Search
  • Follow NativePlanet
Share
» »బహుబలి గుహలు ఇవేనా ? కాదా ??

బహుబలి గుహలు ఇవేనా ? కాదా ??

By Venkatakarunasri

పన్నా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో వజ్రాల గనులకు చెందిన ఒక పట్టణం. ప్రపంచం మొత్తం మీద పన్నా వజ్రాలు చక్కని నాణ్యతను మరియు స్పష్టతను కలిగి ఉంటాయి. పన్నా ఇక్కడున్న నేషనల్ పార్క్ ద్వారా బాగా ప్రసిద్ధి చెందినది. దీనితో పాటుగా సమానంగా బాగా ప్రసద్ధి చెందిన ప్రదేశం మరొకటుంది అదే పాండవుల గుహ మరియు జలపాతం. మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ఈ పట్టణం అందమైన పార్కులు, పిక్నిక్ స్పాట్లతో పర్యాటకులను ఆకర్షిస్తున్నది. పన్నాలో ప్రధానంగా చెప్పుకోవలసినది పన్నా నేషనల్ పార్క్. దేశంలో ఉన్న అతి కొద్ది పులుల స్థావరాలలో ఇది ఒకటి. ఖజురహో నుండి మీరు ఈ పార్క్ కు సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడ మీరు బస చేయటానికి హోటళ్లు మరియు రిసార్ట్ లు ఉన్నాయి. ఇక్కడున్న కొన్ని పర్యాటక ఆకర్షణలు చూసినట్లయితే ...

పన్నా నేషనల్ పార్క్

పన్నా నేషనల్ పార్క్

పన్నా నేషనల్ పార్క్, పన్నా నగరానికి సమీపంలో మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్నది. దేశంలోనే పేరు మోసిన టైగర్ రిజర్వ్ పార్క్ లలో ఒకటిగా గుర్తింపు పొందినది. ఈ నేషనల్ పార్కు పులులకు మరియు అనేక ఇతర జంతువులకి స్థావరంగా ఉంది.

Photo Courtesy: Janvi Singh

పన్నా నేషనల్ పార్క్

పన్నా నేషనల్ పార్క్

పన్నా నేషనల్ పార్క్ చూడాటానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇండో - గంగా మైదానానికి చెందిన ప్రదేశం కావడంతో ఇక్కడ మీరు ఆకురాల్చే అడవులను గమనించవచ్చు. ఈ ప్రదేశం మొదట టేకు చెట్లతో మొదలవుతుంది.

పన్నా నేషనల్ పార్క్

పన్నా నేషనల్ పార్క్

పన్నా నేషనల్ పార్క్ లో చిరుతలు, ఎలుగుబంటీలు, గంభీరమైన పులులు మరియు చిన్కరాస్ లను చూడవచ్చు. అంతే కాక రాబందులు, గుడ్లగూబలు మరియు ఇతర రకాల పశుపక్షాదులను గమనించవచ్చు.

Photo Courtesy: Yajuvendra Upadhyaya

కెన్ ఘరియల్ అభయారణ్యం

కెన్ ఘరియల్ అభయారణ్యం

కెన్ ఘరియల్ అభయారణ్యం లో అంతరించిపోతున్న గొరిల్లా లను సంరక్షించేందుకు స్థాపించబడిన అభయారణ్యం. అభయారణ్యం చూడటానికి అందంగా ఉంది, చుట్టూ దట్టమైన అడవులతో పన్నా నగరానికి దగ్గరలో ఉన్నది. ఈ అభయారణ్యంలో మీరు గనక బాగా నడిస్తే 45 కి. మీ. పొడవున్న కెన్ నది గమనించవచ్చు.

కెన్ ఘరియల్ అభయారణ్యం

కెన్ ఘరియల్ అభయారణ్యం

కెన్ ఘరియల్ అభయారణ్యం లో 6 మీటర్ల పొడావున్న గొరిల్లా లను, అనేక సరీశృపాలను అదేవిధంగా నది ఇసుక ఒడ్డున కృష్ణ జింకలను, చీతల్స్, అడవి పందులను, నెమళ్లను, నీలి ఎద్దులను చూడవచ్చు. పిల్లలు, పర్యాటకులు ఈ అభయారణ్యాన్ని తప్పక సందర్శించాలి.

సందర్శించు సమయం : ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి రోజు సంవత్సరం లో అన్ని రోజులలో తెరిచే ఉంటుంది.

