Search
  • Follow NativePlanet
Share
» »ఓంకారాన్ని దేవతగా పూజించే ప్రపంచంలోని ఏకైక క్షేత్రం

ఓంకారాన్ని దేవతగా పూజించే ప్రపంచంలోని ఏకైక క్షేత్రం

పడనీలంలోని పరబ్రహ్మ దేవాలయానికి సంబంధించిన కథనం.

దేవాలయం అన్న తక్షణం మనకు అక్కడ ఆ పరమేశ్వరుడు, లేదా విష్ణుభగవానుడు కొలువై ఉంటాడన్న విషయం మదిలో మెదులుతుంది. అయితే ఈ సష్టికి మూలకారణమైన ఓంకార నాదం పరబ్రహ్మ స్వరూపంగా భక్తులతో పూజలు అందుకొంటూ ఉంది. ఇక్కడ కుల, మత భేదం లేకుండా ఎవరైనా నేరుగా పూజలు చేసుకోవచ్చు. 24 గంటల పాటు ఇక్కడ దేవాలయం తెరిచే ఉంటుంది. ఇటువంటి దేవాలయం భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మరెక్కడా ఉండదని చెబుతారు. ఇక్కడ ఏడాదికి ఒకసారి జరిగే ఉత్సవాల్లో స్థానిక రైతులు అంతా నిలువెత్తు ఎద్దుల విగ్రహాలను ప్రదర్శిస్తారు. అంతేాకాకుండా శివరాత్రి రోజున ఇక్కడ దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఆ దేవాలయానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

ఇక్కడ కాకులు తిన్న ఆహారమే భక్తులకు ప్రసాదంఇక్కడ కాకులు తిన్న ఆహారమే భక్తులకు ప్రసాదం

జూనియర్ హంపిని చూశారా?జూనియర్ హంపిని చూశారా?

రావణుడు స్వర్గానికి సోపానాలు నిర్మించడానికి ఎంపిక చేసుకున్న స్థలాలు ఇవేరావణుడు స్వర్గానికి సోపానాలు నిర్మించడానికి ఎంపిక చేసుకున్న స్థలాలు ఇవే

పడ అంటే యుద్ధం, నీలం అంటే భూమి

పడ అంటే యుద్ధం, నీలం అంటే భూమి

P.C: You Tube

మలయాళం భాషలో పడ అంటే యుద్ధం అని నీలం అంటే భూమి అని అర్థం. అంటే పడనీలానికి తెలుగులో సమానార్థం యుద్ధభూమి. ఏ యుద్ధం జరిగిందని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. అయితే ఆ పేరు మాత్రం అలా నిలిచిపోయింది.

అలప్పీ జిల్లాలో

అలప్పీ జిల్లాలో

P.C: You Tube

కేరళలో ప్రముఖ పర్యాటక స్థలమైన అలప్పీ జిల్లాలో పడనీలం ఒక చిన్న పట్టణం. పడనీలం అనేది ఇక్కడ జరిగిన యుద్ధానికే కాదు స్వయంభువుగా వెలిసిన ఓంకారం లేదా పరబ్రహ్మ దేవాలయానికి కూడా ప్రఖ్యాతి గాంచినది.

ఓంకార రూపాన్ని

ఓంకార రూపాన్ని

P.C: You Tube

ఇక్కడ ఓంకారాన్ని పరబ్రహ్మగా పూజిస్తారు. ఈ దేవాలయం అనేక విశేషాలను కలిగి ఉంది. ఇక్కడ ఓంకారం స్వయంగా వెలిసిందని చెబుతారు. అందువల్లే హిందువులే కాకుండా ముస్లీంలు, క్రైత్సవులు కూడా ఈ దేవాలయానికి వస్తుంటారు.

బ్రహ్మ స్వరూపం

బ్రహ్మ స్వరూపం

P.C: You Tube

మరికొంతమంది ఈ ఓంకారం బ్రహ్మ స్వరూపమని చెబుతారు. మరికొంతమంది ఈ దేవాలయం ఈ విశ్వానికి ఆద్యుడు, త్రిమూర్తుల కంటే గొప్పవాడు పరబ్రహ్మ దేవాలయమని పేర్కొంటారు. అందుకే ఇక్కడ దేవుడికి ఒక రూపం అంటూ ఉండదు.

గోపురం ఉండదు

గోపురం ఉండదు

P.C: You Tube

మరొక విశేషం ఏమిటంటే ఈ దేవాలయానికి ఎటువంటి గోపురం కూడా ఉండదు. అదేవిధంగా ఈ దేవాలయానికి గోడలు కూడా ఉండవు. చుట్టూ ఉన్నా చెట్లే ఈ దేవాలయంగా భావిస్తారు. అంటే దేవుడు సర్వాంతరర్యామి అని ఇక్కడ ప్రజల భావన.

బ్రహ్మనేతరులు పూజారులు

బ్రహ్మనేతరులు పూజారులు

P.C: You Tube

ఇక్కడ పూజారులు బ్రహ్మనేతరులు. ఎటువంటి జాతి భేదం కూడా ఉండదు. ఎవరైనా దేవాలయం లోపలికి ప్రవేశించి ఇక్కడి దేవుడిని స్వయంగా పూజించవచ్చు. ఇక పూజా విధానం కూడా నిర్థిష్టంగా ఉండదు.

