» »హైదరాబాద్ సమీపంలో ట్రెక్కింగ్ ప్రదేశాలు

హైదరాబాద్ సమీపంలో ట్రెక్కింగ్ ప్రదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ట్రెక్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవే. చాలా మందికి ఇవి తెలియవు కూడా. హైదరాబాద్ లో ఉండి కూడా మనము బెంగళూరు, హిమాలయ పర్వతాలవైపు మొగ్గుచూపుతున్నాము. ఇవి తెలిస్తే వెళ్ళములెండీ ..! మరి ఆ ట్రెక్కింగ్ ప్రదేశాలు ఏవో ? ఎక్కడెక్కడ ఉన్నాయో ? హైదరాబాద్ కు అవిఎంత దూరంలో ఉన్నాయో ఒకసారి చూద్దాం పదండి !

చాలా మందికి ట్రెక్కింగ్ అంటే ఆసక్తి. దీనికోసమని ట్రెక్కర్లు ఎక్కడెక్కడి ప్రదేశాలకో వెళ్లివస్తుంటారు. అదే మన ఇండియాలో అయితే కర్ణాటక లోని బెంగళూరు, హిమాచల్ ప్రదేశ్, లఢఖ్, ఉత్తరాఖండ్ వంటి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లి ట్రెక్కింగ్ ను ఆస్వాదిస్తుంటారు.

భువనగిరి కోట

భువనగిరి కోట

భువనగిరి కోట నల్గొండ జిల్లాలో కలదు. దీనిని విక్రమాదిత్య రాజు ఒక కొండ మీద ఏకశిలరాతి గుట్టపై నిర్మించాడు. ట్రెక్కింగ్ ద్వారా కొండ పైభాగాన చేరుకుంటే అంతఃపురాలు, నంది విగ్రహం, ఆంజనేయ శిల్పం, సొరంగాలు కనిపిస్తాయి. సమీపంలో యాదగిరి గుట్ట దర్శించవచ్చు.

హైదరాబాద్ నుండి దూరం : 54 కి. మీ.

పైకి ఎక్కడం : సులభం

చిత్ర కృప : Nikhilb239

అనంతగిరి హిల్స్

అనంతగిరి హిల్స్

అనంతగిరి కొండలు వికారాబాద్ లో కలవు. ముక్కు మూసుకొనే మూసీ నది జన్మస్థానం ఇదే. ఇది అటవీ ప్రాంతం కనుక చుట్టుపక్కల ఉండే పచ్చటి కొండలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి.

అనంతగిరి హిల్స్ మరింత సమాచారం

హైదరాబాద్ నుండి దూరం : 79 కి. మీ.

పైకి ఎక్కడం : మరీ అంత సులభం కాదు

చిత్ర కృప : cishoreTM

మెదక్ ఫోర్ట్

మెదక్ ఫోర్ట్

మెదక్ ఫోర్ట్ మెదక్ పట్టణానికి సమీపాన కలదు. ఆక్రమణదారుల నుండి నగరాన్ని రక్షించుకోవటానికి కాకతీయ రాజులు నిర్మించిన ప్రహారీ కోట మెదక్ ఫోర్ట్. కోట పైభాగాన సుందర దృశ్యాలతో పాటు, నగరాన్ని చూడవచ్చు.

హైదరాబాద్ నుండి దూరం : 95 కి. మీ

పైకి ఎక్కడం : సులభం

చిత్ర కృప :Varshabhargavi

ఘనపూర్ కోట ఖిల్లా

ఘనపూర్ కోట ఖిల్లా

ఘనపూర్ కోట మహబూబ్ నగర్ జిల్లాలో కలదు. 'గోన' వంశానికి చెందిన గణపరెడ్డి రెండు ఎత్తైన గుట్టలను కలుపుతూ కోటను నిర్మించాడు. ఈ కోటలో ట్రెక్కింగ్ చేస్తూ తిరగటం ఒక గొప్ప అనుభూతి.

హైదరాబాద్ నుండి దూరం : 109 కి. మీ.

పైకి ఎక్కడం : కొద్దిగా కష్టపడాలి.

చిత్ర కృప :Pruthvi34

కోయిల్ కొండ ఫోర్ట్

కోయిల్ కొండ ఫోర్ట్

ఈ కోట మహబూబ్ నగర్ జిల్లాలో కలదు. కోట పైభాగాన చేరుకోవటానికి మెట్లు ఉన్నాయి. గచ్చు గానీ, మట్టి గానీ వాడకుండా నిర్మించడం కోట స్పెషాలిటీ. కోట పై భాగాన ఆలయాలు, అంతఃపురాలు, మహల్స్ చూడవచ్చు.

హైదరాబాద్ నుండి దూరం : 120 కి. మీ

పైకి ఎక్కడం : సులభం.

చిత్ర కృప :cishoreTM

గాయత్రి జలపాతాలు

గాయత్రి జలపాతాలు

గాయత్రి జలపాతాలు ఆదిలాబాద్ జిల్లాలో కలవు. ఈ జలపాతానికి గల మరొక పేరు గాడిద జలపాతం మరియు మొక్కుడు గుండం. జలపాత పరిసరాలు మిమ్మల్ని స్వర్గం లోకి తీసుకెళ్తాయి. హైదరాబాద్ నుండి దూరం : 207 కి. మీ కనకై జలపాతాలు

కనకై జలపాతాలు

కనకై జలపాతాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మరో చక్కని ట్రెక్కింగ్ స్థావరం. రాళ్ళూ గుట్టలు దాటుకుంటూ వచ్చే నీటి ప్రవాహం పెద్ద గుండంలో కలిసే తీరు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ జలపాతానికి గల మరొక పేరు బంద్రేవ్ జలపాతం.

హైదరాబాద్ నుండి దూరం : 282 కి. మీ

కౌలాస్ కోట

కౌలాస్ కోట

కౌలాస్ కోట నిజామాబాద్ జిల్లాలో కలదు. చుట్టూ అడవి, కింద నది ఉండటంతో ఇక్కడి ప్రకృతి దృశ్యం అమెజాన్ అడవిని తలపిస్తుంది. కోట లోపల మందిరాలు, దర్గాలు, మహల్స్ ఉన్నాయి.

హైదరాబాద్ నుండి దూరం : 169 కి.మీ. పైకి ఎక్కడం : సులభం.

చిత్ర కృప :andhra amitabh gopi

అహోబిలం

అహోబిలం

అహోబిలం కర్నూలు జిల్లాలో కలదు. హైదరాబాద్ ట్రెక్కర్ లకు అహోబిలం ఒక ట్రెక్కింగ్ స్థావరం. ఇక్కడ దేవుని దర్శనంతో పాటు కండరాలకు పనిచెప్పవచ్చు. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం, జలపాతాలు, చుటూ నల్లమల అడవి ఈ ప్రాంతపు అదనపు ఆకర్షణలు. హైదరాబాద్ నుండి దూరం : 351 కి. మీ ట్రెక్కింగ్ : కొద్దిగా కష్టపడాలి

చిత్ర కృప : Gopal Venkatesan