Search
  • Follow NativePlanet
Share
» »హైదరాబాదు....ముత్యాల నగరం !!

హైదరాబాదు....ముత్యాల నగరం !!

హైదరాబాద్ నగరానికి 400 సంవత్సరాల చరిత్ర కలదు. ఈ మహానగరం డెక్కన్ పీఠభూమి ప్రాంతం లో విస్తరించి ఉంది. ప్రస్తుతం 10 సంవత్సరాల పాటుహైదరాబాద్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని గా 2014 జూన్ 2 నుండి అమలులో ఉన్నది. హైదరాబాద్ నగరాన్ని ఎక్కువగా మహమ్మదీయులు పరిపాలించారు.ఈ నగరం మూసి నది ఒడ్డున కలదు. ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ చార్మినార్. దీనిని మొహమ్మద్ కులీ కుతుబ్‌షా నిర్మించాడు. హైదరాబాదు నగరాన్ని భాగ్యనగరం అని కుడా పిలుస్తారు.

చూడదగిన ప్రదేశాలు

గోల్కొండ కోట,చార్మినార్, ఫలక్ నూమా ప్యాలెస్, బిర్లా మందిరం,కుతుబ్ షాహిటూంబ్ లు,సాలార్ జంగ్ మ్యూజియం, నెహ్రూ జూ పార్కు, మక్కా మసీదు,రామోజి ఫిల్మి సిటి, చిలుకూరి బాలాజి దేవాలయం మొదలగునవి.

 చార్మినార్

చార్మినార్

ఆగ్రాకి తాజ్ మహల్, పారిస్ కి ఈఫిల్ టవర్ ఎలాగో హైదరాబాద్ కు చార్మినార్ అలాగన మాట. మహమ్మద్ కులికుతుబ్ షా దీనిని 1591 వ సంవత్సరంలో కట్గించెను. చార్మినార్ చుట్టూ ఉండే స్దంభాలు 48.7 మీ. ఎత్తు కలిగి ఉంటాయి. పర్యాటకులు చార్మినార్ లోపలి కట్టడాలను,వాటి అందాలను ఆస్వాదించవచ్చు. పర్యాటకులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించవచ్చు.

Photos Courtesy : Sanyam Bahga

గోల్కొండ కోట

గోల్కొండ కోట

గోల్కొండ కోట భారతదేశంలోని కోటలలో ముఖ్యమైంది. కుతుబ్ షాహి వంశస్థులు క్రీ.శ.1518 నుండి 1687 వరకు పరిపాలించిరి.ఇది చాలా ప్రసిద్ధి చెందిన కోట.
ఇక్కడ భక్త రామదాసు బందీ ఖానా ఉంది.

Photos Courtesy :Joydeep

మక్కా మసీదు

మక్కా మసీదు

మక్కా మసీదు చార్మినార్ సమీపాన కలదు.మసీదులోని ఆర్చి పై భాగాన్ని మక్కా నుండి తీసుకువచ్చిన ఇటుకలతో నిర్మించినారు.దీనికి శంకుస్థాపన చేసినది కుతుబ్ షాహి వంశస్థులు అయినప్పటికి 1694లొ ఔరంగజేబు దీనిని పూర్తిచేసెను.

Photos Courtesy : Pranav

ఫలక్ నూమా ప్యాలెస్

ఫలక్ నూమా ప్యాలెస్

ఫలక్ నూమా ప్యాలెస్ చార్మినార్ కు 5 కి.మీ. దూరంలో కలదు.ఇది 32 ఎకరాలలో విస్తరించి ఉన్న రాజ భవంతి.దీనిని అప్పటి హైదరాబాద్ ప్రధాని అయిన నవాబు వికర్-ఉల్-ఉమ్రా కట్టించెను.ఉర్దూలో ఫలక్ నూమా అంటే "లైక్ ద స్కై" లేదా "మిర్రర్ ఆఫ్ ద స్కై" అని అర్థం.

Photos Courtesy :Subhamoy Das

బిర్లా మందిరం

బిర్లా మందిరం

బిర్లా మందిరం పాలరాతి మార్బుల్ తో నిర్మించిన కట్టడం.ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రతిరూపంగా దీనిని కొలుస్తారు.

Photos Courtesy :ambrett

కుతుబ్ షాహి టూంబ్ లు

కుతుబ్ షాహి టూంబ్ లు

కుతుబ్ షాహి టూంబ్ లు బులందర్వాజా ప్రాంతం నుండి కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఇక్కడ కుతుబ్ షాహి వంశస్థుల సమాధులు ఉన్నాయి. బూడిద రంగు గ్రానైట్ రాళ్ళతో నిర్మించిన ఈ టూంబ్ లు పర్శియన్, పాథాన్ మరియు హిందూ రీతి కట్టడాలను పోల్చి ఉంటాయి.

Photo courtacy:arupdutta

హుస్సేన్ సాగర్

హుస్సేన్ సాగర్

హుస్సేన్ సాగర్ సరస్సు కలదు.ఈ సరస్సును ఇబ్రహీం కులి కుతుబ్ షా కాలంలో హజరత్ హుస్సేన్ షా వలి క్రీ.శ.1562 లో కట్టించెను,లోతు 32 అడుగులు.ఇది 5.7 చ.కి.మీ. విస్తరించి ఉంది మరియు ఇది మూసీ నదికి ఉప నది. హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో గౌతముని విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు దీని ఎత్తు 18 మీ..

Photos Courtesy :Sankarshansen

 నెహ్రూ జూ పార్కు

నెహ్రూ జూ పార్కు

నెహ్రూ జూ పార్కు 6 అక్టోబర్ 1963 లో ప్రారంభించినారు. జూలో సుమారు 100 ల రకాలైన జంతు సంపద కలిగి ఉంది.దీనిని ప్రస్తత తెలంగాణ రాష్ట్రంలోని అటవీ శాఖ నిర్వహిస్తుంది.ఇక్కడ ఆసియా ఖండపు సింహం, బెంగాల్ పులి,ఖడ్గ మృగం,వివిధ జాతుల కోతులు,పక్షులు,పాములు మరియు ఏనుగులు,మోసళ్ళు మొదలగునవి చూడవచ్చు.

Photos Courtesy :Cephas

సాలార్ జంగ్ మ్యూజియం

సాలార్ జంగ్ మ్యూజియం

భారతదేశంలోని మూడు ప్రధానమైన మ్యూజియాలలో సాలార్ జంగ్ మ్యూజియం ఒకటి.ఈ మ్యూజియంలో చరిత్రకి సంభంధించిన అధ్బుత కళాఖండాలు ,చిత్రాలు(పేంటింగ్),దుస్తులు, సిరామిక్,మెటాలిక్ వస్తువులు,నవాబులు వాడినటువంటియుధ్ధసామాగ్రి,కార్పెట్లు,గడియారాలు మరియు జపాన్,చైనా,ఇండియా,నేపాల్,పర్షియా,యూరప్,నార్తమెరికా నుండి దిగుమతి కాబడిన గృహోపకరణాలు ఉన్నాయి.ఇక్కడ గోడ గడియారం ప్రత్యేకమైనది.

Photos Courtesy :Nikkul

చిలుకూరి బాలాజి దేవాలయం

చిలుకూరి బాలాజి దేవాలయం

ఈ దేవాలయం "వీసా బాలాజి టెంపుల్" లేదా "వీసా గాడ్" గా ప్రసిద్ధి చెందినది.ఇది ఉస్మాన్ సాగర్ సరస్సు ఒడ్డున అక్కన్న,మాదన్న నిర్మించిన పురాతన హిందూ దేవాలయం.ఈ టెంపుల్ లో హుండి ఉండదు.వివిఐపి దర్శనాలు ఉండవు.ఇది మెహదీపట్నంకి 17 కి.మీ. దూరంలో కలదు.ఈ గుడిని 13 వ శతాబ్ధంలో కట్టించినారు.

Photos Courtesy :BavisettySrinivas

 రామోజి ఫిల్మి సిటి

రామోజి ఫిల్మి సిటి

1666 ఎకరాలలో నిర్మించిన రామోజి ఫిల్మి సిటి ప్రపంచంలోనే విశిష్ఠమైన ఫిల్మి సిటిగా గుర్తింపు తెచ్చుకుంది.దీనిని రామోజి రావు అనే సినిమా నిర్మాత 1996 లో ప్రారంభించెను.ఇక్కడ సినిమా షూటింగులు జరుగుతాయి అంతేకాదు ఈ ఫిల్మి స్టూడియో గిన్నిస్ రికార్డు కూడా సాధించింది కూడా.

Photos Courtesy :Shillika

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

విమానాశ్రయం
హైదరాబాదులో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుండి భారతదేశంలోని అన్నిప్రధాన నగరాలకు మరియు కొన్ని అంతర్జాతీయ గమ్యములకు
విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.

రైలు రవాణా
హైదరాబాదుకు జంటనగరమైన సికింద్రాబాదులో దక్షిణమధ్య రైల్వే ముఖ్యకార్యాలయం ఉంది.ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంటుంది. హైదరాబాదులో మొత్తం మూడు ముఖ్య రైల్వేస్టేషన్లు ఉన్నాయి 1)సికింద్రాబాదు రైల్వేస్టేషను 2)నాంపల్లి రైల్వేస్టేషను (హైదరాబాదు దక్కన్) 3)కాచిగూడ రైల్వేస్టేషను.హైదరాబాదులో మల్టీ మోడల్ రవాణా వ్యవస్థ(MMTS) ఉంది.

రోడ్డు రవాణా
హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉన్నది. వాటిలో బెంగళూరు, ముంబాయి, పూణె, నాగ్‌పూర్, విజయవాడ, వరంగల్, గుంటూరు మరియు కర్నూలు చెపుకోతగ్గవి.జాతీయ రోడ్లయిన ఎన్‌హెచ్-7, ఎన్‌హెచ్-9 మరియు ఎన్‌హెచ్-202 నగరంలో నుండే వెళ్తుంటాయి.

Photos Courtesy:ShashiBellamkonda

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X