• Follow NativePlanet
Share
» »ఊటిలో సరికొత్త గార్డన్ చూశారా

ఊటిలో సరికొత్త గార్డన్ చూశారా

Posted By: Beldaru Sajjendrakishore

చల్లగా వీచే పిల్లగాలులు, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో మంచు దుప్పట్లు, చుట్టు కొండలు, కనుచూపు మేరలో పచ్చటి తివాచీ పరిచినట్లు ఉండే టీ ఎస్టేట్ ఇలాంటి ప్రాంతానికి పర్యాటకానికి వెళ్లాలంటే వెంటనే గుర్తుకు వచ్చేది మొదటగా ఊటినే. అంతేనా కొత్తగా పెళ్లైన వారికి హనీమూన్ స్పాట్, వేసవి సెలవుల్లో పిల్లలతో పాటు సేద దీరడానికి ఇలా ఏ చిన్న అవకాశం కలిగిన పర్యవరణ ప్రేమికులతో పాటు సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి ఆర్థికంగా ఉన్నత స్థాయి వ్యక్తుల వరకూ భారత దేశంలో టూరిస్ట్ స్పాట్ అంటే ఊటినే మొదటి ఓటు తమిళనాడులోని ఈ ఉదక మండలానికే. అన్నట్టు ఊటినే ఉటినే ఉదకమండలం అని కూడా అంటారని మీకు తెలుసు అనుకుంటా. ఇప్పటికే ఎంతోమంది ఎన్నోసార్లు ఊటిని అక్కడికి దగ్గర్లోని పర్యాటక ప్రాంతాలను చూసి ఉంటారు. అయితే ఊటిలోని ఫెర్న్ హిల్స్ ప్రాంతంలో దాదాపు 38.71 ఎకరాల్లో కర్ణాటక ప్రభుత్వం దాదాపు ఆరేళ్లు కష్టపడి కర్నాటక సిరి హార్టికల్చర్ గార్డెన్ ( కేఎస్ హెచ్ జీ, ) పేరుతో నూతన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. గత జనవరి 9 నుంచి పర్యాటకులకు ఈ ఉద్యానవనాన్ని చూడటానికి అనుమతిస్తున్నారు. సముద్రమట్టానికి దాదాపు 7,600 అడుగుల ఎత్తున ఉండే ఈ ఉద్యానవనం పర్యటకులను ఎంతగానో ఆకట్టు కొంటోంది. ఆ వివరాలన్నీ నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం...

1. గండభేరుండ పక్షితో కూడిన ద్వారం...

1. గండభేరుండ పక్షితో కూడిన ద్వారం...

pc: sajjednra

ఓడయార్ రాజవంశానికి చెందిన లాంఛనం గండభేరుండ పక్షితో కూడిన ఈ గార్డెన్ ముఖ ద్వారానం చూపరులను ఆకట్టు కుంటోంది. ఈ ద్వారం పై కర్నాటక, తమిళనాడు సంస్క`తి సంప్రదాయాలను ప్రతిభింబించేలా కొన్ని శిల్పాలు చెక్కారు. ఇక ప్రత్యేక సందర్భాల్లో ఇరు ప్రాంతలకు చెందిన జానపద న`త్యాలతో కూడా పర్యాటకులకు స్వాగతం పలుకుతారు. దీని పక్కనే 12 టన్నుల బరువు కలిగి వివిధ పక్షి, జంతువులు, వ`క్షాలతో కూడిన శిల్పం చూపరులను ఆకట్టు కుంటోంది.

2. 7,000 అడుగుల ఎత్తులో పెరిగే పూలు ఇక్కడ...

2. 7,000 అడుగుల ఎత్తులో పెరిగే పూలు ఇక్కడ...

pc: sajjednra

ఈ ఉద్యానవనంలో ఒక చిన్న గ్లాస్ హౌస్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకొంటోంది. అతి శీతల ప్రాంతంలో మాత్రమే పెరిగే కొన్ని రకాల ఆర్చిడ్ మొక్కలను ఇక్కడ ప్రత్యేకంగా పెంచుతున్నారు. ముఖ్యంగా సముద్రమట్టానికి 7వేల అడుగుల ఎత్తులో మాత్రమే పెరిగే సింబీడియం ఆర్చిడ్ మొక్కలను ఇక్కడ చూడవచ్చు. ఇందుకోసం ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు.

3. చూపుతిప్పుకోనివ్వని టోపోరియా

3. చూపుతిప్పుకోనివ్వని టోపోరియా

pc: sajjednra

లతలను, తీగలనుతో పాటు కొన్ని మొక్కలను ప్రత్యేక విధానంలో పెంచి జంతువులు, పక్షుల రూపాలుగా తీర్చిదిద్దడాన్నే టోపోరియా ఆర్ట్ అంటారు. ఇటువంటి టోపోరియా ఆర్ట్ కు రామోజీఫిల్మ్ సిటీ, ముంబైలోని హాంగింగ్ ఉద్యానవనం తదితరాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. అటువంటి టోపోరియా ఆర్ట్ ఈ ఉద్యానవనంలో కూడా కనిపిస్తుంది. డైనోసార్లు, కుందేళ్లు తదితర రూపాలో మొక్కలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

4. పచ్చని తివాచీ...

