Search
  • Follow NativePlanet
Share
» »వ‌స్త్ర ప్ర‌పంచానికి మ‌న‌ పెడ‌న‌ క‌లంకారి ఓ అలంక‌ర‌ణ‌!

వ‌స్త్ర ప్ర‌పంచానికి మ‌న‌ పెడ‌న‌ క‌లంకారి ఓ అలంక‌ర‌ణ‌!

వ‌స్త్ర ప్ర‌పంచానికి మ‌న‌ పెడ‌న‌ క‌లంకారి ఓ అలంక‌ర‌ణ‌!

భార‌తీయ హ‌స్త‌క‌ళ‌లో క‌లంకారి చిత్ర‌క‌ళ ప్రాచీన‌మైన‌ది. చీర‌ల‌పై ప్ర‌కృతి అందాల‌ను జోడిస్తూ అద్భుతాలు సృష్టించే చేతి క‌ళాకారుల నైపుణ్యానికి క‌లంకారి ఓ అలంక‌ర‌ణ‌.. కొత్త‌పుంతులు తొక్కుతున్న వ‌స్త్ర ప్ర‌పంచంలో స‌రికొత్త ట్రెండ్ సృష్టిస్తోన్న పురాత‌న హ‌స్త‌క‌ళ‌ల‌కు చిరునామా.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, అంతర్జాతీయ మార్కెట్‌నే ప్రభావితం చేసేలా నిల‌బ‌డిన క‌లంకారి.. కాదు.. కాదు.. మ‌న క‌లంకారి విశేషాలు తెలుసుకుందాం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం స‌మీపంలో ఉన్న‌ పెడ‌న క‌లంకారికి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోంది. ప‌రిమిత సంఖ్య‌లో క‌నిపించే కలంకారి హ‌స్త‌క‌ళ క‌ళాకారుల కుటుంబాలు ఆ క‌ళ‌ను భ‌విష్య‌త్తు త‌రాల‌కు చేర్చేందుకు కృషి చేస్తున్నారు. అందుకే క‌లంకారిని పెడన కలంకారి అని కూడా పిలుస్తారు. కలంకారీకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. వన్నె తగ్గని సంస్కృతిగా 15వ శతాబ్దంలో మొదలైన రంగుల అద్దకం ఆంగ్లేయుల కాలంలోనే అంతర్జాతీయ మార్కెట్‌ను ప్రభావితం చేసిందంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మానదు.

ఇప్పటికీ లండన్ విక్టోరియా మ్యూజియంలో అలనాటి కలంకారీ వస్త్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నా యంటే ఈ అద్దకం విధానం.. గొప్పతనంతో పాటు వినియోగిస్తున్న సహజ రంగులే అందుకు కారణం.

ఆ రంగును భారతీయ మేదర చెట్టు నుంచి

ఆ రంగును భారతీయ మేదర చెట్టు నుంచి

సహజమైన రంగులు ఉపయోగించి చింతపండు పెన్నుతో పత్తి లేదా పట్టు వస్త్రంపై చేతితో చిత్రించే పురాతన శైలిని ప‌రిశీలిస్తే ఎవ్వ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. కలంకారీ కళలో అచ్చు వేయాల్సిన అద్దకం మూసలను పెద్ద చెక్కముక్కలతో తయారు చేస్తారు. దీనికి కూరగాయలతో తయారు చేసిన సహజ రంగులను చీరలు, ఇతర దుస్తులపై అద్దకం రంగులు వేస్తారు. కలంకారీలో ముఖ్యంగా నాలుగు రంగులు వినియోగిస్తారు. ఎరుపు రంగును భారతీయ మేదర చెట్టు నుంచి తీస్తారు. అలాగే పసుపు రంగును దానిమ్మ గింజల నుంచి లేదా మామిడి చెట్టు బెరడు నుంచి తీస్తారు. నీలం రంగును ఇండిగో (నీలిమందు చెట్టు) నుంచి, నలుపు రంగును మైరో బాలన్ పండు నుంచి తీస్తారు.

పురాణగాథల నుంచి ట్రెండీ థీమ్స్ వ‌ర‌కూ

పురాణగాథల నుంచి ట్రెండీ థీమ్స్ వ‌ర‌కూ

అద్దకం మరియు చేతితో అచ్చు వేయడం అనే ప్రక్రియ చాలా విసృత‌మైన‌ది. ఈ చిత్రాల్లో పురాణగాథల నుంచి నేటి ట్రెండీ థీమ్స్ వరకు వివిధ ఆకృతులను చిత్రిస్తారు. పూర్తిగా ఒక వస్త్రంపై కలంకారీ చేయటానికి అనేక దశలు ఉన్నాయి. వస్త్రం యొక్క నాణ్యతను బట్టి దానిపై వేయవలసిన రంగులు కూడా వివిధ రకాలుగా మారుస్తారు. ప్రతి దశలోనూ దానికి పట్టి ఉంచే రంగులను శుభ్రం చేసి దానిపై పట్టేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక డిజైన్ చేయటానికి చాలా రోజులు పడుతుంది.

సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది..

సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది..

ఇంత‌టి క‌ళాకారుల నైపుణ్యం దాగి ఉంది క‌నుక‌నే ఈ హస్తకళా చిత్రం ఆధునిక టెక్నాల‌జీ త‌ట్టుకొని మార్కెట్‌లో కళకళలాడుతోంది. ఫ్యాషన్‌ డిజైనర్ల చేతుల్లో కొత్త రూపును సంతరించుకుని, అంతర్జాతీయ వేదికమీద వయ్యారాలు పోతూ వస్త్ర ప్రపంచంలోనే సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. ఒకప్పుడు మహిళలు కట్టుకునే చీరలు, దుప్పట్లు, లుంగీలు లాంటి వాటిల్లోనే లభ్యమైన ఈ కలంకారీ వస్త్రాలు ఇప్పుడు చూడీదార్లు, అనార్కలీ మోడల్స్ లో కూడా లభ్యమౌతున్నాయి. సామాన్యులతో పాటు సెలెబ్రటీలను కూడా ఇప్పుడు ఈ కలంకారీ ఆకర్షిస్తోంది. మ‌రెందుకు ఆల‌స్యం, క‌లంకారీని క‌నులారా చూసేందుకు మీరూ బ‌య‌లుదేరండి!

Read more about: kalamkari
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X