» »ఇక్కడ దిగంబర రూపానికి బంగారు, వెండి పుష్పాలతో పూజలు

ఇక్కడ దిగంబర రూపానికి బంగారు, వెండి పుష్పాలతో పూజలు

Written By: Beldaru Sajjendrakishore

పొడవాటి చేతులు, బలిష్టమైన దేహం, నిర్వికారమైన నవ్వుతో దిగంబరుడి రూపం అన్న వెంటనే గుర్తుకు వచ్చేది మనకు శ్రావణ బెళగోళలోని గోమఠేశ్వరుడి విగ్రహమే. ఈ విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అంతేకాకుండా పన్నేండేళ్లకు ఒకమారు ఈ విగ్రహానికి మహామస్తకాభిషేకం పేరుతో ప్రత్యేక పూజలు కూడా జరుపుతారు. ఈ ఏడాది అంటే 2018లో జరుగుతున్న ఈ మహామస్తకాభిషేకంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా వచ్చారు. దీంతో ప్రపంచం మొత్తం ఈ శ్రవణబెళగోళ, గోమఠేశ్వరుడి విగ్రహం గురించే మాట్లాడుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ గోమఠేశ్వరుడు ఎవరు, ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటి, మహామస్తకాభిషేకం విశేషాలు తదితర వివరాలన్నీ నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. ఎవరీ బాహుబలి

1. ఎవరీ బాహుబలి

Image source

కర్ణాటకతో పాటు మిగిలిన మతస్తులు ఈ విగ్రహాన్ని గోమఠేశ్వరుడిగా పూజించినా జైన మతస్తులు మాత్రం బాహుబలిగానే కొలుస్తారు. జైన, విష్ణు పురాణాల్లో బాహుబలి ప్రస్తావన ఉంది. జైన తీర్థాంకురల్లో మొదటివాడైన వ`షభనాదుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించేవాడు. కొన్ని కారణాల వల్ల రాజ్యాన్ని రెండుగా విభజించి తన మొదటి భార్య సునందాదేవి కుమారుడైన భరతుడికి అయోధ్యను రాజు చేస్తాడు. పోదనపురానికి (తెలంగాణలోని బోధన్)కు రెండో భార్య యశస్వతీదేవికుమారుడైన బాహుబలిని రాజు చేస్తారు. అయితే జైత్ర యాత్రలో భాగంగా భరతుడు బాహుబలితో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది.

2.సోదరుడి కళ్లలో భయాన్ని చూసి

2.సోదరుడి కళ్లలో భయాన్ని చూసి

Image source

సోదరులిద్దరూ ధ్వంధ యుద్ధంలో తలపడుతారు. యుద్ధం భీకరంగా జరుగుతూ ఉంటుంది. ఒక సమయంలో బాహుబలి సోదరుడైన భరతుడిని పిడిగుద్దుతో మోది చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో భరతుడి కళ్లలోని ప్రాణభయాన్ని చూసి చలించిపోయాడు. తర్వాత తన రాజ్యాన్ని కూడా భరతుడికి అప్పగించి ప్రపంచంలో శాంతిస్థాపన కోసం సర్వసంగపరిత్యాగిగా మారిపోతాడు.

3.అక్కడి విగ్రహాన్ని చూసి

3.అక్కడి విగ్రహాన్ని చూసి

Image source

అప్పట్లో భోదన్లో బాహుబలి ఎతైన విగ్రహం ఉండేది. ఈ విషయాన్ని తెలుసుకున్న హాసన్ ను పాలించిన గంగరాజుల ఆస్థానంలోని మంత్రి చాముండరాయ తన తల్లి కోరిక మేరకు కర్ణాకటలో కూడా అటు వంటి వగ్రహమే ఉండాలని భావించాడు. చివరికి జైన మతానికి ఆలవాలమైన విధ్యాగిరి పై బాహుబలి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