Photo Courtesy: Karl O'Brien

పాండవుల గుహలు మరియు జలపాతాలు

పాండవుల గుహలు మరియు జలపాతాలు

పాండవుల గుహలు మరియు జలపాతాలు పన్నా పట్టణానికి 12 కి. మీ. దూరంలో ఉన్నాయి. అంతేకాదు, నేషనల్ పార్క్ కి సమీపంలో కూడా ఉన్నది. ఈ జలపాతాలు జాతీయ రహదారికి దగ్గరలో ఉన్నది కనుక చేరుకోవడం చాలా సులభం. స్థానిక బుగ్గల నుంచి ఉద్భవించటం వల్ల ఈ జలపాతం పన్నా ఉత్తమ పర్యాటక ఆకర్షణగా నిలిచింది.

Photo Courtesy: Sujith

పాండవుల గుహలు మరియు జలపాతాలు

పాండవుల గుహలు మరియు జలపాతాలు

సీజన్‌తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా పాండవుల జలపాతం ధారాళంగా నీటి ప్రవాహాన్ని కలిగి ఉంటుంది. జలపాతం సుమారుగా 100 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. వర్షాకాల సమయంలో ఈ జలపాతాన్ని సందర్శించటం ఒక గొప్ప మాధురనుభూతిని కలిగిస్తుంది.

Photo Courtesy: Sujith

పాండవుల గుహలు

పాండవుల గుహలు

పురాణాల ప్రకారం చూసినట్లయితే, బహిష్కరణకు గురైన పాండవులు వనవాస సమయంలో ఇక్కడ ఆశ్రయం పొందినట్లు తెలుస్తుంది. ఈ గుహలు జలపాతం యొక్క అడుగు భాగంలో ఉన్నాయి. గుహలు, జలపాతాలు మరియు దాని పరిసర ప్రాంతాలు పర్యాటకులకు, స్థానికులకు ఒక పిక్నిక్ స్పాట్ గా మారిపోయింది.

Photo Courtesy: Joao Pedro Lopes

మహామతి సన్నిధానం

మహామతి సన్నిధానం

పన్నా నగరం హిందువులకు పవిత్ర నగరం గా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడ మహామతి ప్రన్నాథ్ స్వయంగా సందేశాన్ని భోదించారు. అంతేకాకుండా జగాని జెండా విప్పారు. పన్నాలో మహామతి తన శిష్యులతో పాటు పదకొండు సంవత్సరాలు గడిపిన తర్వాత అయన సమాధి తీసుకోవాలని నిర్ణయించుకున్నారని నమ్ముతారు.

Photo Courtesy: Manfred Sommer

పన్నా ఎలా చేరుకోవాలి??

పన్నా ఎలా చేరుకోవాలి??

విమాన మార్గం

పన్నాలో విమానాశ్రయం లేదు కాబట్టి సమీప విమానాశ్రయం ఖజురా వద్ద ఉన్న ఖజురహో విమానాశ్రయం. ఈ విమానాశ్రయం పన్నా నుండి 50 కి.మీ. దూరంలో ఉంది. విమానాశ్రయం నుండి పన్నా చేరుకోవటానికి టాక్సీలు మరియు బస్సులు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం

పన్నా లో రైల్వే స్టేషన్ లేదు కనుక సమీప రైల్వే స్టేషన్లుగా ఖజురహో మరియు సాట్నా లు ఉన్నాయి. ఖజురహో రైల్వే స్టేషన్ పన్నా నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాట్నా రైల్వే స్టేషన్ పన్నా నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్టేషన్లు రెండు రాష్ట్ర మరియు దేశంలో ప్రధాన నగరాలతో సంబంధం కలిగి ఉంటాయి. బస్సులు మరియు టాక్సీలు రైల్వే స్టేషన్ నుండి పన్నా చేరుకోవటానికి అందుబాటులో ఉంటాయి.

రోడ్డు మార్గం

అనేక స్లీపర్, AC లగ్జరీ కోచ్లు ఢిల్లీ, ఆగ్రా, ఝాన్సీ, లక్నో, ఫరీదాబాద్, వారణాసి, నాగ్పూర్, జబల్పూర్, అలహాబాద్, దోల్పూర్, ఇండోర్, భూపాల్ మరియు మరిన్ని నగరాలు నుండి అందుబాటులో ఉన్నాయి. మధ్య ప్రదేశ్ లో ఈ నగరం జాతీయ రహదారి అనుసంధానించబడింది. రోడ్డు ద్వారా పన్నా కు ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది.

Photo Courtesy: Kumara Sastry

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X