Search
  • Follow NativePlanet
Share
» »రేవుపోలవరం బీచ్ మంచి పిక్నిక్ స్పాట్ మాత్రమే కాదు..అద్భుతమైన షూటింగ్‌ స్పాట్‌ కూడా

రేవుపోలవరం బీచ్ మంచి పిక్నిక్ స్పాట్ మాత్రమే కాదు..అద్భుతమైన షూటింగ్‌ స్పాట్‌ కూడా

రేవుపోలవరం బీచ్ మంచి పిక్నిక్ స్పాట్ మాత్రమే కాదు..అద్భుతమైన షూటింగ్‌ స్పాట్‌ కూడా

విశాఖ అనగానే.. ఆర్కేబీచ్‌, రుషికొండ, యారాడ బీచ్‌లే అనుకుంటాం. విశాఖకు 75 కి.మీ. దూరంలో ఉన్న రేవులపోలవరం తీరం వాటికేమాత్రం తీసిపోదు. ఇక్కడికి వచ్చేవరకు తెలియదు.. ఈ ప్రాంతాన్ని ఎక్కడో చూశామని. కాసేపు ఆలోచిస్తే.. ఫలానా సినిమాలో.. హీరో, హీరోయిన్ల లవ్‌ సీన్‌ ఇక్కడే తీశారని తడుతుంది. పర్యాటకులకు ఆనందాలు పంచుతున్న తీరం.. అద్భుతమైన షూటింగ్‌ స్పాట్‌ కూడా.

విశాఖ జిల్లా సోయగాలకు అద్దం పడుతూ..

విశాఖ జిల్లా సోయగాలకు అద్దం పడుతూ..

విశాఖ జిల్లా సోయగాలకు అద్దం పడుతూ.. కొబ్బరి చెట్లతో అలరిస్తూ ఆహ్వానిస్తుంది రేవుపోలవరం. కనులముందు ఉప్పొంగుతున్న కడలిని చూడగానే.. మనసు బడలిక తీరిపోతుంది. అలా సంద్రం వంక చూస్తూ నిలబడితే.. కెరటాలు పాదాలను ముద్దాడుతాయి.

Photo Courtesy: Rajib Ghosh

ఒడ్డుకు వచ్చిన అలలు వెళ్తూ వెళ్తూ..

ఒడ్డుకు వచ్చిన అలలు వెళ్తూ వెళ్తూ..

ఒడ్డుకు వచ్చిన అలలు వెళ్తూ వెళ్తూ.. కాళ్ల కింద ఇసుకనే కాదూ.. మన మదినీ దోచుకెళ్తాయి. ఇన్ని విశేషాలను ఆస్వాదిస్తుండగానే.. తీరం నుంచి సముద్రంలోకి నిర్మించిన వంతెన అటుగా రమ్మని పిలుస్తుంది.

PC: narsipatnamonline.com

సుమారు 200 మీటర్ల పొడవైన వంతెనపైకి వెళ్తే..

సుమారు 200 మీటర్ల పొడవైన వంతెనపైకి వెళ్తే..

సుమారు 200 మీటర్ల పొడవైన వంతెనపైకి వెళ్తే.. సంద్రం మధ్యలో నిల్చున్న అనుభూతి కలుగుతుంది. ఈ అనుభవాలన్నిటినీ మూటగట్టుకోవడానికి విశాఖ, చుట్టుపక్కల జిల్లాల నుంచి రేవుపోలవరం వచ్చే సందర్శకులతో తీరం కళకళలాడుతుంది.తీరంలోని అందాలు చూసేందుకు వేలాదిమంది పర్యాటకులు ఇక్కడికి తరలివస్తారు.

PC:www.facebook.com

పెద్దగా ఆటుపోట్లు లేని సముద్ర తీరంగా పేరుండడంతో

పెద్దగా ఆటుపోట్లు లేని సముద్ర తీరంగా పేరుండడంతో

పెద్దగా ఆటుపోట్లు లేని సముద్ర తీరంగా పేరుండడంతో, ఈ బీచ్‌లో పర్యాటకుల సందడి ఎంతో ఎక్కువగా ఉంటుంది.విశాఖ జిల్లాలోని ఎస్‌.రాయవరం మండలంలో ఉన్న రేవుపోలవరం ఎంతో ఆకర్షణీయమైన సముద్రతీరం. సముద్ర మట్టానికి 26 మీటర్ల ఎత్తులో ఉన్న ఇక్కడి బీచ్‌ పర్యాటకులకు మంచి సందర్శనా స్ధలమే కాకుండా, జిల్లా వాసులకు మంచి పిక్‌నిక్‌ స్పాట్‌గా ఉంటుంది.

