Search
  • Follow NativePlanet
Share
» »ర‌హ‌స్యాల నిల‌యం... గుత్తికొండ బిలం! (రెండ‌వ భాగం)

ర‌హ‌స్యాల నిల‌యం... గుత్తికొండ బిలం! (రెండ‌వ భాగం)

గుత్తికొండ బిలం ద‌గ్గ‌ర‌కు మ‌ట్టిరోడ్డులో కాలినడకన ముందుకు సాగాం. కొండపైన అంతా నిర్మానుష్యంగా ఉంది. రెండు ఆలయాలు ఉన్నాయి. అవి దాటుకుంటూ ముందుకు వెళ్లాం.. అక్కడే కుడివైపుగా ముక్తిద్వారం అని రాసి ఉన్న మార్గం కనిపించింది. ఒక్కొక్కరిగా ఉన్న బృంద సభ్యులు దగ్గరగా రావడం మొదలుపెట్టారు. అందరం ఒకేసారి లోపలకు అడుగుపెట్టాం. భీక‌ర శ‌బ్ధాలు చేస్తూ గబ్బిలాల గుంపులు గుత్తికొండ బిలంలోకి మాకు ఆహ్వానం పలికాయి. అడుగులు లోపలకు వేసే కొద్దీ మా గుండె వేగం పెరుగుతోంది. మెల్లగా వెలుతురును గుహలోని చీకటి కమ్మేసింది. లోపల రెండు మూడు మార్గాలు విడివిడిగా ఉన్నాయి. మేం వెళ్లే సమయానికి ఓ మార్గంలో మాత్రమే లైట్లు వెలిగి ఉన్నాయి.

ర‌హ‌స్యాల నిల‌యం... గుత్తికొండ బిలం!

ర‌హ‌స్యాల నిల‌యం... గుత్తికొండ బిలం!

ఆ మార్గం గుండా ముందుకు సాగాం. కొంతదూరం వెళ్లేసరికి, అలసట మొదలైంది. చెమటతో మా బట్టలు తడిసి ముద్దయిపోయాయి. ఇక ముందుకు వెళ్లడం కష్టమేమో అనుకున్న టైంలో స్వచ్ఛమైన నీటి కోనేరు కనిపించింది. అది కూడా మా మొబైల్ లైట్ దాని మీద పడటం వల్ల కోనేరును గుర్తించాం. ఆ నీటి అడుగుభాగంలో ఉన్న రాళ్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రదేశంపై మాకు అవగాహన లేకపోవడంతో లోపలకు దిగే సాహసం చేయలేదు. అక్కడి నుంచి పక్కనే ఉన్న మరో మార్గంలో ముందుకు వెళ్లాం. ఆ గుహ మార్గం కూడా నీటితో మునిగి ఉందని అర్ధమయ్యింది. ఇంకా లోపలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ మాలో కొందరు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్లిన మార్గంలోనే

రహస్యాల కేంద్రబిందువు!

రహస్యాల కేంద్రబిందువు!

బయటకు వచ్చాక అక్కడే సుమారు పదిహేనేళ్లుగా ఓ చిన్నకొట్టు పెట్టుకొని జీవిస్తోన్న లక్ష్మి అనే మహిళను కలిశాం. ఆమె ద్వారా అక్కడి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ బిలం సహజ సిద్ధంగా ఏర్పడిందని, దీని లోపల‌ అనేక అంతర గుహలు, అద్భుత జలాశయాలు ఉన్నాయని చెప్పుకొచ్చిందామె.. ఇక్కడ 101 సొరంగాలు ఉండగా ప్రస్తుతం వెళ్లటానికి వీలుగా ఏడు గుహలు మాత్రమే ఉన్నాయి. బిలంలోని కోనేరులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ బిలాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ జలాలు ఎక్కడనుంచి వస్తాయో ఎక్క‌డికి వెళ్తాయో ఎవరికీ తెలియదు' అంటూ చెప్పుకొచ్చిందామె. ఈ బిలానికి ఓ ప్రత్యేకత ఉంది. చలికాలంలో వెచ్చగాను, వేసవికాలంలో చల్లగాను ఉంటుంది ఇక్కడి నీరు. అంతేకాదు, లోపల నీటిమట్టం ఎప్పుడూ ఒకే రకమైన స్థిర పరిమాణంలో ఉండటం మరో ప్రత్యేకత. ప్రతి ఏటా తొలి ఏకాదశినాడు జరిగే బిలమహోత్సవానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు.

చారిత్ర‌క నేప‌థ్యం..

చారిత్ర‌క నేప‌థ్యం..

పల్నాటి యుద్ధం ముగిసిన తర్వాత బ్రహ్మనాయుడు తన చివరి రోజులు ఇక్కడే గడిపాడని చెబుతున్నారు. బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఆయుధం పురావస్తువారి అన్వేషణలో లభించగా, దానిని హైదరాబాదు పురావస్తుశాలలో పదిల పరిచారట! ఈ బిలంలో ఒక్కొక్క సొరంగం ఒక్కొక్క జల ప్రాంతానికి దారితీస్తుంది. నూటొక్క సొరంగాలున్న ప్రాంతం రహస్యాలకు కేంద్రబిందువుగా చెప్పారు. ఇన్ని రహస్యాలు ఇమిడి ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా మరింత ప్రాచుర్యం కల్పించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అన్నట్టు, ఇక్కడికి వెళ్లే పర్యాటకులు, తమ వెంట టార్చ‌లైట్లు తీసుకువెళ్ళడం మంచిది. అలాగే, ఇక్కడ రోజూ ఆలయ పర్యవేక్షణలో ఉచిత భోజన సదుపాయం ఉంది. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు బిలంలోకి వెళ్లే సాహసం చేయకపోవడమే మంచిది. సొంతవాహనాల్లో వెళితే మంచిది. లేకుంటే, సాయంత్రం కాకముందే తిరుగు ప్రయాణం అవ్వాలి. మరెందుకు ఆలస్యం మీ అడ్వంచర్ టూర్ మొదలు పెట్టండి!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X