Search
  • Follow NativePlanet
Share
» »మధ్యప్రదేశ్ టూరిజం అంబాసిడర్ గా సల్మాన్ ఖాన్

మధ్యప్రదేశ్ టూరిజం అంబాసిడర్ గా సల్మాన్ ఖాన్

మధ్యప్రదేశ్ టూరిజం అంబాసిడర్ గా సల్మాన్ ఖాన్

దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఇండోర్ మొదటి స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ లో పర్యాటక రంగం ప్రోత్సహించడానికి పర్యాటక రాయబార కార్యాలయం సూపర్ స్టార్ ను ఎంపిక చేసింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ యొక్క పర్యాటక రంగం ప్రోత్సహించడానికి రాయబారిగా ఉన్నారు, ఇండోర్ కు సల్మాన్ ఖాన్ కు సంబంధం ఉంది. ఎలాగంటే సల్మాన్ ఖాన్ పూర్వీకులు ఇండోర్లో ఉండేవారు, సల్మాన్ ఖాన్ ఇండోర్లో జన్మించాడు.ఇక్కడే అతని బాల్యం మొత్తం జరిగింది సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ముంబాయ్ కి శిఫ్ట్ అవ్వడానికి ముందు ఇండోర్లోనే ఉండేవారు.

PC:Superfast1111

ప్రధాన ఆకర్షణలు

ప్రధాన ఆకర్షణలు

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పర్యటనకు వెళ్లాలని కోరుకుంటున్నట్లైతే..ఇక్కడ కొన్ని ప్రధాన ఆకర్షణలు గురించి తెలుసుకుందాం..ఇండోర్లో రాజ్వాడా ప్యాలెస్, లాల్ బాగ్ మహాల్, గాంధీహాల్, ప్రాంతీయ పార్కా రోడ్ మరియు బిజాసన్ మాతా మందిర్ వంటి అనేక ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

PC: Wikindia24x7

రాజావాడా ప్యాలెస్:

రాజావాడా ప్యాలెస్:

ఇండోర్ లోని రాజ్వాడా ప్యాలెస్ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో దేశీయులు మరియు విదేశీయులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఈ భవనం హోల్కర్ రాజవంశీయుల యొక్క నివాసం. మరాఠా నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ప్యాలెస్ 200 సంవతసరాల క్రితం చుట్టూ నిర్మించబడింది, ఇది ఫ్రెంచ్ మరియు మొఘల్ నిర్మాణంలో చూడవచ్చు.

PC:Anupams123

లాల్ బాగ్ మహాల్:

లాల్ బాగ్ మహాల్:

లాల్ బాగ్ నిర్మాణం, మహారాజా మహాల్ హోల్కర్ శివాజీ రావు నిర్మించారు. ఈ భవనం ఖాన్ నది ఒడ్డున ఉంది. ఇది మూడు అంతస్తుల భవనం. హోల్కర్ రాజవంశయులు ఈ ప్యాలెస్ అతిథి గ్రుహాలుగా ప్రభుత్వం మార్చేసిందిఈ ప్యాలెస్ యొక్క ప్రధాన ప్రవేశం ద్వారం ఇంగ్లాండ్ లోని బర్డిగం శైలిలో నిర్మించబడింది. భారతదేశంలో మరియు ఇటలీలో అద్భుతమైన కళాకృతులతో ఈ రాజభవనం అలంకరించబడి ఉంది. ఈ ప్యాలెస్ ను 28 ఎకరాల్లో నిర్మించబడిన ఈ ప్యాలెస్ ఒక గులాభీ పుష్పంతో అందమైన పూలతోట ఉంటుంది.