4. ప్రపంచంలో ఎతైన విగ్రహం

4. ప్రపంచంలో ఎతైన విగ్రహం

Image source

ప్రపంచంలో ఎతైన ఏక శిలా విగ్రహం ఇదే. 58.8 అడుగుల ఎతైన ఈ విగ్రహాన్ని క్రీస్తుశకం 981 ఏడాదిలో ప్రతిష్టింపజేశారు. ఈ విషయం విగ్రహం అడుగు భాగంలో ఇప్పటికీ కనిపిస్తుంది. అదే ఏడాది మొదటిసారిగా మహామస్తకాభిషేకం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి పన్నేండేళ్లకు ఒకసారి ఈ మహామస్తకాభిషేకం ఉత్సవాలు జరుగుతున్నాయి.

5.మొదట వారికి మాత్రమే...

5.మొదట వారికి మాత్రమే...

Image source

తొలత ఈ మహామస్తకాభిషేకంలో రాజులు మాత్రమే పాల్గొనాలని చాముండిరాయ షరత్తు విధిస్తాడు. అదే ప్రయారం పూజ ప్రారంభమవుతుంది. అయితే ఎన్ని పాలు పోసినా విగ్రహం తడవదు. దీంతో అక్కడ ఉన్న ఓ వ`ద్దురాలు ఒక గిన్నెడు పాలు మాత్రం పోయగా అవి విగ్రహాన్ని తడపడమే కాకుండా ధారలా ప్రవహించాయి. దీంతో చాముండిరాయ తన తప్పును తెలుసుకుని సాధారణ ప్రజలకు కూడా మహామస్తకాభిషేకంలో పాల్గొనడానికి అవకాశం కల్పించాడు.

6. బంగారు, వెండి పుష్పాలతో

6. బంగారు, వెండి పుష్పాలతో

Image source

12 ఏళ్లకు ఒకసారి జరిగే మహామహామస్తకాభిషేకంలో ప్రపంచ నలమూలల నుంచి జైనగురువులు, వ్యాపారవేత్తలు, సాధరణ ప్రజలు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. ఈ ధార్మిక కార్యక్రమంలో దేశంలోని వివిధ పుణ్యనదీజలాలలతో పాటు పాలు, నెయ్యి, వెన్న, గంధం, పసుపు, కుంకుమ, చెరుకురసం, తదితర పూజాద్రవ్యాలతో పాటు బంగారు, వెండి పుష్పాలతో ఈ విగ్రహాన్ని అభిషేకిస్తారు. ఈ కార్యక్రమంలో కేవలం జైన మతస్తులే కాకుండా ఇతర మతస్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

7.కోట్ల రుపాలు వెచ్చిస్తారు...

7.కోట్ల రుపాలు వెచ్చిస్తారు...

Image source

పన్నేండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహామస్తకాభిషేకంలో విగ్రహాన్ని వివిధ పూజాద్రవ్యాలతో అభిషేకిస్తారు. వాటిని కళశాల్లో ఉంచి విగ్రహం దగ్గరకు తీసుకువస్తారు. మొదటి కళశాన్ని చేజెక్కించుకోవడానికి అనేక మంది కోట్లు కూడా వెచ్చిస్తారు. 2018 జరిగిన మహామస్తకాభిషేకంలో రాజస్థాన్ కు చెందిన ఓ వ్యాపారవేత్త దాదాపు రూ.12 కోట్ల రుపాయలు వెచ్చించి ఈ కళశాన్ని సొంతం చేసుకుని తన చేతుల మీదుగా విగ్రహాన్ని అభిషేకించారు.

8.రెండు కొండల సమహారం

8.రెండు కొండల సమహారం

Image source

శ్రావణబెళగోళ చంద్రగిరి, విద్యాగిరి అనే రెండు కొండల సమహారం. గోమఠేశ్వరుడి విగ్రహం ఈ విధ్యాగిరి పైనే ఉంది. చంద్రగుప్త మౌర్యుడు, అతని గురువ భద్రబాహు ఇక్కడే ధ్యాన్యం చేసి మోక్షం పొందారని ప్రతీతి. ఇక్కడి ఉన్న చంద్రగుప్త బసది (దేవాలయం)ను అశోకచక్రవర్తి నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

9. 8 దేవాలయాలు, వందల శాసనాలు...

