» »సేలం దగ్గర మహిమాన్వితమైన పెరుమాళ్ ఆలయం

సేలం దగ్గర మహిమాన్వితమైన పెరుమాళ్ ఆలయం

Written By: Venkatakarunasri

ఇది తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఉన్న ఒక నగరం.

ఇది భారత దేశంలో దక్షిణాది రాష్ట్రంలో ఉత్తర మధ్య ప్రాంతంలో ఉంది.

సేలం, కొంగు నాడు అనబడే పశ్చిమ తమిళకం ప్రాంతమొక్క విభాగం.

ఇది పడమర తమిళనాడు ప్రాంతాన్ని కలిగి ఉంది.

దాదాపు అన్ని వైపుల కొండలు చుట్టుముట్టి ఉన్న సేలం, ప్రసిద్ధ పర్యాటకుల ప్రదేశమైన ఏర్కాడ్ కొండల అడుగున ఉంది.

ఈ కొండలు ఎక్కుతున్నపుడు మరియు పైనుండి చూసేటప్పుడు అతి సుందరమైన మరియు అధ్బుతమైన దృశ్యాలు కనిపిస్తాయి.

కిళియూర్ జలపాతం వంటి కొన్ని సుందరమైన విదూర ప్రాంతాలు కూడా ఉన్నాయి.

ఉత్తరంలో నగరమలై, దక్షిణంలో జరుగుమలై, పశ్చిమలో కంజమలై మరియు తూర్పులో గోడుమలై వంటి ప్రకృతిసిద్దమైన కొండల మధ్యలో ఈ నగరం ఉంది.

సేలం మరియు పరిసర ప్రాంతాలలో ఉండే కొండలు ప్రాచీన కాలంలో చేర మరియు కొంగు రాజ్యాలలో భాగంగా ఉండేవి. ప్రాచీన తమిళనాడుకు చెందిన కురునిల మన్నర్గళ్ అయిన కొంగు రాజులు ఈ ప్రాంతాలని పరిపాలించేవారు.

స్థానిక జానపదకథల ప్రకారం తమిళ కవయిత్రి అవ్వయ్యార్ సేలం లోనే జన్మించింది. గంగా వంశానికి చెందిన శాసనాలు ఈ జిల్లా లోని ప్రదేశాలలో దొరికాయి. ఈ నగరము కొంగు నాడు మధ్యలో ఉంది.

ముఖ్య విభాగంలో తిరుమణిముతూర్ అనే నది ఈ నగర మధ్యలో ఉంది. కోట ప్రాంతమే ఈ నగరము యొక్క అత్యంత పురాతన ప్రదేశం.

కొండల చుట్టూ ఉండే ప్రదేశాన్ని శాసనాల్లో సూచించే హాయ్ లేదా శల్య లేదా సయిలం అనే పదాలనుండి సేలం అనే పేరు ఉత్పన్నమైనట్లు భావించబడుతున్నది.

ఆలయం ఎక్కడ వుంది?

ఆలయం ఎక్కడ వుంది?

తమిళనాడులోని సేలం జిల్లాలోని నవకురుచ్చి అనే గ్రామంలో దశాబ్దాలుగా మూతబడియున్న ఒక పురాతనఆలయాన్ని గ్రామస్థులు ఇటీవలే తెరిచారు.

PC: official site

ఆలయ రహస్యం

ఆలయ రహస్యం

అయితే ఆలయంలో కొన్ని వాస్తు దోషాలున్నాయని, ఆంజనేయస్వామి విగ్రహం ఉండాల్సిన చోటు కాకుండా మరోచోట వుందని పండితులు తెలిపారు.

PC: official site

విగ్రహాన్ని పునఃప్రతిష్ట ఎందుకు నిర్ణయించారు?

విగ్రహాన్ని పునఃప్రతిష్ట ఎందుకు నిర్ణయించారు?

కాబట్టి స్వామి వారి విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేయాలని నిర్ణయించారు.

PC: official site

తవ్వకాలలో ఏం బయటపడింది?

తవ్వకాలలో ఏం బయటపడింది?

పనులు ప్రారంభించి ఆలయ ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ట కోసం గుంత త్రవ్వుతుండగా ఒక రహస్యగది బయటపడింది.

PC: official site

ఆ రహస్యగదిలో ఏముంది?

ఆ రహస్యగదిలో ఏముంది?

ఆశ్చర్యానికి గురైన గ్రామస్థులు ఆ రహస్య గదికి వెళ్లి చూడగా శతాబ్దాల కిందటి పంచలోహ పెరుమాళ్ విగ్రహాలు బయటపడ్డాయి.

PC: official site

పోలీసులు అక్కడకు వచ్చి ఏం చేసారు?

పోలీసులు అక్కడకు వచ్చి ఏం చేసారు?

వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు పురావస్తు దేవాదాయ అధికారులు అక్కడకు చేరుకున్నారు.

PC: official site

ఈ విగ్రహాలు ఏకాలం నాటివి?

ఈ విగ్రహాలు ఏకాలం నాటివి?

విగ్రహాలను పరిశీలించి చూడగా అవి 16 వ శతాబ్దం నాటివి అని వారు వెల్లడించారు.

PC: official site

పురావస్తుఅధికారులు ఏం ప్రతిపాదించారు?

పురావస్తుఅధికారులు ఏం ప్రతిపాదించారు?

ఈ విగ్రహాలను పురావస్తుశాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రతిపాదించారు.

PC: official site

గ్రామస్థుల అభిప్రాయాలు ఏమిటి?

గ్రామస్థుల అభిప్రాయాలు ఏమిటి?

అయితే దీని పట్ల గ్రామస్థులు భిన్నాభిప్రాయం తెలిపారు.

PC: official site

ఆ గుడిలో ఏం ప్రతిష్టించాలని భావించారు?

ఆ గుడిలో ఏం ప్రతిష్టించాలని భావించారు?

పెరుమాళ్ విగ్రహాలను అదే గుడిలో ప్రతిష్టించాలని వారు భావించారు.

PC: official site

పురావస్తుశాఖ అధికారులు

పురావస్తుశాఖ అధికారులు

అయితే ఆ గ్రామస్థులకు సర్దిచెప్పి పోలీసులు పురావస్తుశాఖ అధికారులు విగ్రహాలను తీసుకెళ్ళిపోయారు.

PC: official site

సమీపంలోని టూరిస్ట్ ప్రదేశాలు

సమీపంలోని టూరిస్ట్ ప్రదేశాలు

ఏర్కాడ్ హిల్ స్టేషన్

భారతదేశం లోని తమిళ్ నాడులోని సేలంలో ఉన్న ఒక హిల్ స్టేషను ఏర్కాడ్. ఇది ఈస్టర్న్ ఘాట్ లలో ఉన్న సేర్వరాయన్ పర్వత శ్రేణిలో (స్గేవరాయ్స్ అని ఆంగ్లంలో చెప్పబడుతుంది) ఉంది.

 ఏర్కాడ్ హిల్ స్టేషన్

ఏర్కాడ్ హిల్ స్టేషన్

ఇది సముద్ర మట్టానికి 1515 మీటర్ల (4969 అడుగు) ఎత్తులో ఉంది. ఈ ఊరి పేరు ఊరు మూలలో ఉన్న చెరువు పేరునుండి వచ్చింది - తమిళ్ లో "ఏరి" అంటే "చెరువు" మరియు "కాడు" అనగా "అడవి". ఏర్కాడ్ కాఫీ తోటలకు, ఆరంజ్ తోటలకు ప్రసిద్ధి.

ఏర్కాడ్ హిల్ స్టేషన్

ఏర్కాడ్ హిల్ స్టేషన్

ఇక్కడ బొటానికల్ సర్వ్ అఫ్ ఇండియా ఆద్వర్యంలో నడపపడుతున్న ఒక ఆర్కిడారియం కూడా ఉంది. ఏర్కాడ్ లో ఉచ్చిష్ట స్థలం సేరరాయన్ గుడి. అందువల్ల ఏర్కాడ్ కొండ ప్రాంతాన్ని షేవరాయ్ హిల్స్ అని పిలుస్తారు. ఏర్కాడ్ పేదల ఊటీ అని కూడా పిలవబడుతుంది.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

చెన్నై, బెంగుళూరు, తిరువనంతపురం, కోయంబతూర్, మదురై, ఎర్నాకుళం/కోచిన్, పాండిచేరి, తిరుచి, కన్యాకుమారి వంటి ప్రదేశాలకు వెళ్లే మార్గ మధ్యంలో సేలం ఉంది.

బస్సు స్టేషన్లు

బస్సు స్టేషన్లు

సేలంలో 2 పెద్ద బస్సు స్టేషను ఉన్నాయి. అవి -:MGR ఇంటేగ్రేటడ్ బస్ టెర్మినస్. సెంట్రల్ బస్ టెర్మినస్ అని కూడా పిలువబడుతుంది (కొత్త బస్ స్టాండ్) - పరిసర ప్రాంతాల మార్గాలు
టౌన్ బస్ స్టేషను (పాత బస్ స్టాండ్) - స్థానిక మార్గాలు, ఊరులో రద్దీగా ఉన్న ప్రాంతాలు.

ట్రైన్ సదుపాయం

ట్రైన్ సదుపాయం

రోజంతట సేలం నుండి రాష్ట్ర రాజధాని చెన్నైకుట్రైన్ సదుపాయం ఉంది.

Please Wait while comments are loading...