Search
  • Follow NativePlanet
Share
» »తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్క్ చూశారా?లేదా? ఐతే ఈసారి తప్పక చూడండి!!

తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్క్ చూశారా?లేదా? ఐతే ఈసారి తప్పక చూడండి!!

"అదివో అల్లదివో హరివాసము.. పదివేలు శేషుల పడగలమయము" అంటూ బాల అన్నమయ్య ఎనిమిది సంవత్సరాల వయస్సులో తొలిసారిగా తిరుమల కొండలను సందర్శించినప్పుడు.. ఆ బంగారు శిఖరాల సౌందర్యానికి ముగ్ధుడై, పరవశుడై ఆనంద తాండవం చేస్తూ పాడుకున్నాడట. తిరుమల గిరుల సౌందర్యాన్ని చూసిన ఎవరయినా అప్రయత్నంగా రాగాలను అందుకోవాల్సిందే మరి..! ఎన్నో ప్రసిద్ధ దైవ క్షేత్రాలను, జలపాతాలను, పవిత్ర తీర్థాలను తనలో ఇముడ్చుకున్న సహజసిద్ధమైన ఈ ఉద్యానవనంలో వన్యప్రాణులను రక్షించేందుకుగానూ ఆ దేవదేవుడి పేరుతో రూపుదిద్దుకున్నదే "శ్రీ వేంకటేశ్వర జాతీయ పార్కు".

తూర్పు కనుమలు, శేషాచల పర్వతాలలో

తూర్పు కనుమలు, శేషాచల పర్వతాలలో

తూర్పు కనుమలు, శేషాచల పర్వతాలలో... శ్రీ వేంకటేశ్వర జాతీయ పార్కు సహజ సిద్ధంగా ఏర్పడింది. బ్రిటీషువారి కాలంలో తొలిసారిగా రూపొందిన అటవీ చట్టం ప్రకారం అటవీ సంరక్షణ జరిగినా.. జంతువుల వేట యధేచ్చగా కొనసాగినట్లు తెలుస్తోంది. ఆ తరువాత 1985వ సంవత్సరంలో అడవులను, వన్యప్రాణులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రం మొత్తంమీదా 20 అభయారణ్యాలు, 4 జాతీయ పార్కులను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఏర్పాటైనదే శ్రీ వేంకటేశ్వర జాతీయ పార్కు.

PC: Adityamadhav83

ఇది ఆసియాలోనే రెండవ అతి పెద్ద జంతుప్రదర్శన శాలగా ప్రసిద్ది

ఇది ఆసియాలోనే రెండవ అతి పెద్ద జంతుప్రదర్శన శాలగా ప్రసిద్ది

ఇది ఆసియాలోనే రెండవ అతి పెద్ద జంతుప్రదర్శన శాలగా ప్రసిద్ది చెందినది. శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ 2212 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద జంతు ప్రదర్శనశాలగా పేరొందిన ఈ పార్క్ లో 30 సింహాలు, దగ్గరగా చూడవచ్చు. అలాగే ఇందులో 349 పక్షులు, 138రకాల సరీసృపాలు మరియు 168 క్షీరదాలు ఉన్నాయి. అరుదైన మొద్దు తోకగల మెకాక్ గ్రుహ చాలా ప్రసిద్ది చెందినది.

PC : Neha

పెంచిన చెట్లతో, బంధించిన జంతువులతో కాకుండా

పెంచిన చెట్లతో, బంధించిన జంతువులతో కాకుండా

పెంచిన చెట్లతో, బంధించిన జంతువులతో కాకుండా సహజసిద్ధంగా పెరిగిన చెట్లతో కూడిన అడవులు, ఆ అడవుల్లో స్వేచ్ఛగా సంచరించే వివిధ రకాల జంతువులతో సహజ సిద్ధంగా రూపుదిద్దుకోవడమే ఈ పార్క్ ప్రత్యేకతగా చెప్పవచ్చు.

PC : ShashiBellamkonda

ఇందులో పదిహేను వందల రకాలైన..

ఇందులో పదిహేను వందల రకాలైన..

ఇందులో పదిహేను వందల రకాలైన.. ఎర్రచందన, తంబజాలం, మోజి, నల్లకరక, పెర్రీత, తెల్లకరక్కాయ లాంటి అరుదైన వృక్ష జాతులు.. 12 వందల రకాల పక్షి జాతులు ఉన్నాయి.

PC : Shravan Kamath94

ప్రఖ్యాతిగాంచిన దైవక్షేత్రాలు, జలపాతాలు సైతం

ప్రఖ్యాతిగాంచిన దైవక్షేత్రాలు, జలపాతాలు సైతం

ప్రఖ్యాతిగాంచిన దైవక్షేత్రాలు, జలపాతాలు సైతం ఈ పార్క్ పరిధిలోనే ఉన్నాయి. తలకోన, గుండాల కోన, గుంజన జలపాతం, కపిల తీర్థం.. లాంటి 350 పవిత్ర తీర్థాలు కూడా ఈ పార్క్ కిందికే వస్తాయి. వీటిలో ముఖ్యంగా తుంబుర తీర్థం, రామకృష్ణ తీర్థం, సీతమ్మ తీర్థాలు ప్రధానమైనవి కాగా.. ప్రపంచంలో సంపన్నుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం కూడా ఈ జాతీయపార్కు పరిధిలోకే వస్తుంది.

