» »ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రాంతం

ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రాంతం

Written By: Venkatakarunasri

ప్రపంచంలోనే అత్యంత మోక్షదాయకాలైన ప్రాంతాలుగా పంచప్రయాగాలను పేర్కొంటారు.అసలు ప్రయాగ అంటే అర్ధం ఏంటంటే సంగమం అని అర్ధం మరి ఆ పంచప్రయాగలు ఎక్కడ వున్నాయో ఏ ప్రాంతంలో ఈ వ్యాసంలో మనం తెలుసుకుందాం.కేధార్ నాథ్ నుండి బద్రీనాథ్ వెళ్లేమార్గంలో పంచప్రయాగలు వున్నాయి.మరి అవి ఏంటంటే విష్ణు ప్రయాగ, నంద ప్రయాగ,కర్ణ ప్రయాగ, రుద్ర ప్రయాగ, దేవ ప్రయాగ.

ఉత్తరఖాండ్ లోని టేహ్రీగర్వాల్ జిల్లాలో సముద్రమట్టానికి 2723అడుగుల ఎత్తులో వున్న ప్రసిద్ధక్షేత్రం దేవప్రయాగ.108దివ్యతిరుపతులలో ఒకటిగా పేరుగాంచింది.ఈ క్షేత్రంలో కేధారనాథ్లో పుట్టిన మందాకిని నది,బదరీనాథ్ లో పుట్టిన అలకానంద, గంగోత్రిలో పుట్టిన గంగా అలా ఈ మూడు నదులు కలిసే త్రివేణీసంగమం. ఈ ప్రాంతంలో బ్రహ్మచర్యవ్రతంతో నాల్గునెలలపాటు అష్టాక్షరి మంత్రం జపిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్ముతారు. ఈ విషయాన్ని శివుడు నారదుడితో చెప్పినట్టు స్కందపురాణంలో రాయబడి వుంది.పురాణాల ప్రకారం దశరధమహారాజు,శ్రీరామచంద్రుడు ఇక్కడ స్వామికోసం తపస్సు చేసారని పాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి స్నానాన్ని ఆచరించి స్వామిని దర్శించుకున్నారు.

ఇప్పుడు విష్ణుప్రయాగ ఎక్కడుందో చూద్దాం

విష్ణుప్రయాగ

విష్ణుప్రయాగ

ఇది బద్రీనాథ్ కి దక్షిణంగా 35కి.మీ ల దూరంలో నిథి అనే లోయ ప్రాంతం వుంటుంది.అక్కడ కొండ శిఖరాల నుండి జాలువారిన నది దవళ గంగ,పడమటి దిక్కునుండి ప్రవహించి విష్ణుప్రయాగలో అలకానంద వద్ద కలుస్తుంది.

విష్ణుప్రయాగ

విష్ణుప్రయాగ

ఇక్కడ విష్ణుమూర్తి వీరనారాయణ రూపంలో తపస్సు చేయటానికి బద్రికావనం వెళ్తూ ఈ సంగమం వద్ద కొంతకాలం ధ్యానం చేసాడట.అందుకే ఈ పవిత్రప్రాంతానికి విష్ణుప్రయాగ అనే పేరు వచ్చింది.

నందప్రయాగ

నందప్రయాగ

బదరీనాథ్ నుండి సుమారు 106కి.మీ ల దూరంలో వుంటుంది. ఇక్కడ నుండి 75కి.మీ ల దూరంలో నందాదేవి పర్వతశిఖరం వుంది.

నందప్రయాగ

నందప్రయాగ

నందాదేవి శిఖరప్రాంతంలో జన్మించిన నది కావున ఈ నది పేరు మీద ఇక్కడ సంగమ ప్రాంతాన్ని ఇక్కడ నందప్రయాగ అంటారు.అంతేకాకుండా పూర్వం ఇక్కడ నందుడు అనే చక్రవర్తి ఈ ప్రాంతంలో గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాడు.ఇప్పుడు కర్ణ ప్రయాగ గురించి తెలుసుకుందాం.

కర్ణ ప్రయాగ

కర్ణ ప్రయాగ

నందప్రయాగ తర్వాత సుమారు 22కి.మీ ల దూరంలో అంటే బద్రీనాథ్ కి 128కి.మీల దూరంలో కర్ణప్రయాగ వుంది. ఇక్కడ పిడగరంగ అనే నది అలకానందలో కలుస్తుంది.

కర్ణ ప్రయాగ

కర్ణ ప్రయాగ

నందప్రయాగసూర్యభగవానుడి కోసం తపస్సును చేసి కవచకుండలాలు పొందాడని స్థలపురాణం ఆ కారణంగా ఈ ప్రాంతానికి కర్ణ ప్రయాగ అనే పేరు వచ్చింది. ఇక్కడ అత్యంత ప్రాచీనమైన ఉమాదేవి ఆలయం వుంది.

