» »మండు - విహార యాత్రకు చక్కటి ప్రదేశం !

మండు - విహార యాత్రకు చక్కటి ప్రదేశం !

Written By:

మండు , మాండవ్ ఘర్ లేదా శాదియాబాద్, అంటే ఒక ఆనందాల భూమి. కాలంతో బాటు ప్రకృతి తెచ్చే అనేక పెను ముప్పులకు ఈ పట్టణం ఎంతో నష్ట పోయింది. అయినప్పటికీ మండు టూరిజం విహారాన్ని అందిస్తోంది. సాంప్రదాయక మాల్వా ఆహారాలు దాల్ బాత్ మరియు టూరిజం శాఖ నిర్వహించే మాల్పువా మాల్వా ఉత్సవాలు వంటివి అన్నీ కలసి, పర్యాటకులకు ఒక చక్కని సెలవుల విహార యాత్రని అందిస్తోంది.

ఉజ్జయిని అసంఖ్యాక పౌరాణిక కథల సంగమ ప్రదేశం !

మండు పట్టణం చాలా వరకు చరిత్ర ప్రసిద్ధ ప్రకృతి ప్రదేశాలు కలిగి వుంటుంది. టవున్ యొక్క గోడలు అద్భుత శిల్ప శైలి కలిగి వుంటాయి. ఎన్నో మసీదులు,మహళ్ళు అన్నీ కూడా గత చరిత్రను పునరుద్ధరిస్తాయి. ఇక్కడ చూడవలసిన వాటిలో రూపమతి మహల్, అద్భుత దర్వాజాలు, కోట యొక్క గేటు లు,తాజ్ మహల్ వలే మార్బుల్ తో నిండిన హోశాంగ్ టూమ్బ్ మొదలైనవి.

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన ఆకర్షణలు...సంక్షిప్తంగా!!

చరిత్ర లోకి వెళితే, ఇపుడు కనపడే ప్రతి ప్రదేశాన్ని చూసి ఆనాటి పాలకుల కళాత్మక దృష్టి ని అభినన్దించవచ్చు. ఒకప్పుడు మండు ఆఫ్ఘన్ పాలకుడైన దిలావార్ ఖాన్ పాలించిన చిన్న రాజ్యం. దిల్వార్ ఖాన్ కుమారుడైన హోశాంగ్ షా దీనిని బాగా అభివృద్ధి చెసాడు. అయితే అక్బర్ దీని రాజు బాజ్ బహాదోర్ ను ఓడించి తన మొగల్ రాజ్యం లో మరో మారు మరాఠాలు 1732 లో దీనిని జయైన్చేతంత వరకూ వుంచుకున్నాడు.

అటవీ అందాలకు నిలయం ... పెంచ్ నేషనల్ పార్క్ !

బాజ్ బహదూర్ మహల్

బాజ్ బహదూర్ మహల్

క్రీ.శ. 16 వ శతాబ్దానికి చెందిన ఈ మహల్ పెద్ద ప్రాంగణాన్ని కలిగి ఉంటుంది. సభా భవనాలు, అనేక టెర్రస్ కలిగి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఇక్కడ గల తోటలలో విహరిస్తూ, ఆనాటి కాలపు కళలను గుర్తుకు తెచ్చుకుంటూ మహల్ ను చుట్టిరావచ్చు.

చిత్రకృప : Abhishek727

చౌబీస్ కంబా మందిరం

చౌబీస్ కంబా మందిరం

నేటికీ శిల్ప సంపదలో అద్భుతంగా చెప్పబడే ఈ మందిరం క్రీ.శ. 10 వ శతాబ్దం నాటిది. ఈ టెంపుల్ యొక్క ప్రవేశ ద్వారం అద్భుతం. మహాలయ మరియు మహామాయ అనే ఇద్దరు దేవతలు గల శిల్పాలు గుడిని కాపాడే దేవతలుగా ఉన్నారు.

చిత్రకృప : Bernard Gagnon

దర్వాజాలు

దర్వాజాలు

దర్వాజా అంటే తలుపు లేదా ద్వారం లేదా మార్గం. ఈ దర్వాజాలు నగరం యొక్క ప్రవేశ ద్వారాలు. నగరం చుట్టూ 12 వరకు దర్వాజాలు ఉన్నాయి. భారతదేశంలో అతి బలంగా నిర్మించబడిన నగరాలలో మండు ఒకటి. అన్నింటిలో 'ఢిల్లీ దర్వాజా' ప్రత్యేకం మరియు ఇదే నగరానికి ప్రవేశ మార్గం. మిగితా ద్వారాలు ఆనాటి శిల్పశైలికి అద్దం పడతాయి.

