• Follow NativePlanet
Share
» »ఈ దేవాలయానికి పురుషులు, మహిళలు నగ్నంగా వెళ్లేవారట

ఈ దేవాలయానికి పురుషులు, మహిళలు నగ్నంగా వెళ్లేవారట

Written By: Kishore

ఇక్కడ ఇలా చేస్తే వద్దన్నా గంపెడు సంతానం

హిందూ సంప్రదాయంలో దేవాలయాల దర్శనానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవాలయాలకు వెళ్లే సమయంలో చాలా సంప్రదాయబద్ధమైన దుస్తులు దరించి వెలుతుంటారు. కొన్ని దేవాలయాల్లో అయితే ఇటువంటి దుస్తులు మాత్రమే దరించాలన్న నిబంధన అంటే డ్రస్ కోడ్ ను కూడా ఇటీవల అమలు చేస్తున్నారు. పరిసర ప్రాంతాలు చాలా పవిత్రంగా ఉండాలన్నదే ఈ నియమం ప్రధాన ఉద్దేశం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేవాలయం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఇక్కడ భక్తులు నగ్నంగా దేవి దర్శనం చేసుకునేవారు. అందులోనూ స్త్రీలు, పురుషులు ఇద్దరు ఒకేసారి ఈ విధంగా నగ్నంగా వెళ్లేవారు. ఇటువంటి దేవాలయం భారత దేశంలోనే కాక ప్రపంచంలోనే మరొకటి లేదు. సదరు దేవాలయం ఎక్కడ ఉంది? దాని విశిష్టతలు ఏమిటి తదితర వివరాలను మీ కోసం

1. శివమొగ్గ జిల్లాలో

1. శివమొగ్గ జిల్లాలో

Image Source:

సమాచార సాంకేతిక రాజధానిగా పిలిపించుకునే కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సొరబు తాలూకాలో ఈ దేవాలయం ఉంది. ఈ సొరబు పట్టణానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో చంద్రగుట్ట అనే చిన్న కొండపై ఉంది.

2. గుహలో

2. గుహలో

Image Source:

ఈ చంద్రగుట్టనే గుత్తియమ్మ కొండ అని కూడా పిలుస్తారు. ఇక ఈ గుట్ట పైన రేణుకాదేవి దేవాలయం ఉంది. ఒక చిన్న అర్థచంద్రాకారం గుహలో ఈ దేవాలయం ఉంటుంది.

3. పరుశరాముడి తల్లి

3. పరుశరాముడి తల్లి

Image Source:

ఈ రేణుకాదేవి జమదగ్ని మహాముని భార్య. అదే విధంగా పరుశరాముడి తల్లి. ఒక రోజు రేణుకాదేవి నీటి కొరుకు చెరువు వద్దకు వెళుతుంది. అక్కడ గంధర్వ జంట చెరువులో స్నానం చేస్తుంటారు.

4. సయ్యాటలను చూసి

4. సయ్యాటలను చూసి

Image Source:

వారి సయ్యాటలను చూస్తూ రేణుకాదేవి సమయాన్ని గమనించదు. కొంత ఆలస్యంగా నీటిని తీసుకుని ఆశ్రమానికి వెలుతాడు. అయితే మిక్కిలి కోపిస్టి అయినటువంటి జమదగ్ని భార్య ఆలస్యానికి కారణం చెప్పమంటాడు.

5. తల్లి తలను నరకమంటాడు

5. తల్లి తలను నరకమంటాడు

Image Source:

దీంతో ఆమె జరిగిన కథ మొత్తం చెబుతుంది. ఆ సమాధానంతో జమదగ్నికి తన భార్య అయిన రేణుకాదేవి పై అనుమానం కలుగుతుంది. దీంతో తన కుమారులను పిలిచి తల్లి తలను నరకమంటాడు.

6. శిరస్సును ఖండిస్తాడు

6. శిరస్సును ఖండిస్తాడు

Image Source:

అయితే వారెవరూ ఇందుకు సమ్మతించరు. చివరికి పరుశరాముడిని తల్లి తలను నరకాల్సిందిగా జమదాగ్ని ఆదేశిస్తాడు. దీంతో పరుశరాముడు తలన తల్లి అయిన రేణుకాదేవిని ఒక గుహలోకి తీసుకువెళ్లి తన ఆయుధమైన పరశువు (గండ్ర గొడ్డలి)తో ఆమె శిరస్సును ఖండిస్తాడు.

7. తల్లిని తిరిగి బతికించుకుంటాడు

7. తల్లిని తిరిగి బతికించుకుంటాడు

Image Source:

తల్లి తలను తీసుకువచ్చి తండ్రికి చూపిస్తాడు. దీంతో జమదగ్ని మహాముని ఎంతగానో సంతోషించి పరుషరాముడిని వరం కోరుకోమంటాడు. తన తల్లిని తిరిగి బతికించమని ప్రార్థించగా జమదగ్ని తన తపోబలంతో ఆమెను బతికిస్తాడు.

8. ఈ ఘటన జరిగింది ఇక్కడే

8. ఈ ఘటన జరిగింది ఇక్కడే

Image Source:

ఈ సంఘటన మొత్తం చంద్రగుట్ట పైనే జరిగినట్లు స్థల పురాణం చెబుతుంది. ఈ గుట్ట పైన ఉన్న పాదం గుర్తులు రేణుకా మాతవని చెబుతారు. అదే విధంగా అక్కడ ఉన్నటు వంటి ఒక చిన్న బావిని రేణుకామాత బావి అని పిలుస్తారు.

9. నగ్నంగా వచ్చేవారు

9. నగ్నంగా వచ్చేవారు

Image Source:

ఇక్కడ రేణుకాదేవికి గుడిని దాదాపు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో కట్టించారని చెబుతారు. ఇదిలా ఉండగా ఇక్కడ రేణుకాదేవి గుడికి పురాణ కాలం నుంచి భక్తులు అందులోనూ స్త్రీ, పురుషులు కలిసి నగ్నంగా వెళ్లేవారు.

12. కొన్ని గంటలు మాత్రమే

12. కొన్ని గంటలు మాత్రమే

Image Source:

ఇక ఈ దేవాలయం ప్రతి మంగళ, శుక్రవారాల్లో 24 గంటల పాటు తెరిచి ఉంచే ఈ దేవాలయం మిగిలిన రోజుల్లో కేవలం ఉదయం కొన్ని గంటలు మాత్రమే తెరిచి ఉంచుతారు.

13. బస్సు సర్వీసులు ఇలా

13. బస్సు సర్వీసులు ఇలా

Image Source:

శివమొగ్గలోని ముఖ్యపట్టణాల్లో ఒకటైన సాగర నుంచి సొరబకు ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది. అక్కడ నుంచి చంద్రగుట్టకు వేరే బస్సులో వెళ్లాల్సి ఉంటుంది.

14. ఇలా కూడా

14. ఇలా కూడా

Image Source:

శివమొగ్గ నుంచి చంద్రగుట్టకు 106 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య నేరుగా బస్సు సర్వీసులు చాలా తక్కువగా ఉంటాయి.

15. ఆయన చిరంజీవి

15. ఆయన చిరంజీవి

Image Source:

ఇదిలా ఉండగా పరశురాముడు అటు రామాయణంలోనూ ఇటు మహాభారత కాలంలోనూ కనిపిస్తాడు. ఇతడు చిరజీవి అని ఇతనకి చావులేదని మన హిందూ పురాణాలు చెబుతాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి