Search
  • Follow NativePlanet
Share
» »శ్రీకాకుళంలోని ఎండల మల్లికార్జున స్వామిని దర్శిస్తే సర్వ రోగాలు సమసిపోతాయి...

శ్రీకాకుళంలోని ఎండల మల్లికార్జున స్వామిని దర్శిస్తే సర్వ రోగాలు సమసిపోతాయి...

అరుదైన చారిత్రక సంఘటనలకు, ఆధ్యాత్మిక విగ్రహాలకు నెలవు తెలుగునేల. ప్రాచీనకాలం నాటి శివలింగాలన్నీ చిన్నగానే ఉండేవి. అవన్నీ స్వయంభూ లింగాలు కూడా. అయితే స్వయంభూ శివలింగాలలో అతిపెద్దది ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని రావివలసలో ఉంది. మన దేశంలోనే పెద్దదైన ఈ శివలింగం మన రాష్ట్రంలో ఉండడం విశేషం. టెక్కలికి 6 కి.మీ. దూరంలో ఉన్న గ్రామంలో వెలసిన స్వామియే మల్లికార్జునుడు, ఆ గ్రామమే రావివలస. ఈ రావివలసలో ఉన్న ఈ అతిపెద్ద స్వయంభూ లింగం గురించి కొద్దిమందికే తెలుసు. దాని ఎత్తు 55 అడుగులు. అందువల్ల ఇచ్చడ గోపురం ఉండదు. ఆ దైవం ఎప్పుడు ఎండలో ఉండాల్సిందే. అందుకే ఈ స్వామిని ఎండల మల్లికార్జునుడు అనే పేరు ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయ విశేషాలేంటో, ఎలా మల్లికార్జునస్వామి వారికి ఎండల మల్లికార్జును అనే పెరువచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

స్థలపురాణం అనేక ఆసక్తికరమైన సంగతులు

స్థలపురాణం అనేక ఆసక్తికరమైన సంగతులు

స్థలపురాణం అనేక ఆసక్తికరమైన సంగతుల్ని తెలుపుతుంది. శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం లంక నుండి అయోధ్యకు వెళ్తూ శ్రీరాముడు సతిసమేతంగా రావి వలస అరణ్య ప్రాంతంలో సుమంత పర్వతంపై విడిది చేశారని ప్రతీతి.

శ్రీరాముని అనుచరగణంలో ఒకడు..వైద్యుడైన సుశేణుడు

శ్రీరాముని అనుచరగణంలో ఒకడు..వైద్యుడైన సుశేణుడు

శ్రీరాముని అనుచరగణంలో ఒకడు..వైద్యుడైన సుశేణుడు అక్కడి వనమూలికలు, ఔషధ మొక్కల్ని చూచి ఆశ్చర్యపోవడమేకాక, రోగాలబారిన పడిన స్థానికులను చూసి చలించి, ప్రజలను రోగ పీడితుల నుండి విముక్తి కలిగించాలని తద్వారా శివ సాన్నిహిత్యం పొందాలని నిశ్చయించుకుని, అక్కడే ఉండిపోవాలనుకుని తన కోరికను శ్రీరామునికి తెలిపి అనుమతి తీసుకుంటాడు.

సుశేణుడి కోరికను మన్నించిన శ్రీరాముడు

సుశేణుడి కోరికను మన్నించిన శ్రీరాముడు

సుశేణుడి కోరికను మన్నించిన శ్రీరాముడు అతన్ని ఆశీర్వదించి తాను తన అనుచరగనంతో అయోద్యకు వెళ్లాడు. ఈ పర్వతంపై సుశేణుడు ఘోర తపస్సుని ప్రారంభిస్తాడు. తర్వాత కొంత కాలానికి శ్రీరామ చంద్రుడు సుమంత పర్వతంపై తపోదీక్షలో ఉన్న సుశేణుడి యొక్క యోగ క్షేమాలు తెలుసుకుని రమ్మని హనుమంతున్ని కోరాడు.

హనుమంతుడు సుశేణుడి తపస్సు చేస్తున్న పర్వత శికరం చేరగా

హనుమంతుడు సుశేణుడి తపస్సు చేస్తున్న పర్వత శికరం చేరగా

దాంతో హనుమంతుడు సుశేణుడి తపస్సు చేస్తున్న పర్వత శికరం చేరగా అక్కడ సుశేనుడి కలేభరం మాత్రమే కనబడుతుంది. దాంతో సుశేణుడు శివ సాన్నిహిత్యం పొందాడని భావించిన హనుమ అక్కడ ఒక గొయ్యి తవ్వి, అందులో సుశేణుని కలేభరం పూడ్చి పెట్టి మల్లెపూలను ఆ గొయ్యిపై ఉంచి దానిపై జింక చర్మం కప్పి, తిరిగి అయోద్యకు వెళ్ళాడట.

