» »అద్భుతం ... జలకంఠేశ్వరాలయం !!

అద్భుతం ... జలకంఠేశ్వరాలయం !!

Written By:

వేలూరు కోటలో ఉన్న జలకంఠేశ్వరాలయం అతి పురాతనమైనది మరియు అందమైనది. అంతకన్న ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ ఆలయ ఆవరణలో ఉన్న కళ్యాణ మండపం. చూపరులను మంత్ర ముగ్ధులను చేయగల విన్యాసము విజయనగర శిల్ప కళలో ఉంది.

దక్షిణ భారత దేశంలో విజయనగర శిల్పకళ లేని ఆలయం లేదు. ఫలాన గుడిని ఎవరు కట్టించారనగానే వెంటనే వచ్చే సమాధానం శ్రీ కృష్ణ దేవరాయలు అని. వారు కట్టిన అలయాలు అంత విస్త్రుతంగా ఉన్నాయి. వాటిలోని శిల్పకళ కూడా అంత విశిష్టంగా ఉంటుంది. ఆ ఆలయాలలోని కళ్యాణ మంటపాలలోని శిల్పకళ మరీ అద్భుతంగా ఉంటుంది. అలాంటి కళ్యాణ మండపాలలో ముఖ్యంగా, ప్రత్యేకంగా కొన్నింటిని చెప్పుకోవాలి. అవి, హంపి లోని విఠలాలయంలో కళ్యాణ మండపం, మధురై లోని వేయి స్తంభాల మండపం, తిరునల్వేలి లోని మండపం., కోయంబత్తూరు దగ్గర ఉన్న పేరూరు మండపం, రాయ వెల్లూరు లోని జలకంఠేశ్వరాలయంలోని కళ్యాణ మండపం. ఇవి దక్షిణ భారత దేశంలోనే అత్యంత అందమైన మండపాలు.

చారిత్రక ఆధారాలు

చారిత్రక ఆధారాలు

జలకంఠేశ్వరాలయంలోని కళ్యాణ మండపం చిన్నదైనా, శిల్పకళా కౌశలం రీత్యా చాల అద్భుతమైనది. ఇది విజయనగరాధీశుడు సదాశివరాయల కాలంలో కట్టబడినదిగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం రాయవేలూరు కోటలోనే ఉన్నందున, కాల గమనంలో కోటతో బాటు ఈ ఆలయం కూడా బ్రిటిష్ వారి అధీనంలోకి వచ్చింది.

చిత్రకృప : Vaikoovery

ముగ్ధులైన బ్రిటిషు వారు

ముగ్ధులైన బ్రిటిషు వారు

ఈ కళ్యాణ మండపంలోని శిల్పకళా రీతులకు ముగ్ధులైన బ్రిటిషు వారు దానిని ఏ కీలుకు ఆ కీలు జాగ్రత్తగా విడదీసి సముద్రాలు దాటించి లండనులో తిరిగి పునఃప్రతిష్టించాలని భావించారు. దానికి తగిన ఏర్పాట్లన్ని చేసుకున్నారు. దీని కొరకు లండను నుండి ఒక స్టీమరు కూడా బయలు దేరింది.

చిత్రకృప : R.K.Lakshmi

శిల్పకళా కౌశలాన్ని

శిల్పకళా కౌశలాన్ని

కాని వారి దురదృష్టమో, భారతీయుల అదృష్టమో గాని ఆ స్టీమరు మార్గ మధ్యలో మునిగి పోయింది. ఆ సందర్భంలోనే జరిగిన అనేక రాజకీయ కారణాల వల్ల కళ్యాణ మండపాన్ని తరలించే కార్యక్రమం మూలన పడింది. ఆ విధంగా ఆ శిల్పకళా కౌశలాన్ని మనమీనాడు చూడగలుగుతున్నాము.

చిత్రకృప : R.K.Lakshmi

కళ్యాణ మండపం

కళ్యాణ మండపం

ఈ కళ్యాణ మండపం ఆలయ ప్రధాన గోపురానికి ప్రక్కనే ఒక మూలన ఉంది. ఇది మూడు భాగాలుగా ఉంది. ఇందులో అన్నీ కలిపి నలబై ఆరు శిల్ప కళా శోభితమైన స్తంభాలు ఉన్నాయి. ఇందులోనే మధ్యన పైకప్పుకు ఉన్న శిల్పకళను బొమ్మలో చూడవచ్చును.

చిత్రకృప : Harrisask

కూర్మం (తాబేలు) శిల్పం

కూర్మం (తాబేలు) శిల్పం

రెండో భాగం మొదటి దానికన్నా మూడడుగుల ఎత్తున ఉంది. ఏ కారణం చేతనో దీని లోనికి వెళ్లడానికి మెట్లు నిర్మించలేదు. దీని తర్వాత నున్న మూడో భాగం ఇంకొంచెం ఎత్తుగా ఉంది. ఈ రెండు భాగాలకు మాత్రం చుట్టు గోడ ఉంది. మధ్యలో కూర్మం (తాబేలు) శిల్పం చెక్కి ఉంది.

