Search
  • Follow NativePlanet
Share
» » మొదటిసారి ఉజ్జయినీ వెలుతున్నారా? వీటిని చూడటం మరిచిపోకండి

మొదటిసారి ఉజ్జయినీ వెలుతున్నారా? వీటిని చూడటం మరిచిపోకండి

ఉజ్జయినీ పర్యాటకానికి సంబంధించిన కథనం.

భారతదేశంలో అత్యంత ప్రాచీన నగరాల్లో ఉజ్జయినీ కూడ ఒకటి. దీనిని అవంతిక అని కూడా అంటారు. భారత దేశంలోని ఏడు మోక్ష నగరాల్లో ఉజ్జయినీ కూడా ఒకటి. ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన ఈ ఉజ్జయినీ శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆ కాలంలోనే ముందు ఉండేది. అందుకు గుర్తుగా ప్రముఖ అబ్జర్వేటరీ కూడా ఉంది. అంతేకాకుండా శక్తిపీఠం, జ్యోతిర్లింగం కూడా ఉజ్జయినీలో ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఉజ్జయినీలో చూడదగిన దేవాలయాలు, ప్యాలెస్ లు, విద్యాసంస్థలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

మహాకాళేశ్వర దేవాలయం

మహాకాళేశ్వర దేవాలయం

P.C: You Tube

భారత దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో మహాకాళేశ్వర లింగం ఒకటి. రుద్రసాగర్ సరస్సుకు పక్కనే ఈ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం ప్రాంగణంలోనే గణేష, కార్తికేయ, పార్వతి తదితర దేవాలయాలు ఉన్నాయి.

కాళ భైరవ దేవాలయం

కాళ భైరవ దేవాలయం

P.C: You Tube

హిందూ పురాణాల్లో చెప్పే తాంత్రిక పూజలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి. అందువల్లే మనకు ఈ దేవాలయం వద్ద సాధువులు, అఘోరాలు ఎక్కువ సంఖ్యలో కనబడుతారు. మహాశివరాత్రి రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్న నందికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

హరసిద్ధి దేవాలయం

హరసిద్ధి దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం వద్ద మహారాష్ట్ర సంప్రదాయాలు కనిపిస్తాయి. ఇప్పటికీ మహారాష్ట్రీయుల ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం నిర్వహించబడుతోంది. ఇది శక్తిపీఠాల్లో ఒకటిగా పేర్కొంటారు. ఇక్కడ దాక్షాయణి మోచేయి పడినట్లుగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా దర్శించుకోవచ్చు.

కాలియాదేశ్ ప్యాలెస్,

కాలియాదేశ్ ప్యాలెస్,

P.C: You Tube

అత్యంత అందమైన కాలియాదేశ్ ప్యాలెస్ సిప్రా నదీ ద్వీపంలో ఉంది. ఈ ప్యాలెస్ ను క్రీస్తు పూర్వ 1458లో నిర్మించినట్లు ఇక్కడ దొరికిన కొన్ని చారిత్రాత్మక ఆధారాలను అనుసరించి తెలుస్తోంది. పర్షియన్ శైలి వాస్తు శైలి మనకు కనిపిస్తుంది. అక్బర్ కూడా ఈ ప్యాలెస్ ను సందర్శించాడు.

మశ్చేంద్రనాథ్ దేవాలయం

మశ్చేంద్రనాథ్ దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయం కూడా సిప్రా నదీ తీరంలోనే మనకు కనిపిస్తుంది. ఉత్తరభారత దేశంలో శైవ మత వ్యాప్తి కోసం ఎంతగానో పాటుపడిన మశ్చేంద్ర జ్జాపకాద్రం ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబతుతారు. క్రీస్తు పూర్వం 6 లేదా 7వ శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మించారు. ఉజ్జయినీలో అత్యంత అందమైన పర్యటక ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి..

కాళిదాస అకాడమి

కాళిదాస అకాడమి

P.C: You Tube

ప్రముఖ కవి కాళిదాసు సంస్మరణార్థం ఈ కాళిదాస అకాడమిని నిర్మించారు. ఇందులో ముఖ్యంగా సంస్క`తం పై పరిశోధనలు జరుగుతాయి. కేవలం సంస్క`తమే కాకుండా లలిత కళలు, భారతీయ ఆచార వ్యవహారాల పై కూడా పరిశోధనలుజరుగుతూ ఉంటాయి. ఇందులో అనేక వేదికలు, ఓపెన్ థియేటర్లు ఉంటాయి. అందువల్ల నిత్యం విద్యార్థులతో ఈ ప్రాంతం సందడిగా ఉంటుంది.

ఖగోళ పరిశోధన శాల

ఖగోళ పరిశోధన శాల

P.C: You Tube

ప్రపంచంలోని ప్రాచీన ఖగోళ పరిశోధనశాలల్లో ఇది కూడా ఒకటి. దీనిని 17వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. రాజ జై సింగ్ దీనిని నిర్మించినట్లు చెబుతారు. ఇప్పటికీ ఈ పరిశోధన శాల వినియోగంలో ఉంది. నక్షత్రాలు, ఉపగ్రహాలను చూడటానికి టెలిస్కోప్ కూడా ఉంది.

చింతామన్ గణేష్ దేవాలయం

చింతామన్ గణేష్ దేవాలయం

P.C: You Tube

సిప్రానదీ తీరంలో ఈ దేవాలయం ఉంది. ఉజ్జయినీలోని అతి ప్రాచీన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ మనం అత్యంత పెద్ద వినాయకుడి విగ్రహాన్ని చూడవచ్చు. ముఖ్యంగా వినాయకచవితి ఉత్సవాలు ఇక్కడ బాగా జరుగుతాయి.

రామ్ ఘాట్

రామ్ ఘాట్

P.C: You Tube

ఉజ్జయినీలో చూడదగిన మరో ముఖ్యమైన ప్రాంతం రామ్ ఘాట్. 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళ ఉత్సవాల్లో ఎక్కువమంది ఈ ఘాట్ లోనే పుణ్యస్నానాలు చేస్తారు.

గోపాల్ మందిర్

గోపాల్ మందిర్

P.C: You Tube

ఆ నల్లనయ్య ఇక్కడ ప్రధాన దైవం. మహారాష్ట్ర శైలి వాస్తు ఈ దేవాలయ నిర్మాణంలో కొటొచ్చినట్లు కనబడుతుంది. వెండి తలుపులు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. 19వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X