» »సిక్కిం .... ప్రకృతి సౌందర్యాల స్వర్గం !!

సిక్కిం .... ప్రకృతి సౌందర్యాల స్వర్గం !!

Posted By:

ఎన్నో ప్రకృతి సౌందర్యాలు ఒదిగినట్లు వుండటంవల్ల, చక్కటి ప్రదేశాలు, మంచుకిరీటాన్ని ధరించిన పర్వతాలు, పూల పాన్పు వంటి మైదానాలు, దివ్యమైన జలవనరులు, ఇంకా ఎన్నో ఉండి, దాదాపుగా ఒక స్వర్గం అనిపించే విధంగా సిక్కిం పర్యటన పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఒక అందమైన అనుభూతిగా పర్యాటకుల అభివర్ణిస్తారు.

సిక్కిం భారతదేశపు ఒక రాష్ట్రము. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే తక్కువ జనాభా కలిగి ఉంది. వైశాల్యంలో రెండవ చిన్న రాష్ట్రం కూడా. సిక్కిం అధికారిక భాష నేపాలీ. రాజధాని గ్యాంగ్టక్ అన్నింటికంటే పెద్ద పట్టణం. ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరంగల కాంచనగంగ పర్వతం సిక్కిం, నేపాల్ లో విస్తరించి ఉంది. సిక్కిం, భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలలో ప్రకృతి దీవెనలతో నిండిన ఎంతో అందమైన ఒక అద్భుత భూమి.

సంస్కృతి

సిక్కింలో దీపావళి, దసరా వంటి హిందువుల పండుగలు, లోసార్, లూసాంగ్, సగదవా, ల్హబాబ్, డ్యూచెన్, ద్రుప్కాతెషి, భుమ్చు వంటి బౌద్ధుల పండుగలు, ఇంకా క్రిస్టమస్, ఆంగ్లనూతన సంవత్సరాది ఉత్సవాలన్నీ జరుపుకుంటారు. పాశ్చాత్య సంగీతము, హిందీ సినిమా పాటలు, స్థానిక నేపాలీ గీతాలూ కూడా జనప్రియమైనవి.

విందులు

నూడిల్సు తో వండే వంటకాలు - తుప్కా, చౌమెయీన్, తంతుక్, ఫక్తూ, గ్యాతుక్, వాంటొన్ - ఎక్కువగా తింటారు. కూరగాయలు, మాంసము వాడకం కూడా ఎక్కువ. ఎక్సైజ్ పన్నులు తక్కువైనందున మధ్యం చౌక కనుక వాడకం కూడా బాగా ఎక్కువ.

గ్యాంగ్టక్

గ్యాంగ్టక్

సిక్కిం రాష్ట్రంలో గ్యాంగ్టక్ అతిపెద్ద నగరంగా ఉంది. తూర్పు హిమాలయములలో 1.437 మీ. ఎత్తులో శివాలిక్ కొండలపైన కనిపిస్తూ అభిమానులను ఆకర్షిస్తుంది. గ్యాంగ్టక్, సిక్కిం పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచి ఉంది. గ్యాంగ్టక్ పట్టణంలో 1840 వ సంవత్సరంలో ఎంచెయ్ మొనాస్టరీ అనే ఆశ్రమం నిర్మాణం తరువాత ప్రధాన బౌద్ధ యాత్రికుల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

Photo Courtesy: Srikanthkashyap

కాంచన్ జంగా

కాంచన్ జంగా

కాంచన్ జంగా ప్రపంచంలోని మూడో అతి పెద్ద పర్వతం. సముద్ర మట్టానికి 8586 మీటర్ల ఎత్తున ఇండియా - నేపాల్ సరిహద్దులో హిమాలయాల్లో వుంది ఈ పర్వతం. కాంచన్ జంగా అంటే "అయిదు మంచు నిధులు'. ఇక్కడే ఉండే 5 శిఖరాలలో ఒక్కోటీ బంగారం, వెండి, జాతి రాళ్ళు, ధాన్యాలు, పవిత్ర గ్రంధాలకు నిధిగా వుంటాయి. కాంచన్ జంగా లో వుండే అయిదు శిఖరాలలో మూడు - ప్రధాన, మధ్య, దక్షిణ శిఖరాలు భారత దేశం లోని ఉత్తర సిక్కిం తోనూ, నేపాల్ లోని తప్లేజంగ్ జిల్లా తోనూ సరిహద్దును కలిగి వుంటాయి. మిగతా రెండు శిఖరాలు పూర్తిగా నేపాల్ లోనే వున్నాయి.డార్జీలింగ్ నుంచి కనపడే అద్భుతమైన దృశ్యాలకు కాంచన గంగా సుప్రసిద్ధమైంది. కొండ పైకి ఎక్కడానికి అనుమతి చాలా అరుదుగా ఇస్తారు కనుక, ఈ పర్వత శ్రేణుల అందం ఇంకా అలానే కాపాడ బడుతూ వుంది.సిక్కిం వాసులు దీన్ని చాలా పవిత్ర స్థానంగా భావిస్తారు.