PC: DipankarSn

ఇండోర్ మ్యూజియం

ఇండోర్ మ్యూజియం

ఇండోర్లో ఒక అందమైన మ్యూజియం ఉంది ఈ మ్యూజియంలో ఇతిహాసాలకు సంబంధించిన వస్తువులు భద్రపరచబడినవి. ఇది సెంట్రల్ మ్యూజియం అని కూడా పిలుస్తారు. రాజ శిల్పశైలికి మాత్రమే కాదు, చారిత్రక చరిత్ర కూడా ఉన్నాయి.

PC:Ganesh Dhamodkar

అన్నపూర్ణ మందిరం:

అన్నపూర్ణ మందిరం:

అన్నపూర్ణకి అంకితం చేయబడిన ఈ మందిరాన్ని 9వ శతాబ్ధంలో నిర్మించబడినది. ఇది ఇండోర్ లోని పురాతన ఆలయం అని చెప్పబడినది. ఈ ఆలయాన్ని ఆర్యన్లు, ద్రావిడ శైలిలో నిర్మించారు. ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు మనస్సుకు కొంత ప్రశాంతత లభిస్తుంది.

PC: Krisbillore

రలామండల వైల్డ్ లైఫ్ శాంక్చురి

రలామండల వైల్డ్ లైఫ్ శాంక్చురి

ఇండోర్ లోని రలామండల వైల్డ్ లైఫ్ సంక్చురి ప్రకృతికి నివాసంగా చెప్పవచ్చు. ఇక్కడ అనేక గుల్మకాయ చెట్లు ఉన్నాయి. అనేక జంతువులు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు జింక సఫారీ అనుభవాన్ని అనుభవించవచ్చు.

PC:Nirmalameena

కాంచే కా మందిర్

కాంచే కా మందిర్

కాంచే కా మందిర్ అంతర్భాగం పూర్తిగా గాజు పలకలతో కప్పబడి ఉంటుంది. అంతా నేల, స్తంభాలు, గోడలు మరియు పైకప్పులతో సహా గాజుతో తయారు చేయబడినది. సేథ్ హుకుంఖండ్ను జైపూర్ మరియు ఇరాన్ నుండి కొంతమంది కళాకారులచేత నిర్మింపబడినది. ఈ మందిరం యొక్క అలంకరణ పురాతన మరియు మధ్యయుగ జైన్ శైలిని తలపిస్తుంది, రంగురంగుల గాజు మరియు అద్దాల ఉపయోగించడం వల్ల ఈ మందిరం ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
PC:Malaiya

గాంధీ మహాల్:

గాంధీ మహాల్:

ఇండోర్లోని గాంధీ హాల్ మధ్య ప్రదేశ్ లో ఒక చారిత్రక స్మారకం. ఇది బ్రిటీష్ కాలంలో నిర్మించబడింది. దీన్నీ ఘంటాఘర్ అని కూడా పిలవబడింది, ఈ ఘంటాఘర్ ను సమయం తెలపడానికి నిర్మించబడినది. ఈ స్మారక భవనం గోపురంపై నాలుగు వైపులా పెద్ద గంటలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి నుండి దూరం నుండి అయినా సమయం తెలుసుకోవడానికి సాధ్యం అవుతుంది.
PC: Asif0717

హరిసద్ది టెంపుల్ :

హరిసద్ది టెంపుల్ :

ఈ ఆలయంలోని దేవత చాలా శక్తివంతమైనదని స్థానికులు నమ్ముతారు. ఉజ్జయిని లోని హరిసిధి టెంపుల్, భారతదేశంలోని అత్యంత పర్యాటక ప్రదేశాలలో ఒకటి. పురాణ కథలతో సంబంధం ఉన్నందున ఈ స్థలం చాలా ప్రసిద్ది చెందినది. శ్రీ హరి సిద్ది దేవి ఆలయం భారతదేశంలో మధ్యప్రదేశ్ లో పురాతన ఆలయాల్లో ఒకటి . దేశంలో అత్యంత పురాతన 51 శక్తి ఆలయాల్లో 13వ శక్తి పీఠంగా విరాజిల్లుతోంది.
PC: Bernard Gagnon

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X