Search
  • Follow NativePlanet
Share
» »సాలార్ జంగ్ మ్యూజియం, హైదరాబాద్ !!

సాలార్ జంగ్ మ్యూజియం, హైదరాబాద్ !!

సాలార్ జంగ్ మ్యూజియం "దార్-ఉల్-షిఫా" వద్ద గల ఒక కళా సంగ్రహాలయము. హైదరాబాదు నగరంలోని మూసీ నది దక్షిణ ఒడ్డున గలదు. భారతదేశం లోని 3 జాతీయ మ్యూజియం లలో ఇది ఒకటి.

By Mohammad

సాలార్ జంగ్ మ్యూజియం "దార్-ఉల్-షిఫా" వద్ద గల ఒక కళా సంగ్రహాలయము. హైదరాబాదు నగరంలోని మూసీ నది దక్షిణ ఒడ్డున గలదు. భారతదేశం లోని 3 జాతీయ మ్యూజియం లలో ఇది ఒకటి. ఇందు "ఏనుగు దంతాల కళాకృతులు", "పాలరాతి శిల్పాలు" గలవు మరియు జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలుచేతివ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు ఉన్నాయి.

చరిత్ర

హైదరాబాద్ యొక్క సాలార్ జంగ్ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్, ఆసియా మరియు దూర ప్రాచ్య దేశాలలో యొక్క కళాత్మక వస్తువుల భాండాగారం. ఈ సేకరణ ప్రముఖంగా సాలార్ జంగ్ III సేకరించారు. 1914 లో, సాలార్జంగ్ తర్వాత ప్రధాన మంత్రి, నిజాం VII, నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్, సేకరించారు. నలభై సంవత్సరాల కాలంలో అతనికి ద్వారా సేకరించిన విలువైన మరియు అరుదైన కళ వస్తువులు, కళ వంటి అరుదైన చాలా అరుదైన ముక్కలు సాలార్ జంగ్ మ్యూజియంలో ఉన్నాయి.

సాలార్ జంగ్ మ్యూజియం

సాలార్ జంగ్ మ్యూజియం

చిత్రకృప : Neeresh.kr

సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడవ అతిపెద్ద సంగ్రహాలయంగా ఉంది. వివిధ నాగరికతలు చెందిన సేకరణలు మరియు 1వ శతాబ్దం చెందిన పురాతన వస్తువులకు భారతదేశంలో ప్రసిద్ధి. 1951 డిసెంబరు 16 న ఈ సంగ్రహాలయం ప్రజలకొరకు తెరవబడింది. హైదరాబాదుకు చెందిన నిజామ్ పరిపాలకుల "సాలార్ జంగ్ కుటుంబం" ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన వస్తు సామగ్రి, కళాఖండాలు సేకరించింది.

ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులూ, నగలూ, నగిషీలూ, యుద్ధసామగ్రీ, పర్షియా తివాసీలు మొదలగునవి ఉన్నాయి. ఈ సేకరణలన్నీ దాదాపు మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సేకరించినవే, ఇతను సాలార్ జంగ్ IIIగా ప్రసిధ్ధి. కొన్ని సేకరణలు ఇతడి తండ్రియైన "మీర్ లయీఖ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ II" మరియు "నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ I"కు చెందినవి.

సేకరణలు

సాలార్ జంగ్ కు చెందిన నగరమహలులో 78 గదులలో 40,000 వస్తువులు గలవు. ఇందులో ప్రముఖంగా : పరదాలో యున్న "రెబెక్కా", జహాంగీర్ చురకత్తి, నూర్జహాను పండ్లుకోసే కత్తి, 12వ శతాబ్దానికి చెందిన "యాఖూతి ఉల్-మస్తామీ" యొక్క ఖురాన్ ప్రతి, గడియారం మరియు "స్త్రీ-పురుష శిల్పం" ప్రధానమైనవి.

సాలార్ జంగ్ మ్యూజియం

వస్తుసేకరణలు

చిత్రకృప : NAGASREENIVASARAO PUPPALA

సేకరణల్లో గ్రంథాలు, పోర్సిలీన్, తుపాకులు, ఖడ్గాలు, శిల్పాలు ప్రపంచపు నలుమూలలనుండి తెప్పించి భద్రపరచబడినవి. భారత పార్లమెంటు, ఈ సంగ్రహాలయాన్ని "జాతీయ ప్రాముఖ్యం" గల సంగ్రహాలయంగా గుర్తించింది.

సందర్శన వేళలు మరియు రుసుము

ఈ మ్యూజియం ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకూ సందర్శకులకొరకు తెరవబడి యుంటుంది. మరియు ప్రతి శుక్రవారం సెలవు. మ్యూజియం సందర్శించటానికి టికెట్ తీసుకోవలసి ఉంటుంది. టికెట్ ధర రూ. 20/-.

మ్యూజియం చేరుకోవటానికి లోకల్ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అఫ్జల్ గంజ్ నుంచి మ్యూజియం సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ లో విమానాశ్రయం ఉన్నది. మ్యూజియం సమీపాన కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

గోల్కొండ కోట గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?గోల్కొండ కోట గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

ఎయిర్ పోర్ట్ లో దిగేవారు క్యాబ్ అద్దెకు తీసుకొని డైరెక్ట్ గా మ్యూజియం చేరుకోవచ్చు. ఒకవేళ సిటీ బస్సులో ప్రయాణించే వారు అఫ్జల్ గంజ్ వరకు ప్రయాణించి (శంషాబాద్ - అఫ్జల్ గంజ్ బస్సు), అక్కడి నుండి నడక మార్గాన మ్యూజియం చేరుకోవచ్చు.

సాలార్ జంగ్ మ్యూజియం

అఫ్జల్ గంజ్

చిత్రకృప : Ryan

సిటీ బస్సు నెంబర్లు

సికింద్రాబాద్ స్టేషన్ నుండి అఫ్జల్ గంజ్ బస్ నెంబర్లు :

1,1C,1J,1P,2,2C,2J,2U,2V,2Z,7Z,8A,8C & 8M. అఫ్జల్ గంజ్ నుండి నడక మార్గాన మ్యూజియం చేరుకోవచ్చు.

నాంపల్లి స్టేషన్ నుండి అఫ్జల్ గంజ్ బస్సు నెంబర్లు :

8M,8R,8U, 9,9D,9E,9F,9K,9C,9M,9Q,9R,9X,9Y/F,65,65M & 65S. అఫ్జల్ గంజ్ నుండి నడక మార్గాన మ్యూజియం చేరుకోవచ్చు.

మహాత్మాగాంధీ బస్ స్టాండ్ :

మహాత్మాగాంధీ బస్ స్టాండ్ నుండి నడక మార్గాన మ్యూజియం చేరుకోవచ్చు.

జూబ్లీ బస్ స్టాండ్ :

8R ఎక్కి అఫ్జల్ గంజ్ లో దిగి, అక్కడి నుండి కాలినడకన మ్యూజియం చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X