Search
  • Follow NativePlanet
Share
» »కార్తీకమాసంలో ఈ దేవాలయాన్ని దర్శిస్తే కైలాసాన్ని దర్శించినట్లే?

కార్తీకమాసంలో ఈ దేవాలయాన్ని దర్శిస్తే కైలాసాన్ని దర్శించినట్లే?

కార్తీకమాసంలో కాళహస్తిని చాలా మంది భక్తులు దర్శించుకొంటూ ఉంటారు.

హిందు ధర్మంలో పూజాధి కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వాటిని ఏదో ఒక ధార్మిక కార్యక్రమంలాగా కాకుండా తమ ఇంటి సంప్రదాయంగా భావిస్తారు. ఒంటికి నలతగా ఉన్నా లేదా ఇంట్లో పరిస్థితులు కొంత తారుమారు అయినా కూడా దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. ఇటువంటి పూజా కార్యక్రమాల్లో కాలసర్పదోష నివారణ పూజలు గురించి ప్రముఖంగా ప్రస్తావించాలి. ముఖ్యంగా శివుడికి అత్యంత ఇష్టమైన ఈ కార్తిక మాసంలో ఈ కాలసర్పదోష నివారణ పూజలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శ్రీ కాళహస్తిలోని కాళహస్తీస్వర దేవాలయానికి సంబంధించిన కథనం మీ కోసం.

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

P.C: You Tube

శ్రీకాళహస్తీశ్వర దేవాయం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది. కాళహస్తిని దక్షిణకాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో కొలువై ఉన్నాడు. ఆయన స్వయంభువుడు. లింగానికి ఎదురుగా ఉన్న దీపం ఆ లింగం నుంచి వచ్చే గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది.

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

P.C: You Tube
అందువల్లే శ్రీకాళహస్తీశ్వర లింగాన్ని వాయులింగం అని కూడా అంటారు. ఇక్కడ శివలింగం చతురస్రాకారంలో ఉంటుంది. స్థానిక పురాణం ప్రకారం కన్నప్ప అనే బోయవాడు నిత్యం స్వామిని పూజిస్తూ ఉండేవాడు.

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

P.C: You Tube

అతని భక్తిని పరీక్షించాలని భావించిన పరమశివుడు ఒకరోజు ఇక్కడి శివలిం పై ఉన్న ఒక కంటి నుంచి రక్తం వచ్చేటట్టు చేస్తాడు. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చుతాడు. అప్పుడు స్వామి రెండవ కంటి నుంచి కూడా నెత్తురు కారడం మొదలవుతుంది.

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

P.C: You Tube

భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చుతాడు. దీంతో కన్నప్ప భక్తికి మెచ్చిన పరమశివుడు ఆయన ఎదుట ప్రత్యక్షయ్యి మోక్షాన్ని ప్రసాదిస్తాడు.

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

P.C: You Tube

కాశీ క్షేత్రం వలే ఇక్కడ చనిపోయినవారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారకమంత్రమును ఉపదేశించి మోక్షం ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. ఈ దేవాలయం మూడు జంతువుల పేర్ల కలయికతో

ఏర్పడింది.

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

P.C: You Tube

శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ క్షేత్రం స్వర్ణముఖి నది తీరంలో ఉన్న క్షేత్రం. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్లే ఇక్కడ రాహుకేత పూజలు జరుగుతాయి.

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

P.C: You Tube

దీంతో ఈ కాళహస్తిని రాహు కేతు క్షేత్రమని కూడా పిలుస్తారు. పుత్రశోకానికి గురైన వశిష్ట మహర్షికి పరమశివుడు పంచముఖ నాగలింగేశ్వరుడి రూపంలో కనిపించాడు. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా

అర్చించాడు.

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

P.C: You Tube

అందువల్లే ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రమని పేరు వచ్చింది. సర్పదోష, రాహుకేతు గ్రహ దోషాల నుంచి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. ఈ దేవాలయంలోని శివలింగం పంచూత లింగాల్లో ఒకటైన

వాయులింగం.

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

P.C: You Tube

దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారం నుంచి లోనికి ప్రవేశించగానే ఉత్తరాభిముఖంగా ఉన్న దక్షిణామూర్తిని సందర్శించుకోవచ్చు. దక్షిణామూర్తి పూజలందుకోవడం కారణంగా ఇది జ్జాన ప్రధానమైన

క్షేత్రం అయ్యింది.

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

P.C: You Tube

ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం మనకు మరెక్కడా కనిపించదు. అందువల్లే ఈ క్షేత్రానికి వైదిక సంప్రదాయంలో ప్రముఖ స్థానముంది. ఆలయానికి ప్రవేశద్వారం వైపున పాతాళ గణపతి ఆలయం ఉంది.

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

P.C: You Tube

ఇందులోనికి ప్రవేశము ఒకసారికి ఒకరికి మాత్రమే ఉంది. దాదాపు 20 అడుగుల లోతు వరకూ ప్రయాణించిన తర్వాత గణపతి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఈ గణపతిని సందర్శించుకొన్న తర్వాతనే కాళహస్తి

దర్శన ఫలితం దక్కుతుందని ప్రతీతి.

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

శ్రీ కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకాళహస్తి

P.C: You Tube

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణం ప్రత్యేకమైనది. ఇక్కడ వినాయకుడు, శ్రీ కాళహస్తీశ్వరుడు, జ్జాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణమూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కులో ఉంటారు. ఆలయ దర్శనం ద్వార చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తులు నమ్ముతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X