4. పచ్చని తివాచీ...

pc: sajjednra

కుకువా గడ్డి జాతిని 10 ఎకాల్లో ప్రత్యేకంగా పెంచారు. దీంతో ఇక్కడ పచ్చని తివాచీ పరిచినట్లు ఉంటుంది. ఇక ఈ ప్రాంతంలో దాదాపు 10 వేల మంది కుర్చొని చూడటానికి వీలుగా ఓపెన్ థియెటర్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి వీకెండ్ తోపాటు ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడ కర్ణాటక, తమిళనాడు సంస్క`తి సంప్రదాయాలను ప్రతిభింబించే సాంస్క`తిక కార్యక్రమాలను ప్రదర్శిస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ కంటికి ఇంపైన రంగుల్లో ఉండే అనేక మొక్కలను చూడవచ్ు్

5. ఇటాలియన్ తరహాలో...

5. ఇటాలియన్ తరహాలో...

pc: sajjednra

ఈ ఉద్యానవనంలో కొంత భాగాన్ని ఇటాలియన్ తరహాలో తీర్చి దిద్దారు. ఈ ప్రాంతంలోని నిలువెత్తు పాలరాతి విగ్రహాలు వీక్షకులను చూపు తిప్పుకోనీయవు. ఇక్కడికి వెళ్లిన వారికి తాము ఏ విదేశాల్లోనో ఉన్నామన్న భావన తప్పక కలుగుతుంది. అదే విధంగా పిల్లలతో పాటు పెద్దలు కూడా దాగుడు మూతలు ఆడుకోవడానికి వీలుగా మేజ్ గార్డ్ ను ఏర్పాటు చేశారు. ఈ ఇటాలియన్ గార్డన్

6.చిన్న నీటి కుంటలు...

6.చిన్న నీటి కుంటలు...

pc: sajjednra

ఈ ఉద్యానవనంలో కొంత భాగంలో నీటి కుంటలను ఏర్పాటు చేశారు. 100x40 అడుగుల విస్తీర్ణం, 10 అడుగుల లోతు ఉన్న ఈ నీటి కుంటలో రంగు రంగుల చేపలను పెంచుతున్నారు. వేర్వేరు జాతులకు చెందిన బాతులు, కొంగలను ఈ నీటి గట్టున చూడవచ్చు. దీంతో మనం ఏ అటవీప్రాంతో ఉన్న భావన కలుగుతుంది. త్వరలోనే ఇక్కడ భూగర్భ అక్వేరియం కూడా ఏర్పాటవుతోంది. అతి త్వరలో బోటింగ్ కు కూడా ఇక్కడ అవకాశం కల్పించనున్నారు.

7.అన్ని రకాల పుష్పాలు ఒకే చోట...

7.అన్ని రకాల పుష్పాలు ఒకే చోట...

pc: sajjednra
వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో పెరిగే పుష్పాలన్నింటినీ ఒకే చోటుకు తీసుకువచ్చి ప్రత్యేక విధానంలో పెంచుతున్నారు. ఇందుకోసం లక్షలాది రుపాయలు వెచ్చించి పాలి హౌస్ ను నిర్మించారు. ఇందులో అజలీన, బెగోనియా, సైక్లేమిన్, స్టాటిస్, కెమిలినా, తునియా, హెడరా, ఫూజియా, హైడ్రేంజియా, గ్రేనియం తదితర జాతులకు చెందిన మొక్కలన్నింటినీ ఈ పాలీహౌస్ లో చూడవచ్చు. అంతేకాకుండా దాదాపు 200 రకాల ఔషద మొక్కలను కూడా ఇక్కడ చూడవచ్చు.

8. ఆకట్టుకొనే షాండియో గొర్రెలు...

8. ఆకట్టుకొనే షాండియో గొర్రెలు...

Pc:

ఇదే ఉద్యానవనంలో ఎకో టూరిజంను అభివ`ద్ధి చేసే చర్యల్లో భాగంగా సముద్రమట్టానికి చాల ఎత్తులో మాత్రమే పెరిగే నిలగిరి, షాండియో జాతి గొర్రెలను కూడా ఇక్కడ పెంచుతున్నారు. ఇందుకోసం దాదాపు 3 ఎకరాలను కేటాయించారు. ఒక వైపున పచ్చటి తోట అందులో తెల్లని గొర్రెలు పై నుంచి మంచు తెరలు వీటి మధ్య మీరు ఊహే ఎంతో మనోహరంగా ఉంది కదూ. ఇలాంటి సుందర ద`ష్యాలు ఎన్నో మనకు ఈ ఉద్యాన వనంలో కనిపిస్తాయి.

9. ఊటిలో ఇంకా ఏమేమి చూడవచ్చు...

9. ఊటిలో ఇంకా ఏమేమి చూడవచ్చు...

pc: sajjednra

ఊటి బొటానికల్ గార్డెన్, బోట్ హౌస్, థండర్ వరల్డ్, టీ ఎస్టేట్, డాల్ఫినోస్ మౌంటైన్, సిమ్స్ పార్క్, కన్నూర్, ఊటి మధ్య తిరిగే టాయ్ ట్రైన్ తదితర ప్రాంతాలను ఊటిలో చూడవచ్చు. అంతేకాకుండా పర్యాటకులకు ఈ ఉద్యానవనానికి పక్కనే ఉన్న ప్రభుత గస్ట్ హౌస్ వసతి కల్పిస్తోంది. ఇందు కోసం ఒక గదికి ఒక రోజుకు రూ.885 చెల్లించాల్సి ఉంటుంది. ఒకే సారి పదిమంది బస చేయవచ్చు.

10. మీ ప్లానింగ్ కోసం...

10. మీ ప్లానింగ్ కోసం...

pc: sajjednra

ప్రవేశం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ
డిపార్ట్ మెంట్ ఆఫ్ హార్టికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ కర్నాటక
ఫెర్న్ హిల్స్, ఊటి, తమిళనాడు


ఫోన్ నంబర్ 0423-2441942

ahofernhillooty@gmail.com

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి