Search
  • Follow NativePlanet
Share
» »శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

ఎక్కడైనా శ్రీరాముడు సీతాలక్ష్మణ హనుమత్ సమేతుడై దర్శనమిస్తాడు.ఆలయంలోని ఆంజనేయస్వామి సింగరకొండ ఆంజనేయస్వామి ప్రతిరూపమేనని పలువురి విశ్వాసం.

By Venkatakarunasri

ఎక్కడైనా శ్రీరాముడు సీతాలక్ష్మణ హనుమత్ సమేతుడై దర్శనమిస్తాడు. ఆదిశేషునిపై శ్రీరాముడు శయనించిన స్థితిలో వున్న విగ్రహాన్ని,విశేషాన్ని చూడాలనుకుంటేమాత్రం ప్రకాశం జిల్లా, చీమకుర్తి పట్టణం, కోటకట్లవారి వీధిలోని శ్రీశేషశయన శ్రీరామాంజనేయస్వామివారి ఆలయానికి రావాల్సిందే.శ్రీరాముడు ఆదిశేషునిపై శయనించినట్లు వున్న ఆలయం దేశంలో ఇదే ప్రధమంఅని భక్తులు పేర్కొంటారు. తాటికుండ రామయోగికి 1972లో ఆంజనేయస్వామి దర్శనభాగ్యం లభించింది. అనంతరం ఆంజనేయస్వామిని ప్రతిష్టించి పూజలు ప్రారంభించారు. ఆలయంలోని ఆంజనేయస్వామి సింగరకొండ ఆంజనేయస్వామి ప్రతిరూపమేనని పలువురి విశ్వాసం.

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క తొమ్మిది కోస్తా ప్రాంతపు జిల్లాల్లో ఒకటి. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణము ఒంగోలు. ఒంగోలు జిల్లా ఫిబ్రవరి 2,1970వ తేదీన, నెల్లూరు, కర్నూలు మరియు గుంటూరు జిల్లాల యొక్క కొంత భాగముల నుండి ఆవిర్భవించింది.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

తరువాత డిసెంబర్ 5,1972వ తేదీన, జిల్లాలోని కనుపర్తి గ్రామములో పుట్టిన గొప్ప దేశభక్తుడు మరియు ఆంధ్ర నాయకుడైన, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధము ప్రకాశం జిల్లాగా నామకరణము చేయబడింది.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఈ జిల్లాలో జరిగిన చీరాల పేరాల ఉద్యమం పేరుగాంచింది. భారతాన్ని తెనిగించిన కవిత్రయాల్లో ఒకరైన ఎర్రాప్రగడ,సంగీత విద్వాంసుడు త్యాగరాజు, శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ జిల్లా వారే. వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుసెనగ, ప్రత్తి, పొగాకు ప్రధానపంటలు. మార్కాపురం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. ప్రకాశంజిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

జిల్లా చరిత్రకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల చరిత్రే ఆధారం. ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాక, పల్లవ, చాళుక్య,కాకతీయ రాజ వంశాలు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్కొండ, కర్ణాటక నవాబులు పరిపాలించారు. భారతాన్ని తెనిగించిన కవిత్రయములో ఒకరైన ఎర్రాప్రగ్గడ, సంగీతంలో పేరుగాంచిన శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాంతానికి చెందినవారే.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

స్వాతంత్ర్యోద్యమ సమయంలో చీరాల పేరాల ఉద్యమం నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, నరసింహరావు ప్రసిద్దులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ తర్వాత మొదటిగా ఒంగోలు జిల్లా ఏర్పడింది. ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా యొక్క మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల మరియు ఒంగోలు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి మరియు దర్శి) మరియు కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలతో (మార్కాపురం మరియు గిద్దలూరు) ఏర్పడినది.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

1972 లో టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తుగా ప్రకాశం జిల్లాగా పేరు మార్చబడింది. ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రపు దక్షిణ కోస్తాలో సుమారు 150.90 మరియు 160 డిగ్రీల ఉతర అక్షాంశాలు 79 మరియు 80 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య నెలకొని ఉంది. ఉత్తరాన మహబూబ్ నగర్ మరియు గుంటూరు జిల్లాలు, పశ్చిమాన కర్నూలు జిల్లా, దక్షిణాన వైఎస్ఆర్ జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు, తూర్పున బంగాళా ఖాతము సరిహద్దులుగా ఉన్నాయి.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

జిల్లాలోని మధ్య ప్రాంతం చిన్న చిన్న పొదలతో, కొండలతో, రాతి నేలలతో కూడి జిల్లాకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. త్యాగరాజు నల్లమల, వెలుగొండలు జిల్లాలోని ముఖ్యమైన కొండలు. నల్లమల కొండలు గిద్దలూరు, మార్కాపురం మండలాలలో వ్యాపించి ఉండగా, వెలుగొండ కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల సరిహద్దులలో ఉన్నాయి. నల్లమలలో నంది కనుమ, మాబాల కనుమ అనే రెండు ముఖ్యమైన కనుమలు ఉన్నాయి.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

నంది కనుమ పశ్చిమాన గల కర్నూలు,బళ్ళారి జిల్లాలకు, తూర్పున కోస్తా జిల్లాలకు ప్రధాన మార్గం కాగా, మాబాల కనుమ పశ్చిమాన ఆత్మకూరు, కర్నూలును తూర్పున దోర్నాల, యర్రగొండపాలెం, మార్కాపురం లను కలుపుతుంది. 2,900 అడుగుల ఎత్తున ఉన్న గుండ్లబ్రహ్మేశ్వరం కొండల నుండి క్రిందకు దిగుతూ గుండ్లకమ్మ వేగం పుంజుకొని రాచర్ల మండలం, జె. పుల్లలచెరువు గుండ్లకమ్మ, పాలేరు, మూసీ, మున్నేరు, సగిలేరులు జిల్లాలో ప్రవహించే ముఖ్యమైన నదులు.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

