Search
  • Follow NativePlanet
Share
» »పెళ్లి చేయవచ్చా..చేయకూడదా? పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు!

పెళ్లి చేయవచ్చా..చేయకూడదా? పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు!

విద్యా కారకుడు, విఘ్నహర్త్ర, విఘ్నకర్త ఐన గణపతి క్షేత్రములెన్నెన్నో ....కుంజవన అనే ఇడగుంజి గణపతి క్షేత్రం అష్టవినాయక క్షేత్రాలలో ఒకటి. ఇడగుంజి గణపతి కలియుగ కల్పతరువు. ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర సమీపంలోని ఇడగుంజిలోని వినాయకుడు అత్యంత శక్తివంతమైన దేవుడిగా భక్తుల భావిస్తారు. పురాణ ప్రసిద్ధి చెందిన ఈ విగ్రహానికి నాలుగో శతాబ్దంలో దేవాలయం నిర్మించారు. మనదేశంలో వెలసిన గణపతి ఆలయాలలో ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ప్రముఖమైనది. ఈ గ్రామం ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఉంది. శరావతి నది అరేబియా సముద్రంలో కలిసేచోట ఈ ఆలయం ఉంది.

ఈ ఆలయంలోని గణపతిని ద్విభుజాలు కలిగి ఉన్నాడు

ఈ ఆలయంలోని గణపతిని ద్విభుజాలు కలిగి ఉన్నాడు

ఈ ఆలయంలోని గణపతిని ద్విభుజాలు కలిగి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడుపెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి. వినాయకుడు బ్రహ్మచారి. కానీ ఏ పెళ్లిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు కర్నాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు.

PC: Brunda Nagaraj

కర్నాటకలోని బంధి అనే జాతివారు

కర్నాటకలోని బంధి అనే జాతివారు

కర్నాటకలోని బంధి అనే జాతివారు ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబాలవారు ఈ ఆలయానికి చేరుకుంటారు.

PC: Brunda Nagaraj

అక్కడ వినాయకుని రెండు పాదాల చెంత ఒక రెండు చీటీలను

అక్కడ వినాయకుని రెండు పాదాల చెంత ఒక రెండు చీటీలను

అక్కడ వినాయకుని రెండు పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని శుభసూచకంగా భావించి భావించి వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు.

PC: Brunda Nagaraj

ఈ విధమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని

ఈ విధమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని

ఈ విధమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పదిలక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు. ఇడగుంజి భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఆరు వినాయకుడు ఆలయాలో ఒకటి. అవి కాసర్గోడ్, మంగుళూరు, అనెగుడ్డే, కుండపుర, ఇడగుంజి మరియు గోకర్ణ.

PC: Brunda Nagaraj

ఈ ఆలయంలో మూల విరాట్టైన వినాయకుడు

ఈ ఆలయంలో మూల విరాట్టైన వినాయకుడు

ఈ ఆలయంలో మూల విరాట్టైన వినాయకుడు చూడముచ్చటగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం.ఇష్టార్థములను తీర్చే వరప్రదాయకుడు.

PC: Brunda Nagaraj

ఈ ఆలయంలో, నిత్యపూజలతో పాటుగా

ఈ ఆలయంలో, నిత్యపూజలతో పాటుగా

ఈ ఆలయంలో, నిత్యపూజలతో పాటుగా, భాద్రపదమాసంలో స్వామి వారి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. వినాయకుడు విఘ్నాలు తొలగించే విఘ్నరాజుగా ఈ స్వామిని భక్తులు భావించి కొలుస్తారు.

.

