» »ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన గుహలను మీరు చూశారా?

ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన గుహలను మీరు చూశారా?

Posted By: Venkata Karunasri Nalluru

భీమ్ బెట్కా గుహలు మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు కేవలం కేవలం 50 కిలోమీటర్ల దూరంలో అమర్ కంటక్ నది తీరంలో రతపాని వన్యప్రాణి అభయారణ్యంలో చూడవచ్చును. ఈ ప్రదేశం నిశ్శబ్దంగా ఉంటుంది. జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాక పాండవులు కొంతకాలం ఈ గుహల్లో తలదాచుకున్నట్లుగా తెలుస్తుంది. పురావస్తు శాఖ అధ్యయనం ప్రకారం 15000 ఏళ్ల కిందటే ఆదిమానవుడు ఇక్కడ నివసించినట్లు ఆధారాలు వున్నాయి.

భీమ్ బెట్కా గుహలు కనుగొనే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త వీ.ఎస్. వకాన్కర్ రైలులో భోపాల్ కు వెళుతుండగా తాను ఐరోపా ఖండంలో చూసిన గుహలను పోలిన వాటిని ఇక్కడ చూసాడు. ఆతర్వాత 1957 లో తన బృందంతో కలిసి గుహలను కనుగొన్నాడు. పురాతత్వ శాస్త్రవేత్త వీ.ఎస్. వకాన్కర్ రైలులో భోపాల్ కు వెళుతుండగా తాను ఐరోపా ఖండంలో చూసిన గుహలను పోలిన వాటిని ఇక్కడ చూసాడు. ఆతర్వాత 1957 లో తన బృందంతో కలిసి గుహలను కనుగొన్నాడు.

భీమ్ బెట్కా గుహల విశేషాలు

ఎరక్టస్ ఆదిమానవులు

ఎరక్టస్ ఆదిమానవులు

భీమ్ బెట్కా గుహలలో లక్ష సంవత్సరాల క్రితం హోమో ఎరక్టస్ ఆదిమానవులు నివసించారు. భీమ్ బెట్కా గుహలు ప్రాచీన శిలాయుగం కాలం నాటివి.

pc : Nagarjun Kandukuru

మొత్తం గుహలు

మొత్తం గుహలు

భీమ్ బెట్కా లో మొత్తం 750 గుహలు వున్నాయి. ఇందులో 243 భీమ్ బెట్కాకి చెందినవిగా మరియు 178 లకర్ జువార్ వర్గానికి చెందినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ గుహలలో సందర్శకుల కోసం 12 మాత్రమే తెరచి ఉంచారట.

pc :Raveesh Vyas

గుహలలో పెయింటింగ్స్

గుహలలో పెయింటింగ్స్

ఆదిమానవులు వేసిన పెయింటింగ్స్ గుహలలో ప్రధాన ఆకర్షణలు. గుహలలో సుమారు 453 పెయింటింగ్స్ కలవు. ఇవి 30,000 ఏళ్ల క్రితం నాటివిగా చెబుతారు.

pc :Michael Gunther

ప్రపంచ వారసత్వ సంపద

ప్రపంచ వారసత్వ సంపద

భీమ్ బెట్కా గుహలను యునెస్కో 2003 లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఒకానొక రాతిగుహలో చేతిలో త్రిశూలం కలిగి నాట్యం చేస్తున్న భంగిమలోని చిత్రం ఇక్కడి పెయింటింగ్స్ లో కెల్లా సెంటర్ ఆఫ్ అట్ట్రాక్షన్స్.

pc :Michael Gunther

బార్కేదా వనరు

బార్కేదా వనరు

భీమ్ బెట్కా గుహలో ఉన్న ఏక శిలపై ఉపయోగించిన రంగుల యొక్క ముడిసరుకు బార్కేదా వనరుగా వ్యవహరించారు పురాతత్వ శాస్త్రవేత్తలు.

pc :Nagarjun Kandukuru

అరుదైన చిత్రాలు

అరుదైన చిత్రాలు

కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా గుహలలో అరుదైన చిత్రాల కోతకు గురైతున్నాయి. వీటిని సంరక్షించడం కోసం పురావస్తుశాఖ రసాయనాలను మరియు మైనాన్ని ఉపయోగిస్తున్నది.

pc :Santanu77

సందర్శన సమయం

సందర్శన సమయం

భీమ్ బెట్కా గుహలను ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించవచ్చు.

pc :Raveesh Vyas

భోపాల్ కు 50 కిలోమీటర్ల దూరం

భోపాల్ కు 50 కిలోమీటర్ల దూరం

భీమ్ బెట్కా గుహలు భోపాల్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కనుక ముందు భోపాల్ చేరుకొని అక్కడి నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా భీమ్ బెట్కా చేరుకోవచ్చు.

pc :Michael Gunther

వాయు మార్గం ద్వారా

వాయు మార్గం ద్వారా

భీమ్ బెట్కా గుహలకు సమీపాన 45 కిలోమీటర్ల దూరంలో రాజ భోజ్ ఎయిర్ పోర్ట్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి విమానాలు వస్తుంటాయి.

pc :Michael Gunther

భీమ్ బెట్కా చేరుకోవటం

భీమ్ బెట్కా చేరుకోవటం

టాక్సీ లేదా క్యాబ్ అద్దెకు తీసుకొని భీమ్ బెట్కా సులభంగా చేరుకోవచ్చు.

pc :Nagarjun Kandukuru

రైలు మార్గం ద్వారా

రైలు మార్గం ద్వారా

భోపాల్ రైల్వే స్టేషన్ భీమ్ బెట్కా కు 37 కి. మీ ల దూరంలో కలదు. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి, పట్టణాల నుండి చక్కగా కనెక్ట్ చేయబడింది.

pc :Nagarjun Kandukuru

రోడ్డు మార్గం ద్వారా

రోడ్డు మార్గం ద్వారా

భీమ్ బెట్కా కు చుట్టుపక్కల ప్రాంతాల నుండి, భోపాల్, ఇండోర్ నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి.

pc :Nagarjun Kandukuru