Search
  • Follow NativePlanet
Share
» »జోగ్ ఫాల్స్ - చరిత్రకెక్కిన జలపాతాలు !

జోగ్ ఫాల్స్ - చరిత్రకెక్కిన జలపాతాలు !

రానున్నది ఎండాకాలం కనుక విహార యాత్రలకు ప్లాన్ చేసుకొనేవారు తప్పనిసరిగా జలపాతం ఉండాలని కోరుకుంటారు. మరి అంతగా జలపాతాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే ... దానికి సరైన సమాధానం పశ్చిమ కనుమలు.

By Mohammad

రానున్నది ఎండాకాలం కనుక విహార యాత్రలకు ప్లాన్ చేసుకొనేవారు తప్పనిసరిగా జలపాతం ఉండాలని కోరుకుంటారు. మరి అంతగా జలపాతాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే ... దానికి సరైన సమాధానం పశ్చిమ కనుమలు.

పశ్చిమ కనుమలు మన తూర్పు కనుమల కంటే దట్టంగా ఉంటాయి. పర్వతాలు, లోయలు, కొండలు, అడవులు, జలపాతాలు, నదులు ఇలా ఒకటేమిటి ... ఎన్నెన్నో ప్రకృతి పులకింతల్ని, అందాల్ని పశ్చిమ కనుమల్లో చూడవచ్చు, చూసి ఆనందించవచ్చు ..!

ఇది కూడా చదవండి : షిమోగా - అబ్బుర పరిచే అందాల హరివిల్లు !

పశ్చిమ కనుమల్లో అతి ఎత్తైన జలపాతం 'జోగ్ జలపాతం'. సుమారు 830 అడుగుల ఎత్తు నుండి ఓంపుసొంపులతో కిందకు పడే నీటి ధారలు పర్యాటకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఈ జలపాతం శరావతి నది నుండి ఉద్భవించి రాజ, రాణి, రోరర్ మరియు రాకెట్ అనే నాలుగు పాయలుగా చీలి కిందకు దూకుతుంది.

జోగ్ ఫాల్స్ చుట్టూ పచ్చని తీవాచీ పరిచినట్లుండే పరిసరాలు అధికంగా ఉంటాయి. ఇవే జలపాతానికి ప్లస్ పాయింట్. జలపాత అందాలను తనివితీరా ఆనందించాలంటే, అక్కడి అనేక ప్రదేశాల నుండి చూస్తూ ఆనందించవచ్చు. ఇక ఆలస్యం చేయటం ఎందుకు ? వెంటనే లగేజి సర్దుకొని అక్కడికి వాలిపోదాం పదండి ..! అక్కడికి ఎలా వెళ్ళాలో ? ఏమేమి చూడాలో ఒకసారి పరిశీలిస్తే ..

జోగ్ ఫాల్స్ ఎలా చేరుకోవాలి ?

జోగ్ ఫాల్స్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం - జోగ్ ఫాల్స్ కు 130 కి. మీ. దూరంలో హుబ్లి దేశీయ విమానాశ్రయం, 135 కి. మీ. దూరంలో మంగళూరు దేశీయ విమానాశ్రయం, 340 కి. మీ దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.

చిత్ర కృప : Veeresh Malik

జోగ్ ఫాల్స్ ఎలా చేరుకోవాలి ?

జోగ్ ఫాల్స్ ఎలా చేరుకోవాలి ?

రైలు మార్గం - జోగ్ జలపాతానికి 30 కి. మీ. దూరంలో తలగుప్ప, సాగర రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. ప్రధాన రైల్వే స్టేషన్ షిమోగా 100 కి. మీ. దూరంలో ఉన్నది.

చిత్ర కృప : Sathish V J

జోగ్ ఫాల్స్ ఎలా చేరుకోవాలి ?

జోగ్ ఫాల్స్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం / బస్సు మార్గం - జోగ్ ఫాల్స్ కు షిమోగా, బెంగళూరు నుండి ప్రభుత్వ మరియు ప్రవేట్ బస్సుల సౌకర్యం ఉన్నది. ఫాల్స్ కు సమీపాన సాగర్ బస్ స్టేషన్ కలదు. రోడ్డు మార్గాన బెంగళూరు నుంచి షిమోగా వయా సాగర్ మీదుగా 375 కి. మీ. దూరం ప్రయాణించి జోగ్ ఫాల్స్ చేరుకోవచ్చు.