Photo Courtesy: Tshiring Dorjee Sherpa

ఉత్తరీ

ఉత్తరీ

అందం మరియు ప్రశాంతత కోసం అయినట్లయతే ఉత్తరీ పర్యటన బాగుంటుంది. ఉత్తరీ ప్రస్తుత పశ్చిమ సిక్కిం జిల్లాలో ఉంది. ఇది చాలా ఆకర్షణీయమైన ప్రదేశము. ప్రత్యేకంగా శీతాకాలంలో శిఖరాలను మంచు కప్పబడిన సమయంలో హిమాలయ పర్వతాల యొక్క ఒక అద్భుతమైన వీక్షణను అందిస్తుంది.మీరు గేజింగ్,పెల్లింగ్ లేదా దేన్తుం నుండి చేరవచ్చు. ఈ మార్గంలో సింగ్శోరే వంతెన ఉంటుంది. ఇది ఆసియాలో రెండవ ఎత్తైన వంతెనగా చెప్పబడుతుంది. ఉత్తరీ యొక్క ఎత్తు 6600అడుగుల ఉంటుంది.

Photo Courtesy: Glabb

యమ్తంగ్

యమ్తంగ్

ఇది ఒక అద్భుతమైన విస్తృత దృశ్యాల లోయ! యమ్తంగ్, ఉత్తర సిక్కింలోని ఒక అందమైన ప్రదేశం. అందువల్ల దీనిని సముచితంగా ‘పువ్వుల లోయ' (వ్యాలీ ఆఫ్ ఫ్లవర్సు) గా పిలుస్తారు. అంతుకాదు ఇది ఒక సుందర దృశ్యాల సంపద. వసంత కాలంలో ఈ ప్రదేశం ప్రిములా, రోడోడెండ్రాన్ వంటి అందమైన రంగురంగుల అడవి పూలతో నిండటం వలన పర్యాటకులను దాని వైపుకు ఆకర్షిస్తుంది. దీనితో బాటు, ఇంకా అనేక ప్రలోభపరిచే ఇతర ఆకర్షణలు ఈ అందమైన ప్రదేశంలోను, చుట్టూ ఉన్నాయి.

Photo Courtesy: Pradeep Kumbhashi

అరితర్

అరితర్

తన ప్రాకృతిక అందానికి, వైభవమైన చరిత్రకి ప్రసిద్ది చెందిన తూర్పు సిక్కిం లోని భాగం అరితర్. ప్రకృతి ఒడి లో సేద తీరాలనుకునే వారికి ఇది సరైన పర్యాటక కేంద్రం. ప్రశాంతమైన సరస్సులు, దట్టమైన అడవులు, చీకటి వరి చేల చుట్టూ వుండే కొండలతో వుండే ఈ అందమైన ప్రాంతంలో స్వర్గం లో వున్న అనుభూతిని పొందుతారు. ఉదయం వేళల్లో ఇక్కడి దృశ్యాలు చెప్పలేనంత అందంగా వుంటాయి. మీరు ప్రకృతిని, సాహసాన్ని ప్రేమించే వారైతే అరితర్ చూడాల్సిందే. మీరు కొండల పైకి ఎక్కలనుకున్నా, పాడిల్ బోట్ సవారీ చేయాలనుకున్నా ఇదే సరైన ప్రదేశం. మీ ప్రయాణంలో అడవిలోని పూదోటల అందాలు, పొడవాటి చెట్లు, ఎత్తైన కొండలు చూస్తూ కాలక్షేపం చేయవచ్చు.అరితర్ ఎలా చేరుకోవాలి అంటే అరితర్ వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

