మకం

నమ్మకం

పడికుట్టి యొక్క భర్తఅయిన నడువజి కూడా శివుని ఆశీర్వాదం అంటే నమ్మకంవుండటంవల్ల ఆ శిశువును స్వీకరిస్తాడు. ఈ విధంగా పెరుగుతూవున్న ఆ శిశువు తన బాల్యంనుంచి కూడా దీనుల కోసం, దళితుల ప్రయోజనం కోసం పాటుపడుతూ వుండేది.

PC: Mithu

బ్రాహ్మణులు

బ్రాహ్మణులు

ఆ శిశువు పెద్దవాడవుతున్నకొద్దీ బ్రాహ్మణుల ఆచార, విచారాలను ఆచరించలేదు. అంటే వేటాడటం మరియు మాంసాన్ని సేవించటం. ఈ అలవాట్లన్నీ ఆ బ్రాహ్మణదంపతులకు ప్రాణసంకటంగా పరిణమించింది.

PC:Rameshng

ఇల్లు వదిలివెళ్ళడం

ఇల్లు వదిలివెళ్ళడం

బ్రాహ్మణుల ఇంటిలో ఇటువంటి ఆహారాన్ని సేవించకూడదు అని దంపతులు వ్యతిరేకించినప్పుడు, అతను ఇంటిని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. తల్లి కొడుకును ఇల్లు వదిలి వెళ్లవద్దని ఎంత విన్నవించుకుంటూ అతని వెనకే వెళుతుంది.

PC:Rameshng

కోపం

కోపం

ఆ సమయంలో కోపంతో అతడు తల్లిని చూస్తాడు. తదనంతరం దంపతులకు తన నిజమైన స్వరూపంలో కనిపిస్తాడు. తదనంతరం తల్లి తన బిడ్డ ముందు తలదించుకుంటుంది.

PC:Rameshng

శస్త్రం

శస్త్రం

అప్పుడు కొడుక్కి ఒక శస్త్రం వుంటుంది. ఆ శస్త్రంతో కంటిని మూయమని ఆమె తన కుమారుని అడుగుతుంది. తల్లి చెప్పినట్లుగా,అతను శస్త్రంతో కన్ను మూసివేసి ఇంటిని వదిలివేసి వెళ్ళిపోతాడు.

PC:Reju

పురాణం ప్రకారం

పురాణం ప్రకారం

పురాణాల ప్రకారం, ఒక కుక్క ఎల్లప్పుడూ తన ప్రయాణంలో ముత్తప్పన్ ను అనుసరిస్తుంది. అందువలన ముత్తప్పన్ దేవాలయంలో కుక్కను దైవసమానంగా పరిగణిస్తారు.

PC:Vinayaraj

ఆశ్చర్యం

ఆశ్చర్యం

ఆశ్చర్యం ఏమంటే ఈ ముత్తప్పన్ దేవాలయంలో 2 వైపులా కుక్కల విగ్రహాలు ఉన్నాయి. సాధారణంగా అన్ని ఆలయాల్లో ఏనుగులు లేదా సింహం విగ్రహాలు కనపడతాయి. కానీ ఈ దేవాలయంలో మాత్రం కుక్కల విగ్రహాలు కనిపిస్తాయి.

PC:Bijesh

ముత్తప్పన్ దేవాలయాలు

ముత్తప్పన్ దేవాలయాలు

కన్నూర్ మరియు కాసర్గోడ్ జిల్లాలలో అనేకమైన ముత్తప్పన్ దేవాలయాలు కనపడతాయి. ఈ దేవునికి సంబంధించిన కర్ణాటకలో కూర్గ్ జిల్లాలో కూడా దేవాలయాలు కనిపిస్తాయి.

PC: Sreelalpp

ఆలయ నిర్మాణం వెనుక ఒక కథ

ఆలయ నిర్మాణం వెనుక ఒక కథ

ఆలయ నిర్మాణానికి ముందు కూరూత్ కుటుంబంలో పెద్దవాడైన ముత్తప్పన్ పేరు మీద ముత్తప్పన్ దేవాలయం అని నామకరణం కలిగిన ఈ స్థలానికి తరచుగా ముత్తప్పన్ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూవుంటాడు. అతను తరచుగా మద్యపానం చేస్తూవుండేవాడు.

PC:Dexsolutions

పనస చెట్టు

పనస చెట్టు

అతడు తన భక్తితో సమీపంలో వెలసిన ఒక చెట్టుకి మొదట కొన్ని చుక్కలు మద్యం సమర్పించి తదనంతరం త్రాగేవాడు. అతను చనిపోయిన అనంతరం గ్రామానికి అనేక సమస్యలు ఎదురైనాయి.

PC:Sajith7775

దేవాలయం నిర్మాణం

దేవాలయం నిర్మాణం

ముత్తప్పనికి మద్యం లభించటం లేదని గ్రామంలోని అందరుప్రజలకూ కీడు చేస్తున్నాడని భావించి ముత్తప్పనికి దేవాలయాన్ని నిర్మించారంట.

PC: Rajesh Kakkanatt

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

కేరళ లోని ఈ దేవాలయం కన్నూర్ కి 22 కి.మీ. దూరంలో ఉంది. కన్నూర్ మునిసిపల్ బస్ స్టేషన్ ఈ ఆలయానికి సమీపంలోని బస్ స్టేషన్.

సమీప రైల్వే స్టేషన్

సమీప రైల్వే స్టేషన్

సమీప రైలు స్టేషన్ కన్నూర్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సమీప విమానాశ్రయం

సమీప విమానాశ్రయం

సమీప విమానాశ్రయమేదంటే కన్నూర్ నుండి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరిపుర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more