చిత్రకృప : Sayantan07

లోహాని గుహలు

లోహాని గుహలు

లోహాని గుహలు మరియు దేవాలయం శిల్పశైలికి భిన్నంగా ఉంటుంది. ఇవి కొండలలో తొలచిన చిన్న గుహలు. గుహలను శైవ సిద్ధులు తమ నివాసాలుగా ఉపయోగించేవారు. హిందూ మతానికి చెందిన విగ్రహాలు గుహలో ఉండేవని, ప్రస్తుతం వాటిని తొలగించారని చెబుతారు.

చిత్రకృప : Varun Shiv Kapur

జామా మసీద్

జామా మసీద్

జామా మసీద్ ను ఘోరీ వంశీయులు క్రీ.శ. 14 వ శతాబ్దంలో నిర్మించారు. చక్కని కానీ నడక మార్గాలు, స్తంభాలతో ఈ ప్రార్ధనా మందిరం ప్రశాంతతను అందిస్తూ చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. మసీద్ పస్థూన్ శిల్పశైలిలో నిర్మించారు.

చిత్రకృప : Intekhab0731

జహాజ్ మహల్

జహాజ్ మహల్

జహాజ్ మహల్ ఒక అద్భుత నిర్మాణం. దీనిని రెండు సరస్సుల మధ్య నిర్మించారు. దీని నిర్మాణం 'షిప్' ఆకారాన్ని కలిగి ఉంటుంది కనుక షిప్ మహల్ అని కూడా పిలుస్తారు. దీనిని ఖిల్జీ పాలకులు నిర్మించారు. కాలువలు, వాటర్ ఫౌంటెన్ లు, ఆర్చీలు మొదలైనవి తప్పక చూడదగ్గవి.

చిత్రకృప : Skjain2007

భర్తృహరి గుహలు

భర్తృహరి గుహలు

భర్తృహరి విజ్ఞానవంతుడు మరియు పండితుడు. ఇతను రాజు విక్రమాదిత్యుని సవతి తమ్ముడు. రాజవంశంలో పుట్టిపెరిగిన భర్తృహరి రాజభోగాలు, విలాసాలు ఒట్టి మాయ అని తెలుసుకొని వాటన్నింటినీ వదిలి జ్ఞానోదయానికి మార్గం వెతికాడు. ఈ గుహలలో ధ్యానం చేస్తూ కాలం గడిపాడు కనుకనే భర్తృ గుహలుగా పేరుగాంచాయి.

చిత్రకృప : Varun Shiv Kapur

రూపమతి పావిలియన్

రూపమతి పావిలియన్

ఈ ప్యాలెస్ ప్రేమకు చిహ్నం. రాణి రూపమతి మరియు బాజ్ బహదూర్ ల ప్రేమకథ కు సంబంధించినది ఈ ప్రదేశం. ఇక్కడి నుండి రూపమతి ప్రియుడి భవనాన్ని, నర్మదానది అందాలను చూసి మురిసిపోయేదని చెబుతారు. ప్యాలెస్ వద్ద ఒక కో పాయింట్ ఉంది. అక్కడి నుండి అద్భుత సూర్యాస్తమయాలు, సూర్యోదయాలను తిలకించవచ్చు.

చిత్రకృప : Abhishek727

బాఘ్ గుహలు

బాఘ్ గుహలు

బౌద్ధ ఆశ్రమాలుగా సేవలందిస్తున్న ఈ తొమ్మిది గుహలను మండు లో తప్పక సందర్శించాలి. ఈ గుహలు క్రీ. శ 4-7 వ శతాబ్దానికి చెందినవి. ఇవి సహజంగా ఏర్పడినవి కావు. మానవ నిర్మితాలు. ఇంచుమించు అజంతా గుహలను పోలి ఉంటాయి.

చిత్రకృప : Nikhil2789

చ్చప్పన్ మహల్

చ్చప్పన్ మహల్

ఈ మ్యూజియంలో గిరిజన కళలు, పురాతన శిల్పకళాఖండాలకు చెందిన వస్తువులను ప్రదర్శిస్తుంటారు. నాటి కాలంలో మనుషులు ఎలా ఉండేవారో, వారి జీవన విధానం ఎలా ఉండేదో ఆడియో, విజువల్ ఎఫెక్ట్స్ తో మ్యూజియంలో ప్రదర్శిస్తారు.

