» »బులెట్ దేవుడు...విస్కీ దేవత ఇలాంటివి విన్నారా

బులెట్ దేవుడు...విస్కీ దేవత ఇలాంటివి విన్నారా

Written By: Beldaru Sajjendrakishore

భారత పురాణాల ప్రకారం మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు. వీరి పేరు పై దేవాలయాలు ఉంటాయి. ఈ ముక్కోటి దేవతలకు అదనంగా భారత దేశంలో కొన్ని ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి. ఒక చోట రాయల్ ఎన్ ఫీల్డ్ ను దేవుడిగా భావించి పూజిస్తున్నారు. మరో చోట కాళీమాతకు విస్కీని నైవేద్యంగా అందజేస్తున్నారు. అదే విధంగా సినిమా హీరోలకు, హీరోయిన్లకు కూడా దేవాలయాలు నిర్మింస్తున్నవారు ఉన్నారు. ఇలా విభిన్న నేపథ్యం ఉన్న దేవాలయాల సమహారమే ఈ కథనం.

1. బులెట్ బాబా

1. బులెట్ బాబా

Image source:


రాజస్థాన్ రాష్ర్టంలోని జోద్ పూర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బండాయి అనే గ్రామంలో ఈ బులెట్ బాబా దేవాలయం ఉంది. ఇక్కడ ప్రధానంగా పూజలు అందుకునేది ఒక ఎన్ ఫీల్డ్ ద్విచక్రవాహనం. ఈ వాహనానికి పూజలు చేయడం వల్ల ఎటువంటి రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా ప్రయాణం సుఖమయమవుతుందని ఇక్కడి వారు భావిస్తారు.

2. ఓం బన్న యువకుడి ఆత్మ

2. ఓం బన్న యువకుడి ఆత్మ

Image source:

స్థానిక ఓం బన్న అనే యువకుడు ఈ బులెట్ పై వెలుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని స్థానికుల కథనం. అప్పటి నంచి అతని ఆత్మ ఈ వాహనంలో ఉందని దీనికి పూజ చేస్తే ప్రమాద రహితంగా తమ ప్రయాణం సాగుతుందని వారు నమ్ముతున్నారు.

3.ఇక్కడ విస్కీ నైవేద్యం

3.ఇక్కడ విస్కీ నైవేద్యం

Image source:


మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిన్ లో కాలభైరవ దేవాలయం ఉంది. పూజలో భాగంగా భక్తులు ఇచ్చిన మద్యాన్ని ఒక సాసర్ లో వేసుకుని గుడిలోని పూజారి కాళీ మాత విగ్రహం దగ్గరకు తీసుకువెళుతాడు. అందులో మూడు వంతుల మద్యం సదరు విగ్రహం తాగుతుందని మిగిలినది భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు.

4. బొమ్మ విమానాల దేవాలయం

4. బొమ్మ విమానాల దేవాలయం

Image source:

జలందర్ లోని షాహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వార్ ను హవాయ్ జహాజ్ గురుద్వార్ గా పిలుస్తారు. విదేశాలకు విద్యా, ఉపాధి కోసం వెళ్లాలనుకునే వారు తమకు తొందరగా వీసా, పాస్ పోర్ట్ రావాలని ఇక్కడి గురుద్వార్ కు బొమ్మ విమానాలను కానుకలుగా సమర్పిస్తారు. ఇలా కానుకలను సమర్పించే ముందు గతంలో వచ్చిన బొమ్మ విమానాలకు పూజలు చేస్తారు.

5.ఎలుకలే దేవుళ్లు

5.ఎలుకలే దేవుళ్లు

Image source:

రాజస్థాన్ లోని కర్ణిమా దేవాలయంలో ఎలుకలను దేవతలుగా భావించి పూజిస్తారు. తాము పెట్టిన నైవేద్యం ఆ ఎలుకలు గుంపులు గుంపులుగా చేరి ఆరగించడం చూసి జీవితం ధన్యమైనట్లు భావిస్తారు. అంతేకాకుండా నల్ల ఎలుకల మధ్య తెల్ల ఎలుకలు కనిపిస్తే తాము చేసిన పాపాలన్నీ తొలిగి పోయాయని, ఇక పై తాము పట్టిందల్లా బంగారం అయిపోతుందని మురిసిపోతారు.

6.మోది గుడి

6.మోది గుడి

Image source:


రాజ్ కోటలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుడి ఉంది. దీనిని సుమారు రెండేళ్ల పాటు కష్టపడి నిర్మించారు. ఈ దేవాలయంలో ఉదయం, సాయంకాలం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఈ ప్రార్థనలకు అక్కడ ఉన్నవారే కాకుండా చుట్టు పక్కల గ్రామల నుంచి కూడా భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు.

7. సోనియా గాంధీ దేవాలయం

7. సోనియా గాంధీ దేవాలయం

Image source:

తెలంగాను ఏర్పాటుకు అంగీకరించినందుకు గాను సోనియాగాంధీకి బెంగళూరు హైదరాబాద్ హైవే మార్గంలో మహబూబ్ నగర్ కు దగ్గరగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. దాదాపు 500 కిలోల కాంస్యాన్ని విగ్రహం తయారికి వాడారు.

8. క్రీడాకారులకు, సినీ నటులకు కూడా...

8. క్రీడాకారులకు, సినీ నటులకు కూడా...

Image source:


భారత దేశంలో క్రికెట్ తో పాటు సినిమాలను ఎంతగానో ఆదరిస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్, నమిత, కుష్బూ, సుదీప్ తదితర వ్యక్తులకు దేశంలోని పలు చోట్ల దేవాలయాలు ఉన్నాయి.