» » శివుడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం...ఇక్కడ ఆయనకు అభిషేకం ఉండదు?

శివుడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం...ఇక్కడ ఆయనకు అభిషేకం ఉండదు?

Posted By: Kishore

దేశంలో శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో చాలా వరకూ శివుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. కొన్ని చోట్ల మాత్రం మానవ రూపంలో విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం కూడా కొర్చొని లేదా నిలబడిన రూపంలో మనకు కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని పళ్లి కొండేశ్వర క్షేత్రంలో శివుడు పార్వతి ఒడిలో పడుకున్న రూపంలో కనిపిస్తాడు. దేశంలో ఇటువంటి విగ్రహం ఇదొక్కటే. ఈ క్షేత్రాన్ని సూరుటుపళ్లి అని కూడా అంటారు. చుట్టూ పచ్చని చెట్లు, సెలయేటి గలగల మధ్య ఈ క్షేత్ర దర్శనం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇందుకు సంబంధించిన కథనం నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1.పురాణ కథనం ప్రకారం

1.పురాణ కథనం ప్రకారం

P.c Razmnama


క్షీరసాగర మథనం సమయంలో హాలా అనే విషయం బయటికి వస్తుంది. ఆ విష ప్రభావం ప్రపంచం మొత్తాన్ని దహించవేయసాగింది. నివారోపాయం కోసం పరమశివుడు ఆ విషాన్ని మింగుతాడు.

2.అముదాంబిక అనే పేరు కూడా

2.అముదాంబిక అనే పేరు కూడా

Image source:

శివుడు మింగిన విషం శరీరంలోకి వెళ్లకుండా పార్వతీ దేవి ఆయన కంఠాన్ని గట్టిగా పట్టుకుంటుంది. విషాన్ని ఆపి జీవితాన్ని అమృత మయం చేసినందువల్లే ఆ తల్లికి అముదాంబిక అని పేరు కూడా వచ్చింది.

శివుడూ శిష ప్రభావానికి లోనవుతాడు

శివుడూ శిష ప్రభావానికి లోనవుతాడు

P.c Iramuthusamy

కాగా, ఈ ఘటన తర్వాత పార్వతి, పరమేశ్వరులు తిరిగి కైలాసానికి బయలుదేరుతారు. ఆ ప్రయాణ సమయంలో వారివురూ పళ్లి కొండేశ్వర క్షేత్రం వద్దకు రాగానే అంతటి పరమేశ్వరుడు కూడా విష ప్రభావానికి లోనవుతాడు.

4.అందుకే శివ శయన క్షేత్రం అని పేరు

4.అందుకే శివ శయన క్షేత్రం అని పేరు


Image source

దీంతో ఈ కాసేపు పార్వతి దేవి ఒడిలో విశ్రమించాడు. అందవ్లే ఇక్కడ శివుడు పార్వతి ఒడిలో పడుకున్న రూపం మనకు దర్శనమిస్తుంది. శివుడు శయనించిన క్షేత్రం కాబట్టే దీనికి శివ శయన క్షేత్రం అనే పేరు వచ్చిందనేది కథనం.

మొదట అమ్మవారినే దర్శించుకోవాలి

మొదట అమ్మవారినే దర్శించుకోవాలి

Image source:

శివుడి శరీరంలోకి విషం వెళ్ల కుండా పార్వతి దేవి రక్షించింది కాబట్టే ఈ క్షేత్రంలో వెలిసిన అముదాంబికను మొదట దర్శించుకుని అటు పై స్వామివారిని దర్శించుకునే ఆచారం ఉంది.

12 అడుగుల విగ్రహం

12 అడుగుల విగ్రహం

P.C రవిచంద్ర

సవర్వమంగళ శ్రీ పళ్లి కొండేశ్వరస్వామి వారి విగ్రహం 12 అడుగుల పొడవు ఉంటుంది. ఈ ఆలయంలో దేవతలూ, రుషులూ చుట్టూ నిలబడి ప్రార్థిస్తుండగా పార్వతీ దేవి ఒడిలో శయనిస్తన్నట్టు ఉండే స్వామివారి విగ్రహ రూపం భక్తులకు దర్శనమిస్తుంది.

7.సరుటుపల్లి అనే పేరు అందుకే

7.సరుటుపల్లి అనే పేరు అందుకే

P.C Iramuthusamy

సురుళ్ అంటే దేవతలని అర్థం. విష ప్రభావానికిలోనైన స్వామివారు తిరిగి లేచేవరకూ బ్రహ్మ, మహావిష్ణువు తదితరులు ఈ క్షేత్రంలోనే ఉండటం వల్ల ఈ ప్రాంతానికి సరుటుపల్లి అని పేరు వచ్చినట్టు స్థానిక కథనం.

8.అభిషేకం ఉండదు

8.అభిషేకం ఉండదు

Image source:

ఈ ఆలయంలోని శివుడి విగ్రహానికి అభిషేకానికి బదులు తమిళనాడు నుంచి తెచ్చే చందన తైలాన్ని ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పూస్తారు. దీని వల్ల విష ప్రభావం ఉండదని నమ్మకం

9.హరిహర బుక్కరాయులు

9.హరిహర బుక్కరాయులు

Image source:

ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరిహర బుక్కరాయులు క్రీ.శ 1344-77 మధ్య నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.

10.ఇలా చేరుకోవచ్చు

10.ఇలా చేరుకోవచ్చు

Image source:

చిత్తూరు లేదా తిరుపతి నుంచి మొదట పుత్తూరు చేరుకోవాలి. అక్కడి నుంచి చెన్నైకి వెళ్లే మార్గంలో 21 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. పుత్తూరు నుంచి ప్రతి పావుగంటకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది. ప్రైవేటు వాహనాలు కూడా దొరుకుతాయి.

11 చూడదగిన ప్రాంతాలు

11 చూడదగిన ప్రాంతాలు


P.c VinothChandar

పళ్లికొండేశ్వర క్షేత్రానికి దగ్గరల్లో తిరుపతి తిరుమల, కాళహస్తి, తలకోణ, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ తదితర పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు.