Search
  • Follow NativePlanet
Share
» »కర్దో ఫారెస్ట్ లో అత్యంత ఎత్తైన స్వయంభు సిద్ధేశ్వర్ నాథ్ శివలింగం: జిరో

కర్దో ఫారెస్ట్ లో అత్యంత ఎత్తైన స్వయంభు సిద్ధేశ్వర్ నాథ్ శివలింగం: జిరో

కర్దో ఫారెస్ట్ లో అత్యంత ఎత్తైన స్వయంభు సిద్ధేశ్వర్ నాథ్ శివలింగం: జిరో

పూలతోటలకు స్వర్గదామం అరుణాచల్ ప్రదేశ్. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. "అరుణాచల్ ప్రదేశ్" అనే పేరు "సూర్యోదయ సూర్యుని భూమి" అని అర్ధం. అరుణాచల్ లోని అన్యదేశ గిరిజన టూర్, మీరు చూడని అందమైన గిరిజన స్థలాలకు వెళ్తుంది, ఇది స్వర్గం కంటే తక్కువగా ఉండదు. గిరిజన సంస్కృతి కాకుండా, మీరు వృక్ష మరియు జంతుజాలం ​​యొక్క మిరుమిట్లుగల శ్రేణిని ప్రేమిస్తారు. అరుణాచల్ తెగలు ఎంతో సాంస్కృతిక వారసత్వం కలిగివుంటాయి, వారి దుస్తులు వారి రంగుల వైఖరిని ప్రతిబింబిస్తాయి.

అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్ళినపపుడు లోయర్ సుబాన్సిరీ జిల్లాలో సముద్ర తలానికి 1500 మీటర్ల ఎత్తులో ఉన్న 'జిరో'ను తప్పకుండా సందర్శించాలి. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో చేర్చేందుకు ప్రతిపాదించింది. ఇక్కడి ప్రజల ఆచారాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ప్రాచీన అపతానీ తెగకు చెందిన గిరిజనులకు ఇది పుట్టినిల్లు. వీరి జీవనాధారం వ్యవసాయం. చుట్టూ అందమైన పర్వతాలు, మధ్యలో వ్యవసాయ క్షేత్రాలతో జిరో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవిలో భిన్నమైన చల్లని హిల్ స్టేషన్ చూడాలనే ఆసక్తి ఉంటే తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించండి.

ఏటా సెప్టెంబర్ నెలలో జరిగే జిరో మ్యూజిక్ ఫెస్టివల్ ను చూసేందుకు దేశ విదేశాల నుండి యువత ఇక్కడికి వస్తుంటారు. ఈటానగర్ నుండి 167 కిమీ దూరంలో జిరో ప్రాంతం కలదు. అరుణాచల్ ప్రదేశ్ లో జిరో మాత్రమే కాదు మరెన్నో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఎత్తైన శివలింగం సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం

ఎత్తైన శివలింగం సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం

అరుణాచల్ ప్రదేశ్ లోని జిరోలో మరో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం సహజసిద్దంగా ఏర్పడి పూజలు అందుకుంటున్న ఎత్తైన శివలింగం సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం. భక్తులచే నిత్య పూజలు అందుకుంటున్న రాతి లింగం ఎత్తు 25 అడుగులు, చుట్టుకొలత 22 అడుగులు. ఈ రాతి శివ లింగాన్ని మనదేశంలో ఎత్తైన స్వయంభూ లింగంగా చెబుతారు. స్వయంభువుగా వెలసిన ఈ ఎత్తైన రాతి శివలింగాన్ని సందర్శించడానికి ఎక్కడెక్కడి నుండో సందర్శకులు వస్తుంటారు.
arunachaltravelguide

కర్దో ఫారెస్ట్ వద్ద ఉన్న ఈ శివ లింగం

కర్దో ఫారెస్ట్ వద్ద ఉన్న ఈ శివ లింగం

కర్దో ఫారెస్ట్ వద్ద ఉన్న ఈ శివ లింగం హపోలి పట్టణం నుండి 4కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భారి లింగం జూలై 2004వ సంవత్సరంలో హిందు క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో కనుగొనబడినది.

PC: arunachaltravelguide

 స్వయంభు లింగం

స్వయంభు లింగం

ఈ శివలింగం ఏర్పడుటకు ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. స్థానికుల సమాచారం ప్రకారం ఒక నేపాలీ చెట్టును కట్ చేస్తునప్పుడు ఈ లింగాన్ని కనుగొన్నాడు. అప్పటి నుండి అక్కడి స్వయంభు లింగం పూజలు అందుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఏడాది పొడవునా సందర్శిస్తుంటారు.