PC: Brunda Nagaraj

ఇక్కడి ప్రత్యేకత

ఇక్కడి ప్రత్యేకత

ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలోని గణపతికి ఇక్కడ రెండు దంతాలు ఉంటాయి. అంతే కాదు అన్ని చోట్ల గణపతి కడుపుకు నాగుపాము చుట్టుకుని ఉంటుంది. కానీ, ఇక్కడ ఉండదు. అలాగే నాగ యజ్ఞోపవీతం ధరించి ఉండటం పలు విగ్రహాలకు గమనించి ఉంటాము. అలాగే ఇట గణపతి ద్వి భజాలతో ఉంటారు. రెండు చేతుల గణపతి ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కనబడుతాడు. ప్రపంచంలోనే ద్విభుజ గణపతి దేవుడు ఇక్కడే.

.

PC: Brunda Nagaraj

పురాణ కథనం ప్రకారం

పురాణ కథనం ప్రకారం

పురాణ కథనం ప్రకారం మహాభారత రచనకు గణపతి ఆగని గంటం కోసం తన దంతాన్నే ఉపయోగించారని ప్రతీతి. అంటే ఇక్కడి గణపతి అంతకు పూర్వమే ఉన్నారన్నమాట. ఈ ఆలయం కూడా సుమారు 1500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ద్విభుజ గణపతి స్వామి ఆలయం శరావతి నది ఒడ్డున ఉన్నది. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని తెలియుచున్నది. ఈ ఆలయంలోని నల్ల చలవరాతి గణేష విగ్రం నిలబడిన ఆకారంలో ఉంటుంది

PC: Brunda Nagaraj

 ప్రతి సంవత్సరం 10 లక్షల మంది భక్తులు స్వామిని దర్శిస్తారని

ప్రతి సంవత్సరం 10 లక్షల మంది భక్తులు స్వామిని దర్శిస్తారని

దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట చేసినట్లుగా మరియు అదేవిధంగా, ఈ ఆలయ అతి ప్రాచీనమైన నిర్మాణ శైలికి కూడా భక్తులు మరియు యాత్రికులు యొక్క ప్రగాఢ విశ్వాసం. ప్రతి సంవత్సరం 10 లక్షల మంది భక్తులు స్వామిని దర్శిస్తారని అంచనా. ఇక్కడ స్వామిని గరికతో అర్చిస్తారు.

PC: Brunda Nagaraj

ఇడుగుంజికి సమీపంలో చూడదగ్గ మరికొన్ని టూరిస్ట్ ప్రదేశాలు

ఇడుగుంజికి సమీపంలో చూడదగ్గ మరికొన్ని టూరిస్ట్ ప్రదేశాలు

ఇడుగుంజికి సమీపంలో చూడదగ్గ మరికొన్ని టూరిస్ట్ ప్రదేశాలు

మురుడేశ్వర (19km), అప్సరకొండ (12km), గోకర్ణ (68km), హొన్నావర (15km) and బత్కల్ (30km) వంటి మరికొన్ని బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలు కూడా ఇడగుంజి చుట్టుప్రకల చూడదగ్గ ప్రదేశాలున్నాయి.

.

PC: Brunda Nagaraj

ఎలా చేరుకోవాలి:

ఎలా చేరుకోవాలి:

ఇడుగుంజి మురుడేశ్వర మరియు హోన్నుర్ కు మద్యలో ఉంది. గోకర్ణ నుండి 68 కిలోమీటర్ల దూరంలో ఉంది. మురుడేశ్వర నుండి 19కిలోమీటర్ల దూరంలో ఉంది.

PC: Brunda Nagaraj

 ఎలా చేరుకోవాలి:

ఎలా చేరుకోవాలి:

బస్సు మార్గం: హోన్నుర్ నుండి అనేక బస్సు సర్వీసులున్నాయి,. సర్సీ మరియు కుమత వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి,. అయితే ఈ ప్రదేశంలో ఇతర అందమైన ప్రదేశాలను కవర్ చేయాలనుకుంటే ప్రైవేట్ వాహనాలను బుక్ చేసుకోవడం మంచిది.

ట్రైయిన్ : ఇడుగుంజికి 15కిలో మీటర్ల దూరంలో రైల్వేష్టేషన్ ఉంది. హోన్నూర్ రైల్వేస్టేషన్ ఇడుగుంజికి అతి సమీపంలో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more