వీటిలో 220 కి మీలు ప్రవహించే గుండ్లకమ్మ నది జిల్లా యొక్క తాగునీటి, సాగునీటి అవసరాలకు తల్లి వంటిది. తమ్మిలేరు, ఈగిలేరు, గుడిశలేరు అనే చిన్న నదులు, వాగేరు వాగు, నల్లవాగు, యేడి మంగల వాగు వంటి వాగులు కూడా జిల్లాలో ప్రవహిస్తున్నాయి.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

వాతావరణం, వర్షపాతం

జిల్లా లోని కోస్తా ప్రాంతాల్లో సముద్రపు గాలి వలన అన్నికాలాల్లోను వాతావరణం ఒకే రకంగా ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో వేసవి కాలం చాలా తీవ్రంగా ఉంటుంది. జూన్‌- సెప్టెంబరులో నైరుతి ఋతుపవనాలు, అక్టోబరు - డిసెంబరులో ఈశాన్య ఋతుపవనాల వలన వర్షాలు కురుస్తాయి. జిల్లా సగటు వర్షపాతం 764మిమి.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

భూతప్రేత పిశాచ గ్రహబాధలతో బాధపడేవారు ఈ ఆలయంలో 40రోజులపాటు ప్రదక్షిణచేస్తే వారికి స్వస్థత చేకూరుతుందని నిర్వాహకులు చెప్తారు.వారు చెప్పటమేకాక పలువురు భక్తుల ప్రత్యక్షఅనుభవం కూడా.ఆలయంలో గత 3దశాబ్దాలనుండి భక్తులు నిత్యం శ్రీరామనామజప పారాయణం నిర్వహిస్తారు.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

ఆంజనేయస్వామి శ్రీరాముని భక్తుడు కావటంతో 1998,ఫిబ్రవరి 6న శేషశయన శ్రీరాముని విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. శ్రీరాముని పాదాలవద్ద ఆంజనేయస్వామి ముకుళితహస్తాలతో కూర్చున్నట్లుగా విగ్రహాన్ని సుందరంగా మలచారు.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

కేరళలోని అనంతపద్మనాభస్వామివారిని స్పురింపజేసేలా శ్రీరాముడు శేషశయనుడిగా దర్శనమిస్తాడు. ఎక్కడానయంకాని మానసిక రుగ్మాలతో బాధపడేవారితోబాటు గ్రహబాధలతో క్రుంగిపోయేవారికి ఈ ఆలయం సంజీవిని వంటిదని అంటారు.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

రోజూ ఎంతోమంది భక్తులు ఆలయానికి వస్తూంటారు.శనివారం గ్రహపీడలు ఎక్కువసంఖ్యలో వస్తాయి. సాయంత్రం 3గంటలపాటు జరిగే భజనకీర్తన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడవలసిందే.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

ఆలయఆవరణలో 21దేవతామూర్తులను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ఆంజనేయస్వామి భజనచేసున్న విగ్రహాన్ని సుందరంగా మలచారు. దుర్గాదేవి, నృసింహస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వెంకటేశ్వరస్వామి, సత్యనారాయణస్వామి, వినాయకుడు,అష్టలక్ష్ములతో బాటు, పలు దేవతామూర్తులకు నిత్యపూజలు నిర్వహిస్తున్నారు.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

ప్రతి శనివారం సాయంత్రం ఆంజనేయస్వామి సన్నిధిలో భజనసంకీర్తనల ఆలాపన జరుగుతుంది.ప్రముఖ గాయకులు తాటికొండబాలయోగి ఆలయవ్యవహారాలను పరిరక్షిస్తున్నారు.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

చేమకుర్తి వచ్చిన భక్తులు శేషశయన రామాలయంతోబాటు హరిహరక్షేత్రం,సాక్షి రామలింగేశ్వర ఆలయం, గంగమ్మ ఆలయం,ఆగ్రహం వెంకటేశ్వరస్వామి ఆలయం, రామతీర్థం, మోక్షరామలింగేశ్వరఆలయం,రామతీర్థం జలాశయం, చీమకుర్తి గ్రానైట్ క్వారీలను కూడా చూడవచ్చు.

pc:youtube

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

ఎలా వెళ్ళాలి?

చీమకుర్తి ఒంగోలుపట్టణానికి 25కిమీల దూరంలో ఒంగోలు,మార్కాపురం ప్రాధానరోడ్డు మార్గంలో వుంది. బస్సులు,ఆటోలలో ప్రైవేట్ వాహనాలలో సులభంగా చేరుకోవచ్చు.

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

శ్రీరాముడు శయనిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం

ఒంగోలు రైల్వే స్టేషను

చెన్నయ్-ఢిల్లీ రైలు మార్గము, గుంతకలు గుంటూరు రైలు మార్గము జిల్లాలోని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కలిగిస్తున్నాయి. రైల్వే లైను పొడవు242 కిమీ. ఎన్.హెచ్.5. జాతీయ రహదారి (ఆరు దారుల) జిల్లాలో 117 కిమీ, రాష్ట్ర రహదారులు 570 కిమీ, జిల్లా పరిషత్ రహదారులు 1786 కిమీ, ఇతర జిల్లా రహదారులు 936 కిమీ వున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X