PC: arunachaltravelguide

ఈ శివలింగం అపారమైన శక్తులు కలిగి ఉంది

ఈ శివలింగం అపారమైన శక్తులు కలిగి ఉంది

ఇక్కడ స్థానికులు ఈ శివలింగం అపారమైన శక్తులు కలిగి ఉందని విశ్వసిస్తారు. వారు ఈ దేవాలయంలోని లింగానికి ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు. చాలా మంది పర్యాటకులు ఈ ఇంత ఎత్తైన అద్భుతమైన శివలింగాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం వేల కొద్ది సందర్శిస్తుంటారు.

ఇటానగర్

ఇటానగర్

ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. దీనిని మినీ భారతం అని కూడా పిలుస్తారు. ఫోర్ట్, మ్యూజియములు, పార్క్, అభయారణ్యం, సరస్సు లతో పాటు పురావస్తు మరియు చారిత్రక ప్రదేశాలు చూడదగ్గవి.

PC:Rudrajit Mukhopadhyay

బొమ్డిలా

బొమ్డిలా

బొమ్డిలా సముద్రమట్టానికి 8000 అడుగుల ఎత్తున ఉంటుంది. యాపిల్ తోటలు, బౌద్ద ఆరామాలు, హిమాలయ శ్రేణులు యాత్రికులను అలరిస్తాయి. సాహస ప్రియులకు పర్వతారోహణ శిక్షణ ఇచ్చే కేంద్రం కూడా కలదు. భాలుక్పొంగ్ , ఈగల్ నెస్ట్ వన్యప్రాణుల అభయారణ్యం, ఏనుగుల రిజర్వ్ ఫారెస్ట్, సేస్సా పూతోటల అభయారణ్యం, బొమ్డిలా గోమ్పాలు ఇక్కడ చూడదగ్గవి.
PC : Karl Heinz Grass

తేజు

తేజు

తేజు అందమైన లోయలకు, నదులకు పేరుగాంచింది. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు పరుశురామ్ కుండ్, డాంగ్, గ్లో సరస్సు , హవా కాంప్, వేడి నీటి బుగ్గలు చూడదగ్గవి. ఇక్కడ ఏటా ఫిబ్రవరి మాసమలో మిష్మి పండగ జరుపుకుంటారు.

PC : Prashanthns

అలాంగ్

అలాంగ్

అలాంగ్ సముద్ర మట్టానికి 619 మీటర్ల ఎత్తులో, పర్వతాల మధ్యలో ఉన్నది. ఇక్కడి సహజ సిద్ద మైన ప్రకృతి సౌందర్యం, లోయలు, ట్రెక్కింగ్, రివర్ రాప్టింగ్, హైకింగ్ వంటివి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆకాశంగంగ, దోనయి పోలో ఆలయం , హాంగింగ్ బ్రిడ్జ్ లు, మలినిథాన్ లు అలాంగ్ లో చూడదగ్గవి.
PC : Catherine Marciniak

తవాంగ్

తవాంగ్

'తవాంగ్' భారతదేశ భౌగోళిక పటంలో సుస్థిర స్థానం కలిగి ఉన్నది. ఇండియా లో మొట్టమొదట సూర్యుడు ఇక్కడే ఉదయిస్తాడు. ఆరామాలు, జలపాతాలు, శిఖరాలు సందర్శకులకు మంత్రముగ్ధులను చేసి ఆనందపరుస్తాయి. తవాంగ్ మానేస్త్రీ, సెలా పాస్, బాలీవుడ్ చిత్రాలకు సరైన ప్రదేశాలుగా ఉన్న అనేక ఇతర జలపాతాలు వంటివి కొన్ని తవాంగ్ లోని ప్రధాన ఆకర్షణలు.

PC : Saurabhgupta8

ఎలా వెళ్లాలి:

ఎలా వెళ్లాలి:

జీరోకు దగ్గరగా ఉండే ఎయిర్ పోర్ట్ తేజ్ పుర్. అయితే వాతావరణ కారణాల రీత్యా ఇక్కడికి వెళ్లే విమానాలు తరుచుగా రద్దువుతుంటాయి. అందుకని ముందుగా అస్సోం రాజధాని గువాహటికి వెళ్లాలి. అక్కడి నుండి నహార్లాగున్ కు రైలులో వెళ్లి..తర్వాత రోడ్డు మార్గం ద్వారా నాలుగు గంటలు ప్రయానిస్తే జీరో చేరుకోవచ్చు. గువాహటి, ఈటానగర్ నుండి జిరోకు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X