Search
  • Follow NativePlanet
Share
» »వర్కాల ... ఒక ప్రసిద్ద బీచ్ పట్టణం !!

వర్కాల ... ఒక ప్రసిద్ద బీచ్ పట్టణం !!

కేరళలోని తిరువనంతపురం జిల్లాలో వర్కాల ఒక కోస్తా తీర పట్టణం. ఇది కేరళకు దక్షిణ భాగంలో కలదు. సముద్రానికి సమీపంగా కొండలు ఈ ప్రదేశంలోనే కలవు. ఇక్కడి ప్రత్యకత అంటే .. కొండల అంచులు అరేబియన్ సముద్రంతో కలుస్తాయి. వర్కాల గొప్పవైన పది సీసనల్ బీచ్ లలో ఒకటిగా చెపుతారు.

ఇక్కడ మీరు చూసినట్లయితే, అసలు కేరళ అంటేనే బ్యాక్ వాటర్ తో సందడిగా ఉంటుంది. వర్కాలను సందర్శించడానికి కేవలం మన దేశం నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ ప్రాంతం వారి పాలిట ఒక పర్యాటక కేంద్రం అయిపోయిందనే చెప్పవచ్చు. ప్రకృతి ప్రేమికులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకొని, హాయిగా విహరించి ఆనంద ముఖాలతో వెళుతుంటారు. మరి ఇంత ప్రచూర్యం పొందిన ఈ ప్రదేశం గురించి తెలుసుకోవాలని లేదా?? ఇక్కడున్న పర్యాటక ప్రదేశాల గురించి మీకు అవగాహన కల్పిస్తూ...

వర్కాల హోటళ్ళ వసతి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

వర్కాలలో వాతావరణం ఎలా ఉంటుందో ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్రీ కూపన్లు : ఇప్పుడే త్వరపడండి అన్ని గోఐబిబో కూపన్లు పూర్తి ఉచితంగా!!

వర్కాల బీచ్

వర్కాల బీచ్

వర్కాలలో మొట్ట మొదట సందర్శించాల్సిన ప్రదేశం వర్కాల బీచ్. ఈ బీచ్ పురాతన కాలం నుంచి ప్రాచూర్యంలో ఉంది. ఈ బీచ్ లో ఒకటవ శతాబ్దం నుండి వావు బెలి అనే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ బీచ్ లో ఒక ప్రధాన ఆకర్షణ .. ఇక్కడ మహిమలు కల నీటి బుగ్గ ఒకటి కలదు. ఈ నీటిలో స్నానాలు చేస్తే మొండి వ్యాధులు కూడా నయమవుతాని విశ్వసిస్తారు. ఇక్కడ మీరు వాలీ బాల్ ఆడవచ్చు. లేదా స్విమ్మింగ్, సర్ఫింగ్ వంటి సాహస క్రీడలు చేయవచ్చు లేదా ప్రకృతి అందించే సహజ అందాలు తిలకిస్తూ ఆనందించవచ్చు.

Photo Courtesy: Koshy Koshy

శివగిరి మఠం

శివగిరి మఠం

వర్కాలలో కల శివగిరి మఠం కేరళలో ప్రసిద్ధి చెందిన మఠాలలో ఒకటి. ఇది శ్రీ నారాయణ గురు పేరుపై కట్టిన సమాధి. ఈ మఠంలో వివిధ మతపర, సాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఏటా గురు జయంతి మరియు సమాధి ఉత్సవాలు నిర్వహిస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సెమినార్లు, బహిరంగ సమావేశాలు జరుపుతారు. శ్రీ నారాయణ గురు " ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దైవం" అనే సిద్ధాంతాన్ని బోధించాడు.
మఠం సందర్శన సమయం : ఈ మఠం ఉదయం 5. 30 గం. నుండి మ.. 12 గం. వరకు మరియు సా. 4.30 గం. నుండి 6.30 గం. వరకు తెరచి వుంటుంది.

Photo Courtesy: Native Planet

పరవూర్

పరవూర్

వర్కాల లో ప్రసిద్ది చెందిన మరొక చిన్న పట్టణం పరవూర్ . ఈ ప్రదేశం బ్యాక్‌వాటర్ కి మరియు కయ్యాలుకి పేరుగాంచినది. ఇక్కడ మీరు గనక ఒక ట్రిప్ వేస్తే చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ మనసు చాలా ఆహ్లాదంగా, హుషారుగా ఉంటుంది. మీ మైండ్ కూడా రెఫ్రెష్ అవుతుందనడంలో సందేహం లేదు. బీచ్ ప్రేమికులు ఆధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి బ్యాక్ వాటర్ లో బోట్ రైడ్లను చేస్తూ మిక్కిలి ఆనందాన్ని పొందుతారు.

Photo Courtesy: Arunvrparavur

వర్కాల టన్నెల్

వర్కాల టన్నెల్

వర్కాలలో ఒక సొరంగం లేదా టన్నెల్ కలదు. ఈ టన్నెల్ పొడవు 924 అడుగులు కలదు. దీనిని 1867 లో దివాన్ ఆఫ్ ట్రావెంకూర్ కట్టించారు. దీని నిర్మాణానికి 1 4 సంవత్సరాలు పట్టింది. ఈ టన్నెల్ రాజకుటుంబం నివాసంగా చేసుకున్న అత్తిన్గ్కల్ ప్యాలసు నీటి అవసరాల కొరకు కట్టించబడినది. ఇది ఒక పురాతన ఇంజనీరింగ్ నిర్మాణం కనుక బాగా ఆకర్షిస్తుంది. ఈ టన్నెల్ వర్కాల టన్నెల్ లైట్ హౌస్ సమీపంలోనే కలదు.

Photo Courtesy: Binoyjsdk

జనార్ధనస్వామి దేవాలయం

జనార్ధనస్వామి దేవాలయం

జనార్ధనస్వామి దేవాలయం వైష్ణవ మతస్తులది. ఈ గుడి పాపస్నానం బీచ్ సమీపంలో ఉంటుంది. ఈ గుడిలో డచ్ ఓడ కు చెందిన కెప్టెన్ ఒకరు బహుకరించిన పెద్ద గంట కలదు. ఇది పర్యాటకులకు ఒక ఆకర్షణ. ఈ గుడిలో విష్ణుమూర్తి ప్రధాన దైవం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆరాట్టు పండుగ చేస్తారు. ఈ పండుగ మీన మాసంలో పది రోజులపాటు నిర్వహిస్తారు. వేలాది భక్తులు ఆరాట్టు పండుగకు హాజరవుతారు. హిందువులు కాని వారిని దేవాలయంలోకి ప్రవేశం ఇవ్వరు. హిందువులు ఇక్కడ వారి పూర్వీకులకు మతపర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడి కొలనులో నీరు పవిత్రమైనది అని ఆ నీటిలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భావించి ఆచరిస్తారు.

Photo Courtesy: Binoyjsdk

ఎలా వెళ్ళాలి??

ఎలా వెళ్ళాలి??

విమానాశ్రయం

వర్కాల కి దగ్గరలో ఉన్న విమానాశ్రయం తిరువనంతపురం విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ఒక అంతర్జాతీయ ఏర్‌పోర్ట్. కనుక దేశం నుంచే కాక ప్రపంచ దేశాల నుంచి కూడా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

రైల్వే స్టేషన్

వర్కలలో రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ దేశంలోని వివిధ నగరాలతో అనుసందానించబడినది.

రోడ్డు మార్గం

వర్కాల తిరువనంతపురం కు 50 కి.మీ. ల దూరంలో కలదు. అట్లే, కొల్లంకు 49 కి.మీ. దూరంలో వుంది. దక్షిణ భారత దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుండి వర్కాలకు ప్రభుత్వ బస్సులు కలవు.

Photo Courtesy: Thierry Leclerc

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X