చిత్ర కృప : Gowreesh Kapani

జోగ్ జలపాతం

జోగ్ జలపాతం

దక్షిణ భారతదేశంలో, పశ్చిమ కనుమల్లో ఎత్తైన జలపాతంగా ప్రసిద్ధి చెందిన జోగ్ జలపాతం, కర్నాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లా సాగర్ తాలూకా లో ఉన్నది.

చిత్ర కృప : Lalit K Roul

జోగ్ జలపాతం

జోగ్ జలపాతం

శరావతి నదిపైనుండి పుట్టుకొచ్చిన ఈ జలపాతం, 830 అడుగుల ఎత్తు నుండి కింద పడుతూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. 'గేరు సొప్ప', 'జోగాడ గుండి' అనేవి ఈ ఫాల్స్ కు గల ఇతర పేర్లు.

చిత్ర కృప : Vmjmalali

జోగ్ జలపాతం

జోగ్ జలపాతం

జోగ్ ఫాల్స్ (శరావతి నది) పై నుండి నాలుగు పాయలుగా చీలి కిందకు పడే తీరు చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ నాలుగు పాయలకు గల పేర్లు రాజ, రోరర్, రాకెట్ మరియు రాణి.

చిత్ర కృప : VINAYAK NAIK

పాయల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ..!

పాయల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ..!

రాజ - ఈ పాయ చాలా నిర్మలంగా, సౌమ్యంగా కిందకు దూకుతుంది.
రాణి - వాయారాలు, వంపులు చేస్తూ ... పై నుండి కిందకు పడుతుంది
రో రర్ - ఈ పాయ పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నుండి భీకర శబ్ధాలు చేస్తూ కిందకు పడుతుంది
రాకెట్ - అత్యంత వేగంతో, సన్నటి నీటి ధారగా మారి కిందకు చేరుకుంటుంది

చిత్ర కృప :Thangaraj Kumaravel

వాట్ కిన్స్ ప్లాట్ ఫాం

వాట్ కిన్స్ ప్లాట్ ఫాం

ఇంతెత్తులో ఉన్న జలపాతాన్ని చూడాలంటే మనవల్ల కాదు అందుకే కర్నాటక పర్యాటక శాఖ వారు ఒక వ్యూ పాయింట్ ను కట్టించినారు. అదే వాట్ కిన్స్ ప్లాట్ ఫాం.

చిత్ర కృప : Abhijith Rao

వాట్ కిన్స్ ప్లాట్ ఫాం

వాట్ కిన్స్ ప్లాట్ ఫాం

ఈ ప్లాట్ ఫాం నుండి జలపాతం మొత్తాన్ని వీక్షించవచ్చు. ఈ వ్యూ పాయింట్ వద్దకు చేరుకోవాలంటే 1400 మెట్లు దిగాలి. ఇక్కడి నుంచి చూస్తే మీకు నింగి, నేల ఇవేమీ కనిపించవు ... కనిపించేదంతా జలధారలే! బాంబే బంగ్లా ఈ జలపాతాన్ని చూడొచ్చు కానీ అంత లుక్ అనిపించదు.

చిత్ర కృప : Shuba

లేజర్ లైట్ షో లు

లేజర్ లైట్ షో లు

సాయంత్రంవేళ జలపాతం వద్ద లేజర్ లైట్ షో ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ షో లో ఆవిష్కారమవుతున్న జలపాతాన్ని చూస్తూ ... శాస్తీయ కర్నాటక సంగీత కచేరీ లను ఎంజాయ్ చేయవచ్చు.

చిత్ర కృప : Abhijith Rao

బోట్ ట్రిప్

బోట్ ట్రిప్

మీకు వీలుంటే శరావతి నది లో బోట్ లో షికారు చేయవచ్చు. ఇది ట్రిప్ కు అదనపు ఆకర్షణ.

చిత్ర కృప : Sreenath H B

హొన్నేమర్దు

హొన్నేమర్దు

హొన్నేమర్దు, జోగ్ ఫాల్స్ నుండి 20 కి. మీ. దూరంలో ఉంటుంది. సాహస క్రీడలు, నీటి క్రీడలు ఇష్టపడేవారికి ఈ ప్రదేశం బాగుంటుంది.

