» »మన దేశంలో త్వరలో అదృశ్యం కానున్న ప్రదేశాలు ఏవేవో మీకు తెలుసా?

మన దేశంలో త్వరలో అదృశ్యం కానున్న ప్రదేశాలు ఏవేవో మీకు తెలుసా?

Written By: Venkatakarunasri

ఇండియా దానికి గల అందమైన పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి. ఎంతో మంది దేశీయ, విదేశీయ టూరిస్ట్ లను ఆకర్షిస్తోంది. ప్రతి పర్యాటకుడికి ప్రపంచంలో ఇండియా తప్పక చూడదగిన ప్రదేశం. అయితే, పట్టణీకరణ పెరగటం మరియు మానవుడు ప్రకృతి పట్ల చూపుతున్న అనేక దౌర్జన్యా చర్యల కారణంగా అంటే, కాలుష్యం, అడవులు నరుకుట మొదలైన వాటి కారణం గా కొన్ని అందమైన ప్రదేశాలు, అంతం అయ్యే చివరి దశలో వున్నాయి. ఆ రకంగా ప్రకృతి లో త్వరలో అంతరించి పోగల కొన్ని అందమైన ప్రదేశాలను మీకు అందిస్తున్నాము. త్వరలో పర్యటించి ఆనందించండి.

ఉత్తరాఖండ్ లోని మున్షి యారి

ఉత్తరాఖండ్ లోని మున్షి యారి

మున్షి యారి ప్రదేశం ఒక అందమైన హిల్ స్టేషన్ హిమాలయ పర్వత శ్రేణుల దిగువ భామ్లో కలదు. ఇది తప్పక చూడ దాగిన ప్రదేశం. దీనిని మున్సి యారి అని కూడా అంటారు.

pc: SudiptoDutta

జనస్కార్ వాలీ , జమ్మూ & కాశ్మీర్

జనస్కార్ వాలీ , జమ్మూ & కాశ్మీర్

జనస్కార్ వాలీ ని అందరూ వర్జిన్ వాలీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం ఇండియాలో ఎవరూ అన్వేషించని ప్రదేశం మరియు జమ్మూ & కాశ్మీర్ లో ఒక మంచి పర్యాటక ప్రదేశం. ఇది కార్గిల్ జిల్లా లో కలదు.

pc:Corto Maltese 1999

జనస్కార్ వాలీ , జమ్మూ & కాశ్మీర్

జనస్కార్ వాలీ , జమ్మూ & కాశ్మీర్

సంవత్సరంలో చాలా భాగం ఈ వాలీ పూర్తిగా మంచుచే కప్పబడి వుంటుంది. కనుక దీనిని చూడాలంటే మే నెల మధ్య భాగం నుండి అక్టోబర్ నెల మధ్య భాగం వరకు సౌకర్యం.

pc: hamon jp

జనస్కార్ వాలీ , జమ్మూ & కాశ్మీర్

జనస్కార్ వాలీ , జమ్మూ & కాశ్మీర్

పర్యాటకులు సాధారణంగా ఈ ప్రదేశాన్ని వారి హెహ్ పర్యటనలో వయా శ్రీనగర్ చూస్తారు. ఈ ప్రదేశానికి గల రోడ్లు పూర్తిగా బురద మాయం గా వుండి డ్రైవింగ్ కు అనుకూలం కాదు.

pc: hamon jp

ఖురి ఇసుక దిన్నెలు, జైసల్మేర్

ఖురి ఇసుక దిన్నెలు, జైసల్మేర్

రాజస్తాన్ ఎడారులా అందాలు చూడాలంటే, జైసల్మేర్ కు సమీపంలో కల ఖురి ఇసుక దిన్నెల పై నుండి చూడాలి. ఇక్కడి ఇసుక దిన్నెలు ఇండియా లోనే ఉత్తమ పర్యాటక ప్రదేశంగా చెప్పవచ్చు. ఖురి విలేజ్ జైసల్మేర్ కు సుమారు 40 కి. మీ. ల దూరంలో కలదు.

pc: Last Emperor

ఖురి ఇసుక దిన్నెలు, జైసల్మేర్

ఖురి ఇసుక దిన్నెలు, జైసల్మేర్

ఈ ప్రదేశంలో టూరిస్ట్ లు కేమల్ సఫారి చేయవచ్చు. అలంకరించబడిన ఒంటెలు ఈ సఫారిలో పర్యాటకులను జైసల్మేర్ ఎదారులలోకి తీసుకు వెళతాయి.

