» »పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

సప్తదేవీ హిల్ టెంపుల్స్

మానసాదేవి ఆలయం

ఈ ప్రార్థనామందిరం శక్తిస్వరూపిణిఅయిన మానసాదేవికి అంకితం ఇవ్వబడినది.ఉత్తరాఖాండ్ లో ఈ గుడిగురించి టూకీగా చెప్పాలంటే ఆదివాసీలు ఎక్కువగా పూజించే ఈ దేవత నిజానికి చాలా యుగాల తర్వాత హిందూధర్మంలో పూజలందుకోవటం మొదలుపెట్టిందని చెప్పాలి. తన చుట్టూ పాముల్ని అలంకారంగా ధరించే హాలాహలం సేవించిన శివుడి గరళం నుంచి విషప్రభావాన్ని దూరంచేసిందని,అందుకే జతగా ఈ శక్తిస్వరూపాన్ని శివుడు తన కుమార్తెగా స్వీకరించాడని ఒక కధ బాగా ప్రాచుర్యంలో వుంది. ఆమెకు గల ఔన్నత్యాన్ని పెంపొందించాలని సంకల్పించిన సిద్దపురుషులు హిందువులకు అత్యంత పవిత్రమైన హరిద్వార్ పుణ్యక్షేత్రంలోని బిల్వపర్వత శ్రేణిలో మానసాదేవి ఒక ఆలయాన్ని నిర్మించారని అక్కడే ఆవిడ పూజలందుకుంటోందన్నమాట.

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

మా శారదా దేవి ఆలయం

మధ్యప్రదేశ్ లోని సత్రా జిల్లాలో వున్న ఈ మందిరానికి పురావస్తుశాఖ వారు ఒక వున్నతస్థానాన్ని కల్పించారు. పాశ్చాత్యుల పరిభాషలో వర్ణించే పాలియోలిథిక్ యేజ్ కాలం ఆదిమమానవ అవశేషాలు ఇక్కడ దొరికాయట.వాటిని భద్రపరచటానికి చేసిన పరిశోధనలలో ఓ కథ ప్రాచుర్యంలోకొచ్చింది.

pc:youtube

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

సతి మృతదేహాన్ని తన భుజంపై మోసుకువెళ్ళే శివుడు ముల్లోకాలు శోకంతో పర్యటించే వేళ ఆమె మెడలో నుంచి జారిన హారం ఇప్పటి మైహార్ అని ఆమె ప్రియభక్తులైన సోదరులు అల్లాహ్ మరియు వుడాల్ ఆ ప్రదేశంలో అమ్మవారిని పూజించటంవల్ల వారికి పృథ్వీరాజ్ చౌహాన్ తో యుద్ధంచేసేందుకు బలం చేకూరిందని చెబుతారు.

pc:youtube

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

చాముండేశ్వరీ ఆలయం

క్రౌంచ్య శక్తిపీఠంగా ఈ మహా పుణ్యక్షేత్రం సప్తమాతృకాదేవి ఆలయాలలో ఒకటవటానికి గల కారణం యోగినివ్యవస్థకు ఆదిభూతులైన 64యోగినులలో ఒకరైన చాముండిఆమ్మవారు కాళికామాతకు చాలా దగ్గరిపోలికలు వుండే ఈ చండా, ముండా అనే రాక్షసుల సంహారం తరువాత వారి అభ్యర్ధన మేరకు వారి పేర్లతో పిలిపించుకోవటం మొదలుపెట్టింది అమ్మ అని పేర్కొంటారు చాలా మంది పండితులు.

pc:youtube

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

12వ శతాబ్దిలో హోయిసల రాజ్యాధినేతలు కట్టించారని తెలుస్తోంది. అమ్మవారి పతైన మహాశివుడి వాహనం నంది ఇక్కడ ప్రధానఆకర్షణ. 15అడుగులపొడవు, 24అడుగుల వెడల్పు అయిన గ్రానైట్ నంది అక్కడున్న 1000మెట్ల దారిలో 800మెట్టు దగ్గర ఈ నంది మనకు కనిపిస్తుంది.

pc:youtube

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

సప్తశ్రుంగీ దేవి ఆలయం

మహారాష్టలోని నాశిక్ ప్రాంతంలో వున్న ఈ గుడి ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. సతీదేవి శరీరభాగాలైన కాళ్ళు మరియు కుడిచేయు ఇక్కడ పడగా ఈ సప్తపర్వతశిఖరాల మధ్య వున్న అమ్మవారిని భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా పూజిస్తారు.స్థలపురాణం ప్రకారం ఇక్కడున్న అమ్మవారు స్వయంభూ దేవతని 18 చేతులతో సింధూరవర్ణంతో తేజోమయంగా విరాజిల్లుతోందనితెలుస్తుంది.

