Search
  • Follow NativePlanet
Share
» »మధ్యప్రదేశ్ లో మరుగున పడిన మాణిక్యం ఓర్చా..ప్రేమ త్యాగాలకు నిలయ!

మధ్యప్రదేశ్ లో మరుగున పడిన మాణిక్యం ఓర్చా..ప్రేమ త్యాగాలకు నిలయ!

చరిత్రతోపాటు ప్రకృతిని ప్రేమించే వాళ్లకు ఆసక్తికరమైన ప్రదేశం ఓర్చా. ఓర్చా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వున్న ఈ ప్రదేశం.. చారిత్రాత్మకమైంది. ఈ ప్రదేశాన్ని మహారాజా రుద్ర ప్రతాప్ సింగ్ స్థాపించాడు. ఆయనే దీనికి మొదటి రాజు కూడా. ఇక్కడ కల నిర్మాణాలు అద్భుత ఆకర్షణలుగా నిలిచాయి. వాటిలో రాజ మహల్, రాణి మహల్, సుందర్ మహల్, లక్ష్మి నారాయణ ఆలయం తప్పనిసరిగా చూడాల్సినవి.

ఓర్చా ఫోర్ట్‌ బేత్వా నది మధ్యలో ఉన్న దీవిలో ఉంటుంది. ఈ ఫోర్ట్‌ మొత్తంలో ఒకసారి చూస్తే ఎప్పటికీ మర్చిపోలేని సుందర చారిత్రక కట్టడం రాజ మహల్‌. ఓర్చా కట్టడాన్ని బుందేల్‌ ఛీఫ్తాన్‌ రుద్రప్రతాప్‌ నిర్మించారు. గుప్తుల కాలానికి చెందిన ఈ కట్టడం పురాతత్వ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

పదహారవ శతాబ్ది నగరం ఓర్చా

పదహారవ శతాబ్ది నగరం ఓర్చా

పదహారవ శతాబ్ది నగరం ఓర్చా .బుందేల్ ఖండ్ ప్రాంతం లో ‘బెట్వా నది'తీరం లో నిర్మించబడిన పట్నం .ఝాన్సి -ఖజురహో రోడ్డుపై ఉంది. ఝాంసికి 16 కిలోమీటర్ల దూరం. బుందేల్ రాజ పుత్ర సైన్యాధికారి రుద్రప్రతాప్ నిర్మించిన నగరం. ఇతని తర్వాత కొడుకు బీర్ సింగ్ దేవ్ నగరాభి వృద్ధి చేశాడు. అనేక శతాబ్దాలుగా యాత్రికులకు ప్రత్యెక ఆకర్షణగా ‘ఓర్చా' ఉండి ‘అచ్చా' అని పించుకొంటోంది, మధ్యప్రదేశ్ లో మరుగున పడిన మాణిక్యం ఓర్చా .

ప్రేమ త్యాగాలకు నిలయం

ప్రేమ త్యాగాలకు నిలయం

దీని గాధలు పాటలుగా పద్యాలుగా జనం పాడుకొంటారు . మధ్య ప్రదేశ్ కు ఉత్తరాన మాల్వా పీఠ భూమి లో ఓర్చా ఉంది .వేసవిలో వేడి తక్కువగా ఉండటం శీతాకాలం లో ఆహ్లాద వాతావరణం దీని ప్రత్యేకత.బుందేల్ ఖండ్ రాజులు దీన్ని రెండు శతాబ్దాల పాటు 1531నుండి పాలించారు .ఒకప్పుడు ఒక రాజ పుత్రా వీరుడు తనను విన్ధ్యవాసిని దేవికి సమర్పించుకోవాలని సిద్ధ పడ్డాడు .అప్పుడా దేవి అతని త్యాగానికి మెచ్చి అతన్ని ‘'బుందేలా ‘' అంటే ‘'రక్త తర్పణం చేసిన వాడా ‘'అని పిలిచింది .అప్పటి నుంచి ఆ వంశీకులు బుందేల్ ఖండ్ రాజ పుత్రులై చరిత్రలో చిర కీర్తి సాధించారని కధనం.