చిత్రకృప : Abhishek727

మహాల్

మహాల్

డాయ్ కా మహల్, డాయ్ కి ఛోటి బెహన్ కా మహల్ లు పట్టణంలో పర్యాటక ఆకర్షణ కేంద్రాలుగా ఉన్నాయి. కాలంతో పాటు నాశనమవకుండా ఇంకా జీవం ఉట్టిపడుతున్న ఈ స్మారక భవనాలు సాక్ష్యాలుగా ఉన్నాయి.

చిత్రకృప :Varun Shiv Kapur

దర్యా ఖాన్ టూంబ్

దర్యా ఖాన్ టూంబ్

మండు లో దర్యా ఖాన్ టూంబ్ సందర్శించదగ్గది. దీనిని తాజ్ మహల్ ను గుర్తుకుతెచ్చేటట్లు నిర్మించారు.

చిత్రకృప : Varun Shiv Kapur

హిందోళ మహల్

హిందోళ మహల్

మండు రాజ వంశాలు కట్టించిన మహల్ లలో హిందోళ మహల్ ఒకటి. రాజులకు ఇది ఒక దర్బార్ మహల్ గా సేవలు అందించింది. మహల్ వరంగల్ కోట ను గుర్తుకు తెస్తుంది.

చిత్రకృప : Abutorsam007

హోషంగ్ సమాధి

హోషంగ్ సమాధి

హోషంగ్ సమాధిని మార్బుల్ రాతిపలకతో నిర్మించారు. దీని నిర్మాణం ఆఫ్ఘన్ నిర్మాణ శైలిలో ఉంటుంది. భారతదేశంలో ఆఫ్ఘన్ రీతిలో నిర్మించిన అతికొద్ది సమాధులలో ఇది ఒకటి.

చిత్రకృప : Varun Shiv Kapur

మాలిక్ ముఘీస్ మస్జీద్

మాలిక్ ముఘీస్ మస్జీద్

మాలిక్ ముఘీస్ మస్జీద్ మందులో పురాతన మసీదు లలో ఒకటి. దీనిని క్రీ.శ. 1432 లో ముస్లిం రాజుల దండయాత్రకు వచ్చినప్పుడు కట్టించారు. శుక్రవారాలలో, పండుగ పర్వదినాల్లో ముస్లిం లు అధిక సంఖ్యలో ప్రార్థనలు చేస్తుంటారు.

చిత్రకృప : Intekhab0731

శ్రీ మందవగర్హ్ తీర్థ్

శ్రీ మందవగర్హ్ తీర్థ్

ఈ తీర్థం మండు ఊరి పోరిమేరల్లోనే కలదు. ఈ తీర్థం మహిమ కలదని భక్తుల విశ్వాసం. భక్తులు స్నానాలు ఆచరించి సమీపంలోని దేవాలయాన్ని సందర్శిస్తారు.

చిత్రకృప : sheetal saini

రూపాయాన్ మ్యూజియం

రూపాయాన్ మ్యూజియం

ఈ మ్యూజియం లో సైన్స్, క్రాఫ్ట్స్, ఆర్ట్స్ మరియు చరిత్ర, విప్లవాలకు సంబంధించిన అంశాలతో ముడిపడివున్న పరికరాలను, వస్తువులను ప్రదర్శిస్తుంటారు.

చిత్రకృప : Ashley Van Haeften

రేవా కుండ్

రేవా కుండ్

రేవా కుండ్ ఒక స్మారకం. రూపమతి ప్రియుడైన బజ్ బహదూర్ ఈ సరస్సును నిర్మించాడు. ఈ సరస్సు నుండి నీరు రూపమతి మహల్ కు వెళ్ళేది.

చిత్రకృప : Bernard Gagnon

మండు ఎలా చేరుకోవాలి ?

మండు ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : సమీపాన ఇండోర్ ఎయిర్పోర్ట్ 100 KM ల దూరంలో కలదు. ఢిల్లీ, జైపూర్ తదితర నగరాల నుండి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీలలో ఎక్కి మండు చేరుకోవచ్చు.

రైలు మార్గం : రట్లం సమీప రైల్వే స్టేషన్. ఇది మండు నుండి 140 కి.మీ ల దూరంలో కలదు. బస్సు లేదా టాక్సీ లలో ఎక్కి మండు చేరుకోవచ్చు.

బస్సు లేదా రోడ్డు మార్గం : ఇండోర్, భోపాల్ మరియు సమీప ప్రాంతాల నుండి స్థానిక బస్సులలో ఎక్కి మండు వెళ్ళవచ్చు.

చిత్రకృప : Bernard Gagnon

Please Wait while comments are loading...