pc:youtube

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

ఇక్కడకొచ్చిన భక్తులకు సకల గుణ సంపన్నతో పాటు ధైర్యాన్ని,శౌర్యాన్ని పెంపొందించేవిధంగా ఆమె కధలను పండితులు భక్తులకు వుపదేశిస్తారు. ఆ సప్తపర్వతాలల్లో ఒక్కటైన మహానిద్రిపర్వతంమీద అమ్మవారు భౌతికంగా భక్తులకు దర్శనం ఇచ్చారని తన అవతారానికి కారణమైన రాక్షసవధ సమాప్తికావటం, ఈ ఆలయంద్వారా అప్పటినుండి భక్తుల కోర్కెలు తీర్చే దేవతగా విరాజిల్లుతోందని తెలుస్తోంది.

pc:youtube

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

ఇంద్రకీలాద్రి ఆలయం

ప్రపంచంలోని అందరి తెలుగువారికీ సుపరిచయం అయిన ఆలయం ఇంద్రకీలాద్రి ఆలయం. ఇక్కడ వాళ్ళు చెప్పినదాని ప్రకారం ఇంద్రకీలుడు అన్న ముని ఒక కొండమీద అమ్మవారి గురించి ఘోరమైనతపస్సు చేయసాగాడు.దానికి కారణం ఇప్పటి విజయవాడ ప్రాంతంలో ఒకప్పుడు మహిషాసురుడు అనే అసురుడు జనుల్ని రాచిరంపాన పెట్టేవాడు.

pc:youtube

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

అమ్మవారు మహిషాసురమర్ధినిగా విజయం పొందినతర్వాత ఇంక ఆ ప్రాంతం విడచి తాను వెళ్లకూడదని ఇంద్రకీలుడు ప్రార్ధించాడు. అలా ఆయన తల మీద వెలసిన అమ్మవారు అక్కడ భక్తులతో పూజలందుకుంటున్నారు.

pc:youtube

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని మించిన పాశుపతాస్త్రాన్ని పొందినదిఇక్కడే అని వినికిడి.స్వయంభూ అమ్మవారిగా విజయవాడలో ఆ తల్లి కాపాడుతుందని ఏటా అక్కడ జరిగే తెప్పోత్సవాలలో అమ్మవారి స్థలపురాణాన్ని భక్తులకు వివరిస్తారు.

pc:youtube

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

మా తారిణి ఆలయం

ఒరిస్సాలోని కుమారశ్రేణి పర్వతాలలో వుండే ఈ దేవాలయానికి రామాయణకాలం నుండే ప్రాచుర్యం వుంది.రావణుడిచెరలో బందీగా వున్న సీతమ్మను వెతికే క్రమంలో రామలక్ష్మణులు అమ్మవారి గురించి చేసే పూజలో ఆకాశవాణి వినిపించి ఎట్టి పరిస్థితులలోను అమ్మవారిని తమ కళ్ళతో చూడరాదని తెలియపరచింది.

pc:youtube

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

కాని లక్ష్మణుడు అమ్మవారిని చూడగా అమ్మవారి ప్రకోపం నుంచి లక్ష్మణుడ్ని కాపాడుకోదలచి శ్రీరాముడు నింద తనపై వేసుకొని ఆమె కోపానికి బలిఅవ్వటానికి తెగించాడు.కాని సాక్షాత్తూ విష్ణు అంశతో జన్మించిన రాముణ్ణి అమ్మవారు శపించకుండా అక్కడే ఒక శిలగా మారిపోయారని తెలియవస్తుంది.

pc:youtube

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

అలా ఖ్యాతికెక్కిన అమ్మవారు భక్తుల కోరికలు తీరుస్తూ ట్రైబల్ గాడెస్ అని బ్రిటీష్ వారు కూడా అమ్మవారికి ప్రత్యేక స్థానం కల్పించారట.అప్పటినుండి ఒడిషా రాష్ట్రానికి ఇలవేల్పుగా అమ్మవారు ప్రభుత్వలాంచనాలతో పూజలందుకుంటున్నారు.

pc:youtube

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

వైష్ణోదేవి ఆలయం

జమ్మూకాశ్మీర్ లో విశ్వవ్యాప్తంగా ఖ్యాతికెక్కిన వైష్ణోదేవి ఆలయం తెలియని వారుండరు. కాట్రాపర్వతం మీదున్న త్రికూటపర్వత శ్రేణిలో కొలువైవున్న అమ్మవారు మహిమలు చూపి భక్తులను కాపాడుతుందనిఅందుకే చాలామంది మా వైష్ణోదేవి అనే మొదటి పేరును తమ అసలుపేరుకు ముందున చేర్చుకునితరిస్తారని తెలిసింది.

pc:youtube

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

పర్వత శ్రేణుల్లో వెలసిన అద్భుతమైన సప్త దేవి ఆలయాలు..!

5200అడుగులపైనుండే ఈ ఆలయం చాలామందికి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది. ప్రతికూల వాతావరణం, ఉగ్రదాడులు మొదలైన విషయాలను దృష్టిలోపెట్టుకుని భారతసైన్యం తరఫున ఒక బేస్ క్యాంప్ ఇక్కడ ఎప్పుడూ అందుబాటులో వుంటుంది.

pc:youtube