ఓర్చా వైభవమంతా కోటలో ఉంది

ఓర్చా వైభవమంతా కోటలో ఉంది

ఓర్చా వైభవమంతా కోటలో ఉంది .అనేక రాజ భవనాలు, ఆలయాలు, తోటలు స్మ్రుతి చిహ్నాలు ఉన్నాయి బుందేల స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ప్రసిద్ధమైనది.పుష్పాలఅలంకరణ కు ప్రసిద్ధి. బెట్వా నది ఒడ్డున ఓర్చా కోట ఉంటుంది. మొగల్ చక్రవర్తి సందర్శన సందర్భంగా బీర్ సింగ్ రాజు స్మారక మందిరం నిర్మించాడు. ఇక్కడ కోర్టు,దర్బారు గొప్పగా ఉంటాయి.

హిందూ మొగల రాజ భవనాలు ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు

హిందూ మొగల రాజ భవనాలు ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు

హిందూ మొగల రాజ భవనాలు ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. రాజా ఇంద్రమణి అనే కవి, సంగీతజ్నురాలు పేర ‘రాజ్ ప్రవీణ్ మహల్ 'నిర్మించారు. ఆమె గొప్ప అందగత్తే నాట్యకారిణి. జహంగీర్ ఆమెను ప్రేమించాడని కధనం. వీరిద్దరి ప్రణయ గాధ పాటలుగా కావ్యాలుగా ప్రసిద్ధమైనాయి. ఆమె భర్తను వదిలి వెళ్ళటం ఇష్టపడని రాజ పుత్ర స్త్రీ పతివ్రత.

ఆనంద మహల్, హర్దు వాల్ మందిరాలు వైభవంగా ఉంటాయి

ఆనంద మహల్, హర్దు వాల్ మందిరాలు వైభవంగా ఉంటాయి

ఆనంద మహల్, హర్దు వాల్ మందిరాలు వైభవంగా ఉంటాయి. హర్దువాల్ బీర్ సింగ్ కుమారుడు.అన్న ఝుహార్ కు తన అమాయకత్వాన్ని నిరూపించటానికి ప్రాణ త్యాగం చేశాడు. మరణం తరువాత అతనిని దేవతా భావంతో విగ్రహం నెలకొల్పి పూజిస్తూ ఆరాధిస్తున్నారు.

రామ రాజ దేవాలయం

రామ రాజ దేవాలయం

ఇక్కడున్న మరో ఎట్రాక్షన్‌ రామ రాజ దేవాలయం. గుడిగా మారిన ఈ రాజ ప్రసాదంలో రాముడిని దేవుడిగా కాకుండా రాజుగా కొలవటం ఈ ప్రదేశానికున్న విశిష్టత. మధుకర్ షా భార్య రాణి గణేష్ కున్వారీదేవి అయోధ్య నుంచి శ్రీరాముని విగ్రహం తనతో ఒర్చాకు తీసుకొచ్చింది. దాన్ని రాజ ప్రాసాదంలో ఒక చోట తాత్కాలికంగా ఉంచింది. వేరొక చోట దాన్ని ప్రతిష్టిద్దామని ప్రయత్నం చేస్తే విగ్రహం ఊడి రాలేదట . చివరికి ఈ రాజ ప్రాసాదాన్నే శ్రీరాముని సమర్పించారు రాణీ రాజు.ఇక్కడ శ్రీరాముడు రాజు గా పూజింప బడుతున్నాడు .భారత దేశం మొత్తం మీద ఎక్కడా శ్రీరాముడు రాజుగా అర్చింపబడటం లేదు ఇక్కడే అది జరుగటంతో ఓర్చా తన ప్రత్యేకతను నిలుపు కొంటోంది .

చతుర్భుజ దేవాలయం

చతుర్భుజ దేవాలయం

కున్వారి రాణీ కోసం మధుకర్ షా చతుర్భుజ దేవాలయాన్ని ఓర్చాలో నిర్మించాడు .ఉన్నతమైన శిఖరం తో మహా గొప్ప కళా నికేతన్ గా ఉంటుంది .రామ రాజ ,లక్ష్మీ నారాయణ దేవాలయాలూ ఉన్నాయి .‘బుందేల్ చిత్రకళ’ఈవిశేష ప్రాముఖ్యత పొందింది.