9. 8 దేవాలయాలు, వందల శాసనాలు...

Image source

ఈ చంద్రగిరి, విద్యాగిరి పై అక్కనబసది, చంద్రగుప్తబసది, పార్శనాథ బసది తదితర ఎనిమిది దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడి శిల్పసంపద జైన సంస్క`తి సంప్రదాయాలను మనకు గుర్తుకు తీసుకువస్తుంది. అంతేకాకుండా ఈ రెండు కొండల పై ఇప్పటి వరకూ 800 శాసనాలు లభించాయి. ఇవన్నీ భారత చరిత్రకు, జైన మతానికి సంబంధించినవి. ఇద్దులో కొన్ని కన్నడ భాషలో కూడా ఉండటం గమనార్హం.

10. తెల్లని సరోవరం ఉండటం వల్లే

10. తెల్లని సరోవరం ఉండటం వల్లే

Image source

ఇక్కడి దొరికిన కొన్ని శాసనాలను అనుసరించి ఇక్కడ ఒక తెల్లని సరోవరం ఉండేదని అందువల్లే ఈ ప్రాంతానికి శ్రావణబెళగోళ అనే పేరు వచ్చింది. ఇప్పటికీ ఈ ఈ నగరంలో ఈ సరోవరాన్ని చూడవచ్చు.

11. 49 శాతం ఓట్లు ఈ విగ్రహానికే

11. 49 శాతం ఓట్లు ఈ విగ్రహానికే

Image source

2007 ఆగస్టు 5న నిర్వహించిన ఓ సర్వేలో భారత దేశంలోని ఏడు వింతల్లో ఒకటిగా గోమఠేశ్వర విగ్రహం నిలించింది. సర్వేలో పాల్లొన్న వారిలో 49 శాతం ఓట్లు ఈ ఏక శిలా విగ్రహానికి వచ్చాయి.

12. ఎక్కడ ఉంది

12. ఎక్కడ ఉంది

Image source

శ్రావణబెళగోళ హాసన్ జిల్లాలోని చన్నరాయపట్టణ తాలూకాకు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక కర్ణాటకలో ప్రముఖ పట్టణమైన హాసన్ కు 51 కిలోమీటర్ల దూరంలో హలేబీడుకు 78 కిలోమీటర్లు, బేలూరుకు 89 కిలోమీటర్లు, మైసూరుకు 83 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరుకు 144 కిలోమీటర్ల దూరంలో ఈ జైన పుణ్యక్షేత్రం ఉంది.

13. ఎలా చేరుకోవాలి

13. ఎలా చేరుకోవాలి

Image source

దేశంలోని చాలా విమానాశ్రయాల నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుంచి ట్యాక్సీతో పాటు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి హాసన్ వరకూ రైలు సౌకర్యం కూడా ఉంది. ఇక కర్ణాటకలోని ప్రముఖ పట్టణాల నుంచి నేరుగా శ్రావణబెళగోళకు ప్రభుత్వ, పైవేటు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

14. ఇంకా ఏమి చూడవచ్చు.

14. ఇంకా ఏమి చూడవచ్చు.

Image source

కేదారేశ్వర దేవాలయం, శెట్టిహళ్లిలోని చర్చ్, లక్ష్మీనరసింహ దేవాలయం, బైసిల్ ఘాట్, గోరూర్ డ్యాం, హేమావతి జలాశయం, బోగనరసింహ దేవాలయం, కప్పే చెన్నిగరాయ దేవాలయం తదితర పర్యాటక ప్రాంతాలను హాసన్ లో చూడవచ్చు.