Search
  • Follow NativePlanet
Share
» »పౌర్ణమి రాత్రి శ్రీరామ తీర్థంలో స్నానమాచరిస్తే పాప పరిహారం అవుతుంది

పౌర్ణమి రాత్రి శ్రీరామ తీర్థంలో స్నానమాచరిస్తే పాప పరిహారం అవుతుంది

శ్రీమన్నారాయణుడి అవతారాల్లో రామ, కృష్ణావతారాలు ప్రత్యేకం. విష్ణుమూర్తి ధర్మ రక్షణ కోసం రామావతారం ఎత్తాడు. త్రేతాయుగంలో ధర్మరక్షణ చేసిన రాముడే, ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించాడు. ధర్మమార్గాన్ని ఆశ్రయించిన పాండవులకు అండగా నిలబడతాడు. ఆ సందర్భంలోనే కృష్ణుడు పాండవులకు సీతారాముల ప్రతిమలను ఇచ్చినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఆ ప్రతిమలు పూజాభిషేకాలు అందుకుంటోన్న క్షేత్రంగా 'రామతీర్థం' దర్శనమిస్తుంది. ఈ రామ తీర్థం విశేషం ఏంటి? సీత, హనుమంతునికి ఈ స్థలానికి ఉన్న అనుబందం ఏంటి అనే విషయం మరింత వివరంగా తెలుసుకుందాం..

రామాయణంతో ముడిపడిన ప్రదేశం

రామాయణంతో ముడిపడిన ప్రదేశం

అమృత్ సర్ భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఒక ముఖ్య నగరం. అంతే కాదు భారత దేశంలో పర్యాటక ప్రదేశంగా బాగా ప్రసిద్ది చెందినది. ఈ ప్రదేశం రామాయణంతో ముడిపడి ఉంది. భారతీయ సంస్కతి మరియు సంప్రదాయాలు రామాణానిది విడదీయలేని బంధం.

PC: YOUTUBE

అమృత్సర్ కు 11కి.మీ దూరంలో ఈ రామ్ తీర్థం

అమృత్సర్ కు 11కి.మీ దూరంలో ఈ రామ్ తీర్థం

అమృత్సర్ కు 11కి.మీ దూరంలో ఈ రామ్ తీర్థం ఉంది. ఇది రాముడికి అంకితం చేయబడినది. లార్డ్ సీత-రాములకు లవకుశలు జన్మించిన ప్రదేశం కూడా ఇదే. లవకుశలు వీరిద్దరూ తండ్రి శ్రీరాముడికి తగ్గ వారసులు. పరాక్రమంలో తండ్రిని మించినవారు. అందుకే వారి పేర్లు ఈ విశ్వం అంతమయ్యేంత వరకూ ఉంటాయి. ఈ రామ తీర్థం వాల్మీకి ఆశ్రమానికి ప్రసిద్ది చెందింది. ఈ ప్రదేశంలో వాల్మీకి ఇతిహస రామాయణం రచించినట్లు చెబుతారు. దీనిని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు.

PC: YOUTUBE

 వాల్మీకి మహర్షి ఆశ్రమము

వాల్మీకి మహర్షి ఆశ్రమము

శ్రీ రామ్ తిర్థం ఆలయం వాల్మీకి మహర్షి ఆశ్రమము యొక్క పురాతన ప్రదేశంగా పరిగణించబడుతుంది. లార్డ్ రామకి అంకితం చేయబడిన ఈ ఆలయం అమృత్సర్ నుండి 11 కి.మీ. దూరంలో ఉంది. పురాణముల ప్రకారం శ్రీరాముడు సీతా దేవని అడవులకు పంపినప్పుడు ఈ ఆశ్రమం సీతా దేవికి ఆశ్రయం ఇచ్చెను. ఆ ఆశ్రమంలోనే సీతాదేవి 12 సంవత్సరాల పాటు ఉన్నట్లు పురాణాలు తెలుపుతున్నాయి.