చిత్ర కృప : Sarthak Banerjee

హొన్నేమర్దు

హొన్నేమర్దు

హొన్నేమర్దు గ్రామం చూడటానికి రిజర్వాయర్ మధ్యలో ఒక చిన్న ద్వీపం వలె ఉంటుంది. హొన్నేమర్దు చూడకుండా పోతే జోగ్ ఫాల్స్ పర్యటన అస్సలు పూర్తికాదు.

చిత్ర కృప : Srinath.holla

సాహస క్రీడలు

సాహస క్రీడలు

రాప్టింగ్, స్విమ్మింగ్, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలను ఈ ద్వీపంలో ఆచరించవచ్చు. అందుకుగాను ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్, రిజర్వాయర్, అటవీ ప్రదేశాలు ఉన్నాయి. అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ రకరకాల పక్షులను వీక్షించవచ్చు.

చిత్ర కృప : Srinath Holla

గడిమనే

గడిమనే

హొన్నేమర్దు సమీపంలోని గడిమనే గ్రామం తప్పక సందర్శించాలి. ఈ గ్రామం చిత్తర ఆర్ట్ వర్క్ కి ప్రసిద్ధి చెందినది. గ్రామస్తులచే వేయబడిన అందమైన పెయింటింగ్ పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి. బియ్యం పౌడర్ మరియు అక్కడి అడవుల్లో లభించే వివిధ పండ్ల రసాలతో వీరు ఈ చిత్రాలను వేస్తారట ..!

చిత్ర కృప : jayaraj rv

సాగర

సాగర

సాగర, జోగ్ ఫాల్స్ కు సమీప బస్ స్టాండ్ (30 కి. మీ) మరియు పట్టణం కూడా. జలపాతాన్ని చేరుకోవాలంటే సాగర మీదుగానే ప్రయాణించాలి. సాగర నుండి బెంగళూరు, మంగళూరు వంటి ముఖ్య పట్టణాలకు బస్సు, రైలు సౌకర్యం కలదు.

చిత్ర కృప : Shyam k

సాగర

సాగర

సాగర దేవాలయాల పట్టణం. ఇక్కడ ఎన్నో దేవాలయాలను సందర్శించవచ్చు. పట్టణంలో మారికాంబ దేవాలయం, మహాగణపతి దేవాలయం, గణపతి సరస్సు చూడదగ్గవి. వీలుంటే ఊరికి సమీపంలోని ఇక్కేరి, కెలాడి గుళ్ళను కూడా దర్శించవచ్చు.

చిత్ర కృప : Vmjmalali

ఇక్కేరి

ఇక్కేరి

ఇక్కేరి, సాగర పట్టణం వద్ద ఉన్న చిన్న ఊరు. ఈ ఊరు అఘోరేశ్వర దేవాలయానికి ప్రసిద్ధి. ఈ దేవాలయ శిల్ప నైపుణ్యతలో వివిధ పాలకుల శిల్పకళా నైపుణ్యతలు కనిపిస్తాయి.

చిత్ర కృప : Pavithra Hanchagaiah

కెలాడి

కెలాడి

కెలాడి ఊరు కూడా సాగర పట్టణానికి సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ మ్యూజియం, పురాతన శివాలయం, వీరభధ్ర, పార్వతి మరియు రామేశ్వర దేవాలయాలు చూడదగ్గవి.

చిత్ర కృప : Omshivaprakash H L

కలాసి

కలాసి

కలాసి, సాగర పట్టణం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం సొరబ్ రోడ్డు ద్వారా జోగ్ ఫాల్స్ కు కలపబడింది. నీలకంఠేశ్వర, మల్లికార్జున దేవాలయాలు ఇక్కడ చూడదగ్గవి.

చిత్ర కృప : Kannan Sampath

సిగందూర్

సిగందూర్

సిగందూర్, సాగర కు చేరువలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా సాగర నుండి రోడ్డు మార్గం ద్వారా 29 కి. మీ. ప్రయాణించాలి. అక్కడి నుంచి ఒక కిలోమీటర్ పైన లాంచీ ప్రయాణం చేయాలి. మరళా అక్కడి నుంచి 3 - 4 కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా వెళితే గాని చేరుకోలేం.

చిత్ర కృప : v_k_b

సిగందూర్

సిగందూర్

సిగందూర్ లో దెవీమాత చౌడేశ్వరి దేవాలయం ఉంటుంది. సంక్రాంతి సమయంలో భక్తులు మాతను దర్శించుకొని జాతరలో పాల్గొంటారు. శరావతి నది బ్యాక్ వాటర్ మరియు పచ్చని చెట్లు ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణలు.