అలాగే.. ప్రపంచంలో ఎక్కడా కనిపించనటువంటి,

అలాగే.. ప్రపంచంలో ఎక్కడా కనిపించనటువంటి,

అలాగే.. ప్రపంచంలో ఎక్కడా కనిపించనటువంటి, 120 సంవత్సరాల క్రితం అంతరించిపోయిందని చెప్పబడుతున్న "బంగారు బల్లి" ఈ జాతీయ పార్కులోని శేషాచలం అడవుల్లో ఉన్నట్లు చెబుతుంటారు.

ఇంకా అరుదైన దేవాంగ పిల్లి, మూషిక జింక,

ఇంకా అరుదైన దేవాంగ పిల్లి, మూషిక జింక,

ఇంకా అరుదైన దేవాంగ పిల్లి, మూషిక జింక, పెద్దపులి, చిరుతపులి, తోడేలు, రేచుకుక్కలు, ఎలుగుబంట్లు, హైనాలు, నక్కలు, అడవి కుక్క, క్రూరపంది, ఆలువ, అడవి పంది, గడ్డి జింక, కొండ గొర్రె, దుప్పి, కణితి, ఎగిరే బల్లి తదితర జంతువులు ఈ జాతీయ పార్కులో స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్నాయి.

 శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్

శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్

తిరుపతికి 15కిలోమీటర్ల దూరంలో శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 353 చదరపు కిలోమీటర్లు ఇది విస్తరించి ఉంది. శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్1987 సెప్టెంబర్ 29న స్థాపించబడింది. 5,532 ఎకరాల వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈ పార్క్ మగ కోడి, జింక, చిలక, చిరుత, అడవి ఏనుగులకి ఆవాసం. శాకాహార, మాంసాహార స్థలాలు, మగకోడి నివాస స్థలానికి పక్కన విస్తరి౦చీ ఉన్న పచ్చని మైదానాలు ఇక్కడ పెద్ద ఆకర్షణగా ఉన్నాయి.

PC:gundalakona

వివిధ రకాల జంతువులను

వివిధ రకాల జంతువులను

వివిధ రకాల జంతువులను , పక్షులను , చూడాలని కోరికునే వారికి వైల్డ్ లైఫ్ ను ఇష్టపడే వారు శ్రీ వేంకటేశ్వర నేషనల్ పార్క్ ను తప్పకుండా సందర్శించవచ్చు. ఇది ప్రపంచ ప్రసిద్దిగాంచిన తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయానికి సమీపంలో ఉంది.

PC: Adityamadhav83

ఈ జాతీయ పార్క్ ను సందర్శించడానికి

ఈ జాతీయ పార్క్ ను సందర్శించడానికి

ఈ జాతీయ పార్క్ ను సందర్శించడానికి సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జూన్ మరియు మార్చి మరింత అనుకూలమైన వాతావరణం . వేసవిలో విహారంతో పాటు జంతువులను చూడటానికి అనుకూలమైన సమయం. ఇక వింటర్లో కూడా ఉష్ణోగ్రత 15°C నుండి 40°C ఉంటుంది.

ఓపెనింగ్ టైమ్:

ఓపెనింగ్ టైమ్:

ఈ నేషనల్ పార్క్ వారంలో అన్ని రోజులు తెరవబడుతుంది. వేసవి మరియు చలికాలంలో మాత్రం సందర్శించే సమయాల్లో చాలా స్వల్ప మార్పులు ఉంటాయి.

వేసవిలో : ఉదయం 8:00 AM - 6:00 PM

శీతాకాలంలో : 9:00 AM - 5:00 PM

నేషనల్ పార్క్ చుట్టూ చూడవల్సిన ప్రదేశాలు

నేషనల్ పార్క్ చుట్టూ చూడవల్సిన ప్రదేశాలు

శ్రీ వేంకటేశ్వర దేవాలయం:

శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది.

శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం:

శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం:

తిరుమల కొండ నుంచి శ్రీ పద్మావతీ దేవి దేవాలయం 5 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవేరి పద్మావతీ దేవి కొలువై వుంది. తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఈ దేవాలయాన్ని ముందుగా దర్శించాకే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెప్తారు. ఈ ఆలయం పద్మావతీ దేవి జననం గురించి, పద్మావతీ వెంకటేశ్వరుల పరిణయం గురించిన గాథలను చెప్తు౦ద౦టారు. తోన్దమందలాన్ని పాలించే ఆకాశ రాజు ఒక యజ్ఞ౦ చేసినప్పుడు ఆయనకు ఒక తామరపువ్వు లో దొరికిన బిడ్డను పద్మావతీ దేవి పేరిట తన కూతురుగా పెంచుకున్నాడు. ఆవిడనే అలమేలు మంగ అని కూడా అంటారు.

PC : Adityamadhav83

కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం:

కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం:

అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమలలో తన నౌకాయన సమయంలో వెంకటేశ్వర స్వామి ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నట్లుగా నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత ఇక్కడ శ్రీ సిద్దేశ్వర, ఇతర ఋషులను ఆశీర్వదించాడు.

గోవిందరాజస్వామి దేవాలయం:

గోవిందరాజస్వామి దేవాలయం:

తిరుపతి లోని ప్రధాన క్షేత్రాలలో గోవిందరాజస్వామి దేవాలయం ఒకటి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయం నిర్మించబడింది. 1235లో నిర్మించిన ఈ దేవాలయానికి వైష్ణవ గురువు శ్రీమద్రామానుజాచార్యులు శంఖుస్థాపన చేసారని చెప్తారు. ఈ గోపురం కాక మరో రెండు గుళ్ళ చుట్టూ బయటి ప్రాకారం వుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more