pc: Shiva-Nataraja

ఖురి ఇసుక దిన్నెలు, జైసల్మేర్

ఖురి ఇసుక దిన్నెలు, జైసల్మేర్

ఖురి లొని నివాస గృహాలు మట్టి మరియు గడ్డి పోచాలతో నిర్మించబడి వుంటాయి. ఇవి అక్కడి ఎదారులకు మరింత శోభను ఇస్తాయి. ఇక్కడి కెంప్ ఫైర్ లు, కలబెలియా డాన్స్ లు ఆహ్లాదకర సాయంకాలాలను పర్యాటకులు అమితంగా ఆనందిస్తారు.

pc: Shiva-Nataraja

కచ్ లోని సాల్ట్ ఎడారి

కచ్ లోని సాల్ట్ ఎడారి

కచ్ లోని గ్రేటర్ రాన్ ప్రదేశంలో ప్రపంచంలోనే పెద్దదైన సాల్ట్ ఎడారి కలదు. అద్భుతమైన అందాలు కలిగి వుంటుంది. ఇక్కడి ఉప్పు కణికలు సూర్య రశ్మి పది వజ్రాలవలె మెరుస్తూ వుంటాయి. డెసర్ట్ అంతా ఒక అద్భుతంవలె వుంటుంది.

pc: Vinod Panicker

కచ్ లోని సాల్ట్ ఎడారి

కచ్ లోని సాల్ట్ ఎడారి

కచ్ లోని గ్రేటర్ రాన్ ప్రదేశంలో ప్రపంచంలోనే పెద్దదైన సాల్ట్ ఎడారి కలదు. అద్భుతమైన అందాలు కలిగి వుంటుంది. ఇక్కడి ఉప్పు కణికలు సూర్య రశ్మి పది వజ్రాలవలె మెరుస్తూ వుంటాయి. డెసర్ట్ అంతా ఒక అద్భుతంవలె వుంటుంది.

pc: Vinod Panicker

మహారాష్ట్ర లోని మాతేరాన్

మహారాష్ట్ర లోని మాతేరాన్

మాతేరాన్ ఒక అందమైన హిల్ స్టేషన్. అద్భుత ప్రకృతి దృశ్యాలు కలిగి వుల్న్తుంది. ఈ ప్రదేశం రాయ గడ జిల్లాలో కలదు. ఇండియాలో తప్పక చూడవలసిన ప్రదేశం.

pc: Nicholas

మాతేరాన్ , మహారాష్ట్ర

మాతేరాన్ , మహారాష్ట్ర

మాతేరాన్ హిల్ రైల్వే ఇండియా లోని ఆరు హిల్ రైల్వే లలో ఒకటి. ఈ ప్రదేశానికి వాహనాలు అనుమతించారు. దస్తూరి పాయింట్ తర్వాత కార్లు కూడా అనుమతించారు. దస్తూరి నుండి మాతేరాన్ కు నడక సాగించాలి.

pc: Nilesh.shintre

దూద్ సాగర్ జలపాతాలు, గోవా

దూద్ సాగర్ జలపాతాలు, గోవా

ఈ జలపాతాలు మీరు అనేక సినిమాలలో చూసే వుంటారు. చాలా అందమైనవిగా వుంది పాలు ప్రవహిస్తున్నాయా అనేలా వుంటాయి.

pc: Purshi

వెంబనాడ్ లేక్ , అల్లెప్పి

వెంబనాడ్ లేక్ , అల్లెప్పి

కేరళ రాష్ట్రంలోని అల్లెప్పి లో కల వెంబనాడ్ లేక్ ఇండియా లో తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశంలో బ్యాక్ వాటర్స్ అందాలు అద్భుతంగా వుంటాయి.

pc: Sivavkm

పగడపు దీవులు, లక్ష ద్వీప్

పగడపు దీవులు, లక్ష ద్వీప్

మీరు ప్రకృతి ప్రియులు అయినట్లయితే లక్ష ద్వీప్ దీవులలో ని నీటి కింద గల కోరల్ రీఫ్ లను అన్వేషించాలి. ఎంతో అడ్వెంచర్ గా వుంటుంది.

pc: U.S. Fish & Wildlife Service

ధనుష్కోడి బీచ్ , రామేశ్వరం

ధనుష్కోడి బీచ్ , రామేశ్వరం

ధనుష్కోడి తమిళ్ నాడు లోని ఒక చిన్న గ్రామం. అక్కడ కల అందమైన బీచ్ కు అది ప్రసిద్ధి. ఈ బీచ్ లో స్నానం ఆచరిస్తే, పాపాలు పోతాయని కూడా నమ్ముతారు.

