Search
  • Follow NativePlanet
Share
» »నేలపట్టు పక్షి అభయారణ్యం, నెల్లూరు !!

నేలపట్టు పక్షి అభయారణ్యం, నెల్లూరు !!

నేలపట్టు గూడుబాతు సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇంకా నత్తగుల్లకొంగ, నీటికాకి, తెల్లకంకణాయి, శవరి కొంగ లాంటి అంతరించిపోతున్న జాతులకు కూడా ఇది సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

By Mohammad

ప్రదేశం : నేలపట్టు పక్షి అభయారణ్యం

జిల్లా : నెల్లూరు జిల్లా

రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్

నేలపట్టు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, దొరవారిసత్రము మండలానికి చెందిన గ్రామము. నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం ఇక్కడ ప్రసిద్ధి చెందిన ప్రదేశం. నేలపట్టు అనే గ్రామనామం నేల అనే పూర్వపదం, పట్టు అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో నేల అన్నది భూసూచి. పట్టు అన్న పదానికి వాసస్థలం, ఊరు, చిన్నపల్లె అనే అర్థాలు వస్తాయి.

పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దివ్య క్షేత్రం !పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దివ్య క్షేత్రం !

పక్షి సంరక్షణా కేంద్రం

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సుమారు 404 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రానికి విదేశీ పక్షులు ఏటా చలికాలంలో వేలమైళ్ళు ప్రయాణించి ఆహారం కోసము, సంతానోత్పత్తి కోసమూ వస్తుంటాయి. పెలికాన్ పక్షులకు దక్షిణాసియాలో ఇదే అతి పెద్ద ఆవాసం.

వివిధ రకాల చెట్లు

వివిధ రకాల చెట్లు

ఇక్కడ నీటి నిండా కరుప, నీర్‌కంటి అని రకరకాల పేర్లతో పిలిచే బేరింగ్‌టోనియా యాక్యుటాంగ్యులా అనే చెట్లు పుష్కలంగా పెరుగుతాయి. ఇవి దాదాపు సగభాగం నీటిలో మునిగి ఉంటాయి.

చిత్రకృప : Lalithamba

పక్షులు

పక్షులు

ఇక్కడ ఉన్న బురద మట్టి ఈ చెట్లకి బాగా సరిపోతుంది. నీటిలోని చేపలకు ఆహారం బాగా దొరుకుతుంది. మత్స్యసంపదకు లోటుండదు కాబట్టి పక్షులు సుదూర తీరాల నుంచి తరలి వస్తుంటాయి.

చిత్రకృప : Pranayraj1985

నత్తగుల్లకొంగలు

నత్తగుల్లకొంగలు

నేలపట్టు గూడుబాతు సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇంకా నత్తగుల్లకొంగ, నీటికాకి, తెల్లకంకణాయి, శవరి కొంగ లాంటి అంతరించిపోతున్న జాతులకు కూడా ఇది సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

చిత్రకృప : GnanaskandanK

సుదూర ప్రాంతాల నుంచి

సుదూర ప్రాంతాల నుంచి

ఇక్కడికి బర్మా, నేపాల్, అమెరికా, చైనా, థాయ్‌లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అంటార్కిటికా ప్రాంతాల నుంచి పక్షులు శీతాకాలంలో వలస వస్తుంటాయి. అక్టోబరు నుంచి మార్చి వరకు పక్షులు ఇక్కడే ఉంటాయి.

చిత్రకృప : Manvendra Bhangui

పోషణ

పోషణ

అక్టోబరు మొదటి, రెండో వారంలో వచ్చిన పక్షులు మూడో వారంలో గూడుకోసం సామాగ్రిని సంపాదించుకుంటాయి. నాలుగో వారంలో ఆడ, మగ పక్షులు జతకూడుతాయి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో గుడ్లు పెడతాయి. డిసెంబరు రెండు లేదా మూడో వారంలో గుడ్డు నుంచి పిల్లలు బయటికి వస్తాయి. తరువాత పిల్లపక్షికి తల్లి పక్షులు ఈతకొట్టడం ఎగరడం, ఆహారాన్ని సంపాదించుకోవడం నేర్పిస్తుంది.

చిత్రకృప : Ashishchepure

దృశ్యం

దృశ్యం

పురుగులు, క్రిమి కీటకాలు, చేపలు, కప్పలు, నత్తలు, పీతలు, గొంగళి పురుగులు, నాచుమొక్కలు వీటి ఆహారం. పిల్లపక్షులు పెద్దయిన వెంటనే తిరిగి స్వస్థలానికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్న వాచ్ టవర్ ఎక్కితే ఈ పక్షులను బాగా చూడవచ్చు.

చిత్రకృప : Yoc2007

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

ఇక్కడ ఒక మ్యూజియం, గ్రంథాలయం, ఆడిటోరియం కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న అభయారణ్యంలో తోడేళ్ళు, లోరిస్ జాతి కోతులు, చుక్కల జింకలు, తాబేళ్ళు, పాములు కూడా ఉన్నాయి.

చిత్రకృప : Mukerjee

ఫ్లెమింగ్ ఫెస్టివల్

ఫ్లెమింగ్ ఫెస్టివల్

నేలపట్టు ఫ్లెమింగ్ ఫెస్టివల్ : ప్రతిఏటా జనవరి మొదటి, రెండవ వారం ఫ్లెమింగ్ ఫెస్టివల్ జరుపుతారు.

చిత్రకృప : Nandha

ఎప్పుడు సందర్శించాలి

ఎప్పుడు సందర్శించాలి

అక్టోబర్ నుండి మర్చి వరకు నేలపట్టు బర్డ్ శాంక్చురిని సందర్శించవచ్చు. అప్పడే వలస పక్షుల సందడి మొదలవుతుంది. జనవరి లో ఫ్లెమింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.

చిత్రకృప : arian.suresh

ఎలా వెళ్ళాలి ?

ఎలా వెళ్ళాలి ?

రోడ్ మార్గం : చెన్నై హై వే రోడ్ మార్గానికి 50 కిలోమీటర్ల దూరంలో నేలపట్టు అభయారణ్యం కలదు. నెల్లూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల నుంచి నేలపట్టు పక్షి కేంద్రానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం : సూళ్ళూరుపేట సమీప రైల్వే స్టేషన్.

విమాన మార్గం : చెన్నై అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ సమీపాన కలదు.అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో నేలపట్టు చేరుకోవచ్చు.

చిత్రకృప : Pranayraj1985

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X