Search
  • Follow NativePlanet
Share
» »మహాభారతంలో కూడా ప్రస్తావించిన ఈ ప్రదేశం పర్యాటకులను అద్భుతంగా ఆకర్షిస్తోంది..

మహాభారతంలో కూడా ప్రస్తావించిన ఈ ప్రదేశం పర్యాటకులను అద్భుతంగా ఆకర్షిస్తోంది..

సిర్సా జిల్లాకు ఈ పేరు ఎలా వచ్చిందంటే సిర్సా ముఖ్య కేంద్రం ఉండటం వల్ల ఈ జిల్లాను ఉత్తర భారతదేశంలో చాలా పురాతన ప్రదేశాల్లో ఒకటిగా భావించడం జరుగుతుంది. ఈ ప్రాంతం గురించి మహాభారతంలో కూడా ప్రస్తావన ఉంది. మహాభారతంలో సిర్సాను షిరిక్షిక అని పిలుస్తారు. పూర్వం నకులు తన దండయాత్రలో భాగంగా పశ్చిమాన వున్న సైరిశకను చేజిక్కించుకున్నట్టు ఉంది. భారతీయ పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలను కూడా ఇక్కడ చూడవచ్చు.

సిర్సాకు ఆ పేరు ఎలా వచ్చింది

సిర్సాకు ఆ పేరు ఎలా వచ్చింది

1819 లో ఈ ప్రాంతాన్ని చేజిక్కి౦చుకున్నాక డిల్లీ రాజ్యంలోని వాయువ్య భాగంలో ఒక ప్రాంతమైంది ఈ జిల్లా. మరో సంవత్సరం తరువాత వాయువ్య జిల్లాను ఉత్తర మరియు పశ్చిమ జిల్లాలుగా మరియు సిర్సా యొక్క పశ్చిమ జిల్లాగా విభజించారు. తరువాత దీనికి హర్యానా అని పేరు పెట్టారు.

సిర్సా మరియు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

సిర్సా మరియు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

సిర్సా మరియు చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. సిర్సా జిల్లా పర్యాటకులకు చాలా అందిస్తుంది. షా మస్తానా గా పిలువబడే ఖేమామల్ స్థాపించిన ధార్మిక బృందం డేరా సచ్చా సౌదా కు సిర్సా ప్రధాన కేంద్రం. ఈ తెగ వారు సమాజ సేవా కార్యక్రమాలు చేస్తారు, ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు (లంగర్), పైగా ప్రజల నుంచి ఎటువంటి చందాలు స్వీకరించరు.

మరో ప్రసిద్ధ ధార్మిక సమూహం రాదా స్వామిలకు కూడా

మరో ప్రసిద్ధ ధార్మిక సమూహం రాదా స్వామిలకు కూడా

మరో ప్రసిద్ధ ధార్మిక సమూహం రాదా స్వామిలకు కూడా ఇదే ప్రధాన కేంద్రం. సిర్సా నగరానికి తూర్పున అయిదు కిలోమీటర్ల దూరంలో వున్న సికందర్ పూర్ సమీపంలో రాధా స్వామి సత్సంగ్ ఘర్ వుంది. ఈ తెగ నిజానికి పంజాబ్ లోని అమృతసర్ జిల్లాలోని బియాస్ లో వున్న రాధా స్వామి ప్రధాన కేంద్రానికి శాఖ. సిర్సా లో వున్నప్పుడు కగ్దానా లో వున్న రాం దేవ్ మందిరం కూడా చూడవచ్చు.

 పేరుకు తగ్గట్లే,

పేరుకు తగ్గట్లే,

పేరుకు తగ్గట్లే, ఈ ఆలయం భారతదేశంలోని కొన్ని ఇతర రాష్ట్రాలలో ప్రసిద్ది చెందిన బాబా రామ్‌దేవ్‌జీకి అంకితం చేయబడింది. ప్రధానంగా రాజస్థాన్‌లో మరియు పాకిస్తాన్‌లోని సింధ్‌లో. తో సహా చాలా ఇతర రాష్ట్రాల్లో దైవపురుషుడిగా కొలిచే బాబా రాందేవ్ కోసం నిర్మించారు. పేద వారిని, ఆర్తులను ఆదుకున్నందుకు ఆయన్ను దయామయుడిగా కొలుస్తారు, ఆయనకున్న మహిమాన్విత శక్తుల గురించి కూడా కొన్ని కథలు ప్రచారంలో వున్నాయి.

రాం నగరియా లో వున్న హనుమాన్ దేవాలయం,

రాం నగరియా లో వున్న హనుమాన్ దేవాలయం,

రాం నగరియా లో వున్న హనుమాన్ దేవాలయం, చోర్మార్ ఖేరా లో వున్న గురుద్వారా గురు గోవింద్ సింగ్ కూడా చూడతగ్గవి. సిఖ్ గురువు గోవింద్ సింగ్ ఇక్కడ ఒక రాత్రి గడిపాడని చెప్తారు.

13 వ శతాబ్దంలో డేరా బాబా సర్సాయి నాథ్ దేవాలయం

13 వ శతాబ్దంలో డేరా బాబా సర్సాయి నాథ్ దేవాలయం

13 వ శతాబ్దంలో డేరా బాబా సర్సాయి నాథ్ దేవాలయం సిర్సా లో ఇప్పుడు హిసార్ గేట్ గా పిలువబడే ప్రాంతంలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని నాథ సంప్రదాయానికి చెందినా సర్సాయి నాథ్ అనే గురువు నిర్మించారు, ఆయన కూడా తన అనుచరులతో ఇక్కడ పూజలు, యజ్ఞాలు, ధ్యానం చేసారు.

సిర్సా నగరం,

సిర్సా నగరం,

సిర్సా నగరం, దాని పరిసరాలు మనకు ఘగ్గర్ లోయ ఘన చరిత్ర, సాంస్కృతిక వారసత్వ౦ గురించి తెలియ చేస్తాయి. భారతీయ పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలను కూడా ఇక్కడ చూడవచ్చు.

సిర్సా వాతావరణం

సిర్సా వాతావరణం

సిర్సా లో వేసవి, వర్షాకాలం, శీతాకాలం తో కూడిన ఉప ఉష్ణ మండల వాతావరణం వుంటుంది.

సిర్సా ఎలా చేరుకోవాలి ?

సిర్సా ఎలా చేరుకోవాలి ?

సిర్సా కు రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా రవాణా సౌకర్యాలు వున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X