PC:Harvinder Chandigarh

రామాయణ కాలం నాటి శ్రీ రామ తిర్థ ఆలయం

రామాయణ కాలం నాటి శ్రీ రామ తిర్థ ఆలయం

రామాయణ కాలం నాటి శ్రీ రామ తిర్థ ఆలయం దాని ప్రాంగణంలో అనేక దేవాలయాలు మరియు ఒక పాత ట్యాంక్ ఉంది. ఆలయం ముఖ్యాంశాలుగా శ్రీరాముడి కుమారులు లవ మరియు కుశ జన్మించిన ఒక గుడిసె ఉంది. అలాగే హనుమంతుడు తవ్విన ఒక పురాతన కొలను ఉంది.

 వాల్మీకి మహర్షి కుటీరం

వాల్మీకి మహర్షి కుటీరం

వాల్మీకి మహర్షి కుటీరం మరియు మెట్ల వరుస, సీతా స్నానం చేయటానికి ఉపయోగించిన సంక్లిష్టమైన లోపలి భాగం సంరక్షించబడుతున్నాయి. అమృత్సర్ లోని శ్రీ రామ తిర్థ ఆలయంలో నవంబర్ నెలలో ఒక పౌర్ణమి రోజున నాలుగు రోజుల పాటు వార్షికోత్సవం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు.

దీపావళి రెండు వారాల తర్వాత ఉత్సవం

దీపావళి రెండు వారాల తర్వాత ఉత్సవం

దీపావళి రెండు వారాల తర్వాత ఉత్సవం జరుగుతుంది. ఉత్సవం ముగిసిన ఐదవ పౌర్ణమి రోజున హనుమంతుడు నిర్మించిన కొలనులో పవిత్ర స్నానం చేసి, మంత్రాలు పఠిస్తారు. రామతీర్థం సందర్శించిన భక్తులు అక్కడ ఉన్న చారిటీని సందర్శించి వారికి తోచిన సహాన్ని అందిస్తుంటారు. దీన్ని ఆలయ దర్శకర్తలు, అనాథలకు, బిక్షకులకు, అనారోగ్యులకు వారికి తోచిన సహాయంను అందిస్తుంటారు.

ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది

ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది

ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే తెల్లని రంగులో సీతదేవి ఆలయం, సీతామాత కుండ్, లవకుశల పాటశాల & లవకుశలు అశ్వమేధ యాగ యుద్దం ప్రదేశించిన స్థలం, అతి పెద్ద హనుమంతుని విగ్రం ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. అమ్రిత్ సర్ సందర్శించే పర్యాటకులు రామతీర్థం, వాల్మీకి తీర్థం సందర్శించడం వల్ల ప్రశాంతత లబిస్తుంది. సంవత్సరానికొక సారి నిర్వహించే రామతీర్థ మేళకు వేల మంది భక్తులు వస్తుంటారు.

శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసి ప్రదేశం

శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసి ప్రదేశం

శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసి ప్రదేశం . యాగ ధర్మాన్ని అనుసరించి ఒక గుర్రాన్ని స్వేచ్చగా వదులుతారు. ఆ గుర్రం ఎక్కడక్కెడ తిరగుతుందో ఆ ప్రదేశం అంతా కూడా ఆ రాజు పాలన క్రిందికి వస్తుంది. ఇది ఆ కాలంలో ధర్మాన్ని అనుసరించి నిర్ధారించిన నియమం.