చంద్ర శేఖర ఆజాద్ నివశించిన ప్రదేశం

చంద్ర శేఖర ఆజాద్ నివశించిన ప్రదేశం

విప్లవ వీరుడు స్వాతంత్ర సమరంలో వీర మరణం పొందిన చంద్ర శేఖర ఆజాద్ ఓర్చా లో1926-27లో నివసించటం దీని విఖ్యాతిని మరింత పెంచింది .సిద్ధ బాబా మందిర్ ,జుగల్ కిషోర్ మందిర్ ,జానకీ మందిర్ దర్శింప దగినవి .ఇక్కడ రాజస్తాని ,జైన, మొగల్ శిల్ప కళలు వర్ధిల్లి కళా త్రివేణీ సంగమ స్థానమైంది.

ఓర్చ్చ లో చ్చాత్రీస్

ఓర్చ్చ లో చ్చాత్రీస్

"చ్చాత్రిస్" అంటే ప్రధానంగా రాజుల సమాధులు అని అర్థం. ఓర్చాలో నది ప్రక్కన ఉన్న ఏకైక ఆకర్షణకు అద్దం పడుతుంది. బెట్వా నదిలో కాంచన్ ఘాట్ తో పాటు నిలుచుని ఉన్న పద్నాలుగు ఖాళీ సమాధులు ఉన్నాయి. ఓర్చా రాజ్య పాలకుల సమాధులు ఇక్కడ చూడవచ్చు. ఈ స్మారక చిహ్నాలు అందంగా చెక్కబడిన గోడలు, స్తంభాలు, డోములతో కను విందు చేస్తాయి.

వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురీ

వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురీ

ఓర్చాలో 46 కి.మీ విస్తీర్ణంలో విస్తరించివున్న వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురీ తప్పక చూడాల్సిన ప్రదేశం. ఇక్కడ రకరకాల జంతువులతోపాటు 200 రకాల పక్షులు కూడా ఉంటాయి. ఈ అడవిగుండా బేత్వా నది ప్రవహించటం మూలంగా సంవత్సరం పొడవునా అడవంతా పచ్చదనాన్ని సంతరించుకుని ఉంటుంది. ఇక శివపురిలోని మాధవ్‌ నేషనల్‌ పార్క్‌ యానిమల్‌ లవర్స్‌ చూడదగ్గ మరో ప్రదేశం. ఇదే పార్కులో వేట మధ్యలో సేదతీరేందుకు అప్పటి రాజు శివాజిరావు సిందియా కట్టించిన జార్జ్‌ కాజిల్‌ హంటింగ్‌ లాడ్జ్‌ పైకి ఎక్కాలి. ఇదే పార్క్‌ మొత్తంలో ఎత్తైన ప్రదేశం. ఇక్కడినుంచి చూస్తే అడవంతా స్పష్టంగా కనిపిస్తుంది.

సందర్శించాల్సిన సమయం

సందర్శించాల్సిన సమయం

అక్టోబర్, మార్చిలలో సందర్శించదగినదిగా పేర్కొనడబడినది

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

ఈ ప్రాంతానికి సమీప ఎయిర్‌పోర్ట్‌ ఖజురహో. రైల్వేస్టేషన్‌ ఝాన్సీలో ఉంది. ఓర్చాకు ఇది 19 కిలోమీటర్లు. ఝాన్సీ-ఖజరహోకు రోడ్డు మార్గం ఉంది. గ్వాలియర్‌కు 120 కిలోమీటర్లు, ఖజరహోకు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. జహంగీర్‌ మహల్, రాయ్‌ప్రవీణ్‌మహల్, రాజ్‌మహల్, చతుర్భుజి టెంపుల్, లక్ష్మీనారాయణ టెంపుల్, జానకి, హనుమాన్‌ మందిర్, షాహిద్‌స్మారక్‌ ప్రదేశాలు సందర్శించదగినవి. ఇక్కడ నుంచి 139 కిలోమీటర్ల దూరంలో డియోగడ్‌ ఉంది.

రోడ్డు మార్గం ఓర్చా ను సులభంగా మరియు సౌకర్యవంతంగా మధ్యప్రదేశ్ అన్ని ప్రధాన నగరాల నుండి చేరుకోవచ్చు. ఓర్చా రోడ్స్ బాగా నిర్వహించబడతాయి. ఓర్చా కు మధ్యప్రదేశ్ లో అన్ని ముఖ్యమైన ప్రదేశాల నుండి క్రమ విరామాలతో బస్సులు ఉంటాయ. ఇంకా దాని పొరుగు ప్రదేశాల నుండి ఓర్చా చేరుకోవడానికి ఒక టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X