PC:narsipatnamonline.com

 విశాఖపట్నం నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్‌కు

విశాఖపట్నం నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్‌కు

విశాఖపట్నం నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్‌కు నేరుగా రోడ్డు మార్గంలో వెళ్లవచ్చు. ఈ బీచ్‌ మరోవైపు తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుకు కూడా చేరువలో ఉండడంతో ఇక్కడి హంసవరం రైల్వే స్టేషన్‌ నుంచైనా చేరుకునే అవకాశం ఉంటుంది. రేవుపోలవరంబీచ్‌ ఎన్నో ప్రకృతి సోయగాలకు ఆలవాలమైనప్పటికీ, ఇక్కడ రెస్టారెంట్లు, రిసార్ట్‌లు వంటివి ఇంకా ఏర్పాటు కావాల్సివుంది.

PC:PC: narsipatnamonline.com

కొండపై విశాఖ కైలాసగిరి మాదిరిగా

కొండపై విశాఖ కైలాసగిరి మాదిరిగా

కొండపై విశాఖ కైలాసగిరి మాదిరిగా ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇవి వైజాగ్‌ కైలాసగిరిపై కొలువుదీరిన ఆదిదంపతుల మూర్తులను గుర్తుకుతెస్తాయి. అలల కొండను ఢీకొనడంతో ఏర్పడిన వివిధ ఆకృతులు, ఎంతో చరిత్ర కలిగిన లక్ష్మీమాధవస్వామి గుడి, తీరంలో నిర్మించిన జెట్టీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. తీరాన్ని ఆనుకుని కొబ్బరి తోటలు ఎక్కువగా ఉన్నాయి. విహారయాత్రకు వచ్చేవారిలో ఎక్కువగా తీరం వద్దనే వంటలు వండుకుని వనసమారాధన చేస్తారు.

Photo Courtesy: kmdangi

సుందరమైన తీరంలో ఎన్నో సినిమాలు షూటింగ్‌ జరుపుకొన్నాయి.

సుందరమైన తీరంలో ఎన్నో సినిమాలు షూటింగ్‌ జరుపుకొన్నాయి.

సుందరమైన తీరంలో ఎన్నో సినిమాలు షూటింగ్‌ జరుపుకొన్నాయి. సింహాద్రి నుంచి గీతగోవిందం వరకు ఎన్నో చిత్రాల్లో రేవుపోలవరం కనువిందు చేసింది. షార్ట్‌ఫిల్మ్‌లు, సీరియల్స్‌ షూటింగ్‌లు కూడా తరచూ జరుగుతుంటాయి. ఈ విశేషాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఉంటారు పర్యాటకులు. ఉదయాన్నే వచ్చి సాయంత్రం దాకా కులాసాగా గడిపి.. గంపెడన్ని సంతోషాలతో తిరుగు ప్రయాణం అవుతారు.

Photo Courtesy: Srichakra Pranav

రేవుపోలవరం తీరానికి వచ్చే పర్యాటకులు అడ్డురోడ్డు కూడలి

రేవుపోలవరం తీరానికి వచ్చే పర్యాటకులు అడ్డురోడ్డు కూడలి

రేవుపోలవరం తీరానికి వచ్చే పర్యాటకులు అడ్డురోడ్డు కూడలి నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణించాలి. తీరానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలో ప్రయాణం చేయాలి. రైలులో వచ్చే పర్యాటకులు నర్సీపట్నం రోడ్‌ రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడి నుంచి ఆటోలో రేవుపోలవరం చేరుకోవచ్చు.

PC:

తూర్పుగోదావరి జిల్లా తుని

తూర్పుగోదావరి జిల్లా తుని

తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి 35 కి.మీ., విశాఖపట్నం నుంచి 75 కి.మీ దూరంలో ఉంటుంది రేవుపోలవరం. ఈ రెండు చోట్ల నుంచి నక్కపల్లి అడ్డరోడ్డు మీదుగా రేవుపోలవరం చేరుకోవచ్చు. నక్కపల్లి అడ్డరోడ్డు నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి.

PC:narsipatnamonline.com

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X