Search
  • Follow NativePlanet
Share
» »ఆపదలు..అనారోగ్యాలు..సర్పదోషాలు..కుజదోషాలు తొలగించే వరాల నాగమ్మ తల్లి

ఆపదలు..అనారోగ్యాలు..సర్పదోషాలు..కుజదోషాలు తొలగించే వరాల నాగమ్మ తల్లి

సాధారణంగా చాలా ఆలయాల్లో నాగదేవతల విగ్రహమూర్తులు కనిపిస్తుంటారు. అలాగే కొన్ని దేవాలయాలలో పుట్టలకి కూడా నాగపూజలు చేస్తూ ఉంటారు. అయితే ొక నాగుపాము నేరుగా వచ్చి ఒకే ప్రదేశంలో కొన్ని రోజుల పాటు ఉండి..అక్కడే ఆవిర్భవించిన క్షేత్రంగా 'వరాల నాగమ్మ తల్లి' క్షేత్రం కనిపిస్తుంది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండటం ..గంటి గ్రామంలో ఈ క్షేత్రం భక్తుల పాలిట కోరిన వరాల్చిచే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది.

పచ్చని పంటపొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం

పచ్చని పంటపొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం

కొంత కాలం క్రితం స్వయంగా నాగుపాము వచ్చి తేజస్సును ఆవిష్కరిస్తూ ఎక్కడైతే ఆవిర్భవించిందో అక్కడే ఆలయాన్ని నిర్మించారు. పచ్చని పంటపొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం వెలుగొందుతోంది.

గర్భాలయంలో నాగదేవత రూపం

గర్భాలయంలో నాగదేవత రూపం

గర్భాలయంలో నాగదేవత రూపం పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. ప్రతి మంగళవారం అభిషేకం జరిపించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

 ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల ఆపదలు..అనారోగ్యాలు తొలగిపోతాయనీ

ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల ఆపదలు..అనారోగ్యాలు తొలగిపోతాయనీ

ఈ తల్లికి మనసారా మొక్కితే ఆపదలు గట్టెక్కిస్తుంది. కష్టాలు దూరం చేస్తుంది, భక్తి శ్రద్దలతో పూజిస్తే భక్తులకు ధర్మబద్దమైన కోరికలన్నీ అనుగ్రహిస్తుందని.. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల ఆపదలు..అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సర్పదోషాలు ..కుజదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

ఈ దేవాలయంలో నాగపడగ నీడన ఆ తల్లి

ఈ దేవాలయంలో నాగపడగ నీడన ఆ తల్లి

ఈ దేవాలయంలో నాగపడగ నీడన ఆ తల్లి మనోహరంగా దర్శనమిస్తూ తన చల్లని దీవెనలతో భక్తులను అనుగ్రహిస్తోంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఘనంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు.

పండుగలు, పర్వదినాలలో షష్టి రోజున

పండుగలు, పర్వదినాలలో షష్టి రోజున

పండుగలు, పర్వదినాలలో షష్టి రోజున సుబ్రహ్మణ్య షష్టి రోజున, నాగపంచమి, నాగులచవితి రోజున అమ్మవారికి దర్శనానికి భక్తులు విశేషంగా తరలివస్తుంటారు.

రాజమండ్రికి 13 కిలోమీటర్ల దూరంలోని కొత్తపేట మండల కేంద్రానికి

రాజమండ్రికి 13 కిలోమీటర్ల దూరంలోని కొత్తపేట మండల కేంద్రానికి

రాజమండ్రికి 13 కిలోమీటర్ల దూరంలోని కొత్తపేట మండల కేంద్రానికి చేరుకుని అక్కడి నుండి ప్రైవేటు వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, తదితర ప్రధాన నగరాల నుండి రాజమండ్రికి రైలు, బస్సు సర్వీసులున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X