Search
  • Follow NativePlanet
Share
» »నల్లమల ఫారెస్ట్ లోని సలేశ్వర జలపాతం చూడాలంటే ఎంతో ధైర్యం.. అదృష్టం ఉండాలి

నల్లమల ఫారెస్ట్ లోని సలేశ్వర జలపాతం చూడాలంటే ఎంతో ధైర్యం.. అదృష్టం ఉండాలి

తూర్పు కనుమల్లో ఒక భాగంగా ఉన్న నల్లమల అడవులు ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల్లోని 5 జిల్లాల్లో(మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కడప, కొద్ది మేర నల్గొండ జిల్లాలలో) విస్తరించి ఉన్నాయి. నల్లమల కొండల సరాసరి ఎత్తు 520 మీ. వీటిలో 923 మీ. ఎత్తుతో బైరానీ కొండ మరియు 903 మీ. ఎత్తుతో గుండ్ల బ్రహ్మేశ్వరం కొండ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ అడవుల్లో పులులు సమృద్దిగా ఉండటం వలన ఈ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ గా ప్రకటించారు. ఇది మన దేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణాకేంద్రం. టైగర్ సఫారీ పేరిట ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారు నల్లమలఅడవిలో స్వేచ్ఛగా తిరగాడే జంతువులను, పులులను పర్యాటకులకు చూపిస్తారు.

నల్లమల అడవులు ఆధ్యాత్మిక పరంగా, ప్రకృతి పరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఈ దట్టమైన అడవిలో గుళ్ళు, గోపురాలు, జలపాతాలకు లెక్కలేదు. రోడ్డు ప్రక్కన ఉన్న ప్రదేశాలకు వెళ్ళవచ్చేమో ... కానీ అడవుల్లో దాగి ఉన్న కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలంటే దేవుడు కనిపిస్తాడు. ట్రెక్కింగ్ చేసుకుంటూ ... వెళ్ళవచ్చు!

ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం

ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం

ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము.

PC: youtube

ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం

ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం

ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలి పౌర్ణమికి మొదలగుతుంది. మండు వేసవిలో జాలువారే జలపాతాలు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నీటిగుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి. కష్టమైనా ఇష్టంగా సలేశ్వరం చేరుకుని మొక్కును తీర్చుకుంటారు భక్తులు.

pc: youtube

 ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు

ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు

శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరంలో వుంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలొమిటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.

pc: youtube

ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు

ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు

ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. శ్రీశైలం మల్లికార్జునస్వామి, సలేశ్వర లింగమయ్యస్వామి, లుండి మల్లన్న,ఉమామహేశ్వరం ఈ 4 లింగాలే అందరికీ తెలిసినవి. ఆ ఐదో లింగం నల్లమయ్య అడవులలో ఎక్కడ వుందో ఇప్పటికి రహస్యమే. ఇక్కడ సంవత్సరంలో 5 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది.

PC: SDATTAREDDY

ఇక్కడ సలేశ్వరం జలపాతం

ఇక్కడ సలేశ్వరం జలపాతం

సలేశ్వర క్షేత్రం మహబూబ్నగర్ జిల్లా నల్లమల అడవిలో ఉంది. ఇక్కడ సలేశ్వరం జలపాతం గురించి చెప్పుకోవాలి. ఆకాశ గంగను తలపించే మహత్తర జలపాతం ఇక్కడ ఉంది. ఈ జలపాతం వేసవిలో చల్లగా ఉంటుంది. కొండల్లో శివుడు కొలువై ఉంటాడు.

PC : SDATTAREDDY

చుట్టూ ఉన్న ప్రకృతి నిజంగా స్వర్గమనే చెప్పాలి

చుట్టూ ఉన్న ప్రకృతి నిజంగా స్వర్గమనే చెప్పాలి

చుట్టూ ఉన్న ప్రకృతి నిజంగా స్వర్గమనే చెప్పాలి. దట్టమైన అడవిలో ఎత్తైన కొండలలో ప్రకృతి అందాల మధ్య సాగుతుంది సలేశ్వర యాత్ర. కాలిబాటన వచ్చే భక్తులను ప్రకృతి అందాలు అడుగడుగునా కట్టిపడేస్తాయి. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.

PC: youtube

చుట్టూ ఉన్న ప్రకృతి నిజంగా స్వర్గమనే చెప్పాలి

చుట్టూ ఉన్న ప్రకృతి నిజంగా స్వర్గమనే చెప్పాలి

నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది.

PC : SDATTAREDDY

జాగ్రత్త !!

జాగ్రత్త !!

గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టల మధ్య లోయ లోనికి దిగాలి. ఆ దారిలో ఎన్నెనో గుహలు గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం. గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే. చిత్రకృప : Avinash Kantamaneni

లింగమయ్య స్వామి లింగం

లింగమయ్య స్వామి లింగం

లింగమయ్య స్వామి లింగం గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనె ప్రధాన దైవ మైన లింగమయ్య స్వామి లింగం ఉంది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడా లింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి.

చిత్రకృప : SDATTAREDDY

జాతర

జాతర

జాతరకు 15రోజుల ముందు నుంచి ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. సలేశ్వరం జాతర సంవత్సరాని కొకసారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరగడం వల్ల కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు "వత్తన్నం వత్తన్నం లింగమయ్యో" అంటు వస్తారు. వెళ్లేటప్పుడు "పోతున్నం పోతున్నం లింగమయ్యొ" అని అరుస్తూ నడుస్తుంటారు.

చిత్రకృప : SDATTAREDDY

ఎక్కడ ఉంది

ఎక్కడ ఉంది

ఇది తెలంగాణలోని మాహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల అడవులలో వుంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలొ 150 కిలోమీటర్ రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో వుంది. మన్ననూరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలోని ఒక లోయలో ఈ క్షేత్రం ఉంటుంది. ప్రతి సంవత్సరం చైత్ర పున్నమి రోజు ఈ క్షేత్రానికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు.

చిత్రకృప : Avinash Kantamaneni

సలేశ్వరం ఎలా చేరుకోవాలి ?

సలేశ్వరం ఎలా చేరుకోవాలి ?

హైదరాబాద్ - శ్రీశైలం వెళ్ళే దారిలో మన్ననూర్ అనే ఊరు వస్తుంది. అక్కడి నుండి 10 -12 KM దూరం శ్రీశైలం వెళ్ళే మార్గంలో వెళ్తే ... సలేశ్వరం అనే బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు చూపించే గుర్తు వైపు 10 కిలోమీటర్లు వెళ్తే ... సలేశ్వరం లోయ కనిపిస్తుంది. అక్కడే వాహనాలు, బస్సులు ఆపాలి. లోయలో ఐదు కిలోమీటర్లు నడిస్తే ... ఆకాశ గంగను తలపించే జలపాతం, గుహలు కనిపిస్తాయి. అదే సలేశ్వర క్షేత్రం.

pc: youtube

సలేశ్వరం ఎలా చేరుకోవాలి ?

సలేశ్వరం ఎలా చేరుకోవాలి ?

మరో మార్గంలో హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై ఫరహాబాద్ చౌరస్తా నుంచి 16 కి. మీ. అటవీ మార్గం గుండా ప్రయాణించి, రాంపూర్ అనే చెంచు పెంట వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి 6 కి.మీ. దూరం వరకు కాలి నడకన వెళితే సలేశ్వర క్షేత్రం చేరుకోవచ్చు. ఏ మాత్రం ఎబరపాటుగా ఉన్న లోయలో కిందపడతారు సుమి !

pc: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more