Search
  • Follow NativePlanet
Share
» »మరారికులం ఒక అందమైన బీచ్ విహార కేంద్రం !

మరారికులం ఒక అందమైన బీచ్ విహార కేంద్రం !

By Mohammad

మరారికులం ... అల్లెప్పి లేదా అలప్పూజా గా పిలువబడే కేరళలోని ఒక అందమైన జిల్లాకు చెందినది. మరారికులం ఒక అందమైన బీచ్ విహార కేంద్రం , బంగారు వన్నె గల ఇసుకకు ప్రసిద్ధి చెందినది. అరేబియా సముద్రానికి ఒడ్డున ఉన్న మరారికులం గ్రామం ఆలెప్పి పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉండి, 26 నిమిషాలలో చేరుకొనే విధంగా ఉంటుంది.

మరారికులం మలబార్ తీరాన ఉన్న అందమైన గ్రామం. ఈ గ్రామం విశ్రాంతి తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. స్థానిక మత్స్యకారులతో పడవల్లో సముద్రంలోనికి వెళ్ళి చేపలు పట్టటం చూసి ఆనందించవచ్చు. అవసరమైతే మీరు కూడా ఒక చేయి వేసి చేపలు పట్టవచ్చు. యోగ, ధ్యానం, వలల అల్లకం, ఆయుర్వేద చికిత్స వంటివి ఇక్కడ కలవు.

ఇది కూడా చదవండి : కేరళ హౌస్ బోట్ ఆనందాలు !

సందర్శనీయ స్థలాలు !

మరారికులం లో పర్యటించవలసిన ప్రదేశాలు కంచికుంగ్లార దేవాలయం, కొక్కమంగళం చర్చి, శివాలయం, అర్థుంకల్ చర్చి మొదలగునవి చూడవచ్చు. అరేబియా సముద్రం ఒడ్డున వెళ్ళి బీచ్ లలో కూర్చొని సాయంత్రంవేళ సూర్యాస్తమ దృశ్యాలను చూస్తూ గడపవచ్చు. ఆహార ప్రియుల విషయానికి వస్తే సముద్రపు ఆహారాలను (చేపలు, రొయ్యలు, పీతలు వంటివి) రుచి చూడవచ్చు.

మరారికులం బీచ్

మరారికులం బీచ్

మరారికులం బీచ్ గురించి చుట్టూప్రక్కల ప్రాంతాల వారికి తప్ప మిగితావారికి తెలీదు అందుకే ఈ బీచ్ పరిసరాలు ఎంతో పరిశుభ్రంగా ఉంటాయి. ఈ బీచ్ కి అందం ఇక్కడ గల తాటి చెట్ల వరుస.

చిత్ర కృప : A Girl Called Jaya

మరారికులం బీచ్

మరారికులం బీచ్

ఈ బీచ్ లో మీరు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు, తెల్లని ఇసుక తిన్నెల స్పర్శ మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఆయుర్వేద చికిత్స అవసరమనుకుంటే పొందవచ్చు. బీచ్ వద్ద వాలీబాల్, పారా సెయిలింగ్, స్విమ్మింగ్ మొదలగు ఆటలను ఆడవచ్చు.

చిత్ర కృప : MYSTIKAL HOLIDAYS

అర్థుంకల్ బీచ్

అర్థుంకల్ బీచ్

అర్థుంకల్ బీచ్ ప్రభుత్వ పర్యాటక స్థలంగా గుర్తించబడింది. ఇది కూడా సముద్రం ఒడ్డున ఒంటరి ప్రశాంత మనస్సు తో గడపాలనుకొనేవారికి బాగుంటుంది. బీచ్ ఒడ్డున కూర్చొని సాయంత్రంవేళ అస్తమించే సూర్యున్ని చూడటానికి యాత్రికులు చాలా మంది వస్తుంటారు. ఇక్కడ కూడా సముద్రపు ఆహారాలతో పాటు చికెన్ లభ్యమవుతుంది.

చిత్ర కృప : MYSTIKAL HOLIDAYS

అర్థుంకల్ చర్చి

అర్థుంకల్ చర్చి

అర్థుంకల్ చర్చి అర్థుంకాల్ గ్రామంలో కలదు. ఈ గ్రామం మరారికులం గ్రామం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉండి, 15 నిమిషాల్లో చేరుకొనే విధంగా అలాగే ఆలెప్పి నుండి 20కి.మీ దూరంలో ఉండి, 38 నిమిషాల్లో చేరుకొనే విధంగా ఉంటుంది. దీనిని పోర్చుగీసు వారు క్రీ.శ. 16 వ శతాబ్ధంలో నిర్మించినారు.

చిత్ర కృప : shashi kallada

కొక్కమంగళం చర్చి

కొక్కమంగళం చర్చి

కొక్కమంగళం చర్చి తుంపోలీ లో కలదు. ఇది మరారికులం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉండి, 20 నిమిషాల్లోపు చేరుకొనే విధంగా ఉంటుంది. ఈ చర్చి లో వర్జిన్ మేరీ విగ్రహం ఉన్నది. గొప్ప యాత్రా స్థలాల్లో ఈ చర్చి ఒకటి.

చిత్ర కృప : Tony Leon

మరారి కులం చుట్టుప్రక్కల గల ఆలయాలు

మరారి కులం చుట్టుప్రక్కల గల ఆలయాలు

మరారికులం సమీపాన శివాలయం, అరూర్, అరుధంకాలన్, పూచ్ఛక్కాల్, పానావలీ, వెలోర్ వట్టం లు ఇతర ఆకర్షణలు గా ఉన్నాయి. ఆలాగే కంచి కుంగ్లార అనే మరో ప్రసిద్ధ దేవాలయం, చెర్తాల కార్తియేని దేవాయం కూడా సమీపాన ఉన్నాయి.

చిత్ర కృప : FabIndia

మరారికులం ఎలా చేరుకోవాలి ?

మరారికులం ఎలా చేరుకోవాలి ?

మరారికులం చేరుకోవటానికి విమాన, రైలు మరియు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

మరారికులం సమీపాన ఉన్న విమానాశ్రయం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 70 కిలోమీటర్ల దూరంలో కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ప్రవేట్ వాహనాల ద్వారా మరారికులం చేరుకోవచ్చు.

రైలు మార్గం

మరారికులం లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి కేరళలోని వివిధ ప్రాంతాలనుండి రైళ్ళు వస్తాయి. ఇది ఎర్నాకులం - అలప్పుజా రైలు మార్గంలో కలదు. మరారికులంకు మీకు నేరు ట్రైన్ లేకుంటే, సమీప రైలు స్టేషన్ లో దిగి మరారికులం రైలు స్టేషన్ కు చేరవచ్చు.

రోడ్డు మార్గం

మరారికులం గ్రామం సమీపాన జాతీయ రహదారి 47 వెళుతుంది. ఆలెప్పి, కొచ్చి, కుమారకొమ్ ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తాయి.

చిత్ర కృప : MYSTIKAL HOLIDAYS

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X