చిత్ర కృప : Photo Synthesis

వరదాపుర

వరదాపుర

వరదాపుర చేరుకోవాలంటే, పర్యాటకులు సాగర పట్టణానికి పొలిమేరలలో కల జోగ్ రోడ్ నుండి మలుపు తిరిగి 6 కి.మీ.ల దూరం ప్రయాణించాలి. ఇక్కడ శ్రీ శ్రీధరస్వామీజీ సమాధి, శ్రీధర స్వామి మఠం ఉంటుంది. శ్రీధర స్వామీజీ 20 వ శతాబ్దిలో పేరుగాంచిన స్వామీజీ. ఈ పట్టణాన్ని వరదహళ్ళి లేదా వడ్డాలి అని కూడా అంటారు.

చిత్ర కృప : Harshith JV

డబ్బే ఫాల్స్

డబ్బే ఫాల్స్

జోగ్ ఫాల్స్ నుండి భట్కల్ వెళ్ళే దారిలో, 35 కి. మీ. దూరంలో డబ్బే ఫాల్స్ కలదు. ఈ ఫాల్స్ అక్కడి సమీప పర్వతాల నుంచి పుడతాయి. అయితే ఇప్పటికీ చాలామంది పర్యాటకులు జోగ్ ఫాల్స్ వరకు వచ్చి చూస్తారే తప్ప ఈ ఫాల్స్ గురించి అస్సలు పట్టించుకోరు.

చిత్ర కృప : Madhav jois

డబ్బే ఫాల్స్

డబ్బే ఫాల్స్

డబ్బే ఫాల్స్ చూసిన వారు దాని అందానికి ముగ్ధులవకతప్పదు. ఇంకో విషయం, ఈ జలపాతాన్ని చూడటానికి కొద్ది మంది పర్యాటకులు మాత్రమే వస్తుంటారు కనుక మీ ప్రైవసీ కి ఎటువంటి ఢోకా ఉండదు.

చిత్ర కృప : Siddhartha Sen Choudhary

శరవతి వన్య ప్రాణుల అభయారణ్యం

శరవతి వన్య ప్రాణుల అభయారణ్యం

శరవతి వన్య ప్రాణుల అభయారణ్యం బెంగళూరు నుండి 350 కి. మీ. దూరంలో సాగర పట్టణ తాలూకాలో కలదు. జోగ్ ఫాల్స్ కు సమీపాన ఉన్న ఈ అభయారణ్యం పశ్చిమ కనుమల్లోని సుమారు 430 కి. మీ. లు విస్తరించిన శరావతి లోయ ప్రాంతంలో ఉన్నది. ఈ అభయారణ్యం గుండా శరావతి నది ప్రవహిస్తుంది.

చిత్ర కృప : Thangaraj Kumaravel

లింగనమక్కి డ్యామ్

లింగనమక్కి డ్యామ్

లింగనమక్కి డ్యామ్ ప్రదేశమంతా పచ్చని అడవులతో, లోయలతో నిండి ఉంటుంది. ఈ డ్యామ్ జోగ్ ఫాల్స్ కు 14 కి. మీ. దూరంలో కలదు. ఈ డ్యామ్ వద్ద ఫోటో లు నిషేధం.

చిత్ర కృప : sharath_911

లింగనమక్కి డ్యామ్

లింగనమక్కి డ్యామ్

లింగనమక్కి డ్యామ్ లోని నీళ్ళ కు, జోగ్ ఫాల్స్ కు సంబంధం ఉన్నది. ఈ డ్యామ్ లోని నీళ్ళను కిందకు వదిలితే అది జోగ్ ఫాల్స్ గా మారి పర్యాటకులను ఆకర్షిస్తుంది. సమీపంలో మహాత్మాగాంధీ జలవిద్యుత్ ప్రాజెక్ట్, హిరెబాస్కర డ్యామ్ చూదగ్గవి.

చిత్ర కృప : Vikas M

జోగ్ ఫాల్స్ - వినోదాలు

జోగ్ ఫాల్స్ - వినోదాలు

జోగ్ ఫాల్స్ వద్ద నిత్యం వివిద బాషల సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. రజినీ నటించిన 'లింగా', మళయాళ 'కుమ్‌కి', తెలుగు 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' తో పాటు ఎన్నో వందల సినిమాలు ఇక్కడే షూట్ చేస్తారు.

చిత్ర కృప : Shuba

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X