రుద్రప్రయాగ

రుద్రప్రయాగ

కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పైరెండు కిలో మీటర్ల ప్రయాణానంతరం రుద్రప్రయాగ చేరుకుంటాం . ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా ముఖ్యకేంద్రమైన రుద్రప్రయాగ కేదార్ నాధ్ వెళ్లే యాత్రీకులకు , బదరీనాధ్ వెళ్లే యాత్రీకులకు ముఖ్యకూడలి . ఇక్కడ భోజన , వసతి సౌకర్యాలు వున్నాయి . సంవత్సరంలో ఆరునెలలు భక్తులతో రద్దీ గా వుంటుంది .కేదారనాధ్ దగ్గర వున్న " చోరాబారి " అనే హిమనీనదములో పుట్టిన మందాకిని అలకనందతో రుద్రప్రయాగ దగ్గర సంగమించింది .

రుద్రప్రయాగ

రుద్రప్రయాగ

ఎత్తైన మెట్లు దిగి కిందకి వెళితే సంగమ ప్రదేశం చేరుకోవచ్చు . సంగమానికి వెళ్లేదారిలో నారదశిల వుంటుంది . ఇక్కడ నారదుడు శివుని కొరకై తపస్సు చేసి శివుని వద్ద సంగీతం నేర్చుకుంటాడు . ఈ ప్రదేశంలో శివుడు రుద్రనాధుడుగా పూజింప బడుతున్నాడు . రుద్రనాధుని కి కోవెలకు యెదురుగా చిన్న గుట్టమీద చాముండా దేవి కోవెలను చూడొచ్చు . పక్కగా వున్న కాలిబాటన వెళితే చిన్న గుహ అందులో కోటి లింగేశ్వరుని దర్శించుకోవచ్చు .

దేవప్రయాగ

దేవప్రయాగ

రుద్రప్రయాగ నుంచి సుమారు నలబ్బై కిలో మీటర్ల పయాణం తరువాత మనం దేవప్రయాగ చేరుకుంటాం .పూర్వం దేవశర్మ అనే ముని యీ ప్రదేశమ లో తపస్సు చేసుకున్నందువలన యీ వూరికి దేవప్రయాగ అని పేరు వచ్చిందని ఒక కథ , దేవప్రయాగ అంటే దేవతలు కలిసే చోటు అని అర్ధం కాబట్టి ఈ ప్రదేశం సర్వదేవతలు నివాసస్థలం అని కొందరి కథనం .ఎవరు యేవిధంగా నిర్వచించినా యిక్కడి ప్రకృతి మనలని మంత్ర ముగ్ధులను చేస్తుంది అనడంలో అతిశయోక్తి యేమీ లేదు .

దేవప్రయాగ

దేవప్రయాగ

చుట్టూరా యెత్తైన కొండలు , ఒకవైపున అలకనంద వురుకులు పరుగులతో వచ్చి , గోముఖ్ దగ్గర గంగోత్రి హిమనీనదములో పుట్టిన భగీరథి ( మొదటి పేరాలో భగీరథి కథ వివరించేను) తో కలిసి ' గంగ ' గా అవతరించి దిగువకు ప్రవహించడం ఒక అద్భుతాన్ని తలపింపకమానదు . రెండునదుల సంగమ ప్రదేశంలో 'తొండేశ్వర మహదేవ్ ' మందిరం వుంది . ఈ సంగమాన్ని అత్తాకోడళ్ల సంగమం అనికూడా అంటారు.

దేవప్రయాగ

దేవప్రయాగ

అలకనంద మహాలక్ష్మి స్వరూపమని , భగీరథి స్వయంగా శివుని పత్ని అని , యింట్లో అత్తాకోడళ్ల తగవులు యెక్కువగా వున్నవాళ్లు యిక్కడ పూజలు చేసుకుంటే వారి సంబంధం లో మంచిమార్పులు చోటుచేసుకుంటాయని యిక్కడి వారి నమ్మకం . ఫొటోలో వున్న విధంగా అరుగులు కట్టి 2013 కి పూర్వం వుండేది . 2013 లో వచ్చిన వరదలలో అన్నీ కొట్టుకు పోయేయి . ప్రస్తుతం యిలాంటివి లేవు . ఇక్కడి ప్రభుత్వం యిలాంటివి తిరిగి నిర్మించ యాత్రీకులకు సంగమాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించే సదుపాయం కలిగిస్తుందని ఆశిద్దాం .

Please Wait while comments are loading...