pc:Nsmohan

ది షోలా గ్రాస్ లాండ్స్ , నీలగిరి

ది షోలా గ్రాస్ లాండ్స్ , నీలగిరి

నీలగిరులలోని అతి ఎత్తైన ప్రదేశంలో ఈ గడ్డి భూములు కలవు. ఇండియా లో ఈ ప్రదేశం ఎంతో బెస్ట్ కనుక తప్పక చూడాలి. ఈ షోలా గ్రాస్ లాండ్స్ దక్షిణ ఇండియా లోని ఈ పర్వత ప్రాంతాలలో మాత్రమే కలవు.

pc: Karunakar Rayker

ఓడిశా లోని భీత కానిక తడి భూములు

ఓడిశా లోని భీత కానిక తడి భూములు

ఓడిశా లోని చాందిపూర్ నుండి భీత కానిక ప్రదేశం సుమారు 206 కి. మీ. లు వుంటుంది. ఈ వెట్ లాండ్స్ కు వెళ్ళాలంటే, ఖోలా నుండి దంగ్మల్ కు ఒక బోటు లో ప్రయాణించ వలసి వుంటుంది. భీతార్ కానిక ఫారెస్ట్ అధికారులనుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ ప్రదేశం దాని అద్భుత అందాలకు ప్రసిద్ధి.

pc: S K Nanda

కరెం లియాట్ ప్రహ కేవ్ , మేఘాలయ

కరెం లియాట్ ప్రహ కేవ్ , మేఘాలయ

మేఘాలయ లో అనేక గుహలు కలవు. వాటిలో కొన్నెఇ పొడవైనవి, లోతైనవిగా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కాయి. ఇండియా లో పొడవైన సహజ గుహలైన కరెం లియాట్ ప్రహ గుహను మీరు జైంతియా ప్రదేశంలో చూడవచ్చు.

pc: Dave Bunnell

గాంజెస్ - బ్రహ్మపుత్ర డెల్టా , వెస్ట్ బెంగాల్

గాంజెస్ - బ్రహ్మపుత్ర డెల్టా , వెస్ట్ బెంగాల్

ది గాంజెస్ - బ్రహ్మపుత్ర డెల్టా వెస్ట్ బెంగాల్ లోని సి పోర్ట్ హాల్దియా లో కలదు. ఇది ప్రపంచంలోనే పెద్ద డెల్టా గా ప్రసిద్ధి చెందినది. దీనినే గ్రీన్ డెల్టా లేదా సుందర్బన్స్ డెల్టా అని కూడా అంటారు.

pc: bri vos

మాజులి రివర్ ఐలాండ్

మాజులి రివర్ ఐలాండ్

మాజులి ఒక నదీ ద్వీపం. ఇది అస్సాం లో కలదు. సుందరమైన ఈ ప్రదేశం ప్రపంచంలోనే అతి పెద్ద నది ద్వీపంగా చెప్పబడుతుంది. ఇప్పటికి ఈ నది సైజు బాగా తగ్గి పోయింది. కారణం పట్టణీకరణ .

pc: Kalai Sukanta

 కన్హా నేషనల్ పార్క్, మధ్య ప్రదేశ్

కన్హా నేషనల్ పార్క్, మధ్య ప్రదేశ్

కన్హా నేషనల్ పార్క్ మధ్య ప్రదేశ్ లో కలదు. ఈ పార్క్ కు ఇండియా లోని అన్ని నేషనల్ పార్క్ ల కంటే, టూరిస్ట్ లు అధిక సంఖ్యలో వస్తారు. ఇది మధ్య ప్రదేశ్ లోని బాలాఘాట్ - మండ్లా జ్లిల్లాలలో వ్యాపించింది వుంది.

pc: Honzasoukup

అంత కన్హా నేషనల్ పర్క్ల్, మధ్య ప్రదేశ్

అంత కన్హా నేషనల్ పర్క్ల్, మధ్య ప్రదేశ్

కన్హా నేషనల్ పార్క్, అక్కడ కల దట్టమైన వెదురు తోపులకు ప్రసిద్ధి. పచ్చిక బయళ్ళు కూడా ప్రసిద్ధి. అంతేకాక ఇండియా లో ఇది ఒక మంచి టైగర్ రిజర్వు కూడ ను.

pc: Dey.sandip