చిత్రకృప : பா.ஜம்புலிங்கம்

దేవతా మూర్తుల చిత్రాలు

దేవతా మూర్తుల చిత్రాలు

స్తంభాలపై అష్ట దిక్పాలకుల చిత్రాలు, వినాయకుడు, విష్ణు, బ్రహ్మ, భూదేవి, శ్రీదేవి, సరస్వతి, పార్వతి మొదలగు దేవతా మూర్తుల చిత్రాలు అత్యంత సుందరంగా చిత్రించి ఉన్నాయి. ఇవి గాక నాట్య గత్తెల, సంగీత కారుల, శిల్పాలు కూడా ఉన్నాయి.

చిత్రకృప : பா.ஜம்புலிங்கம்

ప్రత్యేకం

ప్రత్యేకం

ప్రతి స్తంభం మీద శిల్పకళను వివరంగా గమనిస్తే, అనేక పురాణ గాధలను స్ఫురింప జేస్తాయి. ఇందులోని ఒక శిల్పం గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది ఒక ఎద్దు, ఒక ఏనుగు ఎదురెదురుగా నిలబడి ఉన్నట్టుంది. కాని ఆ రెండింటికి తల ఒక్కటే.

చిత్రకృప : பா.ஜம்புலிங்கம்

శిల్ప కళా వైచిత్రి

శిల్ప కళా వైచిత్రి

ఎద్దు శరీరాన్ని మూసి చూస్తే ఏనుగు కనిపిస్తుంది. అలాగే ఏనుగు శరీరాన్ని మూసి చూస్తే ఎద్దు ఆకారం కనబడుతుంది. ఇలాంటి చిత్రం హంపి లోని అచ్యుత రామాలయంలోను, హజరా రామాలయంలోను, దసరా దిబ్బ ప్రక్కన మైదానంలోను ఉన్నాయి. ఇదొక శిల్ప కళా వైచిత్రి.

చిత్రకృప : Nsmohan

జలకంఠేశ్వర టెంపుల్ ప్రత్యేకత

జలకంఠేశ్వర టెంపుల్ ప్రత్యేకత

ఈ దేవాలయంలో త్రిమూర్తులందరూ తమ భార్యలతో కొలువై ఉండటమే. శ్రీ మహావిష్ణువు లక్మిదేవి తో , బ్రహ్మ సరస్వతి దేవి తో మరియు శివుడు పార్వతీ దేవి తో కొలువై ఉన్నారు.

చిత్రకృప : Ravindraboopathi

ఉత్సవాలు/ పండుగలు

ఉత్సవాలు/ పండుగలు

చిత్రపూర్ణిమ (ఏప్రిల్- మే) 10 రోజులు, సురసంహారం (అక్టోబర్ - నవంబర్), ఆదిపూరం (జులై-ఆగస్టు), వినాయక చతుర్థి (ఆగస్టు-సెప్టెంబర్), నవరాత్రి (సెప్టెంబర్-అక్టోబర్) ఘనంగా జరుగుతాయి.

చిత్రకృప : Nandhinikandhasamy

సందర్శించువేళలు

సందర్శించువేళలు

టెంపుల్ తెరుచువేళలు : ఉదయం 6:00 AM -1:00 PM వరకు మరియు సాయంత్రం 5:00 PM - 8:30 PM వరకు భక్తుల సందర్శనార్థం తెరుస్తారు.

అడ్రెస్స్ : శ్రీ జలకందేశ్వర టెంపుల్, కోట, వెల్లూరు - 632 001, వెల్లూరు జిల్లా.

ఫోన్ : +91 98947 45768, 98946 82111, + 416 222 3412, 222 1229

చిత్రకృప : Surya Teja

వెల్లూరు చేరుకోవడం ఎలా ?

వెల్లూరు చేరుకోవడం ఎలా ?

బస్సు మార్గం : బెంగళూరు, తిరువాతి, చెన్నై, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి రెగ్యులర్ గా వేలూరు కు బస్సులు తిరుగుతుంటాయి. బస్ స్టాండ్ లో దిగి ఆటో రిక్షాలో వేలూరు కోటలోని జలకంఠేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు.

రైల్వే స్టేషన్ : వెల్లూరు లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక మరియు చెన్నై నుండి రైళ్ళు నడుస్తాయి.

విమాన మార్గం : తిరుపతి దేశేయ విమానాశ్రయం, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లు వెల్లూరు పట్టణానికి చేరువలో ఉన్నాయి.

చిత్రకృప : Haneeshkm

Please Wait while comments are loading...