PC: Harvinder Chandigarh

ఎవరైన ఆ గుర్రాన్ని బంధించి

ఎవరైన ఆ గుర్రాన్ని బంధించి

ఎవరైన ఆ గుర్రాన్ని బంధించి రాజుసైన్యంతో యుద్దం చేసి గెలిస్తే వారికి రాజ్యం దక్కుతుంది. అలా శ్రీరాముడు అశ్వమేథ యాగం చేసి వదిలిన గుర్రాన్ని లవకుశలు ఈ రామతీర్థంలోనే బందించారి పురాణాలు తెలుపుతున్నాయి. అంతే కాదు, ఆ అశ్వాన్ని విడిపించడానికి శ్రీరాముని సైనం పరాక్రమంతో ఆంజేయుడి కూడా రావడంతో లవకుశలిద్దరు హనుమంతున్ని ఇక్కడే బంధించారని స్థల పురాణం చెబుతోంది.

ఆంజనేయుడిని బంధించిన ప్రదేశం

ఆంజనేయుడిని బంధించిన ప్రదేశం

అలా ఆంజనేయుడిని బంధించిన ప్రదేశంలో ఇప్పుడు దుర్గా దేవి ఆలయం లాహోర్ గేట్ సమీపంలో ఉంది.ఈ ఆలయం హిందువుల పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ పార్వతీ దేవే, దుర్గా దేవి రూపంలో కొలువుదీరారు. ఆ ఆలయాన్ని 20వ శాతాబ్దంలో హరసాయిమల్ కపూర్ అనే వ్యక్తి పంజాబ్ లోని గోల్డన్ టెంపుల్ తరహాలో నిర్మించడం విశేషం.

ఈ ఆలయ ద్వారాలను వెండితో తయారుచేయడం వల్ల

ఈ ఆలయ ద్వారాలను వెండితో తయారుచేయడం వల్ల

ఈ ఆలయ ద్వారాలను వెండితో తయారుచేయడం వల్ల సిల్వర్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో హిందూ దేవతలైన దుర్గాదేవి, సీతాదేవితో పాటు అతి పెద్ద హనుమంతుడి విగ్రహాన్ని కూడా మనం సందర్శించవచ్చు. ఇక్కడ దుర్గా దేవి వివిధ రూపాల్లో చిన్న చిన్న శిల్పకళతో కనబడుతుంది. ఇవి చూడటానికి చాలా అందంగా కనబడుతాయి.

ఈ దేవాలయంలో దసరా

ఈ దేవాలయంలో దసరా

ఈ దేవాలయంలో దసరా, జన్మాష్టమి, రామ నవమితో పాటు దీపావళి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి స్థానికులే కాకుండా దేశంలోని నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు.

PC: Harvinder Chandigarh

సందర్శించవల్సిన సమయం:

సందర్శించవల్సిన సమయం:

ఇక్కడ వాల్మికి జయంతి చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో కుటుంబంసభ్యలు, జంటలు, స్నేహితులు తో కలిసి వెళ్ళవచ్చు. ఈ ప్రదేశాన్ని రెండు రోజుల సమయంలో చుట్టి రావచ్చు. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుండి మార్చి వరకూ అనుకూలమైనది.

PC: YOUTUBE

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రామతీర్థ దేవాలయం అమ్రుత్ సర్ జోగవన్ రోడ్ పశ్చిమంగా సుమారు 11కిమీ దూరంలో ఉంది. ఇక్కడికి రోడ్డు, రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఏప్రదేశం నుండి అయినా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.

అమ్రుత్ సర్ రైల్వే జంక్షన్ నుండి రామ తీర్థంకు సుమారు 12.8కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి 30నిముషాల్లో చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ నుండి రామతీర్థం చేరుకోవడానికి లోకట్ ట్యాక్సీలు, లోకల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం: రామతీర్థంకు సమీపంలో రాజా సని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉంది. ఇక్కడికి ఇతర దేశాలకు సంబంధించిన రెగ్యులర్ ఫ్లైట్స్ కనెక్ట్ అవుతాయి. ఈ మద్యకాలంలో జెట్ ఎయిర్ వేసే, తుర్కుమినిస్తాను, ఎయిర్ ఇండియా వంటి ఫ్లైట్స్ ఆఫర్స్ ఇస్తున్నవి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X