Search
  • Follow NativePlanet
Share
» »నాగర హోళే - పాముల నది ఒడ్డున విశ్రాంతి !!

నాగర హోళే - పాముల నది ఒడ్డున విశ్రాంతి !!

నాగర హోళే అంటే పాముల నది అని చెప్పాలి. ఈ పేరు రావటానికి గల కారణం ఇక్కడి నది దట్టమైన అడవులగుండా తీవ్ర వేగంతో ఒక పాము వలే మెలికలు తిరుగుతూ పరుగుపెడుతూంటుంది. ఈ ప్రాంతం కర్నాటక లోని కొడగు జిల్లాలో ఉంది. ప్రకృతి ఆరాధకులు, వేట ఇష్టపడేవారు జంతువులను దర్శించేందుకు ఆసక్తి చూపేవారు ఈ ప్రాంతాన్ని బాగా ఇష్టపడతారు. నాగర హోళే అటవీ ప్రదేశం మంగుళూరు నుండి కూడా తేలికగా సందర్శించవచ్చు.

 నేషనల్ పార్క్

నేషనల్ పార్క్

నాగర హోళే ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది? నాగర హోళే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ లో ఒక భాగం. అద్బుత వాతావరణం, పచ్చని మొక్కలు, అందమైన జంతుసంపద, దట్టమైన పచ్చటి అడవులు, పర్యాటకులను ఈ ప్రాంతానికి సంవత్సరం పొడవునా వచ్చేలా చేస్తాయి.

 బ్రహ్మగిరి పర్వతాలు

బ్రహ్మగిరి పర్వతాలు

నాగర హోళే పురాతన కాలంలో కూడా జంతువులకు ప్రసిద్ధిగా ఉండేది. స్ధానిక కధనాల మేరకు మైసూరు రాజ్య పాలకులు ఈ ప్రాంతంలో ఏనుగులను, ఇతర అడవి జంతువులను వేటాడి ఆనందించేవారు. ఇప్పటికి ఈ పార్క్ లో అనేక రకాల జంతువులుంటాయి.

 సీతారాముల వనవాసం!

సీతారాముల వనవాసం!

నాగరహోళే చూసే వారు ఇదే ప్రాంతంలో ఉన్న బ్రహ్మగిరి పర్వతాలు మరియు ఇర్పు జలపాతాలు కూడా తప్పక చూడాలి. ఈ జలపాతాలు లక్ష్మణ్ తీర్ధ నదినుండి ఏర్పడతాయి. స్ధానికులు ఈ నది మాతా దేవి సీతమ్మకు చెందినదిగా తెలుపుతారు.

సహజ అందాలు

సహజ అందాలు

శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత వనవాసానికి వచ్చినపుడు సీతమ్మకు దాహం వేసిందని, ఎంతో విధేయుడైన లక్ష్మణుడు ఒక బాణం భూమిలోకి వేసి ఆ నదిని పైకి తెప్పించాడని చెపుతారు.

 స్వేచ్చా విహారం

స్వేచ్చా విహారం

నాగార్హోలె ప్రదేశం చిన్నదే కావచ్చు. కాని దానికిగల సహజ అందాలు ఒక్కసారి పరవశింప జేస్తాయి. సహజ అడవులు, జలపాతాల కారణంగా పర్యాటకులు అధిక సంఖ్యలో ఆకర్షించబడతారు.

 జీవ వైవిధ్యం

జీవ వైవిధ్యం

నాగర్ హోలే కు వెళ్ళే మార్గం ఎంతో అందంగా కనపడుతుంది. వన్య జంతువుల స్వేచ్చా విహారంతో మరింత అందంగా ఉండి ఆశ్చర్య చకితులను చేస్తుంది.

ఎపుడు చూడాలి ?

ఎపుడు చూడాలి ?

దట్టమైన అడవులు కలిగి అంతులేని జీవ వైవిధ్యం కలదిగా ఉంటుంది. వివిధ మొక్కలు, పక్షులు, జంతువులు కనపడతాయి. అడవి మధ్యలో కల జంతువుల స్వేచ్చా జీవనం తప్పక చూసి ఆనందించదగిన ప్రదేశం ఇది.

ఎపుడు చూడాలి ?

ఎపుడు చూడాలి ?

వర్షాకాలంలో ఈ ప్రాంతాన్ని సందర్శించటం చాలా కష్టం. నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఈ జంతువుల స్వేచ్చా విహారం సౌకర్యవంతంగా చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X