Photo Courtesy: Sfan00

పెల్లింగ్

పెల్లింగ్

సముద్ర మట్టానికి 2150 మీటర్ల ఎత్తున పెల్లింగ్ పట్టణం ఉంది. ఈ కొండ ప్రాంతం నుండి మంచుతో కప్పబడిన పర్వతాలను, విస్తృత దృశ్యాలను చూడవచ్చు. దీని గొప్ప చరిత్ర, సంస్కృతి వల్ల గాంగ్టక్ తరువాత సిక్కిం లోని పెల్లింగ్ అత్యంత సందర్సనా స్థలాలలో రెండవదిగా గుర్తించబడింది. పెల్లింగ్ ప్రారంభంలో అనేక వన్యప్రాణులు నివసించే అడవితో నిండిన భూమి.పండుగలు, వేడుకలు సంవత్సరానికి ఒకసారి జరుపుకునే కాంచేన్ జంగా పండుగ రాకతో మొత్తం ప్రాంతం పండుగ ఉత్సాహంతో నిండిపోతుంది. ఈ పండుగ పర్వతాలపై బైకింగ్, సాంప్రదాయ క్రీడల వంటి సాహస కార్యకలాపాలతో పాటు రంగిట్ పై వైట్-వాటర్ రాఫ్టింగ్, కాయాకింగ్, పర్వతారోహణ ప్రచారం, పర్వతాలపై బైకింగ్ వంటి అనేక సరదా కార్యకలాపాలను కూడా ఏర్పాటుచేస్తుంది.చేరుకోవడం ఎలా అంటే పెల్లింగ్ వాయు, రైలు మార్గాల ద్వారా భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది.

Photo Courtesy: Shivali Chopra

జొంగు

జొంగు

జొంగు, ఉత్తర సిక్కింలో వున్న అసలైన వాసులు లేప్చాల భూమి గా ప్రసిద్ధి చెందింది.గ్యాంగ్ టక్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం ప్రాకృతిక దృశ్యాలతో నిండినప్పటికి పెద్దగా అన్వేషించబడలేదు. ఈ ప్రాంతం అద్భుతమైన వృక్ష, జంతు సంపదతో, దాని పర్యాటకులకు పూర్తి సిక్కిం పర్యాటకరంగానికి చెందిన మనోహరమైన అనుభూతిని అందిస్తుంది. జొంగులో పర్యటన అనందాన్నిరెట్టింపు చేస్తుంది.ఈ ప్రాంతంలో సెవెన్ సిస్టర్సు జలపాతాన్ని సందర్శించండి ఒక మరుపురాని అనుభూతిగా నిలుస్తుంది. ఈ స్వస్థలాన్ని సందర్శించినప్పుడు లేప్చాల సంప్రదాయ పానీయం - ఛీ ను రుచి కూడా చూడటం మరువకండి.

Photo Courtesy: Brian Marshall

చుంగ్త౦గ్

చుంగ్త౦గ్

చుంగ్త౦గ్ ఉత్తర సిక్కిం జిల్లాలోని ఒక చిన్న పట్టణం. యుమ్తంగ్ చుంగ్తంగ్ లోయ మార్గం వద్ద ప్రస్తుతం లచుంగ్ చు, లచేన్ చు సంగం నదులను చూడవచ్చు. సిక్కింలోని ఈ చిన్న పట్టణం సిక్కిం ప్రసిద్ధ సాధువు పద్మసంభవ గురు దీవెనలు అందుకుని, పవిత్రంగా భావించబడింది. చుంగ్తంగ్ పట్టణం గొప్ప జీవన వైవిధ్యాన్ని కలిగిఉండి, ఆశక్తికర వృక్ష, జంతుజాలాలు విస్తృతంగా ఉన్నాయి.అంతేకాకుండా, రాయిమీద ఎల్లప్పుడూ నీరు ప్రవహించే చిన్న ద్వారంకూడా ఉంది.

Photo Courtesy: sudeep1106

యుక్సోం

యుక్సోం

యుక్సోం పశ్చిమ సిక్కిం జిల్లా లో కలదు. ఇక్కడ గెయ్జింగ్ అనే ప్రాంతం ధార్మిక మరియు చారిత్రక ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. ట్రెక్కింగ్ చేసే సాహస యాత్రికులకి ఇది ఒక మధుర అనుభూతిని ఇస్తుంది. ఇది పర్యాటక ప్రియులు తప్పక ఆస్వాదించ ప్రదేశం. అంతేకాదండోయ్!చరిత్ర పరంగా కూడా ఇది చాలా ప్రశస్తి .కలది. సుమారు 1780 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గ్రామం రెండువేల ఎకరాలలో విస్తరించింది.యుక్సోం చేరుకోవడం చాలా సులభం ఎందుచేతనంటే ఇక్కడ నుండి 170 కిలోమీటర్ల దూరంలో బాగ్దోగ్రా విమానాశ్రయం ఉంది. రోడ్డు వసతి కూడా కలదు.

Photo Courtesy: ks_bluechip

రూంటెక్

రూంటెక్

రూంటెక్ గ్యాంగ్టాక్ కి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల మధ్యలో ఉన్నది. ఈ పట్టణం టిబెటన్ బౌద్ధులకి ప్రసిద్ది చెందింది. ఇక్కడ బౌద్ధ సన్యాసులు తరచూ వస్తుంటారు. రూంటెక్ మొనాస్టరి ఉండటం వల్ల ఈ ప్రాంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు, కొండలు వీక్షకులకు మతిపోగోడుతుంది. ఇది కొండ మీద ఉండటం వల్ల గ్యాంగ్టాక్ అందాలను ఆస్వాదించవచ్చు.

Photo Courtesy:Indrajit Das

రించెన్ పోంగ్

రించెన్ పోంగ్

రించెన్ పోంగ్ 5576 అడుగుల ఎత్తులో ఉన్నందున ట్రెక్కింగ్ కు అనువైనది. రించెన్ పోంగ్ ప్రకృతి అందాలకు,సోయగాలకు నిలువుటద్దమ్. ఇక్కడున్న కోమలమైన సహజ అందాలను ఆస్వాదిస్తే మంచి అనుభూతి కలగకమానదు. ఇక్కడి నుండి కంచన్ జంగా అందాలను ఆస్వాదించడం మరో రకమైన ఆనందం. ఈ ప్రాంతం కోమలమైన,నిర్మలమైన ప్రకృతి ఒడిలో ఒదిగినట్టుగా ప్రశాంతంగా ఉంటుంది.

Photo Courtesy:Alakananda.s

నామ్చి

నామ్చి

నామ్చి గ్యాంగ్టాక్ కి 92 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సముద్ర మట్టానికి 1675 మీటర్ల ఎత్తులో,చుట్టూ అందమైన ప్రకృతితో కలగలసిన పట్టణం.నామ్చి అంటే భూటియ భాషలో "స్కై హై" అని అర్ధం. నామ్చి పర్యాటకుల దృష్టిలోనే కాకుండా, దాని గొప్ప చరిత్ర, అనేక రకాల పర్యాటక ఆకర్షణలు, కార్యకలాపాల వల్ల పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ది చెందింది. నామ్చి లోని ప్రసిద్ధ బైచుంగ్ స్టేడియం లో "గోల్డు కప్" ఫుట్ బాల్ టోర్నమెంట్ జరుగుతుంది, ఇది అనేకమందిని ఆకర్షిస్తుంది. ఈ స్టేడియం సిక్కి౦వాసుల ఫుట్ బాల్ ఆటగాడు బైచుంగ్ భూటియ గౌరవార్ధం సిక్కిం ప్రభుత్వ౦ చే నిర్మించబడింది.నామ్చి చేరుకోవడం ఎలా అంటే నామ్చిని వాయు, రైలు మార్గాలద్వారా చేరుకోవచ్చు.

Photo Courtesy:Sudarsan Tamang

ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

విమానాశ్రయం
భౌగోళిక కారణాలవల్ల సిక్కింలో విమానాశ్రయం లేదు. కానీ పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి విమానాశ్రయం గ్యాంగ్టక్ కు 124 కి.మీ. దూరంలో ఉన్నది.
రైలు మార్గం
రైలు మార్గాలు లేవు. కానీ సిలిగురికి 16 కి.మీ. దూరంలోని 'క్రొత్త జల్పాయ్‌గురి' సిక్కింకు దగ్గరలోని రైలు స్టేషను.
రోడ్డు మార్గం
సిలిగురినీ గ్యాంగ్‌టక్ నూ కలుపుతూ జాతీయ రహదారి (National Highway 31ఎ) ఉన్నది.

Photo Courtesy:Abhishek Kumar

Please Wait while comments are loading...