Search
  • Follow NativePlanet
Share
» » నారదుడికి స్త్రీ రూపం వచ్చి పెళ్లి జరిగిన క్షేత్రం గురించి తెలుసా? సందర్శిస్తే మీరు

నారదుడికి స్త్రీ రూపం వచ్చి పెళ్లి జరిగిన క్షేత్రం గురించి తెలుసా? సందర్శిస్తే మీరు

గర్వం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ 5వేల ఏళ్లనాటి దేవాలయం. అపర బ్రహ్మచారి అయిన నారదముని తన గర్వంతో తన బ్రాహ్మచర్యాన్ని పోగొట్టుకున్నాడు. అంతేకాకుండా ఓ మహిళగా మారి సాధారణ మనిషిని పెళ్లిచేసుకొన్నాడు.

అటు పై శత్రువుల చేతికి చిక్కకూడదని చెప్పి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అడవుల్లోకి పారిపోయాడు. చివరికి ఆ శ్రీమన్నారయణుడి దయ వల్ల తిరిగి స్త్రీ రూపం నుంచి పురుష రూపం పొందాడు. ఇక బ్రహ్మచర్యాన్ని తిరిగి పొందడం కోసం పాతాళ భావనారాయణుడిని ప్రతిష్టించాడు.

ఈ ఘటనలను అన్నీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోనే జరిగాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక నారదముని ప్రతిష్టించిన ఆ భావనారయణుడి వల్ల అది పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రాన్ని సందర్శించి అక్కడి కొలనులో స్నానం చేయడం వల్ల మీరు చేసిన పాపాలన్నీ పోతాయని చెబుతారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం మీ కోసం...

 పంచ భావనారాయణ క్షేత్రాలు

పంచ భావనారాయణ క్షేత్రాలు

P.C: You Tube

పంచభూత లింగాలు, పంచరామాలు, పంచ కేశవాలయాల వలే పంచ భావనారాయణ క్షేత్రాలు కూడా మన తెలుగు నేల పై ఉన్నాయి. అవి వరుసగా భాపట్ల, పొన్నూరు, భావదేవరపల్లి, సర్పవరం, పెదగంజాం. కాగా, పూర్వం సర్పాలు ఎక్కువ ఉండటం వల్ల సర్పవరానికి ఆ పేరు వచ్చిందంటారు.

సర్పవరం

సర్పవరం

P.C: You Tube

ఇందులో అత్యంత పురాతన మైనది సర్పవరం. ఇక్కడ ఉన్న భావనారాయణ స్వామి దేవాలయం దాదాపు 5000 సంవత్సరాల క్రితం నిర్మించినదని చెబుతారు. ఇక్కడ అపర బ్రహ్మచారిగా పేరొందిన నారదుడికే పెళ్లి అయ్యిందని స్థలపురాణం వివరిస్తుంది.

 బ్రహ్మవైవర్త పురాణం

బ్రహ్మవైవర్త పురాణం

P.C: You Tube

దీంతో తన బ్రహ్మ చర్యానికి అంటిన కళంకాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడే నారదుడు ప్రతిష్టించి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడని చెబుతారు. ఇందుకు గల పురాణ కథనం బ్రహ్మవైవర్త పురాణములో చెప్పబడింది.

త్రిమూర్తులతో సహా

త్రిమూర్తులతో సహా

P.C: You Tube

అంతే కాకుండా అగస్త్య మహామర్షి సర్పవరంలోని భావనారాయణ క్షేత్రం గురించి సనకసనందాదులకు కూడా వివరించినట్లు మన పురాణాల్లో ఉన్నాయి. పూర్వం ఇంద్రుడి సమక్షంలో త్రిమూర్తులతో సహా చాలా మంది దేవతలు సమావేశమవుతారు.

లోక కళ్యాణం

లోక కళ్యాణం

P.C: You Tube

లోక కళ్యాణం గురించి, ఇందుకు త్రిమూర్తులు పాడుపడుతున్న విధానం గురించి, ఆ ముగ్గురు మూర్తులకు మిగిలిన దేవతలు సహకారం అందిస్తున్న విషయం పై చర్చ జరుగుతూ ఉంది. ఈ సమయంలో లోక కళ్యాణం, ప్రజల సుఖ శాంతుల కోసం కొన్ని సార్లు విష్ణువు చేసే మాయలను అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదని ఇంద్రుడు పేర్కొంటాడు.

 నారదుడు

నారదుడు

P.C: You Tube

అందువల్లే దానిని విష్ణు మాయ అంటారని మిగిలిన దేవతలు విష్ణువును పొగడ్తలతో ముంచెత్తుతారు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన నారదుడు నిత్యం విష్ణు నామాన్ని పారాయణం చేసే తాను విష్ణు మాయకు అతీతుడని పేర్కొంటాడు.

సంధ్యావందనం

సంధ్యావందనం

P.C: You Tube

అంతేకాకుడా ఆ మాయ వెనుక ఉన్న మర్మాలన్నీ తనకు ముందుగానే తెలుస్తాయని గర్వంతో మాట్లాడుతారు. ఇది జరిగిన కొంత కాలానికి నారదుడు భూలోక వివాహానికి వెలుతాడు. ఆ సమయంలో ప్రస్తుతం సర్పవరంలో ఉన్న కొలనులో సంధ్యావందనం చేయాలని చేయడం కోసం దిగుతాడు.