ఎవరికి తోచిన రీతిలో వారు

ఎవరికి తోచిన రీతిలో వారు

P.C: You Tube

ఈ దేవాలయాన్ని సూర్యోదయానికి ముందే తెరవడం, మూయడం వంటి కార్యక్రమాలు ఏమీ ఉండవు. ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడ దైవారాధన చేసుకోవచ్చు. పూజ కూడా ఎవరికి తోచిన రీతిలో వారు చేస్తూ ఉంటారు.

24 గంటలూ

24 గంటలూ

P.C: You Tube

24 గంటలూ ఇక్కడ దైవదర్శనానికి అనుమతి ఉంటుంది. శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ బాగా జరుగుతాయి. ఇక్కడ భక్తులకు భస్మాన్ని ప్రసాదంగా అందజేస్తారు. లేదా భక్తులు తాము తెచ్చిన నైవేద్యాన్ని ఇతరులకు అందజేస్తారు.

కావడి ఉత్సవాలు

కావడి ఉత్సవాలు

P.C: You Tube

సుబ్రహ్మణ్యస్వామికి నిర్వహించే విధంగా ఇక్కడ కూడా కావడి ఉత్సవాలు జరుపుతారు. అయితే కుల, మత భేదం లేకుండా చాలా ఎవరైనా ఈ ఉత్సవంలో పాల్గొనవచ్చు. ముస్లీం రైతులు కూడా ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొంటారు.

సర్వ సమానత్వం

సర్వ సమానత్వం

P.C: You Tube

అందువల్ల ఇది క్షేత్రం సర్వ సమానత్వాన్ని ప్రభోదిస్తుందని చెప్పవచ్చు. ఇక శివరాత్రి సందర్భంగా నిర్వహించే కట్టు కళచా అనే ఉత్సవం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

ఎద్దుల బొమ్మలను

ఎద్దుల బొమ్మలను

P.C: You Tube

దేవాలయ పరిధిలో ఉంటే ప్రజలు ఎద్దుల బొమ్మలను సుందంగా అలంకరించి ఇక్కడ ప్రదర్శనకు తీసుకువస్తారు. ఇందు కోసం దాదాపు నెల రోజుల ముందు నుంటే ప్రణాళికలు సిద్ధం చేసుకొంటారు. ఎవరు ఎతైన బొమ్మలు తయారు చేస్తారన్న విషయం ఇక్కడ వారి ప్రతిష్టగా భావిస్తారు.

మొదట చెక్కతో

మొదట చెక్కతో

P.C: You Tube

ఈ బొమ్మలను మొదట చెక్కతో తయారుచేసి అనంతరం వాటిని వివిధ రంగులు, దుస్తులతో అలంకరిస్తారు. అటు పై ట్రాక్టర్ల పై ఊరేగిస్తారు. దివిటీల వెలుగులో ఆ బొమ్మల అందాలను చూడాలేకాని వర్ణించడానికి వీలుకాదు.

ఇతర దేవతల విగ్రహాలను ప్రదర్శించరు

ఇతర దేవతల విగ్రహాలను ప్రదర్శించరు

P.C: You Tube

అంతేగాని ఏ ఇతర దేవతల బొమ్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ప్రదర్శించరు. వ`శ్చిక మాసం మొదటి 12 రోజులు ఈ దేవాలయ ఆవరణంలో నిద్రించి ఇక్కడి పరబ్రహ్మను పూజించడం అత్యంత పవిత్రమైన కార్యంగా భక్తులు భావిస్తారు.

వివిధ ప్రాంతాల నుంచి

వివిధ ప్రాంతాల నుంచి

P.C: You Tube

ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇందుకోసం తాత్కాలికంగా గుడిసెలను వేసుకొంటారు. ప్రతి ఏడాది ఈ గుడిసెల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే ప్రత్యేక భద్రతా వ్యవస్థలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

భక్తుల సంఖ్య పెరుగుతూ

భక్తుల సంఖ్య పెరుగుతూ

P.C: You Tube

అంటే ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉందని అర్థం. ఈ దేవాలయాన్ని మళయాలంలో ఇడతావళం అని అంటారు. అంటే ఏదేని పుణ్యక్షేత్రాన్ని సందర్శించే సమయంలో తాత్కాలికంగా విశ్రమించే ప్రదేశం అని అర్థం.

శబరిమలేకు వెళ్లేవారు

శబరిమలేకు వెళ్లేవారు

P.C: You Tube

అందుకే శబరిమలేకు వెళ్లే వారిలో చాలా మంది ఈ పుణ్యక్షేత్రంలో కొద్ది సేపు ఉండి వెలుతారు. ఆ సమయంలో దేవాలయం వారు వారికి శొంటి కాఫీ, ఫలహారన్ని అందజేస్తారు. ఈ దేవాలయం కాయంకులం పట్టణం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలప్పి నుంచి కాయంకులంకు రైలు, బస్సుల ద్వారా చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X