Search
  • Follow NativePlanet
Share
» »పుష్కర్...జంతువుల ఫ్యాషన్ షో చూడొచ్చు

పుష్కర్...జంతువుల ఫ్యాషన్ షో చూడొచ్చు

పుష్కర్ మేళ 2018 కు సంబంధించిన కథనం

పుష్కర్ మేళ. రాజస్థాన్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం పుష్కర్. ఇక్కడ అరుదైన బ్రహ్మదేవాలయం ఉంది. ఇక్కడ బ్రహ్మచారులకు ప్రవేశం లేదు. అటు వంటి పుణ్యక్షేత్రంలో ప్రతి ఏడాది ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంత జరుగుతుంది. ఆసియా దేశాల్లోనే అతి పెద్ద సంతగా దీనికి పేరు. ఇక్కడ ఒంటెలు, గుర్రాల అందాల పోటీలు కూడా జరుగుతాయి. ఇంతటి విశిష్టమైన పుష్కర్ మేళకు సంబంధించిన వివరాలు మీ కోసం...

పుష్కర్ మేళ 2018

పుష్కర్ మేళ 2018

P.C: You Tube

రాజస్తాన్ లోని పుష్కర్ లో ప్రతి ఏడాది కార్తిక పౌర్ణమి రోజు పుష్కర్ మేళ జరుగుతుంది. ఇక్కడ ఒంటెలకు వివిధ రకాల పోటీలను కూడా నిర్వహిస్తారు.

పుష్కర్ మేళ 2018

పుష్కర్ మేళ 2018

P.C: You Tube

ఈ పుష్కర్ మేళలో రాజస్థాన్ గిరిజన సంప్రదాయాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఈ పుష్కర్ మేళను చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

పుష్కర్ మేళ 2018

పుష్కర్ మేళ 2018

P.C: You Tube

ఈ పుష్కర్ మేళ భారత దేశంలో ప్రాచీన కాలం నుంచి నిర్వహిస్తున్న పశువుల సంతలో ఒకటి. కార్తిక పౌర్ణమి రోజున నిర్వహించే ఈ మేళ రాజస్థాన్ సంస్క`తి సంప్రదాయాలతో పాటు భారత దేశంలోని మిగిలిన రాష్ట్రాల సంప్రదాయాలు కూడ అక్కడక్కడ కనిపిస్తుంది.

పుష్కర్ మేళ 2018

పుష్కర్ మేళ 2018

P.C: You Tube

ఈ మేళలో ప్రధాన ఆకర్షణ రాజస్థాన్ లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తమ ఒంటెలను ఇక్కడికి తీసుకువస్తారు. దేశ విదేశాల నుంచి కూడా లక్షల సంఖ్యలో ఈ మేళను చూడటానికి ఇక్కడికి వస్తారు.

పుష్కర్ మేళ 2018

పుష్కర్ మేళ 2018

P.C: You Tube

ఈ పుష్కర్ మేళ సందర్భంగా ఒంటెలను అందంగా అలంకరిస్తారు. వాటికి అందాల పోటీ కూడా నిర్వహిస్తారు. అంతేకాకుండా వాటితో పరుగు పోటీలు, నాట్య పోటీలను కూడా జరుపుతారు.

పుష్కర్ మేళ 2018

పుష్కర్ మేళ 2018

P.C: You Tube

ఈ పోటీలను చూడటానికే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. దీంతో పుష్కర్ సందర్భంగా ఇక్కడి హోటల్స్ లో రూంలు దొరకడం చాలా కష్టం. దాదాపు రెండు నెలల ముందే రూంలు బుక్ అయిపోతాయి.

పుష్కర్ మేళ 2018

పుష్కర్ మేళ 2018

P.C: You Tube

అందువల్లఒకవేళ మీరు పుష్కర్ మేళకు వెళ్లాలనుకొంటే మీరు ముందుగానే హోటల్స్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పుష్కర్ మేళ సందర్భంగా కేవలం సంత మాత్రమే కాకుండా చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలు కూడా చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.

పుష్కర్ మేళ 2018

పుష్కర్ మేళ 2018

P.C: You Tube

ముఖ్యంగా ఇక్కడ ఉన్న పుష్కర్ సరోవరం చాలా పవిత్రమైనదని భావిస్తారు. అందువల్ల ఈ సరోవరంలో స్నానం చేసి బ్రహ్మదేవాలయాన్ని ఖచ్చితంగా సంర్శించుకొంటారు.

పుష్కర్ మేళ 2018

పుష్కర్ మేళ 2018

P.C: You Tube

అన్నట్టు ఈ సారి పుష్కర్ మేళ ఈ ఏడాది నవంబర్ 15 నుంచి 23 వరకూ నిర్వహిస్తారు. పుష్కర్ కు చేరుకోవాలంటే ఢిల్లీ, జైపూర్, ఆగ్రా వంటి ప్రముఖ నగరాల నుంచి కూడా బస్సులు ఉన్నాయి.

పుష్కర్ మేళ 2018

పుష్కర్ మేళ 2018

P.C: You Tube

ఇక్కడికి దగ్గర్లో ఆజ్మీర్ రైల్వేస్టేషన్ ఉంది. అదే విధంగా ఇక్కడికి దగ్గర్లో అంటే జైపూర్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అజ్మీర్ నుంచి పుష్కర్ చేరుకోవడానికి ప్రైవేటు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X