అందమైన స్త్రీగా

అందమైన స్త్రీగా

P.C: You Tube

దీంతో ఆయన వెంటనే అందమైన స్త్రీగా మారిపోతాడు. అంతే కాకుండా గట్టున పెట్టిన తన వీణ, కమండలం కనిపించవు. అదే సమయంలో అక్కడకు వచ్చిన స్థానిక రాజు నికుంఠుడి స్త్రీ రూపంలో ఉన్న నారదుడి అందానికి ముగ్దుడై పోతాడు.

శత్రువుల చేతిలో రాజు

శత్రువుల చేతిలో రాజు

P.C: You Tube

అటు పై గాంధర్వ వివాహం చేసుకొని తన కోటకు తీసుకువెలుతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రాజు శత్రువుల చేతిలో హతమవుతాడు. రాజ్యం శత్రువులు ఆక్రమించుకోవడంతో వారి నుంచి తప్పించుకొన్న స్త్రీ వేశంలోని నారదుడు అడవుల్లోకి పారిపోతాడు.

శ్రీమన్నారయణుడు

శ్రీమన్నారయణుడు

P.C: You Tube

అలా అడవుల్లో తిరుగుతూ తాను ఎక్కడైతే స్త్రీగా మారాడో అదే ప్రాంతానికి వస్తాడు. అక్కడ ఆకలి తీర్చుకోవడానికి చెట్టు పై ఉన్న పండును తినడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటాడు. అదే సమయంలో మారు వేశంలో అక్కడకు శ్రీమన్నారయణుడు వస్తాడు.

మునిపటి నారద రూపం

మునిపటి నారద రూపం

P.C: You Tube

నీవు ఈ సరస్సులో మునకవేస్తేనే ఆ చెట్టు పై ఉన్న పండు నీకు దక్కుతుందని చెబుతాడు. దీంతో స్త్రీ వేశంలో ఉన్న నారదుడు ఆ చెట్టును కొమ్మను పట్టుకునే ఆ కొలనులోకి దిగుతాడు. దీంతో వెంటనే స్త్రీ వేశం వెళ్లి పోయి మునిపటి నారద రూపం వస్తుంది.

చేతికి గాజులు

చేతికి గాజులు

P.C: You Tube

అయితే చెట్టు కొమ్మను పట్టుకొన్న చేయి మాత్రం నీటిలో తడవక పోవడం వల్ల ఆ చేతికి ఉన్న గాజులు అలాగే ఉండిపోతాయి. ఒడ్డుకు వచ్చిన నారదుడికి జరిగిన విషయం మొత్తం విష్ణు మాయగా అర్థమవుతుంది.

క్షమాపణ

క్షమాపణ

P.C: You Tube

ఈ ఘటన మొత్తం తనకు తెలియకుండా జరిగిందని కూడా తెలుసుకొంటాడు. దీంతో విష్ణు మాయ మొదట తనకే తెలుస్తుందన్న తన వాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని అక్కడే ఉన్న విష్ణువును చెబుతాడు.

వెయ్యి సంవత్సరాలు తపస్సు

వెయ్యి సంవత్సరాలు తపస్సు

P.C: You Tube

ఇక తన బ్రహ్మచర్యం తిరిగి పొందడానికి నారాయణుడి సూచనమేరకు పాతాళ భావనారాయణ స్వామిని ప్రతిష్టించి వెయ్యి సంవత్సరాలు ఘెర తపస్సు చేస్తాడు. అటు పై రాజ్యలక్ష్మీ అమ్మవారిని అక్కడ ప్రతిష్టింపజేసి తిరిగి దేవ కార్యక్రమంలో మునిగిపోతాడు.

రెండు కొలనులు

రెండు కొలనులు

P.C: You Tube

కాగా నారదుడు ముందుగా స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందిన కొలను, అటు పై మునిగి స్త్రీ రూపాన్ని వదిలించుకున్న కొలనులు రెండూ ఇక్కడ పక్కపక్కనే ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. ఇక ఆలయం విశాలమైప ప్రాకారాన్ని కలిగి ఉంటుంది.

ఉత్తరాన గాలిగోపురం

ఉత్తరాన గాలిగోపురం

P.C: You Tube

ఉత్తరాన గాలిగోపురం, తూర్పున సింహద్వారం ఉంది. దక్షిణదిశలో పూలతోట, ఉత్తరాన కళ్యాణ మంటపం, తూర్పుదిశలో ధ్వజస్తంభం ఉంటాయి. ఈ ధ్వజస్తంభానికి ఇరు వైపులా గరుడ, ఆంజనేయ విగ్రహాలను మనం చూడవచ్చు.

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

P.C: You Tube

కాకినాడ నుంచి సర్పవరానికి కేవలం 5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇక కాకినాడ నుంచి సర్పవరం చేరుకోవడం చాలా సులభం. అటోలు, బస్సులు ప్రతి అరగంటకు ఒకటి అందుబాటులో ఉంటాయి.

సామర్లకోట రైల్వే స్టేషన్

సామర్లకోట రైల్వే స్టేషన్

P.C: You Tube

దగ్గరగా సామర్లకోట రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడకు దగ్గరగా ఉన్న బస్ స్టేషన్లో మధవ పట్నం వెళ్లే బస్సలు బోలెడు. మధవ పట్నంలో దిగితే భావనారాయణ స్వామి దేవాలయం 1.5 కిలోమీటర్లు మాత్రమే. అటోలు అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more