జింక చర్మం తొలగించి చూడగా అక్కడ శివలింగం దర్శనం

జింక చర్మం తొలగించి చూడగా అక్కడ శివలింగం దర్శనం

హనుమ ద్వారా సుశేణుని మరణ వార్త తెలుసుకుని సీతారాములు చింతించి హనుమ సమేతంగా సుమంచ పర్వతంపైకి వస్తారు. శ్రీరామునికి సుశేణుడి కలేబరం చూపించడానికి హనుమ జింక చర్మం తొలగించి చూడగా అక్కడ శివలింగం ఉంది. దానిపై మల్లెపూలు కూడా ఉండటాన్ని చూసిన శీతారాములు తన్మయత్వం చెంది, సీతాసమేతంగా పక్కనే ఉన్న కొలనులో స్నానం చేసి ఆ శివలింగానికి పూజచేశారు.

ఆ శివలింగం పెద్దగా

ఆ శివలింగం పెద్దగా

దాంతో ఆ శివలింగం పెద్దగా పెరుగుతూ ఆ ప్రాంతంలోని ఔషద సువాసనలతో గాలి శివలింగాన్ని తాకగా ప్రచండ పవనాలుగా మారి ఆ గాలి వీచినంత మేర రోగ పీడుతులయిన ప్రజల రోగాలు హరించిపోయాయట. ఈ శివలింగంలో దివ్వతేజస్సు రావడం గమనించి శ్రీరాముడు ఈ లింగానికి గుడి కడదామని భావించిన అది అంతకంతకూ పెరుగుతుండటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.

మల్లెపూలతో కప్పబడిన జినం

మల్లెపూలతో కప్పబడిన జినం

అలా ఆ శివలింగం పెరిగి పెరిగి మహాలింగంగా ఏర్పడింది. మల్లెపూలతో కప్పబడిన జినం అనగా చర్మంతో కప్పబడిన ఉన్నందున ఈ స్వామికి మల్లికార్జున స్వామిగా పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ పేరు మల్లికార్జున స్వామిగా స్థిరపడింది.శివుని పూజించినట్టు ప్రతీతి.

పాండవుల వన వాస సమయంలో

పాండవుల వన వాస సమయంలో

ద్వాపర యుగంలో పాండవుల వన వాస సమయంలో ఇక్కడి వచ్చి సీతారాములు స్నానం చేసిన సీతకుండంగా పిలవబడే కొలనులో స్నానం చేసి స్వామి వారికి అర్చన అభిషేకాలు చేసి కొంత కాలం పాటు ఇక్కడ గుహలో ఉన్నారని స్థల పురాణం చెబుతుంది.

సీతకుండ్ లో స్నానం చేసి స్వామి వారిని దర్శించడం వల్ల

సీతకుండ్ లో స్నానం చేసి స్వామి వారిని దర్శించడం వల్ల

సీతకుండ్ లో స్నానం చేసి స్వామి వారిని దర్శించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ సంబంధిత రోగాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.ఈ దైవాన్ని దర్శిస్తే చాలు పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రజల్లో నమ్మకం. ఈ స్వామిని సేవిస్తే చాలు, కోర్కెలన్నీ తీరుతాయని అంతేకాదు, ముక్తిని జీవన్ముక్తిని భక్తికి, శక్తిని, ప్రసాదించే దైవమని భక్తులకు ప్రగాఢ విశ్వాసం.

టెక్కలి జమిందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర

టెక్కలి జమిందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర

1870 ప్రాంతములో టెక్కలి జమిందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ దేవాలయము నిర్మింపగా అది తొందరలోనే కొంతకాలమునకు శిదిలమైనది. మరికొంతకాలానికి ఆలయనిర్మాణమునకు పూనుకొనగా స్వామి భక్తుల కలలో కనబడి తనకు ఆలయము వద్దనీ వాతావరణ మార్పులలో ఆరుబయట ఉండటమే తనకు ఇష్టమనీ అదే లోక కళ్యాణమనీ తెలియజేసాడు. దానితో దేవాలయ నిర్మాణము విరమించుకొన్నారు.

సుమారు నాలుగైదు వందల సంవత్సరాల నాటి పురాతన దేవాలయం

సుమారు నాలుగైదు వందల సంవత్సరాల నాటి పురాతన దేవాలయం

ఇది సుమారు నాలుగైదు వందల సంవత్సరాల నాటి పురాతన దేవాలయం. దీనిని కంచి కామకోటి పరమాచార్యులు దర్శించి, పూజించారు. కార్తీకమాసంలోని మూడు సోమవారాలు మహాశివరాత్రికి ఎండలమల్లిఖార్జునుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఆ సమయంలో స్వామిని దర్శించుకోవడానికి రావివలస భక్తులు పోటెత్తుతారు.మహాశివరాత్రి, కార్తీకమాసము విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. కార్తీకమాసంలో ఇక్కడ కల అశ్వర్ధ వృక్షం క్రింద గడిపేందుకు, స్వామిని దర్శించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల నండి చాలా మంది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తూ ఉంటారు. రాష్ట్రము నలుమూలల నుండి కూడా యాత్రికులు వస్తుంటారు.

ఎలా వెళ్ళాలి?:

ఎలా వెళ్ళాలి?:

శ్రీకాకుళం నుంచి టెక్కలి దాదాపు 33 కి.మీ. దూరంలో ఉంది, అక్కడి నుంచి మూడు కి.మీ. దూరంలో రావివలస ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X